breaking news
-
అవి ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలుగా మారిన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై పోరాడేది తామేనని, తెలంగాణ ప్రజలు, భావి తరాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తమ పార్టీని గెలిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ వేలాది కోట్లు ఖర్చు చేస్తూ ఎంఐఎం మధ్యవర్తిత్వంతో బీజేపీ గెలవకుండా కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సోమవారం పార్టీ నాయకులు డా.ఎస్.ప్రకాశ్‌రెడ్డి, సోలంకి శ్రీనివాస్, సునీతారెడ్డి, అమర్నాథ్, జి, వెంకటరెడ్డి, మౌనికతో కలిసి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలు ఎలా అనేది కోటి డాలర్ల ప్రశ్న అని వ్యాఖ్యానించారు. ఈ గ్యారంటీల అమలుకు తెలంగాణకు ఇప్పుడొస్తున్న రెవెన్యూకు మూడింతలు డబ్బు అవసరమని లెక్క వేశారు. ఇక్కడ ఎన్నికలకు కర్ణాటక ప్రభుత్వ యాడ్స్ ఎలా ఇస్తారు ? తెలంగాణలో ఏ ప్రాతిపదికన కర్ణాటక ప్రభుత్వ డబ్బుతో కాంగ్రెస్ ప్రకటనలు ఇస్తుందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక్కడ ఎన్నికల కోసం కర్ణాటకలోని కాంట్రాక్టర్లు, ఐటీసంస్థలు, వ్యాపారులను బెదిరించి వేల కోట్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో 50 శాతం మందికి కేసీఆర్, మరో 50 శాతం మందికి కర్ణాటక సర్కార్ ఖర్చు చేస్తోందని నిందించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ల దోస్తీ, కాంగ్రెస్ కేంద్ర కేబినెట్లో కేసీఆర్ మంత్రిగా పనిచేయడం, కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నాలు వంటి అంశాలపై రాహుల్‌గాంధీ చర్చకు రావాలని కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లది డూప్ ఫైట్... ‘ఎన్నికల నేపథ్యంలో...కాంగ్రెస్, బీఆర్ఎస్లది డూప్ ఫైట్...రాహుల్‌గాంధీ అంత చేతగాని రాజకీయనాయకుడు మరొకరు లేడు’అని కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి నిర్వహణ చేతకాదంటూ వదులుకున్న వ్యక్తి రాహుల్ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వైద్యకళాశాలల ఏర్పాటు కోసం కేసీఆర్ రాసినట్టు చెబుతున్న 50 లేఖలు చూపిస్తే తాను రాజకీయాల నుంచి విరమించుకుంటానని సవాల్ విసిరారు. రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలు.. ‘రైతుబంధుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నాయి బీఆర్ఎస్ సర్కార్‌కు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందుగానే రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో ఫిర్యాదు చేయించడం ద్వారా బీఆర్ఎస్కు ఇది ఇవ్వడం ఇష్టం లేదని తేలిందన్నారు. హైదరాబాద్ పేరు మారుస్తాం... బీజేపీ అధికారానికి వస్తే హైదరాబాద్ పేరును కచ్చితంగా భాగ్యనగర్‌గా మార్చేస్తామని ఒక ప్రశ్నకు కిషన్‌రెడ్డి బదులిచ్చారు. ‘ఎవరైనా బీజే పీ, బీఆర్ఎస్ ఒక్కటంటే.. లాగి చెప్పుదెబ్బ కొట్టండి...ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరితో కలిసే ప్రసక్తే లేదు’అని తీవ్రంగా స్పందించారు. -
రైతుబంధు ఆపింది కాంగ్రెస్ పార్టీయే
సాక్షి, హైదరాబాద్: రైతుల నోటికాడ బుక్క కాంగ్రెస్‌పార్టీ ఎత్తగొట్టిందని ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిని అడ్డుపెట్టి రైతుబంధు పంపిణీ ఆపలేదని అన్నారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ఎన్నికలు ముగిసిన వెంటనే డిసెంబర్ 6న రైతులకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తామని చెప్పారు. సోమవారం రాత్రి తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పార్లమెంటరీ పక్షనేత కె.కేశవరావుతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. రైతుబంధు ఆపాలని అక్టోబర్23న కాంగ్రెస్ నేత మాణిక్‌రావు ఠాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారని, ఆరోజే ఢిల్లీలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రెస్‌మీట్‌పెట్టి ఈ విషయం చెప్పారని వెల్లడించారు. రైతుబంధు ఐదున్నర ఏళ్లుగా కొనసాగుతున్న పథకమని.. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరితే పంపిణీకి అనుమతిఇచ్చిందని, దానిని తాను స్వాగతించాను తప్ప ఎన్నికల సంఘంపెట్టిన ఆంక్షలను ఎక్కడా అతిక్రమించలేదని హరీశ్‌రావు స్పష్టం చేశారు. దీనిపై పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ఎన్నికల సంఘానికిమళ్లీ ఫిర్యాదు చేసి, రైతుల ఖాతాల్లో డబ్బులు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. రైతుబంధుకు ఎన్నికల సంఘంఅనుమతి ఇచ్చినప్పుడు పీసీసీ చీఫ్రేవంత్రెడ్డి.. ఎలక్షన్‌కమిషన్, బీఆర్ఎస్, బీజేపీది ఫెవికాల్ బంధమని ఆరోపించారే కానీ స్వాగతించలేదని అన్నారు. రైతులంటే రేవంత్‌కు ప్రేమ ఉంటే రైతుబంధు సాయం పంపిణీని స్వాగతించే వారు పేర్కొన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా కాంగ్రెస్‌పరిస్థితి ఉందన్నారు. రైతులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈనెల 30న ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని హరీశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు రైతులంటే గిట్టదు.. కాంగ్రెస్‌పార్టీకి రైతులంటేనే గిట్టదని, అది ఎప్పుడూ రైతు వ్యతిరేక పార్టీయేనని హరీశ్‌రావు అన్నారు. ఆ పార్టీ ఉచిత కరెంట్‌ను ఉత్త కరెంట్చేసిందని, కాంగ్రెస్అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆ పార్టీది రైతు వ్యతిరేక వైఖరేనని చెప్పారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు రూ.4 వేల చొప్పున ఇచ్చేవారని, కానీ కాంగ్రెస్గెలిచిన వెంటనే ఆ పథకాన్ని రద్దు చేశారని చెప్పారు. తెలంగాణలో గెలిచి రైతుబంధును రద్దు చేయాలని కాంగ్రెస్కుట్ర చేస్తోందన్నారు. ఉత్తమ్రైతుబంధును దుబారా అంటున్నారని, రేవంత్రైతులను బిచ్చగాళ్లు అంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్అధికారంలో ఉన్నప్పుడు అర్ధరాత్రి కరెంట్ఇచ్చి రైతులను అరిగోస పెట్టిందని, ఎరువులు, విత్తనాలను పోలీస్స్టేషన్ల ముందు లైన్లో నిలబెట్టి పంపిణీ చేస్తూ బాధ పెట్టిందని అన్నారు. వ్యవసాయం దండగ అన్న నాయకుడి వారసుడు రేవంత్అని మండిపడ్డారు. అందుకే ఆయన సాగుకు మూడు గంటల కరెంట్‌చాలు అన్నారని, కర్ణాటక డిప్యూటీ సీఎం ఐదు గంటల కరెంట్‌చాలు అంటున్నారని హరీశ్ మండిపడ్డారు. అవి చిత్తు కాగితాలు.. కాంగ్రెస్ ప్రకటించిన గ్యారంటీలను అమలు చేస్తామని ఆ పార్టీ అభ్యర్థులు బాండ్‌పేపర్లు రాసి ఇస్తున్నారని.. అయితే అవి చిత్తు కాగితాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్మూడోసారి గెలిచి హ్యాట్రిక్కొడతారని, 80 సీట్లలో గెలుస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
రైతుబంధుకు బ్రేక్ వెనక కాంగ్రెస్, బీజేపీ కుట్ర
సాక్షి, పెద్దపల్లి/హుజూరాబాద్/సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ఏటూరునాగారం/వెల్గటూర్ (ధర్మపురి)/అంబర్‌పేట/ముషిరాబాద్: కాంగ్రెస్, బీజేపీ కలసి కొత్త కుట్రకు తెరలెపి రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో పడకుండా ఆపాయని మంత్రి కె. తారక రామారావు ఆరోపించారు. రైతుబంధు ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే బీజేపీ నేతలు ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి నిలిపివేయించారని దుయ్యబట్టారు. అధికారంలోకి రాకముందే ఆ పార్టీలు రైతుబంధును కాటగలిపి రైతుల నోట్లో మట్టిగొట్టాయని... పొరపాటున ఆ పార్టీలు అధికారంలోకి వస్తే రైతుబంధును మొత్తానికే ఎత్తగొడ్తాయని హెచ్చరించారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి ఓటుతో బుద్ధిచెప్పాలని కోరారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్, జగిత్యాల జిల్లా వెల్గటూర్, మంచిర్యాల జిల్లా చెన్నూరు, ములుగు జిల్లా ఏటూరునాగారంతోపాటు హైదరాబాద్‌లోని అంబర్‌పేట, ముషీరాబాద్ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కరెంట్ కావాలా.. కాంగ్రెస్ కావాలా.. కరెంట్ కావాలో లేక కాంగ్రెస్ కావాలోప్రజలే నిర్ణయించుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. 2014కు ముందు తెలంగాణలో కరెంటు కష్టాలు ఎలా ఉండేవో ఒక్కసారి గుర్తుచేసుకోవాలన్నారు. ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా 24 గంటల కరెంటు ఇస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ కరెంటు ఉండదని, కర్ణాటకలో గెలిపించినందుకు ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని తెలిపారు. పిరమైన ప్రధాని.. బీజేపీకి ఓటు వేస్తే మోటార్ల కాడ మీటర్లు బిగిస్తామని బాహాటంగానే చెబుతున్న విషయాన్ని రైతులు గమనించాలని కేటీఆర్ కోరారు. ప్రధాని మోదీ జన్‌ధన్ ఖాతాలు తీయమని చెప్పి రూ.15 లక్షలు వేస్తామని హామీ ఇచ్చి కనీసం రూ. 15 కూడా వేయలేదని విమర్శించారు. దేశంలో నిత్యావసర సరుకులను పిరం చేసి ప్రియమైన ప్రధాని కాకుండా పిరమైన ప్రధానిగా మోదీ మారిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మిత్తితో సహా రైతు రుణమాఫీ.. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీని మిత్తితో సహా చెల్లిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లే అవుతోందని.. కొన్నింట్లో చిన్నచిన్న పొరపాట్లు ఉండవచ్చని.. వాటన్నింటినీ సరిచేసుకుందామన్నారు. కాంగ్రోసోళ్లు ఓటుకు రూ. 10 వేలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిసిందని... ఆ డబ్బును అందరూ తీసుకొని ఓటు మాత్రం కారు గుర్తుకే వేయాలని కేటీఆర్ కోరారు. అంబర్‌పేటలో బీఆర్ఎస్ను గెలిపిస్తే మెట్రో రైలు విస్తరిస్తామని, మూసీ సుందరీకరణ చేపట్టి దానిపై కొత్త బ్రిడ్జీలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గిగ్ వర్కర్ల సంక్షేమానికి సంక్షేమ బోర్డు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ సాక్షి, హైదరాబాద్: స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబర్ ఇతర పార్ట్‌టైం ఉద్యోగాలు చేసే యువకుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడి ఉద్యోగులకు ఆరోగ్య బీమా, పీఎఫ్, ఈఎస్ఐ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సోమవారం తనను కలిసిన వివిధ ఫుడ్ డెలివరీ ఉద్యోగులతో కేటీఆర్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే అధికారులు, కంపెనీల ప్రతినిధులు, గిగ్ వర్కర్ల ప్రతినిధులతో సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామన్నారు. గిగ్ వర్కర్లకు కనీస జీతాలను చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వమే ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్, ఇతర ఆన్లైన్ సేవలకు ప్రత్యేక యాప్‌ని ఏర్పాటు చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు ఉద్యోగులు చేసిన సూచనపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. దీనిపై అధ్యయనం చేస్తామన్నారు. -
యువత కోసమే తొలి అడుగు
సాక్షి, హైదరాబాద్: తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలోని యువతను ఆదుకోవడమే లక్ష్యంగా తొలిఅడుగు వేస్తామని ఏఐసీసీ అగ్రనేత రాహు ల్‌గాంధీ వెల్లడించారు. అక్కడి నిరుద్యోగులు, యువతతో ముచ్చటించిన సందర్భంలో తాను చూసిన, విన్న విషయాలు తీవ్రంగా కలచివేశాయ ని పేర్కొన్నారు. తెలంగాణలోని పరిస్థితులను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు, విద్యార్థులతో భేటీ అయిన వీడియో ను సోమవారం ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ‘నేను ఒకసారి తెలంగాణ యువతతో సమావేశమయ్యాను. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు లీకవడం, ఈ లీకేజీల్లో కేసీఆర్ బంధువుల పాత్ర ఉండడం సిగ్గుపడాల్సిన విషయం. తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన డబ్బులతో చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రావడం లేదు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉంది. యువతకు ఉపాధి, విద్యావకాశాలు కల్పించే దిశలో మేం మొదటి అడుగు వేస్తాం. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసేలా జాబ్ కేలండర్ ఇప్పటికే విడుదల చేశాం. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం. యువ వికాసంలో భాగంగా విద్యాభరోసా కార్డుల ద్వారా విద్యార్థులు.. కళాశాల, యూనివర్సిటీ, కోచింగ్ ఫీజులు కట్టుకునేందుకు రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తాం. అది తెలంగాణ యువత కోసం మేం వేయబోయే ముందడుగు..’అని ఆ వీడియోలో రాహుల్ చెప్పారు. దొరల సర్కారులో తెలంగాణ యువత తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోందని అశోక్‌నగర్‌లో తన తాజా భేటీతో స్పష్టమైందని, తమ పార్టీ ఇచ్చిన జాబ్ కేలండర్ వారికి ఉపశమనం కలిగిస్తుందని, త్వరలో కాంగ్రెస్ నేతృత్వంలో రాబోయే ప్రజల సర్కారులో తెలంగాణ యువత భవితవ్యం పదిలంగా ఉంటుందని, ఇది తన గ్యారంటీ అని పేర్కొన్నారు. నేడు కార్మిక సంఘాలతో భేటీ: చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10:30–11 గంటల వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఆటో వర్కర్లు, జీహెచ్ఎంసీ, జిగ్ కార్మికుల సంఘాలతో సమావేశమవుతారని, మధ్యాహ్నం 11:30–12:30 గంటల వరకు నాంపల్లి నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించి కార్నర్ మీటింగ్‌లో మాట్లాడతారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ జహీరాబాద్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు. -
తెలంగాణలో కర్ణాటక ప్రభుత్వ యాడ్స్‌పై ఈసీ నిషేధం
హైదరాబాద్: కర్ణాటక ప్రభుత్వంపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆగహం వ్యక్తం చేసింది. తెలంగాణలో ప్రకటనలు ఇవ్వడాన్ని సీఈసీ తీవ్రంగా పరిగణించింది. వెంటనే ప్రకటనలు ఆపివేయాలని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు కర్ణాటక సీఎస్ కు లేఖ రాసింది. తెలంగాణలో ప్రకటనల జారీ ఎన్నికల నియమావళి ఉల్లంఘన అవుతుందని కమిషన్ స్పష్టం చేసింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఈసీఐ ఆదేశించింది. సంబంధిత శాఖ కార్యదర్శిపై చర్యలు ఎందుకు తీసుకోరాదో తెలపాలని స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల ముందు ఇక్కడ కర్ణాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా యాడ్లు ఉన్నాయని బీజేపీ ఆరోపించింది. దీనిపై స్పందించిన ఈసీ ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న కౌటింగ్ జరగనుంది. కాగా.. రేపటితో పార్టీల ప్రచారాలకు తెర పడనుంది. ఇదీ చదవండి: పారిపోయే చాన్స్ చాలా తక్కువ -
జోరుగా ప్రచారం.. హైదరాబాద్‌లో స్తంభించిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చింది. దీంతో రాజధాని హైదరాబాద్‌లో పార్టీల అగ్రనేతల ప్రచారం ఊపందుకుంది. ఒక్కసారిగా సభలు, రోడ్‌షోలు, కార్నర్ మీటింగ్‌లు పెరిగిపోవడంతో నగరంలో సామాన్య జనాలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. సోమవారం సాయంత్రం నగరంలో వీఐపీల ప్రచార టూర్లు ఎక్కువగా ఉండడంతో నగరంలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటలవరకు హైదరాబాద్‌లోని ప్రధాన రూట్లలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. అమీర్‌పేట్, సికింద్రాబాద్ నుంచి బేగంపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే రోడ్డు, సికింద్రాబాద్ నుంచి కోఠి వైపు వెళ్లే రోడ్లపై పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఒక కిలో మీటర్ దూరం వెళ్లడానికి సుమారు గంట సమయంపైగా పట్టడంతో విసుగు చెందిన నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలు సాధారణంగా జెడ్ ప్లస్ లేదా ఆ పై స్థాయి సెక్యూరిటీ భద్రతలో ఉంటారు. సెక్యూరిటీ ప్రోటోకాల్ ప్రకారం వారి కాన్వాయ్ వెళ్లేందుకు రోడ్లపై ట్రాఫిక్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పోలీసులు నగరంలో పీక్ అవర్స్ ఉన్నప్పటికీ ట్రాఫిక్‌ను ఆపేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఎదురవుతోంది. పీక్ అవర్స్‌లో ట్రాఫిక్ ఆపడం కారణంగా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు చాలా ఇబ్బందులెదుర్కొంటున్నారు. గత కొద్దిరోజులుగా హైదరాబాద్‌లో వీఐపీల పర్యటనలతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్న నగరవాసులకు ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలతో ముగియనుండడంతో ఉపశమనం లభించనుంది. గురువారం(నవంబర్ 30) న పోలింగ్ ఉండడంతో ఎన్నికల సంఘం నిబంధనల మేరకు 48 గంటల ముందే పచారం ఆపాల్సి ఉంటుంది. దీంతో మంగళవారం సాయంత్రం 5 గంటలకు మైకులన్నీ మూతపడనున్నాయి. -
ఖమ్మంలో బెట్టింగుల హోరు !
సాక్షి,ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆ నాలుగు నియోజకవర్గాల్లో అభ్యర్థుల విజయంపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఇప్పటికే బెట్టింగ్ మార్క్ 100 కోట్లు దాటిందా? పోలింగ్ సమయానికి బెట్టింగులు మరింతగా పెరుగుతాయా? ఏపీకి చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లా బెట్టింగుల్లో కీలక పాత్ర పోషిస్తోందనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు అభ్యర్థులు మాత్రం తమ గెలుపోటములపై బెట్టింగులు పెట్టవద్దని సూచిస్తున్నారంటూ టాక్ మొదలైంది. ఇంతకీ బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం మొదలైన ఆ నాలుగు స్థానాల కథేంటో చూద్దాం. పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుతోంది. ఒక రకంగా రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవహారాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఖమ్మంలో ఏంజరుగుతోందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్న పది సీట్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్య పోరు హోరా హోరీగా సాగుతోంది. ఒకవైపున పోరు రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు అభ్యర్థుల గెలుపోటములపై బెట్టింగులు కూడా అదే రేంజ్లో సాగుతున్నాయి. జిల్లాలో ముఖ్యంగా రెండు జనరల్ సీట్లు..రెండు ఎస్సీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనే విషయం మీద భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి అధికార గులాబీ పార్టీ తరపున మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్...కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ పడుతున్నారు. ఇక్కడ వీరిద్దరి మధ్యా పోటీ అత్యంత తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఈ ఇద్దరి గెలుపు ఓటములపై భారీ బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. పది వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపులా బెట్టింగ్ నడుస్తున్నాయి. అయితే మెజారిటీ 30వేలు దాటుతుందని ఓ పార్టీ అభ్యర్థిపై పెద్ద ఎత్తున బెట్టింగ్ పెట్టారు. ఇక పాలేరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరపున కందాల ఉపేందర్‌రెడ్డి...కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ పడుతున్నారు. సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. ముగ్గురి మధ్య పోటీ టఫ్‌గా ఉంది. అందుకే ఒక్క ఓటుతో గెలుస్తారనేదానిపై ఎక్కువగా బెట్టింగులు నడుస్తున్నాయి. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లోనే బెట్టింగులు వంద కోట్లు దాటాయని టాక్ నడుస్తోంది. ఖమ్మం, పాలేరు స్థానాల తర్వాత..సత్తుపల్లి, మధిర నియోజకవర్గాల్లో కూడా బెట్టింగులు జరుగుతున్నాయి. అనూహ్యంగా సత్తుపల్లిలో బెట్టింగ్‌లు భారీగా పెరిగాయి. ఇక్కడ కూడా ప్రధాన పార్టీల మధ్య రసవత్తరమైన పోటీ నడుస్తూ ఉండటమే బెట్టింగులకు కారణం. ఇక్కడ రెండు పార్టీల అభ్యర్థులకు సంబంధించి 5 వేల లోపు మెజార్టీతో బయట పడుతారని బెట్టింగ్‌లు కాస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి సండ్ర వెంకటవీరయ్య బరిలో ఉండగా..కాంగ్రెస్ నుంచి మట్టా రాగమయి పోటీ చేస్తున్నారు. మధిరలో సైతం సీఎల్పీ నేత భట్టి విక్కమార్క గెలుస్తారా లేదా అనేదానిపై జోరుగా బెట్టింగులు నడుస్తున్నాయి. మధిరలో బీఆర్ఎస్ నుంచి లింగాల కమల్ రాజ్ బరిలో ఉండగా...భట్టి విక్కమార్క కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. 10వేల లోపు మెజార్టీతో గెలుస్తారని రెండు వైపుల నుంచి బెట్టింగ్ లు నడుస్తున్నాయి. రాష్ట్రంలో రోజు రోజుకి పొలిటికల్ ఈక్వేషన్స్ శరవేగంగా మారుతున్నాయి. బెట్టింగ్‌లు సైతం అదే స్థాయిలో స్పీడ్ అందుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ వర్గం ఖమ్మం జిల్లాలో జరుగుతున్న బెట్టింగ్ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడుతారన్న దానిపై నిరంతరం -
రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలన అంతా చీకటిమయమేనని మంత్రి హరీష్ రావు అన్నారు. కరెంట్ కష్టాలు, నీటి కష్టాలను ప్రజలు ఏనాడూ మర్చిపోలేదని చెప్పారు. అర్ధరాత్రి రైతులను గోస పెట్టిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులను ఏనాడు పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో నకిలీ విత్తనాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్లు మారిపోయాయని ధ్వజమెత్తారు. వ్యవసాయం దండగ అంటున్న నాయకునికి వారసుడు రేవంత్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు ఆపాలని కుట్ర పన్నిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక పార్టీనే అని అన్నారు. కాంగ్రెస్ గెలవగానే కర్ణాటకలో రైతు బంధు రద్దు అయిందని చెప్పారు. టీపీసీసీ చీఫ్ రైతు బంధు అవసరమా? అంటాడు.. రైతుల కష్టాలు తెలియని వారు సరైన పాలన ఎలా ఇవ్వగలరని ప్రశ్నించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు.. సిగ్గుందా?: కేసీఆర్ -
గ్రేటర్ హైదరాబాద్‌పై బీఆర్ఎస్ ఫోకస్
గ్రేటర్ హైదరాబాద్‌లో గులాబీ పార్టీకి ముళ్ళు గుచ్చుకుంటున్నాయా? సిటీలో నివసిస్తున్న తెలంగాణేతర ప్రాంతాల ప్రజల ఓట్ల కోసం బీఆర్ఎస్ శ్రమిస్తోందా? హోరా హోరీగా జరిగే ఈ ఎన్నికల్లో బయటి ప్రాంతాలవారి ఓట్లే కీలకంగా మారనున్నాయా? సామాజిక వర్గాల వారీగా ఓట్లు కూడగట్టేందుకు బీఆర్ఎస్ అభ్యర్థులు అనుసరిస్తున్న వ్యూహం ఏంటి? బయటి ప్రాంతాల ప్రజల ఓట్లు సాధించడంలో గులాబీ పార్టీ సక్సెస్ అవుతుందా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంటోంది. ప్రధాన రాజకీయ పార్టీలు హోరా హోరీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. అన్ని పార్టీలు చావో రేవో అన్నట్లుగా తలపడుతున్నాయి. ప్రాంతం, సామాజిక వర్గాల వారీగా ఓటర్లకు చేరుయ్యేందుకు పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ...అమలు చేస్తున్నాయి. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుంచి వచ్చినవారు.. ఇతర రాష్ట్రాల వారు ఉండడంతో వారి ఓట్లపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. గ్రేటర్లో మెజార్టీ సీట్లు గెలవాలంటే వారి ఓట్లు కీలకం కాబట్టి...ఇతర ప్రాంతాల ప్రజల విశ్వాసం పొందేందుకు గులాబీ పార్టీ అభ్యర్థులు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా తెలంగాణేతర ప్రజల ఓట్లను అన్ని పార్టీలు కీలకంగా భావించాయి. ఇతర ప్రాంతాలకు చెందిన ఓటర్లతో సామాజిక వర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు వారి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీ అభ్యర్థులు ఆయా సామాజికవర్గ నేతల భేటీలు పూర్తి చేసే పనిలో ఉన్నారట. చివరి దశలో ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఆయా సామాజికవర్గాలతో భేటీలు నిర్వహించి మద్దతు కోరతారని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో గ్రేటర్ లో ఎక్కువ సీట్లు గెలవకపోయినా...2018 వచ్చే సరికి పూర్తి స్థాయిలో విపక్ష పార్టీలపై ఆధిక్యం సాధించింది బీఆర్ఎస్. ఇప్పుడు కూడా గ్రేటర్ లో అదే స్థాయిలో సీట్లు తమ ఖాతాలో వేసుకోవాలని వ్యూహాలలో మునిగి తేలుతున్నది గులాబీ పార్టీ. గ్రేటర్ హైదరాబాద్ లో ఈసారి ఓటర్లు ఎటువైపు ఉంటారు అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఎంఐఎం ప్రాతినిత్యం వహిస్తున్న స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో గులాబీ పార్టీ పాగా వేస్తుందా లేదా అనే చర్చ మాత్రం జరుగుతోంది. గ్రేటర్ ప్రజలు ఎవరిని కరుణిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3 వరకు ఆగాల్సిందే. -
మీరు మాత్రం వందల కోట్లు దోచుకోవచ్చా?
తెలుగుదేశం పార్టీ బాకాగా గుర్తింపు పొందిన మీడియాలో ఈనాడుతో పాటు ఆంధ్రజ్యోతి కూడా ఒకటి. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అయితే నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో నిత్యం సంబంధాలు నెరపుతుంటారు. టీడీపీ ప్రభుత్వం ఏపీలో ఉన్నప్పుడు రాధాకృష్ణే పలు మద్యవర్తిత్వాలు, ఆర్దిక లావాదేవీలు చేసి బాగా లాభపడ్డ వ్యక్తి అన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో ఉంది. కొన్ని వందల కోట్ల రూపాయల మేర ఆయన తన సంస్థలకు కట్టబెట్టుకున్నారని అప్పట్లో కొందరు ప్రముఖులు నేరుగానే విమర్శలు గుప్పించేవారు. అలాంటి వ్యక్తి ఏమైనా చెబితే అదంతా చంద్రబాబు మనసులో మాటగాను, టీడీపీ భావనగాను అంతా భావిస్తారు. తాజాగా ఆయన రాసిన ఒక వ్యాసంలో తెలంగాణలో రాజకీయ పార్టీలు శాసనసభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై చాలా ఆందోళన చెందారు. ప్రజలకు ఇలా పప్పు , బెల్లాలు మాదిరి పంచిపెట్టి వారిని సోమరులుగా మార్చుతారా అని ఆయన ప్రశ్నించారు. ✍️ఇది చదుతుంటే ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత మరోలా మాట్లాడే చంద్రబాబే గుర్తుకు వస్తారు. ఎంతకాదన్నా ఆయన సొంత మనిషిగానో, మరో రకంగానో ఈయన పేరు పడ్డారు కాబట్టి అలా రాసి ఉండవచ్చు. తెలంగాణ ఎన్నికల ఖర్చు, అక్కడి హామీల గురించి రాస్తూ కూడా ఈయన ఏపీని, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ద్వేషించడం మానుకోలేదు. ఈయన వ్యాసంలోని ఒక భాగం ఇలా ఉంది'ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ చేసిన హామీల అమలుకు ఏటా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఒక అంచనా. ✍️కళ్లు చెదిరే అభివృద్ధి చేశామని చెప్పుకొనే పాలకులు ఈ విధంగా ప్రజలకు తాయిలాలు పంచుకుంటూ పోవడం సమర్థనీయమా? ఇలా అయితే ఈ హామీలకు అంతెక్కడ? కేసీఆర్ కోరుకుంటున్నట్టు ప్రజలు ఎలా గెలుస్తారు? రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించే హక్కు రాజకీయ పార్టీలకు ఎవరిచ్చారు? ఎవరో ముఖ్యమంత్రి పీఠం మీద కుర్చోవడానికి ఇలా అలవికాని హామీలు ఇచ్చుకుంటూ పోవచ్చునా? ఈ ధోరణికి అడ్డుకట్ట పడాల్సిన అవసరం లేదా? ఈ విషయంలో రాజ్యాంగబద్ధ సంస్థలు బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా లేవు. స్వీయ నియంత్రణ పాటించాల్సిన రాజకీయ నాయకులు ఆ పని చేయరు. మరి ఎలా? మౌలిక సదుపాయాల కల్పనకు డబ్బు లేకపోయినా సంక్షేమం పేరిట ప్రజా ధనాన్ని పప్పూ బెల్లాల్లా పంచడం వల్ల ప్రజల్లో సోమరితనం పెరిగిపోతుండటం నిజం కాదా? "అని రాశారు.ఇది చదివితే ఏమనిపిస్తుంది. ✍️చంద్రబాబు నాయుడు తన మనసులో మాట పుస్తకంలో రాసిన విషయాల మాదిరే అనిపిస్తుంది కదా! పేద ప్రజలకు సాయం చేయడం వారిని సోమరిపోతుల్లా మార్చడమే అని అంటున్న ఈయన మాత్రం ప్రభుత్వాల నుంచి వందల కోట్లు సంపాదింవచ్చు. అది ప్రజల అభివృద్ది. అది మౌలిక వసతుల అభివృద్ది అని అనుకోవాలి. తన మీడియా వ్యాపారం కోసం ఈయన రాజకీయ నేతల నుంచి కోట్లకు కోట్లు వసూలు చేయవచ్చు. అప్పుడు ఆ డబ్బు ఎక్కడ నుంచి వస్తుందన్న సందేహం ఈయనకు రాదు. ప్రచార ప్రకటనల పేరుతో , నేతల పుట్టిన రోజు అనో, మరొకటనో వారిని పీడించి డబ్బులు గుంజవచ్చు. అక్కడితో ఆగకుండా ఆంధ్రజ్యోతి వార్షికోత్సవం పేరుతో ఎందరి నుంచి ప్రకటనల రూపంలో డబ్బు దండుకుంటున్నారు!ఇదంతా ఎక్కడ నుంచి వస్తుంది!చేసేది ..ఈ పనులు.. చెప్పేవి మాత్రం నీతులు. ప్రజలపైన, రాష్ట్రం పైన ప్రేమ ఉన్నట్లు నీతి శతకాలు వల్లె వేయడం. పోనీ ఇన్ని కబుర్లు చెప్పే ఈయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 2014లో రైతుల, డ్వాక్రా మహిళల లక్ష కోట్ల రుణాలు మాఫీ చేస్తామని బోగస్ హామీ ఇచ్చినప్పుడు, అబ్బో ఆయన కాబట్టి రుణమాఫీ చేసేస్తారు.. అని ఆయన పత్రిక ప్రచారం చేసిందా?లేదా? అప్పుడేమైనా చంద్రబాబు హామీని నమ్మవద్దని రాసి ఉంటే ఫర్వాలేదనుకోవచ్చు.టీడీపీ ప్రతినెల రెండువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని మానిఫెస్టోలో రాసినప్పుడు అదెలా సాధ్యమని ప్రశ్నించారా?సుమారు 400 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసినప్పుడు ఈయనకు కమ్మగా ఉంది కదా! ✍️ఆ మానిఫెస్టోని వెబ్ సైట్ నుంచి మాయం చేసేశారు కదా! అప్పుడు నోరెత్తలేదే! చిత్తశుద్ది ఉంటే వాటిని కూడా ప్రశ్నించాలి కదా! ఈయన అసలు ద్వేషం తెలంగాణ పార్టీల మీద.. ఆ నేతల మీద కాదు. ఎందుకంటే ఆ పార్టీల నేతలతో ఆయన ఏదో రకంగా ఒప్పందం అయి ఉంటారు. బాగానే గిట్టుబాటుఅయి ఉంటుంది.అందుకే మొదట కాంగ్రెస్ కు పూర్తి అనుకూలంగా ,టిఆర్ఎస్ పై దూకుడుగా వెళ్లిన ఈ మీడియా ఆ తర్వాత ఎందుకు పంధా మార్చుకుందో అర్ధం చేసుకోలేమా! ఆయన వెంటనే ఆవు కధ మాదిరి ఏపీ ప్రభుత్వంపై పడ్డారు. ముఖ్యమంత్రి జగన్ పై నిత్యం వెదజల్లె విషాన్ని మరోసారి చిమ్మి తన వికృత స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. ఇదే వ్యాసంలో ఏమంటారో చూడండి...'పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాం. బటన్లు నొక్కుతున్నామని చెప్పుకొంటున్న పాలకులు అభివృద్ధిని, మౌలిక వసతులను గాలికి వదిలేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఆ పరిస్థితి లేదు. ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను చూశాక తెలంగాణ పరిస్థితి కూడా దిగజారబోతోందన్న గుబులు పట్టుకుంది."ఇది పచ్చి అబద్దం. తెలంగాణలో సైతం పలు సంక్షేమ స్కీములు ఉన్నాయి. ✍️దళిత కుటుంబాలకు పది లక్షల చొప్పున ఆర్దిక సాయం చేస్తామని, బిసి బంధు, మరో బంధు పేరుతో లక్ష రూపాయల చొప్పున డబ్బు ఇప్పటికే ఇస్తున్నారు కదా!అవి కరెక్టా?కాదా?రైతు బంధు పేరుతో ఇచ్చే డబ్బులను సమర్ధిస్తారా? వ్యతిరేకిస్తారా?ఇంకో సంగతేమిటంటే ఈయన కాంగ్రెస్ పార్టీ చెబుతున్న ఆరు గ్యారంటీలను ఎందుకు వివరంగా విశ్లేషించలేదు?కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఆచరణలో మరింత కష్టం అని తెలియదా! మనసులో కాంగ్రెస్ గెలవాలి... రేవంత్ రెడ్డి సి.ఎమ్. అయితే ప్రభుత్వంలో చక్రం తిప్పాలన్న కోరిక కాకుండా మరొకటి ఉందా? మరి ఏపీలో నిజంగా మౌలిక వసతులపై దృష్టి పెట్టలేదా? వేలాది గ్రామాలలో స్కూళ్లను బాగు చేయడం , ఆస్పత్రులను బాగు చేయడం, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ,వార్డు సచివాలయాల భవనాలు నిర్మించడం ఇవేవి మౌలిక వసతులు కావా? పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం, నాలుగు ఓడరేవుల నిర్మాణం, తొమ్మిది ఫిషింగ్ హార్బనిర్మాణం వంటివి ఎన్నడైనా చంద్రబాబు టైమ్‌లో జరిగాయా? ✍️మరి అప్పుడు జరగకపోయినా చాలా జరిగిపోయినట్లు, ఇప్పుడు ఇన్ని జరుగుతున్నా, అసలేమీ చేయనట్లు పచ్చి అబద్దాలు రాస్తూ ప్రజలను మోసం చేయాలన్న తలంపు తెలుస్తూనే ఉంది. ఇది పక్కన బెడదాం. జగన్ బటన్ నొక్కుతున్నారని రోధిస్తున్నారు కదా! మరి చంద్రబాబు నాయుడు రాజమహేంద్రవరంలో మహానాడు పెట్టి మినీ మానిఫెస్టోని ప్రకటించి, అందులో జగన్ ఇస్తున్నవాటికి ఐదు రెట్ల సంక్షేమ స్కీములు అమలు చేస్తామని,బటన్ నొక్కుతామని చెప్పినప్పుడు ఇదే రాధాకృష్ణ తన పత్రికలో ఏమి రాశాడో తెలుసా! జగన్ ప్రభుత్వంపైకి చంద్రబాబు శరాలు సిద్దం..ఇక ప్రభుత్వం పని అవుట్ అన్న చందంగా వాటిని పోల్చి తెగపొగిడారు కదా! రాధాకృష్ణ ఎంతకాదన్నా చంద్రబాబుకు ఏజెంటే కాబట్టి , ఆయనలాగే వ్యవహరిస్తున్నారని అనుకోవచ్చా! జగన్ తాను చెప్పిన నవరత్నాల అమలుకు ఏడాదికి నలభైఐదు వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంటే గుండెలు బాదుకుంటున్న ఆంధ్రజ్యోతి, దీనితో పాటు ఉన్న మరో మీడియా ఈనాడులకు, చంద్రబాబు, పవన్‌లు ఇస్తున్న హామీల ప్రకారం ఏడాదికి లక్షన్నర కోట్లకు పైగానే ఆయా వెల్ఫేర్ స్కీములకు ఖర్చు చేయాలన్న విషయం తెలియదా! ✍️ఏనాడైనా అంత డబ్బు ఎక్కడనుంచి వస్తుందని రాధాకృష్ణ నిలదీశారా?అలా చేయకపోగా ..ఆహా మా చంద్రబాబు కాబట్టి అలా ప్రకటించారు అని చంకలు గుద్దుకున్నారు. నిజంగా రాధాకృష్ణకు ఏమాత్రం కొద్దిపాటి విలువలు ఉన్నా, చంద్రబాబు ప్రకటించిన మినీ మానిఫెస్టోని విమర్శిస్తూ వ్యాసం రాయాలి కదా? కర్నాటకలో కాంగ్రెస్ అమలు చేస్తామని చెప్పినవాటిని కొన్నిటిని, జగన్ అమలు చేస్తున్న కొన్నిటిని కాపీ కొట్టి మరింత ఎక్కువగా అమలు చేస్తామని కదా టీడీపీ మినీ మానిఫెస్టో ఇచ్చింది.దానికి బాబు గ్యారంటీ అంటూ ఒక సర్టిఫికెట్. 2014లో రైతుల రుణమాఫీ హామీ ఇచ్చి ఏదో తూతూ మంత్రంగా జరిపి చేతులెత్తేసినప్పుడు ఆ గ్యారంటీ ఏమైంది?ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో ఇష్టారీతిన హామీలు ఇచ్చేశారని రాధాకృష్ణ చెప్పకనే చెప్పేశారు. ✍️టీడీపీ మినీ మానిఫెస్టోని నమ్మవద్దని ఆయనకు తెలియకుండానే ఒక వాస్తవం చెప్పేశారనుకోవాలి. లేదంటే 2014లో మాదిరి హామీ ఇచ్చి ప్రజలను మోసం చేయవచ్చులే అని అయినా అనుకుని ఉండాలి. ఒకవేళ జగన్ తాను చెప్పిన విధంగా హామీలను నెరవేర్చకుంటే ఇదే రాధాకృష్ణ ఎంత ఘోరంగా రాసి ఉండేవారు! ఆ అవకాశం లేదు కనుక ఇప్పుడు ఈ రాగం ఎత్తుకున్నారు. పోనీ అందులో ఏమైనా చిత్తశుద్ది ఉందా అంటే అదేమి లేదు. మళ్లీ చంద్రబాబు చేసే అబద్దపు హామీలన్నిటిని భుజాన వేసుకుని తిరుగుతుంటారు. రాధాకృష్ణ, రామోజీవంటి వారిని ఆంధ్ర ప్రజలు నమ్ముతారా?నమ్మి మోసపోతారా? అంటే అలా జరగదనే 2019 ఎన్నికల అనుభవం చెబుతుంది. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
TS: ఊపు ఊపిన సోషల్ ప్రచారం
