బదిలీ.. | 101 ci transfers.. | Sakshi
Sakshi News home page

బదిలీ..

Dec 4 2014 3:50 AM | Updated on Aug 17 2018 2:53 PM

మంగళవారం రేంజ్ పరిధిలో 101 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్వర్వులు విడుదల చేశారు.

మంగళవారం రేంజ్ పరిధిలో 101 మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్వర్వులు విడుదల చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 26 మందికి స్థానచలనం కలిగింది. ఇందులో 10 మందిని డీఐజీ కార్యాలయానికి అటాచ్డ్ చేశారు. ఆదిలాబాద్‌కు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 11 మంది రాగా, జిల్లాలోనే ఐదుగురిని ఇక్కడే ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణ, పరిపాలనా సౌలభ్యంతోపాటు దీర్ఘకాలికంగా ఒకేచోట పనిచేస్తున్న పలువురు సీఐలను బదిలీ చేసేందుకు అప్పటి ఎస్పీ గజరావు భూపాల్ ఉన్నతాధికారులకు నివేదిక అందజేశారు. దీంతో అక్టోబర్ 17న జిల్లాలో ఎనిమిది మంది సీఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆ మరుసటి రోజే అవి రద్దు చేశారు. ఆ బదిలీలపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేయడంతో బదిలీలకు బ్రేక్ పడింది. తమకు అనుకూలమైన సీఐలు కావాలని ప్రజాప్రతినిధులు అధినేత దృష్టికి తీసుకెళ్లడంతో బదిలీ ఉత్తర్వులు నిలిచిపోయాయి.  
 
బదిలీలపై ప్రజాప్రతినిధుల ముద్ర..
జిల్లాలో జరిగిన సీఐల బదిలీల్లో ప్రజాప్రతినిధుల ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో తమకు అనుకూలమైన వారు లేక ఇబ్బందులు పడ్డామని, ఈ సారీ ఎలాగైన తమవారికే పోస్టింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు పైరవీలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. ఎలాంటి పారదర్శకత లేకుండానే బదిలీలు రాజకీయంగా మారాయి.
 
గతంలో జిల్లాలో పనిచేసి ప్రస్తుతం ఇతర జిల్లాలో ఉన్న సీఐలు పెద్ద మొత్తంలో ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. వీరిని రప్పించేందుకు ఇక్కడి ప్రజాప్రతినిధుల పెద్ద ఎత్తున పైరవీలు చేసి తమ పంతం నెగ్గించుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ 17న ఉత్తర్వులను రద్దు చేసినప్పటి నుంచి సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతూ అనుకూలమైన పోస్టింగ్ కోసం పైరవీలు చేశారనే విమర్శలు ఉన్నాయి. ఒక పక్క ప్రజాప్రతినిధులకు అనుకూలమైన వారితో పాటు.. అధికారులు కోరుకున్న చోటికి బదిలీ చేసేందుకు ఈ బదిలీల్లో భారీగా మార్పులు జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement