పెద్దషాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి | 1 died, 6 injured in road accident | Sakshi
Sakshi News home page

పెద్దషాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం: ఒకరి మృతి

Sep 30 2015 10:42 AM | Updated on Aug 30 2018 3:56 PM

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద జాతీయరహదారిపై బుధవారం ఉదయం గొలుసుకట్టు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి.

శంషాబాద్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద జాతీయరహదారిపై బుధవారం ఉదయం గొలుసుకట్టు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా లారీ ఢీకొంది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సును కోళ్ల లోడుతో వెళ్తున్న మినీ లారీ వేగంగా వచ్చి ఢీకొనగా అందులోని క్లీనర్ శివ(24) తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కోళ్ల లారీని మరో రెండు లారీలు వెనుక నుంచి ఢీకొట్టాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలిని పర్యవేక్షించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement