సిలిండర్ లీకై ఓ మహిళకు గాయాలయిన సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది.
హైదరాబాద్: సిలిండర్ లీకై ఓ మహిళకు గాయాలయిన సంఘటన నగరంలోని ఎల్బీనగర్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్తానిక నాగోల్ లో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో విజయలక్ష్మీ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సమయంలో మరో రెండు సిలిండర్ కూడా ఉన్నాయి. సిలిండర్ పెలి ఉంటే పెద్ద ప్రమాదమే సంభవించేదని స్థానికులు అంటున్నారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.