రాష్ట్రంలో జిల్లాలు పదేనంట! | 10 districts in the state | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో జిల్లాలు పదేనంట!

Nov 23 2016 4:13 AM | Updated on Sep 4 2017 8:49 PM

రాష్ట్రంలో జిల్లాలు పదేనంట!

రాష్ట్రంలో జిల్లాలు పదేనంట!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలెన్ని అంటే టక్కున 31 అని చెబుతాం..

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలెన్ని అంటే టక్కున 31 అని చెబుతాం.. కానీ తెలంగాణ టూరిజం శాఖ వారు మాత్రం ఇంకా 10 జిల్లాలనే అంటున్నారు. అంతేకాదు ఆ మేరకు వెబ్‌సైట్‌లో కూడా చూపిస్తున్నారు.

సచివాలయంలో తెలంగాణ టూరిజం శాఖ వారు ఏర్పాటు చేసిన కియోస్క్‌లో రాష్ట్రంలో ఉన్న పలు పర్యాటక ప్రాంతాలను పొందుపరిచారు. అంత వరకు బాగున్నప్పటికీ జిల్లాలను మాత్రం పది జిల్లాలుగా చూపడం విడ్డూరంగా ఉందంటూ సచివాలయానికి వచ్చిన వారు ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement