breaking news
-
పోలింగ్ డే హాలీడే.. హైదరాబాద్‌లో పెరగని పోలింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్ నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్‌లో మాత్రం పోలింగ్ శాతం 32గా ఉంది. సిటీలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. ఇదిలా ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ డేను సెలవు రోజుగానే చదువుకున్న ఓటర్లు చూస్తున్నారు. గతంలానే ఓటేసేందుకు హైదరాబాదీలు ముఖం చాటేశారు. సెలబ్రేటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్ శాతం మాత్రం పెరగలేదు. ఇక, మెదక్‌లో అత్యధికంగా 70 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. మరోవైపు.. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్ ముగియనుంది. ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజక వర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్ ముగియనుంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. మిగతా స్థానాల్లో ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. -
ఈవీఎంలలో సమస్యలు.. సీఈవోకు లేఖ రాసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఈవీఎంలు మొరాయిస్తున్నాయి. ఒక్కోచోట ఓటు వేయడానికి కనీసం 10 సెకన్ల సమయం పడుతోందని ఓటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎన్నికల అధికారులకు, స్టేట్ ఎన్నికల కమిషన్‌కు వరుస ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే, ఈవీఎంల విషయమై సీఈవో వికాస్‌రాజ్.. డీఈవోలతో కోఆర్డీనేట్ అయ్యారు. మరోవైపు.. ఈవీఎంల మొరాయింపుపై సీఈవో వికాస్‌రాజ్‌కు కాంగ్రెస్ లేఖ రాసింది. ఈ క్రమంలో ఈవీఎంలలో ఉన్న సమస్యలను పరిష్కరించేలా చూడాలని కోరారు. లేనిపక్షంలో పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సమయాన్ని పెంచాలని కాంగ్రెస్ నేతలు సీఈవోను కోరారు. ఇదిఆల ఉండగా.. హైదరాబాద్‌లో మందకోడిగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కేవలం 21 శాతం పోలింగ్ నమోదు.. అత్యధికంగా మెదక్‌లో 51 శాతం పోలింగ్ నమోదైంది. కాగా, తెలంగాణవ్యాప్తంగా 37 శాతం పోలింగ్ జరిగినట్టు ఎన్నికల అధికారులు చెబుతున్నారు. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. కాగా, సాయంత్రం పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. -
ఎమ్మెల్సీ కవితపై ఎఫ్ఐఆర్ నమోదు..
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల నేతలు కోడ్ ఉల్లంఘిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో, నేతల వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. ఇక, తాజాగా ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఈసీ సీరియస్ అయినట్టు సమాచారం. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవితపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. ఇక, తాజాగా ఎన్నికల సీఈవో వికాస్‌రాజ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఈవీఎంల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. జరిగిన ప్రతి ఫిర్యాదుపై డీఈవోను రిపోర్ట్ అడిగాం. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చింది. కవిత వ్యాఖ్యలపై డీఈవోకు ఆదేశాలు ఇచ్చాను. ఆమె వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు అయిందన్నారు. అంతకుముందు కూడా.. రాజకీయ నాయకులు తొందర పడి వ్యాఖ్యలు చేయవద్దు. నేతలు ఎవరూ నిబంధనలు అతిక్రమించవద్దన్నారు. ఇదిలా ఉండగా.. ఓటు వేసిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వచ్చింది. దీంతో, కాంగ్రెస్ నేతలు ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ నేత నిరంజన్.. ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కవితపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. VIDEO | "I sincerely request everybody in Telangana to come out and exercise their right because when you vote, you have the right to question us. When you vote, you can hold the politicians accountable," says BRS leader @RaoKavitha after casting her vote in Hyderabad.… pic.twitter.com/Y9BbS3kFtL — Press Trust of India (@PTI_News) November 30, 2023 -
అసెంబ్లీ ఎన్నికలు.. ఎగ్జిట్ పోల్స్‌పై ఈసీ కీలక ప్రకటన
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు.. ఎగ్జిట్‌పోల్స్ విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఎగ్జిట్ పోల్ సమయాన్ని మార్చుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సాయంత్రం 5.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయవద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. 5.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఇక, తెలంగాణలో సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మరోవైపు.. తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా వికాస్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. EVMల సమస్య వచ్చిన దగ్గర కొత్తవి మార్చాము. అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి.. ఇక నుంచి పెరుగుతుంది అనుకుంటున్నాం. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు జరిగాయి. జరిగిన ప్రతి కంప్లైంట్స్ పై DEOను రిపోర్ట్ అడిగాం. ఎమ్మెల్సీ కవిత, టీపీసీసీ చీఫ్ రేవంత్ వ్యాఖ్యలపై ఫిర్యాదు వచ్చింది. కవిత వ్యాఖ్యల పై DEOకు ఆదేశాలు ఇచ్చాను. ఆమె వ్యాఖ్యలపై ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. రాష్ట్రంలో 11 గంటల వరకు 20.64 శాతంగా పోలింగ్ నమోదైంది. రూరల్‌లో పోలింగ్ శాతం బాగానే ఉంది.. అర్బన్‌లో పెరగాల్సి ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
నాగార్జున సాగర్ వద్ద ఉద్రిక్తత.. రేవంత్, బండి రియాక్షన్
సాక్షి, కరీంనగర్/కొడంగల్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ డ్యామ్‌పైకి ఏపీ పోలీసులను, ఏపీ ఇరిగేషన్ అధికారులను వెళ్లకుండా తెలంగాణ పోలీసులు గేటు వేసి అడ్డుకున్నారు. గేటు తీయమని శాంతియుతంగా ఎంత చెప్పినా తెలంగాణ పోలీసులు వినలేదు. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న గేటుకు సంబంధించిన సెన్సార్‌ను తెలంగాణ పోలీసులు పగలగొట్టారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు వారికి సెక్యూరిటీ కల్పించారు. పోలీసుల సహకారంతో సాగర్ డ్యామ్‌పై ఏపీ సరిహద్దుల్లో తమ పరిధిలో ఇరిగేషన్ అధికారులు ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నాగార్జునసాగర్ ఘటనపై రేవంత్ స్పందిస్తూ.. ‘ఎన్నికలు వచ్చినప్పుడల్లా తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని రాజకీయ లబ్ధి కోసం కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారు. ఏం ఆశించి ఇలా చేస్తున్నారో కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నది. ఎన్నికల సమయంలో ఇలాంటి పనులు చేయడం కేసీఆర్‌కు అలవాటే. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుందని, నీళ్లు ఎక్కడికీ పోవు. సామరస్యపూర్వకంగా ఇలాంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎన్నికలపై ఇలాంటి కుట్రలు పని చేయవు. దేశాలే నీటి సమస్యలను పరిష్కరించుకుంటున్నప్పుడు.. రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకోలేమా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు సమయస్పూర్తి ఉన్నవాళ్లని, సమస్యను అర్థం చేసుకోగలిగే వాళ్లని అన్నారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేందుకు యత్నించారు’ అని విమర్శించారు. ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం బండి సంజయ్ నాగార్జున సాగర్ ఘటనపై స్పందించారు. ఈ క్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘టీఆర్ఎస్ను బీఆర్ఎస్ చేసి ఇంకా తెలంగాణ సెంటిమెంట్ ఏంది?. తెలంగాణ, ఆంధ్ర ఫీలింగ్ తీసుకొచ్చే కేసీఆర్ అండ్ టీం రెచ్చగొట్టే యత్నం చేస్తోంది. నాగార్జునసాగర్ ఇష్యూ ఇప్పుడే ఎందుకు తెరపైకి వచ్చింది.? తెర వెనుక ఎవరున్నారు?. కేసీఆర్‌వి ఫాల్స్ రాజకీయాలు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. -
TS: పోలింగ్ వేళ ఫైటింగ్.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్తర పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని చోట్ల బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో, పోలీసుల లాఠీలకు పనిచెబుతున్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ Vs కాంగ్రెస్ సూర్యాపేటలోని మఠంపల్లిలో ఉద్రిక్తత. ఓటేసేందుకు వెళ్లిన వ్యక్తిని చితకబాదిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ వాళ్లు ఓటు వేసేందుకు వస్తే చంపుతామంటూ బెదిరింపులు. వ్యక్తి మీద దాడి చేయడంతో అతడికి గాయాలు. ఆసుపత్రికి తరలింపు. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత. ఖానాపూర్ మున్సిపాలిటీ దగ్గర కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ. లాఠీఛార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు. లాఠీలకు పనిచెప్పడంతో పరుగులు తీసిన కార్యకర్తలు, ఓటర్లు. పలువురికి గాయాలు. వికారాబాద్.. తాండూర్ మండలం కరన్‌కట్‌లో నగదు కలకలం. కోటవీధిలోని పోలింగ్ కేంద్రం దగ్గర డబ్బుల పంపిణీ. పోలీసుల రాకతో డబ్బును వదిలేసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు. రూ. 7.45లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. జనగామ.. జనగామ జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్ పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత.. పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పర్యవేక్షించిన బీఆర్ఎస్ అభ్యర్థి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి. పోలింగ్ స్టేషన్ వద్ద ఎక్కువసేపు ఉన్నాడని అభ్యంతరం తెలిపిన కాంగ్రెస్ నాయకులు, సీపీఎం నాయకులు. దీంతో, ఇరువర్గాల మద్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు.. పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకొన్న ఏసీపీ దేవేందర్ రెడ్డి.. కల్లూరులో తోపులాట.. ఖమ్మంలోని కల్లూరు మండలం చెన్నూరు గ్రామంలో పొలింగ్ బూత్ వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య తోపులాట పోలింగ్ బూతు వద్ద బీఆరెఎస్ నాయకులు పార్టీ కండువాలు కప్పుకొని ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇరువర్గాల వారిని చెదరగొట్టిన పోలీస్ బలగాలు ఖమ్మం.. సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామంలో ఓటు వేయకుండా పోలింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు తమ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని ఓటును బహిష్కరించిన గిరిజన గ్రామస్తులు. ఎన్నికల వేళ నాగార్జునసాగర్ అంశంపై రేవంత్ కీలక వ్యాఖ్యలు.. నాగార్జున సాగర్ వివాదంపై సీఈవో చర్యలు తీసుకోవాలి. కావాలనే వ్యూహాత్మకంగా ఈ వివాదం సృష్టించారు. ఎవరు, ఎందుకు, ఏం ఆశించి ఈ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రజలకు తెలుసు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది. నీళ్లు ఎక్కడికి పోవు. ఏ రాష్ట్రంతో సమస్య ఉన్నా.. సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి. ఇలాంటి కుట్రలు ఎన్నికలపై ప్రభావం చూపవు. -
ఈ అభ్యర్థులు.. ఓటేసుకోలేరు!
సాక్షి, కామారెడ్డి: ఎన్నికల బరిలో నిలిచి హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. ఓటేసి తమనే గెలిపించాలని ఓటరు దేవుళ్లను కోరారు. అయితే ఇతరుల ఓట్లభ్యర్థించిన ఆ అభ్యర్థులు.. తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. పలువురు అభ్యర్థుల ఓట్లు వారు పోటీ చేస్తున్న నియోజకవర్గం పరిధిలో లేకపోవడమే ఇందుకు కారణం.. కామారెడ్డి నియోజకవర్గంనుంచి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి కేసీఆర్ ఓటు సిద్దిపేట జిల్లా చింతమడకలో ఉంది. ఆయన తన ఓటును అక్కడే వినియోగించుకోనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రేవంత్‌రెడ్డి ఓటు కొడంగల్ నియోజకవర్గంలో ఉంది. ఆయన కూడా తన ఓటు అక్కడే వేయనున్నారు. బాన్సువాడ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఏనుగు రవీందర్‌రెడ్డి ఓటు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌లో ఉంది. ఇక్కడ బీజెపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యెండల లక్ష్మీనారాయణ ఓటు నిజామాబాద్ నగరంలో ఉంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మదన్మోహన్రావు ఓటు హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఉంది. చిన్నాచితకా పార్టీల అభ్యర్థులు, కొందరు ఇండిపెండెంట్లు కూడా తమ ఓటు తమకు వేసుకోలేకపోతున్నారు. -
అభ్యర్థులు ఎక్కడ ఓటు వేస్తారంటే?
హైదరాబాద్: ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలో గెలుపు కోసం మూడు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. నెల రోజుల నుంచి ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు బుధవారం వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యారు. గురువారం ఈ ముగ్గురు అభ్యర్థులు నియోజకవర్గంలోని వేర్వేరు డివిజన్ల పరిధిలో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ►బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ వెంకటేశ్వరకాలనీ డివిజన్ బంజారాహిల్స్ రోడ్ నెం. 14లోని ఓల్డ్ వెంకటేశ్వరనగర్ బూత్ నెం. 130లో తన ఓటు వేయనున్నారు. ► కాంగ్రెస్ అభ్యర్థి పి. విజయారెడ్డి ఖైరతాబాద్ డివిజన్ పరిధిలోని టెలిఫోన్ భవన్ పక్కన పాఠశాల విద్యాశాఖ పోలింగ్ బూత్ నెం. 59లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ► బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి జూబ్లీహిల్స్ డివిజన్పరిధిలోని బంజారాహిల్స్ రోడ్ నెం. 2 షేక్‌పేట మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ బూత్‌లో ఓటు వేయనున్నారు. -
ఓటేద్దాం రండి!
ఓటు ఎంతో విలువైనది.. వెలకట్టలేనిది. రాష్ట్ర భవిష్యత్, ప్రజల తలరాతను నిర్దేశించే శక్తివంతమైన ఆయుధం ఓటే. ప్రజలు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేయండి. వచ్చే ఐదేళ్లలో మీ ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చగలిగే ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. ఐదేళ్లకోసారి మాత్రమే ప్రజాక్షేత్రంలోకి వచ్చే నేతలకు మీ శక్తియుక్తులను తెలియజేయండి. ఓటరుకు 21 సెకన్లు రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒక్కో ఓటరు ఓటేసేందుకు సగటున 21 సెకన్ల సమయం కేటాయించనున్నారు. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు.. మొత్తం 10 గంటల పాటు పోలింగ్ జరుగుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,550 మంది, మిగిలిన చోట్లలో గరిష్టంగా 1,500 మంది ఓటర్లు ఓటేసేందుకు ఏర్పాట్లు చేశారు. 36,000 సెకన్ల పాటు పోలింగ్ పోలింగ్ కేంద్రంలో మొత్తం 36 వేల సెకన్ల పాటు పోలింగ్ జరగనుండగా, ఒక్కో ఓటరు ఓటేసేందుకు సగటున 21 సెకన్ల చొప్పున మొత్తం 31,500– 32,550 సెకన్ల సమయం పట్టనుంది. ఓటరు పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన వెంటనే తొలుత అతడి పేరు ఓటరు జాబితాలో ఉందా లేదా అని ఓ పోలింగ్ అధికారి పరిశీలించి నిర్థారిస్తారు. ఆ తర్వాత మరో అధికారి ఓటరు ఎడమచేతి చూపుడు వేలుకు సిరా చుక్క పెడతారు. అనంతరం మరో అధికారి ఈవీఎం కంట్రోల్ యూనిట్‌ను సిద్ధం చేసి ఓటరు ఓటేసేందుకు బ్యాలెట్ యూనిట్ ఉండే కంపార్ట్మెంట్లోకి పంపిస్తారు. ఈ మూడు ప్రక్రియలు 14 సెకన్లలోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. జాబితాలో పేరు ఉందా? లేదా? ఎలా తెలుసుకోవాలి ? కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక వెబ్సైట్ https://electoralsearch.eci.gov.in/ ద్వారా ఓటరు వివరాలు/ ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)/ మొబైల్ నంబర్ ఆధారంగా జాబితాలో పేరును సెర్చ్ చేయడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తోంది. మొబైల్ ఫోన్ నంబర్, ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా జాబితాలో పేరు సెర్చ్ చేయడం చాలా సులువు. గతంలో ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకున్న వారు మాత్రమే మొబైల్ ఫోన్ నంబర్ ఆధారంగా పేరును సెర్చ్ చేయడానికి వీలుంటుంది. ఓటరు పేరు, తండ్రి పేరు/ వయసు ఇతర వివరాలను కీ వర్డ్స్‌గా వినియోగించి సెర్చ్ చేసినప్పుడు అక్షరాల్లో స్వల్ప తేడాలున్నా జాబితాలో పేరు కనిపించదు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌తో సకల సదుపాయాలు ఓటర్స్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఓటర్లకు సకల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. ఓటర్ల నమోదుకు దరఖాస్తు చేసుకోవడం, ఓటర్ల జాబితాలో పేరు వెతకడం, పోలింగ్ కేంద్రం వివరాలు తెలుసుకోవడం, బీఎల్ఓ/ఈఆర్వోతో అనుసంధానం కావడం, ఈ– ఎపిక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలను పొందవచ్చు. పోలింగ్ కేంద్రంలో సెల్ఫోన్లపై నిషేధం ! పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కార్డ్ లెస్ ఫోన్లు, వైర్ లెస్ సెట్లతో ప్రవేశంపై నిషేధం ఉంది. పోలింగ్ కేంద్రానికి చుట్టూ 100 మీటర్ల పరిసరాల పరిధిలోకి ఇలాంటి పరికరాలు తీసుకెళ్లకూడదు. పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తూ సెల్ఫీలు తీసుకోవడానికి సైతం వీలు లేదని గతంలో ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కేవలం ఎన్నికల పరిశీలకులు, సూక్ష్మ పరిశీలకులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత అధికారులు మాత్రమే ఎన్నికల కేంద్రంలో మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లవచ్చు. అయితే వాటిని సైలెంట్ మోడ్‌లో ఉంచాల్సిందే. ఓటర్లు పోలింగ్ బూత్‌లో ప్రవేశించి ఓటు ఎవరికి వేశారో మొబైల్ ఫోన్ కెమెరాల్లో చిత్రీకరించే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వీవీ ప్యాట్ యంత్రాల డిస్ప్లే స్క్రీన్‌పై ఓటు ఎవరికి వేశారో ఏడు క్షణాల పాటు కనిపించనుంది. దీనిని ఫోన్‌తో ఫొటో తీసే అవకాశం ఉండటంతో మొబైల్ ఫోన్లపై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నిర్ణీత సమయం దాటిన తర్వాత లైనులో ఉంటే ఓటుహక్కు కల్పిస్తారా? రాష్ట్రంలోని 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు లైనులో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న వారికి పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు. ఓటరు జాబితాలో పేరు తొలగించినా ఓటేయవచ్చు ! పోలింగ్ కేంద్రాల వారీగా ప్రత్యేకంగా అబ్సెంటీ, షిఫ్టెడ్, డెడ్(ఏఎస్డీ) ఓటర్ల జాబితా రూపొందించి సంబంధిత పోలింగ్ కేంద్రం ప్రిసైడింగ్ అధికారికి అందజేస్తారు. ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తి పేరు ఓటరు జాబితాలో లేకపోతే, ఆ వ్యక్తి పేరును ఏఎస్డీ ఓటర్ల జాబితాలో వెతకాలి. ఏఎస్డీ ఓటర్ల జాబితాలో ఆ వ్యక్తి పేరుంటే ఓటరు గుర్తింపు కార్డు/ లేదా ఇతర గుర్తింపు కార్డుల ఆధారంగా ఆ వ్యక్తి గుర్తింపును ప్రిసైడింగ్ అధికారి ముందుగా నిర్ధారించుకుంటారు. అనంతరం ఆ వ్యక్తి పేరును ఫారం 17ఏలో నమోదు చేసి సంతకంతో పాటు వేలిముద్ర తీసుకుంటారు. ఈ క్రమంలో తొలి పోలింగ్ అధికారి సదరు ఏఎస్డీ ఓటరు పేరును పోలింగ్ ఏజెంట్లకు గట్టిగా వినిపిస్తారు. సదరు ఓటరు నుంచి నిర్దిష్ట ఫార్మాట్లో డిక్లరేషన్ తీసుకోవడంతో పాటు ఫొటో, వీడియో తీసుకుంటారు. అనంతరం అతడికి ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. వికలాంగులు, వృద్ధులు ఓటేసేందుకు వాహన సదుపాయం కోసం ఎవరిని సంప్రదించాలి. స్థానిక బూత్ లెవెల్ అధికారి (బీఎల్ఓ)ని సంప్రదిస్తే ఆటో ద్వారా ఓటర్లను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించనున్నారు. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో.. ఎలా తెలుసుకోవాలి ? రాష్ట్రంలోని ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఫొటో ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు జారీ చేసింది. ఈ ఓటర్ స్లిప్పుల వెనకభాగంలో పోలింగ్ కేంద్రం రూటు మ్యాప్‌ను పొందుపరిచింది. ఈ రూట్ మ్యాప్‌తో సులువుగా పోలింగ్ కేంద్రానికి చేరుకోవచ్చు. కొత్త ఎపిక్ కార్డు నంబర్ ఎలా తెలుసుకోవాలి? గతంలో కేంద్ర ఎన్నికల సంఘం 13/14 అంకెల సంఖ్యతో ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేయగా, గత కొంత కాలంగా 10 అంకెల సంఖ్యతో కొత్త ఓటరు గుర్తింపు కార్డులను జారీ చేస్తోంది. పాత ఓటరు గుర్తింపు కార్డు నంబర్ ఆధారంగా మీ కొత్త ఓటరు గుర్తింపు కార్డు నంబర్ తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) కార్యాలయం రూపొందించిన ప్రత్యేక వెబ్సైట్ https:// ceotserms2. telangana. gov. in/ ts& search/ Non& Standard& Epic. aspx ను సందర్శించి మీ పాత ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా కొత్త ఎపిక్ కార్డు నంబర్‌ను తెలుసుకోవచ్చు. మీ ఓటును వేరేవాళ్లు వేసేశారా? అయితే.. టెండర్ ఓటేయవచ్చు! ఎన్నికల్లో ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికి మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే దిగులుపడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఎన్నికల సంఘం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం) ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. టెండర్ బ్యాలెట్ ఓటర్ల వివరాలను ప్రిసైడింగ్ అధికారులు ఫారం–17బీలో రికార్డు చేస్తారు. ఈ ఫారంలోని 5వ కాలమ్‌లో ఓటరు సంతకం/వేలి ముద్రను తీసుకున్న తర్వాత వారికి బ్యాలెట్ పత్రం అందజేస్తారు. ప్రత్యేక ఓటింగ్ కంపార్ట్మెంట్లోకి ఓటరు బ్యాలెట్ పత్రాన్ని తీసుకెళ్లి తాము ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది. ఓటేవరికి వేశారో బయటకు కనబడని విధంగా బ్యాలెట్ పత్రాన్ని మడిచి కంపార్ట్మెంట్ బయటకి వచ్చి ప్రిసైడింగ్ అధికారికి అందజేయాలి. ఆ బ్యాలెట్ పత్రాన్ని టెండర్ ఓటుగా ప్రిసైడింగ్ అధికారి మార్క్ చేసి ప్రత్యేక ఎన్వలప్లో వేరుగా ఉంచుతారు. చాలెంజ్ ఓటు అంటే ..? ఓటేసేందుకు వచ్చిన వ్యక్తి గుర్తింపును అభ్యర్థుల పోలింగ్ ఏజెంట్లు రూ.2 చెల్లించి సవాలు చేయవచ్చు. ఓటరు గుర్తింపును నిర్ధారించడానికి ప్రిసైడింగ్ అధికారి విచారణ జరుపుతారు. ఓటరు గుర్తింపు నిర్ధారణ జరిగితే ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. దొంగ ఓటరు అని నిర్ధారణ అయితే సదరు వ్యక్తిని ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అక్కడ భారీగా బందోబస్తు 119 స్థానాల్లోని 27 శాసనసభ నియోజకవర్గాల్లో 614 పోలింగ్ కేంద్రాలపై వామపక్ష ప్రభావం ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటికే మూడు దఫాలుగా పోలింగ్ ముందు, పోలింగ్ రోజు, పోలింగ్ తర్వాత చేపట్టాల్సిన బందోబస్తుపై ప్రత్యేక ప్రణాళిక చేపట్టారు. ఓటింగ్ రోజు పక్కాగా 144 సెక్షన్ అమలు, పోలింగ్ తర్వాత చీకటి పడకముందే ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్‌రూంకు తరలించడం, సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా రక్షణ కల్పించనున్నారు. మావోయిస్టుల తీవ్ర ప్రభావమున్న 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించనున్నారు. అనుచితంగా ప్రవర్తిస్తే పోలింగ్ బూత్ నుంచి గెంటివేతే స్పష్టం చేస్తున్న నిబంధనలు పోలింగ్ సమయంలో పోలింగ్ కేంద్రంలో అనుచితంగా ప్రవర్తించిన లేదా చట్టపర ఆజ్ఞలను పాటించడంలో విఫలమైన వ్యక్తులను ప్రిసైడింగ్ అధికారి బయటకు పంపించవచ్చు అని కేంద్ర ఎన్నికల సంఘం గతంలో స్పష్టం చేసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 132 కింద ఈ మేరకు అధికారాలు ప్రిసైడింగ్ అధికారికి ఉన్నాయని పేర్కొంది. మద్యం సేవించినా లేదా మాదక ద్రవ్యాలను వినియోగించిన వ్యక్తులను పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించకుండా నిలువరించేందుకు అనుమతి కోరుతూ గత శాసనసభ సాధారణ ఎన్నికల సందర్భంగా నాటి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌కుమార్ రాసిన లేఖకు స్పందిస్తూ అప్పట్లో ఈ మేరకు స్పష్టతనిచ్చింది. మద్యం సేవించి పోలింగ్ కేంద్రానికి వచ్చే వ్యక్తుల ఓటు హక్కును నిరాకరించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. మద్యం లేదా మాదక ద్రవ్యాల మత్తులో విచక్షణ కోల్పోయి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే వ్యక్తులను మాత్రం పోలీసుల సహాయంతో బయటకు పంపించేందుకు నిబంధనలు అనుమతిస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. వెబ్‌కాస్టింగ్‌తో ప్రత్యక్ష ప్రసారం ఓటు హక్కు వినియోగించుకునే దృశ్యం ప్రత్యక్ష ప్రసారం కానుంది. రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునే దృశ్యాలు పోలింగ్ కేంద్రాల నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఓటర్లే కాదు.. ఎన్నికల విధుల్లో పాల్గొననున్న పోలింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, భద్రత సిబ్బంది, పోలింగ్ ఏజెంట్ల ప్రతి కదలికను ఎన్నికల సంఘం లైవ్‌గా వీక్షించనుంది. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 27,094 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించనున్న పోలింగ్ ప్రక్రియను ఆద్యంతం ‘లైవ్ వెబ్‌కాస్ట్’ చేయనున్నారు. ఎక్కడ ఎలాంటి అపశ్రుతి చేసుకున్నా, ఎవరైనా ఆటంకం సృష్టించినా, ఏమైనా హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నా క్షణాల్లో ఎన్నికల సంఘం సంబంధిత పోలింగ్ కేంద్రంలోని పరిస్థితులను లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా వీక్షిస్తుంది. వెంటనే స్థానిక పోలింగ్ అధికారులకు సూచనలు జారీ చేస్తుంది. ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు, హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ), జిల్లా కేంద్రాల నుంచి జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లు, నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా టీవీ తెరలపై ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎన్నికలను పర్యవేక్షించనున్నారు. సాంకేతికంగా ప్రత్యక్ష ప్రసారం సాధ్యం కాని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు కానుంది. ప్రతి కదలిక ప్రత్యక్ష వీక్షణ ♦ లైవ్ వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు చూసేందుకు ఏర్పాట్లు ♦ పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన ఓటరును పోలింగ్ అధికారి గుర్తించే ప్రక్రియ. ♦ ఓటరు వేలి మీద సిరా చుక్క రాయడం ♦ ఓటరును గుర్తించిన అనంతరం ఈవీఎంకు సంబంధించిన కంట్రోల్ యూనిట్‌ను ప్రిసైడింగ్ అధికారి స్టార్ట్ చేయడం ♦ ఓటు వేసేందుకు పోలింగ్ కంపార్ట్మెంట్లో ఓటరు ప్రవేశించే దృశ్యం. అయితే, ఓటు ఎవరికి వేశారన్న రహస్యాన్ని కాపాడేందుకు ఈవీఎం బ్యాలెట్ యూనిట్ కనిపించని విధంగా కెమెరా ఏర్పాట్లు చేస్తారు. ♦ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ ఏజెంట్ల కదలికలు ♦ పోలింగ్ ముగింపు సమయంలో ఇంకా ఓటేసేందుకు వరుసలో నిలబడిన ఓటర్లకు టోకెన్లు/స్లిప్పులు అందించే ప్రక్రియ. ♦ పోలింగ్ ముగిసిన తర్వాత ఈవీఎంలు(బ్యాలెట్ యూనిట్/కంట్రోల్ యూనిట్), వీవీ ప్యాట్లను సీల్ వేసే దృశ్యంతో పాటు పోలింగ్ ఏజెంట్లకు 17సీ కాపీలు అందజేసే దృశ్యం. ♦ కనీసం 7–8 అడుగులకు మించిన ఎత్తులో కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ♦ కెమెరాను గోడకు స్టాండ్ ఆధారంగా, లేదా స్థిరంగా ఉండే విధంగా ఓ చోట బిగిస్తారు. ♦ వెబ్ కెమెరా/సీసీటీవీ నిఘా పరిధిలో మీరు ఉన్నారని పోలింగ్ కేంద్రం వద్ద హెచ్చరిక నోటీసులు అతికిస్తారు. పోలింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది ? పోలింగ్ కేంద్రంలో ప్రవేశించిన వ్యక్తికి ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉందా? లేదా ? అన్న విషయాన్ని ఏదైనా గుర్తింపుకార్డు ఆధారంగా తొలి పోలింగ్ అధికారి పరిశీలిస్తారు. రెండో పోలింగ్ అధికారి ఆ ఓటరు ఎడుమ చేతి చూపుడు వేలుకు సిరా చుక్క అంటించి, ఓ స్లిప్పు అందజేస్తారు. ఫారం–17ఏలో వివరాలు నమోదు చేసి ఓటరు సంతకం తీసుకుంటారు. మూడో పోలింగ్ అధికారి వద్ద ఆ స్లిప్పును డిపాజిట్ చేసి, సిరా చుక్క అంటించిన వేలును చూపిస్తే ఓటేసేందుకు పోలింగ్ బూత్‌లోకి పంపిస్తారు. అక్కడ మూడో పోలింగ్ అధికారి ఓటు వేసేందుకు సాంకేతికంగా ఈవీఎంను సిద్ధం చేసి పెడతారు. ఈవీఎంలో ఓటు ఎలా వేయాలి ? ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ పరికరాలుంటాయి. ప్రిసైడింగ్ అధికారి నియంత్రణలో కంట్రోల్ యూనిట్ ఉంటుంది. బ్యాలెట్ యూనిట్, వీవీ ప్యాట్ మాత్రం ఓటరు ఓటువేసే కంపార్ట్మెంట్లో ఉంటాయి. బ్యాలెట్ యూనిట్‌పై ఓటరు తనకు నచ్చిన అభ్యర్థి పేరు పక్కన ఉన్న నీలిరంగు మీటను నొక్కగానే..ఆ అభ్యర్థి పేరు, మీట మధ్యలో ఉండే రెడ్‌లైట్ వెలుగుతుంది. ఆ వెంటనే ఓటు ఎవరికి పడిందో తెలిపేందుకు అభ్యర్థి పేరు, క్రమసంఖ్య, ఎన్నికల గుర్తుతో ఓ స్లిప్పు వీవీప్యాట్‌పై ప్రింట్ అవుతుంది. 7 సెకండ్ల పాటు వీవీప్యాట్ డిస్ప్లే విండోపై ఈ స్లిప్ ఓటరుకు ప్రదర్శితమవుతుంది. ఆ తర్వాత వీవీప్యాట్‌లోని డ్రాప్ బాక్స్‌లోకి స్లిప్ పడిపోతుంది. ఆ వెంటనే ఓటు విజయవంతంగా పడినట్టు బీప్ శబ్దం వినిపిస్తుంది. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటేయవచ్చు! ♦ ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు కార్డులుంటే ఓకే ♦ ఎపిక్ కార్డులో స్వల్ప తేడాలున్నా ఓటేయవచ్చు ♦ ఎపిక్‌తో గుర్తింపు ధ్రువీకరణ కాకుంటే ప్రత్యామ్నాయ గుర్తింపు తప్పనిసరి ♦ ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్పును గుర్తింపుగా పరిగణించరాదు ♦ రాష్ట్ర శాసనసభ సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈసీ కొత్త మార్గదర్శకాలు ఓటరు గుర్తింపు కార్డు(ఎపిక్)లోని వివరాల్లో స్వల్ప తేడాలున్నా, ఓటరు గుర్తింపు నిర్ధారణ అయితే ఓటు హక్కు కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వేరే నియోజకవర్గానికి సంబంధించిన ఓటరు గుర్తింపు కార్డును చూపించి, మరో నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చే వారికి సైతం ఓటు హక్కు కల్పించాలని సూచించింది. అయితే, ఆ పోలింగ్ కేంద్రం ఓటర్ల జాబితాలో పేరు ఉంటేనే ఈ సదుపాయం కల్పించాలని కోరింది. ఓటరు గుర్తింపు నిర్ధారణ విషయంలో ఈ మేరకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎపిక్‌లో లోపాలుంటే వేరే గుర్తింపు తప్పనిసరి.. ఓటరు గుర్తింపు కార్డులో ఫొటోలు తారుమారుకావడం, ఇతర లోపాలతో ఓటరు గుర్తింపు ధ్రువీకరణ సాధ్యంకానప్పుడు, కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో గుర్తింపు పత్రాల్లో(కింద జాబితాలో చూడవచ్చు) ఏదైనా ఒకదానిని ఆధారంగా చూపాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది. ప్రవాస భారత ఓటర్లు తమ పాస్‌పోర్టును తప్పనిసరిగా చూపాల్సి ఉంటుందని తెలిపింది. పోలింగ్‌కు కనీసం 5 రోజుల ముందు పోలింగ్ కేంద్రం పేరు, తేదీ, సమయం, ఇతర వివరాలతో ఓటర్లకు పోలింగ్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను జారీ చేయాలని ఆదేశించింది. అయితే, వీటిని ఓటరు గుర్తింపుగా పరిగణించరాదని స్పష్టం చేసింది. ఓటరు గుర్తింపు కార్డు లేనిపక్షంలో, ఉన్న గుర్తింపు ధ్రువీకరణ సాధ్యం కానిపక్షంలో పోలింగ్ రోజు ఈ కింది జాబితాలోని ప్రత్యామ్నాయ ఫొటో ధ్రువీకరణ పత్రాలను తీసుకువస్తే ఓటు హక్కు కల్పించాలని ఆదేశించింది. ♦ ఆధార్‌కార్డు ♦ ఉపాధి హామీ ♦ జాబ్‌కార్డు ♦ బ్యాంకు/తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్ ♦ కేంద్ర కార్మికశాఖ పథకం కింద జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ♦ డ్రైవింగ్ లైసెన్స్ ♦ పాన్‌కార్డు ♦ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్, ఇండియా(ఆర్జీఐ).. నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రార్(ఎన్పిఆర్) కింద జారీ చేసిన స్మార్ట్ కార్డు ♦ భారతీయ పాస్‌పోర్టు ♦ ఫొటో గల పెన్షన్ పత్రాలు ♦ కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాలు/పీఎస్‌యూలు/ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగి గుర్తింపు కార్డులు ♦ ఎంపీలు/ఎమ్మెల్యేలు/ఎమ్మెల్సీలకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు ♦కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజెబిలిటీ గుర్తింపు కార్డు(యూడీఐడీ) - ముహమ్మద్ ఫసియొద్దీన్ -
అనుకూల ఓటింగ్‌ను పెంచాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పోటీ చేస్తున్న 111 నియోజకవర్గాల్లో పార్టీ అనుకూల ఓటింగ్‌ను, మరి ముఖ్యంగా పోలింగ్ శాతాన్ని పెంచే చర్యలపై బీజేపీ దృష్టి పెట్టింది. గురువారం పోలింగ్ సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలని, పార్టీ అనుకూలురు ఓటు వేసేలా చూడటంతో పాటు పోలింగ్ బూత్‌లలో ఎలాంటి అక్రమా లు, అవకతవకలు చోటుచేసుకోకుండా జా›గ్రత్తలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షులు, అభ్యర్థులు, పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులకు రాష్ట్రపార్టీ ముఖ్య నేతలు సూచించినట్టు తెలిసింది. ఇతర పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయకుండా ఓ కన్నేసి ఉంచాలని, ఎక్కడైనా ఇలాంటి సూచనలు కన్పిస్తే వెంటనే ఈసీ విజిల్ యాప్‌ను వినియోగించుకుని ఫిర్యాదులు నమోదు చేయాలని పేర్కొన్నట్టు సమాచారం. బుధవారం పార్టీ కార్యాలయం నుంచి వివిధ నియోజకవర్గాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు, పోలింగ్ బూత్ కమిటీల అధ్యక్షులు, ఆపై స్థాయి నాయకులు, జిల్లా అధ్యక్షులతో కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉదయం నుంచి పోలింగ్ ముగిసే దాకా బూత్ కమిటీల సభ్యులు అప్రమత్తంగా ఉండాలని, పోలింగ్ సరళిపై ఏవైనా అభ్యంతరాలుంటే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గంట గంటకు ఓటింగ్ సరళిని, శాతాలను ప్రత్యేక దృష్టితో గమనించాలని చెప్పారు. మంచి ఫలితాలపై ఆశాభావం ఉత్తర తెలంగాణ జిల్లాలు, హైదరాబాద్ మహానగరం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాతో పాటు మరి కొన్ని చోట్ల పార్టీ అనుకూల ఓటింగ్‌ను గణనీయంగా పెంచుకోవడం ద్వారా ఈసారి మంచి ఫలితాలు సాధించవచ్చునని పార్టీవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో ప్రధాని మోదీ, అగ్రనేతలు అమిత్సా, జేపీనడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత సీఎంలు ఇతర ముఖ్య నేతలు నిర్వహించిన విస్తృత ప్రచారం వల్ల ఎన్నికల్లో పార్టీకి తప్పకుండా మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నాయి. -
వ్యాక్సిన్ లేని కరోనా కాంగ్రెస్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘వ్యాక్సిన్ లేని కరోనా లాంటిది కాంగ్రెస్ పార్టీ. ఉద్యోగాల నియామకంలో అవాస్తవాలు ప్రచారం చేసింది. ‘థాట్ పోలీసింగ్’(ఓటరుపై తమ పార్టీ వైఖరిని బలవంతంగా రుద్దడం) అనే యుద్ధ నీతిని కాంగ్రెస్ ఎంచుకుంది. కాంగ్రెస్ వ్యూహకర్తలు ప్రాపగాండ చేసిన తరహాలో క్షేత్ర స్థాయిలో పరిస్థితి లేదు. కొంత మంది అసంతృప్త యువత మినహా మిగతా వర్గాలన్నీ మాతోనే ఉన్నాయి’అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ అధ్యక్షులు, సీఎం కె.చంద్రశేఖర్‌రావు 2009 నవంబర్ 29న నిరాహార దీక్ష చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని బుధవారం తెలంగాణ భవన్లో ‘దీక్షా దివస్’నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన రక్తదాన శిబిరం ప్రారంభించిన అనంతరం కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ‘ఈ ఎన్నికలో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారీగా కలిసి పోయాయని చెప్పేందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. నాంపల్లిలో రోడ్‌షో చేసిన కాంగ్రెస్ నేత రాహల్ గాం«దీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పొరుగునే ఉన్న గోషామహల్‌కు వెళ్లకపోవడం వెనుక ఉన్న రహస్యం ఏమిటో చెప్పాలి. కరీంనగర్, కోరుట్లలో కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రచారం చేయలేదు’అని ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ గాలి ‘బీఆర్ఎస్ పార్టీ గతంలో గెలవని ములుగు, హుజూరాబాద్, గోషామహల్తో పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని స్థానాలను క్లీన్‌స్వీప్ చేస్తాం. హైదరాబాద్‌లో ప్రస్తుతం బీఆర్ఎస్ గాలి వీస్తోంది. విపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ములుగు, హుజూరాబాద్, గోషామహల్ తదితర చోట్ల గెలుస్తాం. రంగారెడ్డిలో రెండు మూడు చోట్ల గట్టి పోటీ ఉంది. కాంగ్రెస్‌లో ఆఫీసులో తయారవుతున్న సర్వేలను పక్కన పెడితే గతంలో గెలిచిన 88 సీట్ల కంటే ఎక్కువే గెలుస్తాం. సాధారణ ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు. రేవంత్‌రెడ్డి అటు కొడంగల్, ఇటు కామారెడ్డిలో రెండో చోట్లా ఓడిపోతారు. సర్పంచ్‌లు మొదలుకుని ప్రజా ప్రతినిధులను కొనుగోలు చేసేందుకు రేవంత్ భారీగా డబ్బులు వెదజల్లుతున్నారు. రేవంత్ రెడ్డి సోదరుడు స్వతంత్ర అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ అని చెప్పుకుంటూ కామారెడ్డిలో మకాం వేశారు.’’అని ఆరోపించారు. ’’కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నదే ఈ ఎన్నిక. ప్రభుత్వ వ్యతిరేక ఓటు 49శాతం దాటకుంటే మేము విజయం సాధించినట్లే కదా. కేవలం 39 శాతం ఓట్లతోనే మోదీ దేశ ప్రధాని అయ్యారు’అని కేటీఆర్ గుర్తు చేశారు. హరీశ్ నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసు ఇవ్వాల్సింది ‘కాంగ్రెస్ ఫిర్యాదుతోనే రైతు బంధు ఆగింది. ఉత్తమ్ డిల్లీకి వెళ్లి పిర్యాదు చేస్తే, రేవంత్ నవంబర్ 25న లేఖ రాశారు. 11 సార్లు రైతుబంధు పంపిణీ చేశాం. కొత్త పథకం కానప్పుడు నిలిపివేయడం ఎందుకు. పీఎం కిసాన్ పథకం నిధులు జమ చేస్తే కాంగ్రెస్ ఎందుకు అభ్యంతరం చెప్పలేదు. రైతుబంధు పథకం విషయంలో మంత్రి హరీశ్‌రావు నిబంధనలు ఉల్లంఘిస్తే ఆయనకు నోటీసు జారీ చేసి సంజాయిషీ అడగాలి. రైతుబంధును నిలిపివేసి రైతులను శిక్షించడం ఎందుకు. ఈసీ నిర్ణయాన్ని ఎత్తి చూపించడం మాత్రమే మా ఉద్దేశం. కేసీఆర్ ఉన్నంత వరకు రైతుబంధు పథకం అమలవుతుంది. డిసెంబర్ 5 తర్వాత మళ్లీ వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తాం. డిసెంబర్ 9న తెలంగాణపై ప్రకటన వచ్చిన రోజును గుర్తు చేసుకుంటూ వివిధ కార్యక్రమాలు ఉంటాయి. వచ్చే ప్రభుత్వంలో టూరిజం శాఖను తీసుకుని రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేయాలని ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు. స్టీఫెన్ రవీంద్ర కొత్త చొక్కా ఇచ్చారు దీక్షా దివస్ సందర్భంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9 వరకు జరిగిన ఘటనలను తలుచుకుంటూ కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. నవంబర్ 29న కేసీఆర్‌ను అరెస్టు చేసి జైలుకు త రలించడం మొదలుకుని, డిసెంబర్ 10 వరకు జ రిగిన పరిణామాలు, తాను వరంగల్ జైలులో గడి పిన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. దీక్ష సమయంలో నిమ్స్ ఆసుపత్రి వద్ద మఫ్టీలో ఉన్న ఓ పోలీసు అధికారి కేసీఆర్ ప్రాణాలకు హాని ఉందంటూ చేసిన హడావుడితో తాను, తనకు టుంబం ఆవేదన పడిన తీరును వివరించారు. కేంద్రం రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన కస రత్తు, దీక్ష విరమణ తదితర పరిణామాలను వె ల్లడించారు. ఉద్యమ సమయంలో తన చొక్కా చింపిన పోలీ సు అధికారి స్టీఫెన్ రవీంద్ర తర్వాత కొత్త చొక్కా పంపిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నారు. -
వార్ రూం... వేదికగా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో నేటి పోలింగ్ ప్రక్రియకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పరిస్థితి సానుకూలంగా ఉందన్న అంచనాల నేపథ్యంలో ఆ సానుకూలతను ఓట్ల రూపంలో మార్చుకునే అంశంపై దృష్టి సారించింది. బుధవారమంతా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే గాంధీభవన్ వార్ రూం నుంచి సమీక్షించారు. ఏ నియోజకవర్గంలో ప్రచార తీరు ఎలా ఉందన్న విషయాలను తెలుసుకోవడంతోపాటు పోలింగ్ ఏజెంట్ల నియామకం, పోల్ మేనేజ్మెంట్ లాంటి విషయాలపై అభ్యర్థులతోపాటు నియోజకవర్గాల పరిశీలకులు, సమన్వయకర్తలు, స్థానిక నేతలతో ఆయన టెలి కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ ముగిసేంతవరకు అభ్యర్థులతో సహా కేడర్ పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ఇతర పార్టీల వ్యూహాలు, డబ్బు, మద్యం పంపిణీ లాంటి అంశాలపై దృష్టి సారించి ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ వర్గాలను సంప్రదించాలని సూచించారు. పూజలు... ప్రమాణాలు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గ ప్రజలకు బాండ్‌పేపర్లు రాసిచ్చిన కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగిసిన మరుసటి రోజు దేవుడి సన్నిధిలో పూజలతో ప్రమాణాలు చేశారు. ఉదయం గాంధీభవన్‌కు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, అంజన్‌కుమార్ యాదవ్ కొంతసేపు ప్రచార సరళిపై సమీక్ష జరిపారు. అనంతరం బిర్లామందిర్‌కు వెళ్లి అక్కడ వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఆరు గ్యారంటీలకు మొదటి మంత్రివర్గంలోనే చట్టబద్ధత కల్పిస్తామని, మేనిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రమాణం చేశారు. ఆ తర్వాత నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాకు వెళ్లి ప్రార్థనలు చేశారు. కేటీఆర్‌పై ఫిర్యాదు మంత్రి కేటీఆర్ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రవ్యాప్తంగా దీక్షా దివస్‌ను నిర్వహించాలంటూ ఆయన మీడియాలో పిలుపునివ్వడం, 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ కార్యాలయంలో రక్తదానం లాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీపీసీసీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ జి.నిరంజన్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు లేఖ రాశారు. అదేవిధంగా తెలంగాణలో ఓటు హక్కు ఉండి ఏపీలో నివసిస్తున్న వారిని ఎలాంటి ఆంక్షలు లేకుండా ఏపీ నుంచి తెలంగాణకు వచ్చి ఓటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎవరెక్కడ ఉన్నారంటే...! ఉదయం ప్రత్యేక పూజల అనంతరం రేవంత్‌రెడ్డి.. జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి వెళ్లారు. రాత్రికి కొడంగల్‌కు చేరుకున్నారు. గురువారం కొడంగల్‌లోని జెడ్పీహెచ్ఎస్ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేయనున్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క బుధవారమంతా మధిర నియోజకవర్గంలోనే ఉన్నారు. కార్యకర్తలతో తీరిక లేకుండా భేటీలు జరిపారు. మండలాలు, గ్రామాలు, పోలింగ్ బూత్‌ల వారీగా పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్‌లోని తన నివాసం నుంచి పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ కేడర్‌తో సమీక్షించారు. -
నాడు కేసీఆర్‌ను కాపాడింది మీరే
