ఇంజినీరింగ్ కాలేజీలో 17 సెల్‌ఫోన్లు చోరీ | 17 cell phones and eavesdropping in Engineering College | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ కాలేజీలో 17 సెల్‌ఫోన్లు చోరీ

Jun 27 2015 12:44 AM | Updated on Mar 21 2019 9:07 PM

ఆదిబట్ల: ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు చెందిన 17 సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయి. వాటిలో 14 ఫోన్లను పోలీ సులు రికవరీ చేశారు.

ఆదిబట్ల: ఇంజినీరింగ్ పరీక్షలు రాసేందుకు వచ్చిన విద్యార్థులకు చెందిన 17 సెల్‌ఫోన్లు చోరీ అయ్యాయి. వాటిలో 14 ఫోన్లను పోలీ సులు రికవరీ చేశారు. ఈ సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జగదీశ్వర్ కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు వెంకట్‌రెడ్డి, అతని మిత్రులు పరీక్ష రాసేందుకు ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని శేరిగూడలోని చైతన్య ఇంజినీరింగ్ కళాశాలకు వచ్చారు. కళాశాలలో సెల్‌ఫోన్లు భద్రపర్చడానికి ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు.
 
 వెంకట్‌రెడ్డి, అతడి మిత్రులు తమ 17 సెల్‌ఫోన్‌లను ఓ బ్యాగు లో ఉంచి కౌంటర్‌లో అప్పగించి టోకెన్లు తీసుకున్నారు. పరీక్ష అనంతరం గుర్తుతెలియని ఓ వ్యక్తి నకిలీ టోకెన్లతో విద్యార్థులకు చెందిన 17 సెల్‌ఫోన్లు ఉన్న బ్యాగును అపహరించుకుపోయారు. విష యం తెలుసుకున్న విద్యార్థులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్లూస్ టీం ఆధారంగా పోలీసులు ఓ బ్యాగ్‌లో లభించిన 14 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement