ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి | 2 died, tractor roll in nalgonda distirict | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి

Feb 13 2015 12:46 PM | Updated on Aug 29 2018 4:16 PM

నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెరువు కట్ట పై వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మోతే మండలం విభలాపురం గ్రామంలో శుక్రవారం జరిగింది. వివరాలు... గ్రామానికి చెందిన రైతు మైనంపాటి వీరారెడ్డి(45) పొలంలో ఉన్న పత్తిమూటలను తెచ్చేందుకు కూలీలతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పత్తిమూటల లోడుతో వస్తుండగా గ్రామంలోని చెరువు కట్టపై మూలమలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది.

ఈ ప్రమాదంలో రైతు వీరారెడ్డి, కూలీ కొత్తపల్లి రమేష్(25)లు అక్కడికక్కడే మృతిచెందారు. వీరారెడ్డికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. రమేష్‌కు కొద్ది నెలల కిత్రమే పెళ్లి అయింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కు  తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
(మోతే)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement