14 నెలల చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
రాంగోపాల్‌పేట్ (హైదరాబాద్) : 14 నెలల చిన్నారికి బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లిన వ్యక్తి ఎంతకీ తిరిగి రాలేదు. దీనిపై బాలుడి తల్లిదండ్రులు మహంకాళి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం... సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్ పరిధిలోని కండోజీ బజార్‌కు చెందిన ఉల్లోజు వీరాచారి, నవ్య దంపతుల ఇంటికి మంగళవారం ఉదయం బంధువైన బాలాచారి (32) వచ్చాడు.
వీరాచారి కుమారుడు పృథ్వీ ఆడుకుంటుండగా.. బిస్కెట్లు కొనిస్తానని చెప్పి తీసుకెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. ఎక్కడా కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు మహంకాళి పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. నిందితుడిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.