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్.. జనాలకు ఇదొక నిత్యవ్యవహారం(నిత్యావసరం!). కానీ, రాజకీయ పార్టీలకు, నేతలకు మాత్రం అవసరాన్ని బట్టి వాడకంగా మారింది. ప్రత్యేకించి ఎన్నికల సమయంలో ఇది వాళ్లకు అత్యంత ప్రాధాన్యమిచ్చే అంశం. త్వరగతిన ప్రజలకు చేరాలంటే సోషల్ మీడియాను మించిన వేగవంతమైన వేదిక వాళ్లకు మరొకటి కనిపించడం లేదు మరి. అందుకే.. అన్ని మాధ్యమాల్లో ఈసారి ఎన్నడూ లేనంతంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల Telangana Assembly Election 2023 కంటెంట్ వైరల్ అయ్యింది. నిస్సారంగా సాగుతున్న నేతల ప్రసంగాల నడుమ.. ఒక రకంగా ఎన్నికల సమరానికి ఊపు తెచ్చింది కూడా ఈ సామాజిక మాధ్యమ ప్రచారమే! సోషల్ మీడియా ప్రచారంలో నేతల ఊకదంపుడు ఉపన్యాసాలుంటేనే సరిపోదు. జనంలోకి దూసుకెళ్లే స్థాయిలోనే కంటెంట్‌లో దమ్ముండాలి. అయితే ఇక్కడ నేతల డిజిటల్ క్యాంపెయినింగ్‌పైనా ఎన్నికల సంఘం నజర్ ఉంటుంది. అభ్యర్థుల ఖర్చు పరిమితి రూ.40లక్షలు దాటకూడదని ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఉన్నాయి. కాబట్టి తమ ప్రచార ఖర్చులన్నింటిలోనే సోషల్ మీడియా నిర్వహణ కూడా ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఖాతాల నిర్వహణ.. వాటి కోసం ఎంత మంది పని చేస్తున్నారు.. వాళ్ల జీతభత్యాలు, ఇతర ఖర్చుల వివరాలు.. నేతల ప్రసంగాల్లో ఈసీ కోడ్ ఉల్లంఘనలు ఏమైనా ఉన్నాయా?.. నిశిత పరిశీలన ఉండాలి. అదే.. ఎన్నికల నిబంధనల్లో ఎక్కడా పార్టీల ఖర్చు పరిమితిపై ఆంక్షలు లేవు. దీంతో నేతల పేర్ల ప్రస్తావన తేకుండా.. పార్టీలను గెలిపించాలంటూ ప్రధానంగా సోషల్ మీడియా ప్రచారం ఉవ్వెత్తున సాగింది. పాటలు.. పదనునైన తూటాలు గులాబీల జెండలే రామక్క.. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి.. సాలు దొర, సెలవు దొర అంటూ.. ప్రకటనలు సోషల్ మీడియాను ఒక ఊపు ఊపాయి స్వరాష్ట్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగేసేలా చేసి.. ఇక్కడి ప్రజల నరాల్ని ఉత్తేజితం చేసిన తెలంగాణ పాటకు ఇప్పుడు రాజకీయ రంగు పలుముకుంది. ఉద్యమ గాయకులు, జానపద కళాకారులుగా పేరొందిన ఎందరో.. పూర్తిగా పార్టీలకు ఆస్థాన గాయకులుగా పని చేశారు. పొగడ్తలు, విమర్శలతో.. విడివిడిగా, కలగలిపి రూపొందించిన పాటలు ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో Telangana Assembly Election 2023 ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్పెషల్ సాంగ్స్‌తో పాటుగా జానపద గేయాలకు.. ఆఖరికి సినిమా పాటల పేరడీలు సైతం జనాదరణతో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్ట్ చేసిన బలగం సినిమాను సైతం.. ఏ నేత వదలకుండా ‘ప్రజలే మా బలగం’ అంటూ పోస్టర్లు వదిలారు. ఇంటర్వ్యూల పర్వం.. వయసు తారతమ్యాలు లేకుండా యూట్యూబ్‌కు ఇప్పుడు ఎక్కువ ప్రాధాన్యం ఉంటోంది. ఫుల్ వీడియోలతో పాటు షార్ట్ వీడియోలపై ఎక్కువ స్క్రీన్ టైం గడిపేస్తున్నారు. అందుకే యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌ను తమ ప్రచారం కోసం వాడేసుకున్నాయి పొలిటికల్ పార్టీలు. రాజకీయ మేధావులు, ప్రముఖ జర్నలిస్టులతో పాటు అటు జాతీయస్థాయిలో.. ఇటు స్థానికంగానూ జనాల నోళ్లలో ఎక్కువగా నానుతుండే యూట్యూబర్లు, బుల్లి తెర నుంచి జనాలకు ఎక్కువగా పరిచయమున్న వాళ్లు.. రాజకీయ నేతల్ని ఇంటర్వ్యూలు చేశారు. లీడర్లు సైతం తమ ప్రచారానికి ఉపయోగపడే రీతిలో ఉండేలాగానే ఆ ఇంటర్వ్యూల్ని ప్లాన్ చేయించుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రత్యర్థుల నుంచి విమర్శలు ఎదురైనా సరే నేతలు తేలికగా తీసుకున్నారు. డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ఇంటర్వ్యూలలో పాడ్‌కాస్ట్, రేడియోలను సైతం వదల్లేదు. వ్యక్తిగత దూషణలు ఈసారి తెలంగాణలో ప్రధాన పార్టీల కీలక నేతల ప్రచారాల ప్రసంగాల్లో పెద్దగా ప్రత్యేకత ఏం కనిపించలేదు. సామెతలు, పిట్ట కథలతో సమాజాన్ని ఆకట్టుకునే కేసీఆర్ సైతం.. ప్రతిపక్షాలపై సాధారణ విమర్శలతోనే సరిపెట్టారు. అయితే వ్యక్తిగత విమర్శల పర్వం మాత్రం షరా మామూలుగా కొనసాగింది. ‘‘చిప్పకూడు తిన్న సిగ్గు రాలే..!!’’ అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బక్కోడు భూబకాసరుడు అంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలు.. ఓ మోతాడు డోసుతో సాగింది విమర్శల పర్వం. బడా-చోటా నేతలు ప్రచారంలో విమర్శలు-ప్రతివిమర్శలకు దిగి ఎన్నికల సమరాన్ని హీటెక్కించారు. రాజకీయ ప్రసంగాలు సాదాసీదాగా సాగినప్పటికీ.. అక్కడక్కడ మాత్రం ఆ విమర్శలు బూతుల దాకా వెళ్లాయి. ఉదాహరణకు.. మొన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ కండువా కప్పేసుకుని కేసీఆర్‌పైనే వ్యక్తిగత దూషణలకు దిగారు. మైనంపల్లి, మల్లారెడ్డిల మధ్య విమర్శలైతే ఒక పరిధిని దాటాయి. ఇక.. పార్టీల మధ్య దూషణలు, విమర్శలు తీవ్రతరమై యాడ్స్ రూపేణా కనిపించడంతో ఎన్నికల సంఘం కలుగజేసుకుని చర్యలతో వాటిని కట్టడి చేసింది. Credits: Nenu Mari Antha Yedvanaaaa Insta Page ఇదేందయ్యా ఇది.. ఇది ఊహించలే! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు Telangana Assembly Election 2023 ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇదే. సాధారణంగా.. నేతలు తమ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో, పార్టీలు తమ అధికారిక పేజీలలో.. ఇవేగాక ఫలానా నేతల ‘సైన్యం’(ఆర్మీ) పేరిట పేజీలు, ఫ్యాన్ మేడ్ హ్యాండిల్స్ ఉండనే ఉన్నాయి. అయితే అదేం విచిత్రమో.. నిత్యం సినిమా డైలాగులు, ఫన్నీ సీన్ల ఫొటోలతో మీమ్స్ వేసి ఫాలోవర్లకు వినోదం పంచే సోషల్ మీడియా పేజీలు సైతం పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. ఫలానా పేజీ ఫలానా రాజకీయ పార్టీకి.. వకాల్తా పుచ్చుకుని మరీ పోస్టింగ్‌లు చేశాయి. ప్రభుత్వ, పార్టీ విజయాలపై లబ్ధిదారులతో ప్రచారం. ఈసారి వ్యహారమంతా పార్టీల పరాజయాలపై పోస్టులు. నేతల స్పీచ్లలోని తప్పులు.. చేష్టలపై మీమ్స్.. ట్రోల్స్ ఇలా నడిచింది. ఆఖరికి.. పార్టీల మేనిఫెస్టోలను కూడా సోషల్ మీడియా పేజీలు ప్రచారం చేశాయంటే ఈసారి సోషల్ ప్రచారం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి 29ఏళ్ల లోపు ఓటర్లు 72లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది 18-19 వయసులో(కొత్త ఓటర్లు) ఉన్నవాళ్లు ఉన్నారు. ఇక 30పైబడిన వాళ్లలోనూ సామాజిక మాధ్యమాలలో టైంపాస్ బాపతు ఎక్కువే ఉన్నారు. వీళ్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగానే.. ఇలాంటి పేజీలను పొలిటికల్ పార్టీలు తమ ఆధీనంలోకి తీసుకుని ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ట్రెండింగ్‌లో హెలికాఫ్టర్ ఎక్కడో ఆదిలాబాద్‌లో పార్టీ ప్రచార సభలో మాట్లాడిన నేత.. గంటన్నర తర్వాత సంగారెడ్డి మీటింగ్‌లో కనిపిస్తారు. ఆ తర్వాత గంటకు ఎక్కడో నల్లగొండ బహిరంగ సభలో ప్రసంగిస్తుంటారు. వందల కిలోమీటర్ల దూరం.. వాయువేగంతోనే వెళ్తే సాధ్యమవుతుంది కదా!. అలా ఈసారి ఎన్నికల్లో నేతల హెలికాఫ్టర్ల వాడకం ఎక్కువగా కనిపించింది. ప్రధాన పార్టీల అగ్రనేతలు మాత్రమే కాదు.. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నవాళ్లూ, కీలక నేతలు, ఓ మోస్తరు నేతలు సైతం విమానల్లో చక్కర్లు కొట్టేశారు. అదే సమయంలో.. రెంట్‌కు హెలికాఫ్టర్లను అందించే కంపెనీలకైతే ఫుల్ గిరాకీ నడిచింది. అలా హెలికాఫ్టర్ ట్రెండ్ కూడా సోషల్ మీడియాకు ఎక్కింది. బర్రెలక్క నాగర్ కర్నూల్ పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల కర్నె శిరీష.. ‘బర్రెలక్క’గా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ ఇప్పుడు. స్వతంత్ర అభ్యర్థినిగా నాగర్ కర్నూల్ బరిలో నిలిచిన శిరీష గురించి మీడియా, సోషల్ మీడియా విపరీతంగా చర్చించింది. చాలాకాలం కిందట.. డిగ్రీ చదివి కూడా నిరుద్యోగిగా ఉన్నానంటూ ఉద్యోగాల నోటిఫికేషన్.. నియామకాల భర్తీ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ బర్రెలను మేపుతూ సరదాగా వీడియో అప్లోడ్ చేసి ‘బర్రెలక్క’ ఫేమస్ అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నామినేషన్ వేయడం.. ప్రచారం చేసుకునేందుకు సైతం డబ్బులు లేవంటూ సోషల్ మీడియాలో విజ్ఞప్తులు.. ఆ వీడియోకు నిరుద్యోగ యువత కదిలివచ్చి చందాలేసుకుని మరీ ఆమె కోసం ప్రచారంలోకి దిగడం.. గుర్తుతెలియని వర్గం ఆమె బృందంపై దాడి చేయడం.. కన్నీళ్లతో ఆమె మాట్లాడిన మాటలు.. ఆ వెంటనే ఆమె లభించిన మేధోవర్గాల, కొందరు రాజకీయ నేతల మద్ధతు.. హైకోర్టు ఆదేశాలతో గన్‌మెన్ సెక్యూరిటీ.. ఈ పరిణామాలన్నింటిని నడుమ సోషల్‌మీడియాలో ఆమెకు విపరీతంగా పెరిగిన సానుభూతి రప్పించి ఈ దఫా ఎన్నికల్లో ఈమె గురించి చర్చించుకునేలా చేశాయి. ఇవేకావు తమ నియోజకవర్గ ఓటర్లు ఏ ప్రాంతంలో ఉన్నా.. ఫోన్లు చేసి, మెసేజ్‌లు పంపి మీటింగ్‌లకు రమ్మని ఆహ్వానాలు పంపడం. వాట్సాప్‌లో సందేశాలు.. ఒక అడుగు ముందుకేసి రాజకీయ ప్రత్యర్థుల అవినీతి-అసమర్థతలను ఎండగట్టే రీతిలో రూపొందించిన కరపత్రాల పంపిణీ.. ఫేక్ ప్రచారాలు వాటిని ఖండిస్తూ వచ్చిన ఫ్యాక్ట్ చెకింగ్ కౌంటర్లు.. ఇలా షరామాములుగానే కనిపించింది. నవంబర్ 28 సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపథ్యంలో కథనం -
పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారు: మోదీ
సాక్షి, కరీంనగర్: పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందని చెప్పారు. తెలంగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వంలో బీసీ సామాజిక వర్గానికి చెందినవారే సీఎం అవుతారని స్పష్టం చేశారు. తెలంగాణ అభ్యన్నతి బీజేపీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. కరీంనగర్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కరీంనగర్ షోడశమహాజనపదాల్లో ఒకటిగా ఉండేదని ప్రధాని మోదీ చెప్పారు. పదేళ్ల పిల్లల్ల భవిష్యత్ కోసమే తల్లిదండ్రులు ఎంతగానో ఆలోచిస్తారు.. అలాగే తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆచితూచి అడుగులు వేయాలని కోరారు. కరీంనగర్ ప్రజాస్వామ్యానికి ప్రతిబింబమని పేర్కొన్నారు. దేశం కోసమే ఓటు వేయాలంటే అది బీజేపీకి మాత్రమే ఓటేయాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని గమనించినట్లు మోదీ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి ఎక్కడ జరిగింది? అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఈ సమయంలో బీజేపీ ప్రభుత్వం ఎంతో అవసరమని వెల్లడించారు. కాంగ్రెస్‌కు ఓటేయడమంటే అది బీఆర్ఎస్కేనని ప్రజలు గుర్తించాలని చెప్పారు. కేసీఆర్‌ను వద్దనుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయొద్దని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లు పిల్లల భవిష్యత్‌ను నిర్లక్ష్యం చేశాయని ధ్వజమెత్తారు. కరీంనగర్‌ను స్మార్ట్ సిటీని చేస్తామంటే కేసీఆర్ అడ్డుపడ్డారని పేర్కొన్న మోదీ.. కరీంనగర్‌ను లండన్ చేస్తానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని దుయ్యబట్టారు. పీవీ నరసింహారావుని కాంగ్రెస్ ఎప్పుడూ నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. రైతులకు నీళ్లిచ్చేందుకు కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ప్రధాని మోదీ ఆరోపించారు. కుటుంబ పాలకులు వారి పిల్లల గురించే ఆలోచిస్తారు.. ప్రజల పిల్లల గురించి ఆలోచించబోరని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పీఎఫ్ఐ వంటి సంస్థలు పెరిగిపోయాయని తెలిపారు. ఫిలిగ్రి కళకు కరీంనగర్ పెట్టింది పేరు.. అలాంటి కళలను ప్రోత్సహించేందుకు కేంద్రం విశ్వ కర్మ యోజనను తీసుకువచ్చినట్లు చెప్పారు. ఇందులో భాగంగా లక్షలాది రూపాయలు గ్యారెంటీ లేకుండానే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. మోదీ నీడ పడితే కలలన్నీ చెదిరిపోతాయని భయం.. అందుకే తనను సీఎం కేసీఆర్ కలవట్లేదని విమర్శించారు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు.. సిగ్గుందా?: కేసీఆర్ -
కాంగ్రెస్‌వాళ్లే రైతుబంధు ఆపారు: కేసీఆర్
సాక్షి, షాద్‌నగర్: కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే. చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయాలని ప్రజలను ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. సోమవారం సీఎం కేసీఆర్ షాద్‌నగర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు. ‘ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటు వేయాలి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం. పార్టీల చరిత్ర చూసి ఓటు వేయ్యాలి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేలు వరకు ఇస్తాం. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని తీసేస్తారట. ధరణి స్థానంలో భూమాత తెస్తామంటున్నారు. కాంగ్రెస్ వాళ్లే రైతుబంధును ఆపారు. కాంగ్రెస్‌లో కూడా రైతుబంధు తీసుకున్న నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్లకు సిగ్గు ఉందా?. రైతుల నోటికాడ బుక్క గుంజుకుంటారా?. షాద్‌నగర్ వరకు మెట్రో తెచ్చే బాధ్యత నాది. షాద్‌నగర్‌కు మెట్రో వస్తే.. ఇక్కడ భూముల ధరలు మూడింతలు పెరుగుతాయి. రైతుబంధు ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే రైతుబంధును ఈసీ నిలిపివేసింది. పాలమూరు ఎత్తిపోతలు పూర్తి కాకుండా కాంగ్రెస్ వాళ్లే స్టేలు తెచ్చారు’ అంటూ విమర్శలు చేశారు. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్.. తెలంగాణను ఊటగొట్టిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ చరిత్ర ప్రజలకు తెలుసని అన్నారు. తెలంగాణను సాధించేందుకే ఈ పార్టీ పుట్టిందని గుర్తు చేశారు. ఓటు తలరాతను మారుస్తుందని పేర్కొన్నారు. ఆచితూచి ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. ఆందోల్‌లో నిర్వహించి ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. పార్టీల చరిత్ర, అభ్యర్థుల చరిత్రను గమనించి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ ప్రజలను కోరారు. ప్రజల హక్కులను కాపాడే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత పెన్షన్లు రూ.5వేలకు పెంచామని తెలిపారు. కంటి వెలుగు వంటి మంచి కార్యక్రమాలతో అభివృద్ధి దిశగా నడిచామని స్పష్టం చేశారు. -
బీఆర్ఎస్ను దరిదాపుల్లోకి కూడా రానివ్వం: మోదీ
సాక్షి, మహబూబాబాద్: తెలంగాణలో బీజేపీ కొత్త చరిత్ర లిఖించబోతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పబోతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీర్ఆఎస్ తెలంగాణను నాశనం చేశాయని ధ్వజమెత్తారు. మహబూబాబాద్‌లో బీజేపీ బహరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. తెలంగాణకు తర్వాతి సీఎం బీజేపీ నుంచి రాబోతున్నారని తెలిపారు. తెలంగాణ తొలి బీజేపీ సీఎం.. బీసీకి చెందిన వ్యక్తి ఉంటారని చెప్పారు. బీజేపీ ప్రభుత్వ మంత్రి వర్గంలో అన్నీ వర్గాలకు స్థానం ఉంటుందన్నారు. బీజేపీతో ఎలాగైనా దోస్తీ చేయాలని కేసీఆర్ ఢిల్లీకి వచ్చారన్నారు ప్రధాని మోదీ. తాను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఉండదలుచుకోలేదని చెప్పారు. ఎన్డీఏలో చేర్చుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు తనను తిట్టడం మొదలు పెట్టారని ప్రస్తావించారు. బీఆర్ఎస్ను తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వమని.. ఇది మోదీ ఇచ్చే గ్యారంటీనన్నారు. తెలంగాణకు ఫాంహౌజ్ సీఎం అవసరం లేదని ప్రధాని మోదీ విమర్శించారు. తెలంగాణను కేసీఆర్ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారని.. మూఢ నమ్మకాలతో సచివాలయాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ చేసిన స్కామ్‌లన్నింటిపైనా దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. స్కామ్ చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. బీఆర్ఎస్లో స్కామ్‌లు చేసిన వారిని జైలుకు పంపిస్తామన్నారు. ల్యాండ్, లిక్కర్, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపిస్తామని తెలిపారు. అణగారిన వర్గాలకు సంక్షేమం అందిస్తుంది బీజేపీనేనన్న మోదీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీ, దళితులను మోసం చేసిందని దుయ్యబట్టారు. చదవండి: మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్ పైలట్ -
మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు: సచిన్ పైలట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందిపరిచ్చిన గ్యారంటీలు ఖచ్చితంగా అమలు చేస్తామని రాజస్థాన్ ఎమ్మెల్యే, ఏఐసీసీ జాతీయ నాయకులు సచిన్ పైలట్ తెలిపారు. తెలంగాణ యువత కాంగ్రెస్‌కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పారదర్శక పాలన అందిస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో మంచి స్పందన ఉందని.. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుందని సచిన్ పైలట్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదని, నిరుద్యోగం పెరిగి పోతుందని విమర్శించారు. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. భారత్ జోడోయాత్ర ద్వారా తెలంగాణలో రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. ‘చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లతోపాటు పాటు తెలంగాణలోను కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలి. కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి. రాజస్థాన్‌లో 5 సంవత్సరాలకోసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. సంప్రదాయాన్ని బ్రేక్ చేసి అక్కడ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం రాజస్థాన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. ప్రజలు అర్ధం చేసుకున్నారు. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్‌లో ఉండదు. అధిష్టానం సీఎంను సెలెక్ట్ చేస్తుంది.’ అని పైలట్ తెలిపారు -
ప్రజల మద్దతు నాకే..
‘ప్రచారానికి వెళ్లిన ప్రతి చోటా ప్రజల నుంచి నాకు ఆదరణ లభిస్తోంది. భారీ మెజార్టీతో విజయం సాధిస్తానన్న ధీమా ఏర్పడింది. నామీద నమ్మకంతో బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఈ ప్రాంత బిడ్డగా.. ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలపై ప్రతి నిత్యం కొట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతా’నని కాంగ్రెస్ నాగార్జునసాగర్ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి అన్నారు. ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. నల్గొండ: నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలు మా ర్పు కోరుకుంటున్నారు. ఎక్కడికెళ్లినా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు. కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని ప్రజలు భావిస్తున్నారు. భారీ మెజార్టీ ఇస్తారని ఆశిస్తున్నాను. నియోజకవర్గానికి మా నాన్న చేసిన అభివృద్ధి వాళ్ల కళ్ల ముందే కనిపిస్తోంది. గడిచిన ఐదేళ్ల కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడింది. నేను గెలిచాక స్థానికంగానే ఉండి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతా. జానారెడ్డి హయాంలోనే అభివృద్ధి.. సాగర్ నియోజకవర్గంలో ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన మా నాన్న కుందూరు జానారెడ్డి హయాంలోనే నియోజకవర్గ అభివృద్ధి జరిగింది. గిరిజన తండాలకు రోడ్లు, కరెంట్ సౌకర్యంతో పాటు 34 వేల ఇళ్లు, 2 లక్షల ఎకరాలకు సాగునీరు, 1048 కిలోమీటర్ల రహదారుల నిర్మాణంతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్లు మా వద్ద లెక్కలతో సహా ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి.. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన జాబ్ క్యాలెండర్ అమలు చేయడానికి కట్టుబడి ఉంది. యువత చెడ్డదారిలో పోకుండా చదువుపై మనస్సును నిలిపి పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉద్యోగ అవకాశాలు విస్తృతం చేయనున్నాం. ప్రైవేట్ రంగాల్లోనూ ఉపాధి కల్పించడానికి నేను సొంతంగా కృషి చేస్తాను. యువత మేధస్సును పరిపూర్ణంగా వినియోగించుకుంటాం. విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి.. నియోజకవర్గంలో ప్రజలు వైద్య సేవలు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి మండల, మేజర్ గ్రామ పంచాయతీల్లో ప్రజలకు కావాలి్సన ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పించి వైద్య సేవలు స్థానికంగానే అందేలా చర్యలు తీసుకుంటాం. విద్యా సౌకర్యాలు లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా స్కూళ్లలో టీచర్ల కొరత ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే.. టీచర్ల కొరత తీర్చడంతో పాటు శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలకు మరమ్మతు చేయించి ప్రైమరీ స్కూళ్లపై ప్రత్యేక దృష్టి సారిస్తాను. -
ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?.. కేటీఆర్‌పై కిషన్ రెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిలో ఓడిపోతున్నారని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. ఈ రెండు చోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ తెలంగాణకు ప్రమాదకరమని సీరియస్ కామెంట్స్ చేశారు. కాగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూటుకేసుల ప్రభుత్వం వస్తుంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను పాలించిన తీరు, కేంద్రంలో బీజేపీ పాలన తీరును బేరీజు వేసుకుని ఓటు వేయండి. మోదీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలు చేస్తున్నాయి. కేసీఆర్ పోటీ చేసిన రెండు చోట్లలో ఓడిపోతారు. బీజేపీ అక్కడ విజయం సాధిస్తుంది. కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించడానికి రేవంత్ రెడ్డి పోటీచేస్తున్నారు. తెర వెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసిన తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు. బీజేపీ కమిట్మెంట్ను మ్యానిఫెస్టో రూపంలో తెలంగాణ ప్రజల ముందు పెట్టాం. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వలేదు. కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్, కేసీఆర్ మైనార్టీలకు ఇచ్చిన హామీలు ఒక్కటే. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ పడి హామీలు ఇస్తున్నారు. రాజ్యాంగ విరుద్ధమైన హామీలు ఇస్తున్నారు.. ముస్లిం సమాజం అర్థం చేసుకోవాలి. ఐటీ పార్కుల్లో మతం ఎక్కడిది?. ముస్లీం ఐటీ టవర్స్ కట్టడం ఏంటి?. సాప్ట్ వేర్ రంగంలో కూడా కేటీఆర్ మతాన్ని జోప్పిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చేయలేదు?. ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు. పాతబస్తీలో అక్షరాస్యత శాతం ఎందుకు తక్కువగా ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒవైసీ కుటుంబానికి అండగా ఉన్నాయి తప్ప.. సామాన్య ముస్లీం సమాజానికి ఏం చేయలేదు. ఒవైసీ కుటుంబం శాసిస్తే కేసీఆర్ ఏదైనా చేస్తారు. పాతబస్తీ ప్రజలు చదువుకుంటే ఒవైసీ కబంధ హస్తాల నుంచి బయటకు వస్తారని అక్షరాస్యత పెంచకుండా చూస్తున్నారు. పాతబస్తీకి మెట్రో వసతి ఎందుకు కల్పించలేకపోయారు. దారుసలాంను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం దారాదత్తం చేసింది’ అంటూ విమర్శించారు. -
రైతుబంధు నిలిపివేతపై మంత్రి హరీశ్ కామెంట్స్..
సాక్షి, జహీరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్ రావు స్పందించారు. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామని స్పష్టం చేశారు. కాగా, మంత్రి హరీశ్ రావు జహీరాబాద్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైతులతో పేగుబంధం మాది. కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది. రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. నేను మీటింగ్‌లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్ ఇచ్చిందని అన్నాను. రైతుబంధును ఆపిన కాంగ్రెస్‌కు ఓటుతోనే పోటు పొడవాలి. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్ ఖతమ్ కావాలి. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తాం. ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు. కేసీఆర్ వస్తే పెన్షన్ రూ.5వేలు ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం. పేదలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రేషన్‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తాం’ అని తెలిపారు. -
రైతుబంధుకు బ్రేక్.. రేవంత్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధుకు ఈసీ బ్రేక్ ఇవ్వడంతో బీఆర్ఎస్ బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. దీంతో, బీఆర్ఎస్పై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా రైతుబంధుతో ఓట్లు దండుకోవాలని వేసిన ప్లాన్‌కు బ్రేక్ పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌పై ఫైరయ్యారు. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీశ్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం’ అని అన్నారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk — Revanth Reddy (@revanth_anumula) November 27, 2023 ఇక, రైతుబంధును ఎన్నికల సందర్భంగా నిలిపివేయడానికి హరీశ్ కామెంట్స్ కారణమని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ ఈసీ అనుమతి నిరాకరించింది. దీంతో, బీఆర్ఎస్ ప్లాన్ రివర్స్ అయ్యింది. -
గెలుపు ఓటములపై ప్రభావం.. అక్కడ మైనారీటీలు ఏ పార్టీ వైపు?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభ బీజేపీకి ఊపునిచ్చింది. ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపింది. ప్రభంజనంలా తరలివచ్చిన జనంతో జైత్రయాత్రను మరిపించింది. కానీ బీజేపీని ఓడించడానికి ముస్లింలు, మైనారీటీలు ఏకం అవుతున్నారా.? కారు పార్టీకి మైనారీటీలు మళ్లీ అండగా నిలబడుతారా? లేదంటే కాంగ్రెస్ వైపు మళ్లుతున్నారా? ఓట్ల చీలిక మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఓటమి నుండి గట్టేక్కిస్తుందా? అసలు మైనారీటీలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? నిర్మల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు మైనారీటీ ఓట్ల భయంపై స్పెషల్ స్టోరీ. నిర్మల్ నియోజక వర్గంలో ఎన్నికల పోరు ఉత్కంఠను రేపుతోంది. బీఆర్ఎస్ నుంచి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మూడోసారి పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి కూచడి శ్రీహరిరావు పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు ఎన్నికలలో గెలవాలని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. ముగ్గురు హేమాహేమీలు నువ్వా.. నేనా రీతిలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నిర్మల్‌లో నిర్వహించిన సభకు ప్రదాని నరేంద్ర మోదీ హజరయ్యారు. మోదీ సభ. సూపర్ సక్సైసైంది. ఈ సభతో విజయం ఖాయమని మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారట. కానీ ముస్లిం మైనారిటీల ఓట్లు దడ పుట్టిస్తున్నాయట. నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై వేలకుపైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో ముప్పై అయిదు వేల నుంచి నలబై వేల వరకు ముస్లిం మైనారీటీల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లే అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఈ ఓట్లను దక్కించుకోవడానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి కూచడి శ్రీహరిరావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. చదవండి: రైతుబంధుకు ఈసీ బ్రేక్.. మంత్రి హరీశ్‌రావే కారణం గత అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింలు బడార్ఎస్ వైపు మొగ్గు చూపారు. ఈసారి ముస్లింలలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కారణంగా ముస్లింలు కాంగ్రెస్ వైపు చూపుతున్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో ముగ్గురు ఒకరికంటే ఒకరు ప్రజల మద్దతు కూడగట్టడానికి పోటీ పడుతున్నారు. ముస్లింల ఓట్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారా లేదంటే బీఆర్ఎస్ వైపు వెళ్తారనేది ఉత్కంఠను రేపుతుందట. బీజేపీని ఓడించడానికి ఒకవేళ గెలిచే కాంగ్రెస్ వైపు వెళతారు. అదేవిధంగా బీఆర్ఎస్ వైపు మొగ్గు ఉంటే కారు పార్టీ వైపు ఓట్లు వేసే అవకాశం ఉంది. బీజేపీని ఓడించటమే ముస్లిం లక్ష్యం. ఆరునూరైనా బీజేపీ విజయం సాదించవద్దని ముస్లింలు బావిస్తున్నారట. అయితే కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య ముస్లిం ఓట్ల చీలిక ఉంటుందని బీజేపీ అంచనా వేస్తుంది. ఇది తనకు కలిసి వస్తుందని బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి భావిస్తున్నారట. గత అసెంబ్లీ ఎన్నికలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి స్వర్ణ రెడ్డికి 16,900 ఓట్లు పోలయ్యాయి. అదేవిధంగా మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తే 70,714 ఓట్లు వచ్చాయి. ఈ. ఎన్నికలలో మైనారిటీ ఓట్లు కాంగ్రెస్‌కు పడ్డాయి. మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. ఆయన చేరికతో నియోజకవర్గంలో బీజేపీకి ఊపు, ఉత్సాహం వచ్చింది. గత పార్లమెంటు ఎన్నికలలో కూడా నిర్మల్ నియోజకవర్గంలో బీజేపీ వైపు ప్రజలు భారీగా మొగ్గు చూపారు. ఎంపీగా సోయంబాపురావు మెజారిటీ విజయం సాదించారు. పార్లమెంటు ఎన్నికల ఊపు మళ్లీ ఉంటుందని తన విజయం ఖాయమని మహేశ్వర్ రెడ్డి బావిస్తున్నారట. బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపుతుండటంతో తన విజయానికి ఎదురులేదని మహేశ్వర్ రెడ్డి అనుకుంటున్నారట. కానీ బీజేపీ విజయాన్ని అడ్డుకోవడానికి మైనారిటీలు ఏకం అవుతున్నారట. మహేశ్వర్ రెడ్డి ఓటమే లక్ష్యంగా మైనారిటీలు ఎత్తగడలు వేస్తున్నారట. ఓట్ల చీలిక నివారించి గెలిచే కారు, కాంగ్రెస్ ఓట్లు వేయాలని ముస్లింలు భావిస్తున్నారట.ఇప్పటికే నిర్మల్‌లో ఎంఐఎం మంత్రికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తోంది. మంత్రి కూడ ముస్లింల మద్దతు కూడగడుతున్నారట. బీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓట్లు వేయాలని మైనారిటీలను మంత్రి కోరుతున్నారట. మైనారీటీలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం ఉంది. ముస్లింలు గంపగుత్తగా ఓట్లు వేస్తే మంత్రి విజయం ఖాయమని తెలిందట. మైనారీటీలు ఎకంగా మహేశ్వర్ రెడ్డికి దడ పుట్టిస్తోందట. కాంగ్రెస్, బీఆర్ఎస్ మద్య ఓట్ల చీలికతో గట్టేక్కాలనుకున్నా ఆశలు అవిరవుతున్నాయట. విజయంపై ఆశలు సన్నగిల్లుతున్నాయట. అయితే ఏది ఏమైనా పార్లమెంటు ఎన్నికల మాదిరిగా ఈసారి విజయం ఖాయమని బావిస్తున్నారట. ముస్లిం మైనారీటలు ఎకమైనా, ఎంతమంది తన విజయాన్ని అడ్డుకోవడానికి కుట్రలు పన్నినా తన విజయాన్ని ఏవరు అపలేరంటున్నారట మహేశ్వర్ రెడ్డి. మరోకవైపు సర్కారు వ్యతిరేకత, మైనారిటీ ఓట్లతో కూచడి ధీమాతో ఉన్నారట. ఈ ముగ్గురిలో ఏవరు విజయం సాధిస్తారో చూడాలి -
వెయ్యి బుల్డోజర్లకు కారు ఒక్కటే సమాధానం: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, నిజామాబాద్: ఆయా పార్టీ అగ్రనేతల పర్యటనలు చూస్తుంటే.. పంటలపై మిడతల దండు దాడి చేసినట్టు ఉందని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. సోమవారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రధాని మోదీ, రాహుల్‌పై మండిపడ్డారు. దండయాత్రకు వచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారంటూ ఆమె దుయ్యబట్టారు. ‘‘రాసిచ్చిన స్క్రిప్ట్‌నే ప్రియాంక చదువుతున్నారు. బీజేపీ హయాంలో పెద్ద కంపెనీలే బాగుపడ్డాయి. సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు?. రాహల్ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన లేదు. వెయ్యి బుల్డోజర్లకు కారు ఒక్కటే సమాధానం. ట్రైలర్‌కే భయపడ్డారు. సినిమా మిగిలే ఉంది’’ అంటూ కవిత వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ నాయకులు వెంటపడి రైతు బంధును ఆపించారు. అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకుంది. నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలి. బీజేపీతో మా శతృత్వం. కాంగ్రెస్ గుండాల ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది’’ అంటూ ఆమె ధ్వజమెత్తారు. ‘‘మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా?. 24 గంటల కరెంటు కావాలా, 3 గంటల కరెంట్ కావాలా?. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. యువత అడగాలి. మతం పేరుతో మంట పెట్టాలని ఒక పార్టీ, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుంది’’ అని కవిత నిప్పులు చెరిగారు. చదవండి: బీఆర్ఎస్కు ఊహించని షాక్.. రైతుబంధుకు ఈసీ బ్రేక్ -
కాంగ్రెస్‌కు మద్దతుపై ఏచూరి వర్సెస్ తమ్మినేని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మద్దతు విషయంలో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నట్టు తెలుస్తోంది. ‘తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలోకి దిగాం. కాబట్టి మేం పోటీ చేయని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఓటేయ్యాలి’అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చాలా స్పష్టంగా చెప్పారు. కానీ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అలాంటి స్పష్టత ఎక్కడా ఇవ్వడంలేదు. ‘మా పార్టీ పోటీ చేసే 19 నియోజకవర్గాలు మినహా బీజేపీ బలంగా ఉన్నచోట్ల దానిని ఓడించగల పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నాం. కొత్తగూడెంలో సీపీఐ, పినపాకలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ, శేర్లింగంపల్లిలో ఎంసీపీఐ అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నాము. మిగిలిన స్థానాలలో ఎవరిని బలపరచాలో పార్టీ జిల్లా కమిటీలు తగు నిర్ణయం తీసుకొని ప్రజాతంత్ర, లౌకిక, సామాజిక, పోరాట శక్తులకు మద్దతు ఇస్తాయ’ని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. చదవండి: రెండున్నర లక్షల ఓట్లు.. ఆర్టీసీ ఉద్యోగులు ఎటు వైపో? ఇక్కడ ఏచూరి ప్రకటనకు, తమ్మినేని ప్రకటనకు మధ్య వైరుధ్యం ఉందని ఆ పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ‘ఇండియా’కూటమిలో ఉన్నందున తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తామని ఏచూరి స్పష్టం చేయగా, తమ్మినేని మాత్రం అలాంటి స్పష్టత ఇవ్వలేదు. రాష్ట్రంలో బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో ఆ పార్టీని ఓడించగలిగే పార్టీలకు ఓటు వేయాలని కోరుతున్న తమ్మినేని, మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌కు ఓటు వేయమని ఎందుకు పిలుపునివ్వడంలేదని రాజకీయ విశ్లేషకులు ప్రశి్నస్తున్నారు. ఏచూరికి సమాచారం ఇవ్వలేదా? రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాల్లో సీపీఎం ఒంటరిగా పోటీ చేస్తుంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ బలంగా ఉన్నచోట దాన్ని ఓడించే పార్టీలకు ఓటేయ్యాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. బీజేపీ బలంగా లేనిచోట ఏ పార్టీకి ఓటు వేయాలన్న దానిపైనే కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మధ్య భిన్నాభిప్రాయం నెలకొంది.. సీతారాం ఏచూరికి రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని తెలియజేయలేదని తెలిసింది. కాగా, తాము పోటీ చేస్తున్న 19 స్థానాలలో సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో కోరారు. చదవండి: డిసెంబర్ 4న జాబ్ కేలండర్ ఇస్తాం: కేటీఆర్ -
తెలంగాణ ఎన్నికలు.. సీఈవో వికాస్‌రాజ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన సీఈఓ వికాస్‌రాజ్ కీలక కామెంట్స్ చేశారు. బ్యాలెట్ ఓట్ల వివరాలను కూడా ఆయన వెల్లడించారు. ఈసారి బ్యాలెట్ ఓట్లు భారీగా పెరిగినట్టు తెలిపారు వికాస్ రాజ్. కాగా, రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఏర్పాట్లపై ఆదివారం ఆయన బీఆర్కేఆర్ భవన్లో మాట్లాడుతూ.. శనివారం నాటికి 1,24,239 మంది ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. గత శాసనసభ ఎన్నికల్లో మొత్తంగా 1,00,135 పోస్టల్ బ్యాలెట్లే నమోదుకాగా.. ఈసారి భారీగా పెరుగుతున్నాయి. ∙కొత్త ఓటర్ల కోసం ఓటరు గుర్తింపు కార్డుల ముద్రణ పూర్తయింది. ఈ ఏడాది 54.39 లక్షల కార్డులను ముద్రించారు. ఇంకా 3 లక్షల కార్డులను బూత్ స్థాయి అధికారుల (బీఎల్ఓ) ద్వారా పంపిణీ చేయాల్సి ఉంది. ∙ 119 శాసనసభ నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా.. అందులో 2,068 మంది పురుషులు, 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ ఉన్నారు. ∙మొత్తం 49 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. 31 జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో నాలుగు చొప్పున కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ∙ఎన్నికల్లో 1.85 లక్షల మంది పోలింగ్ సిబ్బంది, 22 వేల మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. బీఎల్ఓలను కలుపుకొంటే మొత్తం 2.5లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల బందోబస్తు కోసం 45వేల మంది రాష్ట్ర పోలీసులు, 3 వేల మంది అటవీ, ఎక్సైజ్‌శాఖ సిబ్బందితోపాటు 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించనున్నారు. ∙కర్ణాటక, ఏపీ, మహారాష్ట్రల నుంచి 5 వేల మంది చొప్పున, మధ్యప్రదేశ్, తమిళనాడుల నుంచి 2 వేల చొప్పున, ఛత్తీస్‌గఢ్ నుంచి 2,500 మంది కలిపి.. మొత్తంగా 23,500 మంది హోంగార్డులు రాష్ట్ర ఎన్నికల బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. -
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-2023.. టుడే అప్డేట్స్
Telangana Assembly Elections Today Minute To Minute Update.. రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్: హరీష్ రావు కాంగ్రెస్ పాలన అంతా చీకటిమయమే కరెంట్ కష్టాలు, నీటి కష్టాలను ప్రజలు మర్చిపోలేదు అర్ధరాత్రి రైతులను గోస పెట్టి పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ రైతులను ఏనాడు పట్టించుకోలేదు రైతు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్ నకిలీ విత్తనాలతో ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో పెండింగ్ ప్రాజెక్టులుగా పేర్లు మారిపోయాయి. వ్యవసాయం దండగ అంటున్న నాయకునికి వారసుడు రేవంత్ రైతు బంధు ఆపాలని కుట్ర కాంగ్రెస్ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా రైతు వ్యతిరేక పార్టీనే కాంగ్రెస్ గెలవగానే కర్ణాటకలో రైతు బంధు బంద్ అయింది ముగిసిన మోదీ రోడ్ షో రోడ్ షోలో కాచిగూడ చేరుకున్న ప్రధాని మోదీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు జరిగిన ప్రధాని మోదీ రోడ్ షో సావర్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన మోడీ రాత్రి 7.30 నుంచి 7.40 వరకు గురుద్వారా లో ప్రధాని మోడీ ప్రార్థనలు కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా రానున్న ప్రధాని మోదీ హైదరాబాద్‌లో ప్రారంభమైన మోదీ రోడ్ షో చిక్కడపల్లి నారాయణగూడ మీదుగా సాగుతున్న రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు 2.5 కిలోమీటర్లు రోడ్ షో ప్రధాని వెంట వాహనంపై కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ర్యాలీలో పాల్గొన్న 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు భవనాలపై నుంచి మోదీకి అభివాదం చేస్తున్న ప్రజలు మోదీపై పూల వర్షం కురిపిస్తున్న అభిమానులు సంగారెడ్డిలో కేసీఆర్ కామెంట్స్ ఓటు మన తలరాతను మారుస్తుంది తెలంగాణలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి చూడండి ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం తెలంగాణ ఏర్పడిన తర్వాత కరెంటు, నీరు సరిగా ఇచ్చుకున్నాం ఉన్న తెలంగాణను ఊడగొట్టిదే కాంగ్రెస్ 50 ఏళ్లకుపైగా మనం గోసపడ్డాం ఓటు సరిగ్గా వినియోగించుకోవాలని కోరుతున్నా గతంలో మంచి నీళ్లకు ఇబ్బంది పడ్డాం రైతుబంధుతో దుబారా అని కాంగ్రెస్ అంటోంది రైతుబంధు ఉండాలా వద్దా హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ కాసేపట్లో హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ వరకూ ప్రధాని మోదీ రోడ్ షో కొడంగల్ ఎన్నికల ప్రచార సభలో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కొడంగల్ నాకు అస్థిత్వాన్ని ఇచ్చింది.. పోరాటాన్ని నేర్పింది మీరు అండగా ఉన్నంత వరకూ మోదీ, కేసీఆర్ ఎవరైనా కొట్లాడుతా ప్రజల చెమట, రక్తంతో రాష్ట్రం ఏర్పడింది: ప్రియాంక గాంధీ చరిత్రలో ఫామ్‌హౌజ్ నుంచి పాలన చేసిన సీఎం మరొకరు ఉండరు రాష్ట్రంలో ప్రజలు అప్పులపాలయ్యారు దొరల తెలంగాణ బలపడింది.. ప్రజలు బలహీనులయ్యారు చైతన్యవంతులు కాకపోతే నష్టపోయేది మీరే ప్రజల ఆందోళనలు, పోరాటాలతో రాష్ట్రం ఏర్పడింది ప్రజల చెమట, రక్తంతో రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ పదేళ్లలో అవినీతికి పాల్పడ్డారు తెలంగాణలో బీఆర్ఎస్ సంపన్నపార్టీ ప్రపంచంలోనే బీజేపీ అధిక సంపన్నమైన పార్టీ కేంద్రంలో అవసరమైనప్పుడు బీజేపీకి బీఆర్ఎస్ మద్దతునిస్తుంది ల్యాండ్, శాండ్, మైన్ మాఫియాతో ప్రభుత్వం కూరుకుపోయింది మీ ఓటును వ్యర్థం చేసుకోకండి తెలంగాణ వికాసం కోసమే రేవంత్ నాతో ఉన్నారు మీ ఆశను నెరవేర్చేందుకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు తెలంగాణ ఏర్పడితే మన ప్రభుత్వం వస్తుందని అంతా భావించారు కొడంగల్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ ఆందోల్ ఎన్నికల ప్రచార సభలో సీఎం కేసీఆర్ రైతుబంధును కాంగ్రెస్ వాళ్లే ఆపేశారు కాంగ్రెస్ నేతలకు అసలు సిగ్గుందా? కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతోనే ఈసీ రైతు బంధు నిలిపేసింది రైతుబంధును ఆపేస్తే కాంగ్రెస్ వాళ్లకు కూడా నష్టమే రైతుబంధు తీసుకుంటున్న వాళ్లలో కాంగ్రెస్ వాళ్లు కూడా ఉన్నారు ధరణి ఉండాలా? వద్దా? ధరణిని తీసేయాలని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ధరణిని తీసేస్తే మళ్లీ వచ్చేది దళారుల రాజ్యమే ధరణి స్థానంలో భూమాత తెస్తారట. అది భూమాత కాదు.. భూమేత రైతులను ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారు? ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు ఇందిరమ్మ రాజ్యంతోనే కదా తెలంగాణ నాశనమైంది కరీంనగర్లో మోదీ కామెంట్స్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు భారతదేశం తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ శుభాభినందనలు పోలింగ్ రోజు ప్రజలు కేసీఆర్‌కు సినిమా చూపిస్తారు తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయింది తెలగాణలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది బీజేపీ ప్రభుత్వంలో బీసీ వర్గానికి చెందిన వ్యక్తి సీఎం కానున్నారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాం బీజేపీ సర్కారు వస్తేనే తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయి మోదీ అంటే కేసీఆర్‌కు భయం మోదీ వస్తే ఎయిర్‌పోర్టుకు కూడా రాకుండా తప్పించుకునేవారు ప్రజలను దోచుకోవడమే బీఆర్ఎస్ నేతల పని మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తవుతుంది నీళ్లు, నిధులు నియామకాలు ఏమయ్యాయి? బీఆర్ఎస్ పాలనలో కష్టాలు, కన్నీళ్లు కేసీఆర్ కుటుంబ కోసమే తెలంగాణ ఏర్పడిందా? డిసెంబర్ 3 తర్వాత లిక్కర్ స్కాంపై దర్యాప్తు వేగవంతం చేస్తాం రైతులకు నీళ్లిచ్చేందుకు కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారు తెలంగాణలో నీటి ప్రాజెక్టులు బీఆర్ఎస్కు ఏటీఏంలా మారిపోయాయి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సూట్ కేసుల ప్రభుత్వం వస్తుంది: కిషన్‌రెడ్డి తెలంగాణకు బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రమాదకరం గజ్వేల్, కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారు మోదీని అడ్డుకోవడానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామా చేస్తున్నాయి కామారెడ్డిలో కేసీఆర్‌ను గెలిపించడానికి రేవంత్ పోటీ చేస్తున్నారు తెరవెనుక బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు ఎన్ని కుట్రలు చేసినా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటారు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చేయలేదు? ఇన్నాళ్లు పాతబస్తీ యువతకు ఉపాధి అవకాశాలు ఎందుకు కల్పించలేదు ఒవైసీ కుటుంబం శాసిస్తే కేసీఆర్ ఏదైనా చేస్తారు పాతబస్తీకి మెట్రో వసతి ఎందుకు కల్పించలేకపోయారు మరికాసేపట్లో హైదరాబాద్‌లో మోదీ రోడ్ రోడ్ షోలో పాల్గొననున్న గ్రేటర్ పరిధిలోని 24 మంది బీజేపీ అభ్యర్థులు రెండున్నర కిలోమీటర్ల మేర సాగనున్న రోడ్ షో రోడ్ షోకు భారీ ఏర్పాట్లు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ సావర్కర్ విగ్రహం వరకు సాగనున్న ప్రధాని రోడ్ షో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదలనున్న ప్రధాని రోడ్ షో నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన కేంద్ర బలగాలు ఆర్టీసి క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ట్రాఫిక్ ఆంక్షలు గద్వాల్లో ప్రియాంక కామెంట్స్ ఎంత పేదవారైనా తమ పిల్లలను మంచి చదువులు చదివించాలనుకుంటారు తెలంగాణ ఏర్పడితే ఉద్యోగాలు వస్తాయనుకున్నారు కానీ అది కలగానే ఉండిపోయింది చెన్నూరులో కేటీఆర్ కామెంట్స్ అయిదేళ్లలో చెన్నూరు రూపు రేఖలు మార్చిన సుమన్‌కు అభినందనలు రైతుబంధు వేస్తే కేసీఆర్ ప్రభుత్వం గెలుస్తుందని రేవంత్ రెడ్డి ఈసీకి ఉత్తరం రాసిండు ఈసీ రైతు బంధును ఆపేసింది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు బంధు ఉండదు 24 గంటల కరెంటు ఉండదు 10 హెచ్‌పీ మోటార్ చాలు 3 గంటల కరెంట్ చాలు అని రేవంత్‌రెడ్డి అంటాడు కర్ణాటక నుంచి వచ్చినోడు 5 గంటలు చాలు అంటాడు 30 తారీఖున ఓటు వేసే ముందు కరెంట్ కావాల్నా, కాంగ్రెస్ కావాల్నా ఆలోచించండి కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదు కాంగ్రెస్‌కు కరెంటు గురించి అడిగే నైతిక హక్కు లేదు దరిద్రానికి నేస్తం హస్తం..అది నెత్తి మీద పెట్టుకుంటే భస్మం అయిపోతాం రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ రావాలి.. షాద్ నగర్ సభలో సీఎం కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణ సాధించుకున్నాం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్నాం పార్టీల చరిత్ర చూసి ప్రజలు ఓటేయాలి అభ్యర్థులు ఎలాంటి వారో అన్నీ చూసి ఓటేయాలి కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్నీ బాధలే అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ.5వేల వరుకు ఇస్తాం రైతు బంధు దుబారా అని కాంగ్రెస్ నేతలు అంటున్నారు రైతుబంధు ఉండాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి కాంగ్రెస్‌లో చేరిన అశ్వద్ధామ రెడ్డి కాంగ్రెస్‌లో చేరిన టీఎస్ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామ రెడ్డి. జైరాం రమేష్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిక కాంగ్రెస్‌కు మద్దతు పలికిన ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఇటీవలే బీజేపీకి రాజీనామా చేసిన అశ్వద్ధామ రెడ్డి. తెలంగాణలో కొత్త చరిత్ర లిఖించబోతున్నాం: మోదీ మహబూబాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ప్రధాని మోదీ కామెంట్స్.. తెలంగాణ కొత్త చరిత్ర లిఖించబోతుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక బీసీని సీఎం చేస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణను నాశనం చేశాయి. తెలంగాణలో మొదటిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. బీజేపీతో ఎలాగైన దోస్తీ చేయాలని కేసీఆర్ ఢిల్లీకి వచ్చారు. నేను తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్దంగా ఉండదలచుకోలేదు. బీఆర్ఎస్ను బీజేపీ ఎప్పుడూ దగ్గరకు రానివ్వదు. ఎన్డీయేలో చేర్చుకోవట్లేదని బీఆర్ఎస్ నేతలు నన్ను తిట్టడం మొదలుపెట్టారు. మా దరిదాపుల్లోకి కూడా బీఆర్ఎస్ను రానివ్వం, ఇది మోదీ గ్యారంటీ. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్కు గుడ్‌బై చెప్పబోతున్నారు. బీజేపీ ఇచ్చే గ్యారంటీ తప్పకుండా అమలవుతుంది. తెలంగాణను కేసీఆర్ మూఢనమ్మకాల రాష్ట్రంగా మార్చారు. మూఢనమ్మకాలతో సచివాలయాన్ని నాశనం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. దళితులు, బీసీలను మోసం చేశారు. తెలంగాణకు ఫామ్‌హౌస్ సీఎం అవసరం లేదు. బీఆర్ఎస్లో స్కామ్‌లు చేసిన వారిని జైలుకు పంపిస్తాం. ల్యాండ్, లిక్కర్, పేపర్ లీక్ మాఫియాలను జైలుకు పంపిస్తాం. స్కామ్ చేసిన వారు ఎవరైనా వదిలిపెట్టం. బీఆర్ఎస్ చేసిన స్కాములు అన్నింటిపైనా దర్యాప్తు చేయిస్తాం. అణగారిన వర్గాలకు బీజేపీనే సంక్షేమం అందిస్తోంది. కొమురం భీమ్ మ్యూజియం రెడీ అవుతోంది. హుజురాబాద్‌లో అమిత్ షా కామెంట్స్.. హుజురాబాద్‌లో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభకు అమిత్ షా హాజరు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చే సమయం ఆసన్నమైంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి అవుతారు. కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటు వేస్తే కుటుంబ పాలన వస్తుంది. బీజేపీకి ఓటు వేస్తే ప్రజా పాలన వస్తుంది. భారీ మెజార్టీలో ఈటల రాజేందర్‌ను గెలిపించండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య డీల్ కుదిరింది. 2024లో కూడా మోదీనే ప్రధాని అవుతారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీఆర్ఎస్కు ఓటు వేసినట్టే. బీఆర్ఎస్ వేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే. తెలంగాణకు కేంద్రం రూ.7లక్షల కోట్లను అందజేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చాక మొదటి కేబినెట్ భేటీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం. కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి సవాల్ సీఎం కేసీఆర్‌కు బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. మెడికల్ కాలేజీల కోసం కేసీఆర్ రాసిన 50 లేఖలు బయటపెడితే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. కేసీఆర్ మాటాల్లో వాడీవేడీ తగ్గింది. బొగ్గుగనుల ప్రైవేటీకరణను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంది: పొంగులేటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు జగదాంబ సెంటర్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రసంగించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్యను భారీ మెజార్టీతో గెలిపించాలి. బిఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీ. అబద్దాలు చెప్పి రెండు పరియాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేసీఆర్. బీఆర్ఎస్ ద్రోహులను పారదోలి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకోవాలి. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాలు ప్రజలు సుఖా సంతోషాలతో ఉంటారు. డిసెంబర్ 9వ తారీకు హైదరాబాదు ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. 12 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇవ్వాల్సి ఉండగా నాలుగు లక్షల ఎకరాలకే పట్టాలిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు. కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీ పథకాలు అమలు. ఇందిరమ్మ రాజ్యం వస్తే 2లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. రైతులకు రెండు లక్షల రుణమాఫీ. కాంగ్రెస్ వస్తే నిరుపేదలకు సన్న బియ్యం పంపిణీ చేస్తాము. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఫించన్ లు ఇస్తాం. నిరుపేదలకు ఇండ్ల స్థలం తో పాటు డబల్ బెడ్ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బొడు, కోమరారం మండలాలను ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ డబ్బులు ఇస్తే తీసుకోండి. ఓటు మాత్రం కాంగ్రెస్‌కు వేయండి. హరీష్‌రావు వల్లే రైతు బంధు నిలిచిపోయింది.. డోర్నకల్ సభలో రేవంత్ హరీష్ వ్యాఖ్యల వల్లే రైతు బంధు నిలిపేసినట్లు సీఈసీ తెలిపింది కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారెంటీలు అమలు చేస్తాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూ.4వేల పెన్షన్ ఇస్తాం పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు స్వస్తి పలకాలి తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్ పైలట్ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న సచిన్ పైలట్ గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ప్రజల్లో మంచి స్పందన ఉంది. రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంకా గాంధీల పర్యటనలకు మంచి స్పందన వస్తుంది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ఆకాంక్షలు నెరవేరలేదు. నిరుద్యోగం పెరిగి పోతున్నది. ప్రజలు ప్రభుత్వ మార్పు కోరుకుంటున్నారు. భారత్ జోడోయాత్ర ద్వారా రాహుల్ గాంధీ 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌తో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. నవంబర్ 30వ తేదీ జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలి. కాంగ్రెస్‌కు అధికారం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. వారికి క్రెడిబిలిటి లేదు. ఉద్యోగాలు ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. కర్ణాటక విజయం తరువాత జరుగుతున్న తెలంగాణ ఎన్నికల్లో కూడా అలాంటి ఫలితమే వస్తుంది. ఓట్ ఫర్ చేంజ్.. మార్పు కోసమే ప్రజలు ఓటేయబోతున్నారు. రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బహుమతిగా ఇవ్వండి. రాజస్థాన్‌లో ఐదేళ్లకు ఒకసారి ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయం ఉంది. సంప్రదాయాన్ని బ్రేక్ చేసి రాజస్థాన్‌లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాజస్థాన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వలేదు. ప్రజలు అర్ధం చేసుకున్నారు.. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేస్తారు. సీఎం అభ్యర్థి అనేది కాంగ్రెస్‌లో ఉండదు. అధిష్టానమే సీఎంని సెలెక్ట్ చేస్తుంది. కాసేపట్లో వికాస్‌రాజ్‌తో కేశవరావు భేటీ.. కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్‌తో భేటీ కానున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేకే రైతు బంధుకు ఈసీ అనుమతి ఇచ్చి వెనక్కు తీసుకోవడంపై ఫిర్యాదు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపైన ఈసీకి వివరించనున్న బీఆర్ఎస్ నేతలు రైతుబంధు నిలిపివేతపై హరీశ్ కామెంట్స్.. ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ రైతుబంధు నిలిపివేయడంపై మంత్రి హరీశ్ రావు స్పందన రైతుబంధు ఇవ్వవద్దని కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. రైతుబంధును ఎన్ని రోజులు ఆపుతారని ప్రశ్నించారు. వచ్చే నెల మూడో తేదీ తర్వాత మళ్లీ గెలిచేది మేమే.. అప్పుడ రైతుబంధు ఇస్తామన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది పేగుబంధం మాది. కాంగ్రెస్ పార్టీ రైతుల నోటికాడ బుక్కను లాక్కుంది. నేను మీటింగ్‌లో న్యాయం గెలిచిందని.. రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్ ఇచ్చిందని అన్నాను. రైతుబంధును ఆపిన కాంగ్రెస్‌కు ఓటుతోనే పోటు పొడవాలి. రైతుబంధు రావాలంటే కాంగ్రెస్ ఖతమ్ కావాలి. ఎకరాకు రైతుబంధు కాదు.. ఒక్కో రైతుకు 15వేలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. మేము ఓట్ల కోసం రైతుబంధు తీసుకురాలేదు. కేసీఆర్ వస్తే పెన్షన్ రూ.5వేలు ఇస్తాం. సౌభాగ్యలక్ష్మి పేరుతో మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తాం. పేదలకు రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇస్తాం. రేషన్‌కార్డు ఉన్న వారికి సన్న బియ్యం ఇస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఝురాసంఘంలో ఆరువేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తాం. ప్రారంభమైన ఈసీఐ వీడియో కాన్ఫరెన్స్ తెలంగాణ రాష్ట్రం నుంచి పాల్గొన్న సీఈఓ వికాస్ రాజ్ అండ్ టీం హాజరైన డీఈవోలు, ఆర్వోలు, పోలీస్ అధికారులు ఎన్నికల ఏర్పాట్లపై సీఈసీకి వివరించనున్న సీఈఓ వికాస్ రాజ్ చివరి రెండు రోజుల పై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక దృష్టి డబ్బు, మద్యం కట్టడి పై చర్యలు తీసుకోవాలని సీఈసీ ఆదేశాలు రోడ్ షోలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు సుల్తానాబాద్‌లో కేటీఆర్ రోడ్ షో బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం బీఆర్ఎస్ను గెలిపిస్తేనే సంక్షేమం, అభివృద్ధి అందుతాయి. 55 ఏళ్లలో ఏమీ చేయనివారు ఇప్పడు ఏం చేస్తారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అభివృద్ధి కుంటుపడుతుంది. కాంగ్రెస్‌కు అవకాశమిస్తే కరెంట్, రైతుబంధు ఆగిపోతాయి. కాంగ్రెస్ పార్టీ కొత్త కుట్రకు తెరలేపింది. రైతుబంధు వేయకుండా కాంగ్రెస్ అడ్డుకుంది. అధికారంలోకి రాకముందే రైతుబంధును అడ్డుకున్నారు. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఎన్నికల్లో ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యం. కుటుంబ రాజకీయాలకు తెరదించాలంటే కేసీఆర్‌ను గద్దె దించాలి. గజ్వేల్, కామారెడ్డిలోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ సభలకు జనం నీరాజనాలు పడుతున్నారు. యువత, మహిళలు, రైతులు బీఆర్ఎస్పై ఆగ్రహంతో ఉన్నారు. రైతుబంధుపై రేవంత్ ఆసక్తికర కామెంట్స్ బీఆర్ఎస్పై రేవంత్ ఫైర్ ‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీశ్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk — Revanth Reddy (@revanth_anumula) November 27, 2023 కాంగ్రెస్ నేతలు వెంటపడి మరి రైతు బంధును ఆపించారు.. మీడియాతో ఎమ్మెల్సీ కవిత రాసిచ్చిన స్క్రిప్ట్‌ను ప్రియాంక చదువుతున్నారు బీజేపీ హయాంలో పెద్ద కంపెనీలే బాగుపడ్డాయి దండయాత్రకు వచ్చినట్లు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు సింగరేణిని ప్రైవేట్‌కు అప్పగించింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ నేతలంతా ఎక్కడ ఉన్నారు? రాహల్ గాంధీ జోడో యాత్రలో తెలంగాణ ప్రస్తావన లేదు కాంగ్రెస్ నాయకులు వెంటబడి రైతు బంధును ఆపించారు అభద్రతా భావంతోనే ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీగా రుజువు చేసుకుంది నోటి కాడి బుక్కను లాక్కున్నారు కాబట్టి రైతులు ఆలోచించి ఓటు వేయాలి మంచోల్లు కావాలా ముంచే వాళ్లు కావాలా? 24 గంటల కరెంటు కావాలా, 3 గంటల కరెంట్ కావాలా?. కేంద్రంలో ఖాళీగా ఉన్న 10 లక్షల ఉద్యోగాల్లో ఇంతవరకూ కేంద్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు. మతం పేరుతో మంట పెట్టాలని ఒక పార్టీ, కులం పేరుతో చిచ్చు పెట్టాలని మరో పార్టీ చూస్తుంది బీఆర్ఎస్కు షాకిచ్చిన ఈసీ.. రైతుబంధుకు బ్రేక్ రైతుబంధు నిధులను నిలిపివేయాలని ఈసీ ఆదేశం గత వారం రైతుబంధుకు అనుమతించిన ఈసీ.. రైతుబంధుపై ఫిర్యాదులు రావడంతో ఈసీ కీలక నిర్ణయం భారీగా నగదు స్వాధీనం.. ఖమ్మం, పెద్దపల్లిలో భారీ నమోదు స్వాధీనం ఖమ్మంలోని శ్రీరామ్‌నగర్‌లో ఓ ఇంట్లో సరైన పత్రాలు లేకుండా మూడు కోట్లు. నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు. అలాగే, పెద్దపల్లిలోని ఎన్టీపీసీలో కృష్ణనగర్‌లోని ఓ తాళం వేసిన ఇంట్లో భారీ నగదు గుర్తింపు, స్వాధీనం. ఓ జాతీయ పార్టీకి చెందిన కరపత్రాలతో పాటు రెండు కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఎఫ్ఎస్టీ టీమ్. నేడు పెద్దపల్లిలో కేటీఆర్ ప్రచారం మంత్రి కేటీఆర్ నేడు పెద్దపల్లిలో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి దాసరి మనోహర్ రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారం సుల్తానాబాద్‌లో రోడ్ షోలో పాల్గొననున్న కేటీఆర్ భారీ వర్షం.. ప్రచారంపై ఎఫెక్ట్ ఆదిలాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది వర్షం ఎఫెక్ట్ ఎన్నికల ప్రచారంపై పడే అవకాశం ఉంది. నేడు ఛతీస్తగఢ్ సీఎం భూపేశ్ బఘేల్ ఎన్నికల ప్రచారం ఎన్నికల రోడ్ షోలో పాల్గొననున్న భూపేశ్ బఘేల్ ఆయన రోడ్ షోపై వర్షం ఎఫెక్ట్ భువనగిరిలో ప్రియాంక ప్రచారం కాంగ్రెస్ ప్రియాంక గాంధీ నేడు భువనగిరిలో ప్రచారం ఉదయం 11:30 గంటలకు రోడ్ షోలో ప్రియాంక భువనగిరిలో భారీ ర్యాలీకి ప్లాన్ చేసిన కాంగ్రెస్ కరీంనగర్లో నేడు మోదీ పర్యటన ప్రధాని మోదీ నేడు కరీంనగర్లో ఎన్నికల ప్రచారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎస్ఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్లో బీజేపీ సభ బీజేపీ సభలో పాల్గొననున్న ప్రధాని మోదీ అమిత్ షా షెడ్యూల్ ఇలా.. ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో సకల జనుల విజయ సంకల్ప సభకు హాజరుకానున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. జమ్మికుంట డిగ్రీ కళాశాల మైదానంలో ఉదయం పది గంటలకు అభ్యర్థి ఈటల రాజేందర్‌కు మద్దతుగా ప్రచారం. మధ్యాహ్నం పెద్దపల్లిలో పర్యటించనున్న అమిత్ షా బీజేపీ అభ్యర్థి దుగ్యాల ప్రదీప్ రావుతో కలిసి రోడ్డు షోలో ప్రచారం చేయనున్న అమిత్ షా. జగిత్యాలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రోడ్ షో.. జగిత్యాల బీజేపీ అభ్యర్థి బోగ శ్రావణికి మద్దతుగా ప్రచారం. 30న తెలంగాణ భవిష్యత్తు తేలిపోతుంది.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మా రాష్ట్రం వస్తే గ్యారంటీల అమలు చూపిస్తాం ముషీరాబాద్, మక్తల్ కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం ఈ రెండు రోజులూ కీలకం బీజేపీ నేతలతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమీక్ష ప్రచారం ఉధృతం చేయండి పోల్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టండి గట్టి పోటీ ఇస్తున్న 45–50 సీట్లలో ఎక్కువ గెలవాలి నేడు మోదీ, అమిత్‌షా సహా ముఖ్యనేతల ప్రచారం మహబూబాబాద్, కరీంనగర్‌లలో మోదీ బహిరంగసభ జేపీ నడ్డాతో సహా కొందరు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు సోమవారం విస్తృత ప్రచారం మహబూబాబాద్, కరీంనగర్‌లలో బహిరంగసభలతో పాటు హైదరాబాద్‌లో మోదీ రోడ్‌షో అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో కోటి దీపోత్సవంలో పాల్గొననున్న మోదీ గురుద్వారాను సందర్శించిన అనంతరం ఢిల్లీకి తిరుగు పయనం హుజూరాబాద్‌లో బహిరంగసభ, పెద్దపల్లి, మంచిర్యాలలో అమిత్‌షా రోడ్‌షో అనంతరం బేగంపేట నుంచి ఢిల్లీకి.. సోమవారం ఉదయం జగిత్యాలలో రోడ్‌షో అనంతరం బోధన్, బాన్సువాడ, జుక్కల్ బహిరంగసభల్లో పాల్గొననన్ను జేపీ నడ్డా దేవరకద్ర, మంథని సభల్లో, పరకాలలో రోడ్‌షో అసోం సీఎం హిమంత బిశ్వశర్మ హనుమకొండలోని విష్ణుపురి గార్డెన్స్‌లో ఐటీ ఇంటలెక్చువల్ మీట్లో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖమంత్రి పీయూష్ గోయల్ సిద్దిపేటలో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో కేంద్ర సమాచార, క్రీడాశాఖ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ అలంపూర్‌లో పార్టీ నాయకు లు, కార్యకర్తల సమావేశానికి హాజరుకానున్న కేంద్ర సహాయ మంత్రి వి.మురళీధరన్ మంచినీరు, కరెంటు వస్తేనే కారుకు ఓటేయండి.. సాక్షిటీవీ లైవ్‌షోలో మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని వాటిని కూడా నెరవేర్చాం కర్ణాటకలో కాంగ్రెస్ జనాన్ని మోసం చేసింది కేసీఆర్ ఫామ్‌హౌస్ సీఎం కాదు...ఫామింగ్ సీఎం మేం 12 సార్లు రైతుబంధు ఇచ్చాం. కాంగ్రెస్ వస్తే 12 మంది ముఖ్యమంత్రులు ప్రభుత్వ పథకాలపై కాంగ్రెస్ దుష్ప్రచారం తిప్పికొడుతున్నాం కాళేశ్వరంతో రాష్ట్రం సస్యశ్యామలం అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ ఇంట్లో ఐటీ సోదాలు శాంతినగర్‌లో ఆయన నినాసంలో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులు సృహతప్పి పడిపోయిన సంపత్ కుమార్ భార్య సంపత్ కుమార్ ఇంటికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు -
కబ్జాకోర్లు కావాలా.. ప్రశ్నించే గొంతుక కావాలా?
సాక్షి, కరీంనగర్: ‘‘కరీంనగర్ ప్రమాదంలో పడింది. భూకబ్జాదారులు, చీటర్లు, అవినీతి కేసులున్న వారు కాంగ్రెస్, బీఆర్ఎస్ పక్షాన పోటీచేస్తున్నారు. నేను ధర్మం కోసం, ప్రజా సమస్యలపై పోరాడుతున్నాను. ఎటువైపు ఉంటారో ప్రజలు తేల్చుకోవాలి’’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ ప్రజలను కోరారు. ఆదివారం ఆయన కరీంనగర్లో వేర్వేరుగా నిర్వహించిన బ్రాహ్మణ, రెడ్డి, ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొని మాట్లాడారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి కరీంనగర్ నియోజకవర్గం గురించి ఏమీ తెలియదని, తెలిసిందల్లా భూకబ్జాలు చేయడమేనని ఆరోపించారు. ఆయనపై 27 కేసులున్నయని, అవన్నీ కబ్జాలు, ఫోర్జరీ కేసులేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్పైనా అవినీతి, అక్రమ ఆస్తుల కేసులు ఉన్నాయని చెప్పారు. వారు ఎప్పుడూ ప్రజల కోసం కొట్లాడలేదన్నారు. అదే తనపై 74 కేసులు ఉన్నాయని.. అవన్నీ పేదలు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, విద్యార్థుల కోసం కొట్లాడితే సీఎం కేసీఆర్ పెట్టించినవని పేర్కొన్నారు. భారీగా నిధులు తీసుకొచ్చా.. ఎంపీగా కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గానికి దా దాపు రూ.9 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా నని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్–జగిత్యా ల, కరీంనగర్–వరంగల్ జాతీయ రహదారి నిర్మా ణానికి, స్మార్ట్ సిటీకి నిధులు తెచ్చానని పేర్కొన్నా రు. బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు వ్యాపారులను బెదిరించి వసూళ్లు చేయడం తప్ప మరేమీ చేయలేదని ఆరోపించారు. వారు మళ్లీ ఓట్ల కోసం వస్తున్నారని, మోసపోకుండా తనకు ఓటేసి ప్రశ్నించే గొంతుకను కాపాడుకోవాలని ప్రజలను కోరారు.