సాక్షి, హైదరాబాద్: దీక్షాదివస్ సందర్భంగా తెలంగాణ సాధన కోసం 2009లో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు వైద్య సేవలు అందించిన నిమ్స్ వైద్య బృందాన్ని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె.తారక రామారావు బుధవారం సన్మానించారు. ఈ సందర్భంగా వైద్యుల బృందం నాటి సంఘటనలు, అప్పటి భావోద్వేగాలను నెమరు వేసుకున్నారు. 11 రోజులపాటు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళన చెందామని ఆయన ప్రాణానికి ముప్పు కలుగుతుందన్న భయాందోళన తమను వెంటాడేదన్నారు. ఒకవైపు సీఎం ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే మరో వైపు అప్పటి ప్రభుత్వ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన అనేక రకాల ఒత్తిడిలను తట్టుకోవడం తమకు ఒక సవాలుగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఏడు రోజుల తర్వాత కూడా తమ నిరాహార దీక్షను కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందేమోనని భయం కలిగిందన్నారు. అయితే ఆయన శారీరకంగా పూర్తిస్థాయిలో బలహీనంగా మారినా, ఆరోజు తన దీక్ష కొనసాగించే ముందు మానసికంగా అత్యంత దృఢంగా ఉండడంతోనే అన్ని రోజులు దీక్ష కొనసాగించగలిగారని ఆ నాటి పరిస్థితులను గుర్తుకు తెచ్చారు. మా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష సందర్భంగా నిమ్స్ వైద్య బృందం అందించిన సేవలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేటీ రామారావు భావోద్వేగంతో అన్నారు. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కాపాడుకుంటూనే మరోవైపు కుటుంబ సభ్యులుగా కేసీఆర్ ఆరోగ్యం పట్ల తమకు ఆందోళన ఉండేదన్నారు. ఆయన పట్టుదల, మొండితనం వల్లనే నిరాహార దీక్షను కొనసాగించగలిగారని చెప్పారు. అయితే ఒక కుటుంబ సభ్యుడిగా అనేక సందర్భాల్లో ఆందోళనకు గురైనప్పుడు నిమ్స్ వైద్య బృందం అందించిన మనోధైర్యం ఎప్పటికీ మరువలేమన్నారు. అత్యంత సంక్లిష్టమైన సంక్షోభ సమయంలో తమ కుటుంబానికి అండగా ఉండడమే కాకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సజీవంగా నిలిపి స్వరాష్ట్రాన్ని సాకారం చేసేందుకు సహకరించిన వైద్య బృందానికి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపి వారిని సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. -
తెలంగాణలో నేడు ఓట్ల పండుగ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఓటర్లు తీర్పు ఇచ్చే రోజు వచ్చేసింది. గురువారం ఉదయం నుంచే పోలింగ్ మొదలుకానుంది. ఈ మేరకు సర్వం సిద్ధం చేసినట్టు ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. వామపక్ష తీవ్రవాద ప్రభావమున్న 13 స్థానాల పరిధిలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. మిగతా 106 చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. మిగతా ప్రక్రియల పూర్తి అనంతరం డిసెంబర్ 5తో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. మూడు కోట్లకుపైగా ఓటర్లు రాష్ట్రంలో 1,63,01,705 మంది మహిళలు, 1,62,98,418 మంది పురుషులు, 2,676 మంది మూడో జెండర్ ఓటర్లు కలిపి మొత్తంగా 3,26,18,205 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో కలిపి 2,067 మంది పురుష అభ్యర్థులు, 222 మంది మహిళా అభ్యర్థులు, మూడో జెండర్ అభ్యర్థి ఒకరు కలిపి మొత్తం 2,290 మంది ఎన్నికల్లో పోటీపడుతున్నారు. ఏ పార్టీల నుంచి ఎంత మంది అభ్యర్థులు? రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ పోటీచేస్తోంది. కాంగ్రెస్ 118 సీట్లలో, ఆ పార్టీ పొత్తుతో సీపీఐ ఒకచోట బరిలో ఉన్నాయి. మరో కూటమిలో భాగంగా బీజేపీ 111, జనసేన 8 స్థానాల నుంచి పోటీ చేస్తున్నాయి. బీఎస్పీ 107 చోట్ల, ఎంఐఎం 9 చోట్ల, సీపీఎం 19 చోట్ల, సీపీఐఎల్(న్యూడెమోక్రసీ) ఒకచోట తలపడుతున్నాయి. – ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి 41 మంది, ధర్మసమాజ్ పార్టీ నుంచి 101 మంది, జైమహాభారత్ పార్టీ నుంచి 13 మంది, రాష్ట్రీయ సామాన్య ప్రజాపార్టీ నుంచి నలుగురు, ఇతర పార్టీల నుంచి మరో 659 మంది, స్వతంత్రులు 989 మంది ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. – నియోజకవర్గాల వారీగా చూస్తే.. అత్యధికంగా ఎల్బీనగర్ నుంచి 48 మంది, గజ్వేల్ నుంచి 44 మంది, కామారెడ్డి, మునుగోడుల నుంచి 39 మంది చొప్పున పోటీపడుతుండగా.. అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడల్లో ఏడుగురు చొప్పున, బాల్కొండలో 8 మంది బరిలో ఉన్నారు. 35,655 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు రాష్ట్రంలో 299 అనుబంధ పోలింగ్ కేంద్రాలు సహా మొత్తం 35,655 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 27,094 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షించనున్నారు. ఎక్కువ పోలింగ్ కేంద్రాలున్న 7,571 ప్రాంతాల్లో బయటి పరిసరాలను సైతం వెబ్‌కాస్టింగ్ చేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ తెలిపారు. మిగతా పోలింగ్ కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాలు, వీడియోగ్రాఫర్లు, ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్‌ట్యాప్‌లతో విద్యార్థులు పోలింగ్ ప్రక్రియను రికార్డు చేయనున్నారు. రికార్డు చేసిన డేటాను ప్రిసైడింగ్ అధికారులు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి అప్పగిస్తారు. పటిష్టంగా బందోబస్తు పోలింగ్ రోజు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 45వేల మంది రాష్ట్ర పోలీసులు, మరో 3వేల మంది అటవీ/ఆబ్కారీ సిబ్బంది, 50 కంపెనీల టీఎస్ఎస్పీ, 375 కంపెనీల కేంద్ర బలగాలను మోహరిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి వచ్చిన 23,500 మంది హోంగార్డులు కూడా బందోబస్తు విధుల్లో పాల్గొంటున్నారు. దివ్యాంగ ఓటర్లకు ప్రత్యేక సదుపాయాలు దివ్యాంగ ఓటర్లు సులువుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బ్రెయిలీ లిపిలో 76,532 ఓటరు స్లిప్పులు, 40 వేల ఓటర్ గైడ్స్, 40 వేల డమ్మీ బ్యాలెట్ పేపర్లను ముద్రించి అంధ ఓటర్లకు పంపిణీ చేశారు. శారీరక వికలాంగులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తరలించడానికి ఆటోలను ఏర్పాటు చేయనున్నారు. వారికోసం పోలింగ్ కేంద్రాల వద్ద 21,686 ట్రై సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ర్యాంపులను ఏర్పాటు చేశారు. ఉదయం 5.30 గంటలకు మాక్ పోలింగ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) వికాస్‌రాజ్ నేతృత్వంలో దాదాపు ఏడాది నుంచీ ఏర్పాట్లు జరిగాయి. ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఓటర్ల జాబితా సవరణ, ఈవీఎంలను సంసిద్ధం చేయడం, ఎన్నికలు/ పోలింగ్ అధికారులు, సిబ్బంది నియామకం/శిక్షణ, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఓటర్లకు సదుపాయాల కల్పన, భద్రతా ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తిచేసింది. మొత్తం 2,00,433 మంది అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అన్నిజిల్లాల్లో పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఈవీఎంలు, ఇతర పోలింగ్ సామాగ్రిని తీసుకుని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని సీఈఓ కార్యాలయం బుధవారం అర్ధరాత్రి ప్రకటించింది. వారంతా రాత్రి పోలింగ్ కేంద్రాల్లోనే బస చేస్తారు. ప్రిసైడింగ్ అధికారులు గురువారం ఉదయం 5.30 గంటలకు పోల్ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్ పోలింగ్ నిర్వహిస్తారు. తర్వాత కంట్రోల్ యూనిట్‌లోని మెమరీ డిలీట్ చేసి, వీవీ ప్యాట్ కంటైనర్ బాక్స్ నుంచి మాక్ ఓటింగ్ స్లిప్పులను తొలగిస్తారు. పోలింగ్ శాతం మళ్లీ పెరగాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,80,64,684 మంది ఓటర్లకు గాను 2,05,80,470 (73.2 %) మంది ఓటేశారు. 1,41,56,182 మంది మొత్తం పురుష ఓటర్లకు గాను 1,03,17,064 (72.54%) మంది, 1,39,05,811 మంది మొత్తం మహిళా ఓటర్లకు గాను 1,02,63,214(73.88%) మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2691 మంది మూడో జెండర్ ఓటర్లలో కేవలం 192 (8.99%) మంది మాత్రమే ఓటేశారు. 2014 అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో కేవలం 69.5శాతం పోలింగ్ మాత్రమే నమోదైంది. 2014 ఎన్నికలతో పోల్చితే 2018 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగింది. ప్రస్తుత ఎన్నికల్లో కూడా పోలింగ్ శాతం మరింతగా పెంచేందుకు ఓటర్లందరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేయాలని ఎన్నికల యంత్రాంగం పిలుపునిచ్చింది. -
