100 కేజీల గంజాయి పట్టివేత | 100 KG Ganja seized in suryapet | Sakshi
Sakshi News home page

100 కేజీల గంజాయి పట్టివేత

Feb 20 2016 10:51 AM | Updated on Sep 3 2017 6:03 PM

నల్గొండ జిల్లా సూర్యాపేటలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు.

నల్గొండ : నల్గొండ జిల్లా సూర్యాపేటలో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కారులో అక్రమంగా తరలిస్తున్న 100 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్కి తరలించి... పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు.

విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నట్లుకు పోలీసులకు ముందస్తుగా సమాచారం అందింది. దీంతో ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఆ క్రమంలో స్కోడా కారులో గంజాయిని స్వాధీనంచేసుకున్నారు. అలాగే కారులోని వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన కిరణ్, లోకేష్, అఖిల్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement