విష పురుగుల దాడి: 14 మందికి గాయాలు | 14 students injured due to Insect Attack | Sakshi
Sakshi News home page

విష పురుగుల దాడి: 14 మందికి గాయాలు

Nov 17 2017 12:59 PM | Updated on Nov 9 2018 4:44 PM

నిజామాబాద్ మండలం మోపాల్ మైనారిటీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు విష పురుగుల కాటుకు గురయ్యారు.

సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ మండలం మోపాల్ మైనారిటీ గురుకుల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులు విష పురుగుల కాటుకు గురయ్యారు. విషపురుగులు కుట్టడం వల్ల 14 మందికి ముఖాలు ఉబ్బి(వాపు)పోయాయి.

ఆశ్రమ పాఠశాల పక్కనే పొలాలు ఉన్నందున పంటపై పురుగుల మందు కొట్టడంతో ఈ విష కీటకాలు ఎగిరి రాత్రి  సమయంలో ఆశ్రమ పాఠశాల వైపు వచ్చాయని బాధితులు తెలుపుతున్నారు. హాస్టల్‌ గదుల్లోకి పురుగులు రావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. వీరందరినీ వైద్యం కోసం పీహెచ్‌సీకి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement