తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులపై ఒక్కరోజు పాటు సస్పెన్షన్ వేటు పడింది.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ సభ్యులపై ఒక్కరోజు పాటు సస్పెన్షన్ వేటు పడింది. సభా కార్యక్రమాలకు అంతరాయం కలిగించటంతో స్పీకర్ మధుసుదనాచారి మంగళవారం సభ నుంచి జానారెడ్డి మినహా 13మంది కాంగ్రెస్ సభ్యులను సస్పెండ్ చేశారు. సభ్యుల సస్పెన్షన్ను మంత్రి హరీష్ రావు ప్రతిపాదించారు. సస్పెండ్ అయిన సభ్యుల వివరాలు:
1. జీవన్ రెడ్డి
2. డీకె అరుణ
3. మల్లు భట్టి విక్రమార్క
4. సంపత్ కుమార్
5. కోమటిరెడ్డి వెంకటరెడ్డి
6. గీతారెడ్డి
7, పువ్వాడ అజయ్ కుమార్
8. ఉత్తమ్ కుమార్ రెడ్డి
9. పద్మావతి రెడ్డి
10.భాస్కరరావు
11. రాంరెడ్డి వెంకటరెడ్డి
12. కృష్ణారెడ్డి
13. రామ్మోహన్ రెడ్డి