ఓటేసేందుకు ఊరి బాట..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికల్లో ఓటేసేందుకు చాలామంది హైదరాబాద్ వాసులు సొంతూళ్ల బాట పట్టారు. పోలింగ్ రోజు గురువారం(నవంబర్30)న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో సొంతూళ్లలో ఓట్లున్నవారు స్వస్థలాలకు పయనమయ్యారు. ఒక్కసారిగా నగర వాసులు సొంతూళ్లకు బయలుదేరడంతో నగరంలోని ఎంజీబీఎస్, జేబీఎస్ బస్ స్టేషన్లు రద్దీగా మారాయి. పండగల ముందురోజుల్లో ఉన్నట్లుగా కిక్కిరిసిపోయాయి. బస్సులన్నీ నిండిపోవడంతో సీట్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఎలాగైనా ఊరెళ్లి ఓటెయ్యాలన్న ఉద్దేశంతో సీట్లు దొరకకపోయిన బస్సుల్లో నిల్చొని ప్రయాణించేందుకూ సిద్ధమవుతున్నారు. ఓటేసేందుకు స్వచ్ఛంధంగా ఊళ్లకు వెళ్లే వారు కొందరైతే పార్టీల పోల్ మేనేజ్మెంట్ ఎఫెక్ట్‌తో ఊరి బాట పట్టేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఊళ్లలోని ప్రధాన పార్టీల స్థానిక నాయకులు ఫోన్లు చేసి మరీ హైదరాబాద్‌లో ఉంటున్న ఆయా ఊళ్లకు సంబంధించిన వారిని ఓటేసేందుకు రమ్మని పిలుస్తున్నట్లు సమాచారం. దీంతో సొంత నియోజకవర్గాల్లో తమ అభిమాన పార్టీని, నాయకుడిని గెలిపించుకునేందుకు నగరవాసులు స్వస్థలాలకు బయలుదేరారు. హైదరాబాద్‌కు ఉద్యోగ,వ్యాపార రీత్యా, ఇతరకారణాలతో వచ్చి నివసిస్తున్న వారిలో చాలా మందికి నగరంలో ఓటు హక్కు లేదన్న విషయం తెలిసిందే. వీరంతా తమ ఓటును సొంతూళ్లలోనే నమోదు చేయించుకున్నారు. పోలింగ్ రోజు ఓటేయ్యకుండా హైదరాబాద్‌లో ఉండటానికి వీరు సాధారణంగా ఆసక్తి చూపరు. ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లో తమ స్వస్థలాల్లో వినియోగించుకోవాలని చాలా మంది ఊరి బాట పట్టారు. ఇదీచదవండి..తెలంగాణ పోలింగ్‌కు వరుణగండం? -
ఓటేయండి.. సెల్ఫీ తీసుకోండి.. సాక్షికి పంపండి
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు మరికొద్ది గంటల్లో పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఓటేసే వారికోసం సాక్షి. కామ్ సెల్ఫీ కాంటెస్ట్ నిర్వహిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఓటేసిన తర్వాత మీ స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీ తీసుకుని ఈ నంబర్‌కు (9182729310) వాట్సాప్ చేయడమే. అందులోంచి నాణ్యత ఉన్న ఫోటోలను ఎంపిక చేసి సాక్షి. కామ్‌లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫోటో గ్యాలరీలు గ్యాలరీ -4 గ్యాలరీ -3 గ్యాలరీ -2 గ్యాలరీ -1 -
'అధ్యక్షా..!' అనేదెవరో?
సాక్షి, వరంగల్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఓ ప్రత్యేకత కలిగి ఉంది. ఇక్కడి నుంచి మూడు ప్రధాన పార్టీల అధ్యక్షులు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆయా పార్టీల ప్రెసిండెట్లు తలపడుతుండగా పోటీ రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఈ ముగ్గురిలో ఎవరు గెలుపొంది అసెంబ్లీలో అధ్యక్షా.. అంటారో అనే విషయంలో ఆయా పార్టీల నేతలతోపాటు ఓటర్లలోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ నాలుగు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నుంచి విజయం సాధించి, ఐదో విజయం కోసం ధీమాగా ముందుకు సాగుతున్నారు. ఇక.. కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి తొలిసారి పార్టీ అభ్యర్థిత్వం దక్కించుకుని అసెంబ్లీలో అడుగిడడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అదే విధంగా బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి తొలిసారి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురు విజయం కోసం ఎవరికి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఐదో విజయం కోసం దాస్యం వినయ్ భాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ ఐదో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల్లో, 2010 ఉప ఎన్నికల్లో, 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు, తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏకైక ఎమ్మెల్యేగా ఉద్యమకారులకు అండగా నిలవడం, ఉద్యమకారుడిగా ప్రజల్లో గుర్తింపు ఉండడం, నిత్యం వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజల ముంగిటికి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం వినయ్ భాస్కర్‌కు కలిసొచ్చే అంశాలు. ప్రధానంగా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బబ్దిదారులతో పాటు నియోజకర్గంలో వైద్య చికిత్స కోసం పెద్ద మొత్తంలో సీఎంఆర్ఎఫ్ నుంచి సాయం అందించారు. కార్మికులకు సొంతగా ప్రీమియం చెల్లించి వారికి గుర్తింపు కార్డులు ఇప్పించి బీమా సౌకర్యం కల్పించారు. దీంతోపాటు ఈ నెల 28న నిర్వహించిన సభకు సీఎం కేసీఆర్ రావడంతో తాను గెలుస్తాననే ధీమాలో ఉన్నారు. మొదటిసారి శాసనసభకు నాయిని రాజేందర్ రెడ్డి పోటీ.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న నాయిని రాజేందర్ రెడ్డి మొదటిసారి శాసన సభ ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడిన సమయంలో కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచారు. ఉమ్మడి వరంగల్, జిల్లాల పునర్విభజన తర్వాత హనుమకొండ, వరంగల్ జిల్లాలో పార్టీని కాపాడి ఈసారి టికెట్ సాధించారు. 2014, 2018లో పార్టీ టికెట్ ఆశించారు. ఆ రెండు సార్లు రాకపోయినా పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. ఈసారి అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించడంతో బరిలో దిగారు. నిత్యం ప్రజల మధ్య ఉండడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ, నాలుగు పర్యాయాలుగా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యేగా ఉండి ఆయనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకత నాయిని రాజేందర్ రెడ్డికి అనుకూలించే అంశాలు. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, జార్ఖండ్ సీఎం బూపేష్ భఘేల్, సినీ నటి విజయ శాంతి చేసిన ప్రచారం తనకు విజయం చేకూరుస్తుందనే విశ్వాసంతో ఉన్నారు. 'పద్మ' విశసించేనా..!? వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన రావు పద్మ, పశ్చిమ నుంచి తొలిసారి పోటీ చేస్తున్నారు. కాగా, రావు పద్మ 2014 ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నుంచి టికెట్ అశించి చివరకు వరంగల్ తూర్పు నుంచి పోటీ చేసి ఓటమి పొందారు. వరంగల్ మహానగరంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్మార్ట్ సిటీ, అమ్మత్, హృదయ్ పథకాల ద్వారా జరిగిన అభివృద్ది, రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, స్థానిక ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న అసంతృప్తి, కాజీపేటలో రైల్వే ఓవరాయిలింగ్ యూనిట్, వ్యాగన్ తయారీ పరిశ్రమ మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పనకు అవకాశం, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం, ప్రధాని మోదీకి ప్రజాదరణ ఉండడం, డబుల్ ఇంజన్ సర్కార్‌తో అభివృద్ధి, మహిళల ఓట్లు వంటివి రావు పద్మకు కలిపోచ్చే అంశాలు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు, పవన్ కళ్యాణ్ రాక, బీజేపీ నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి, మంత్రి సాద్వి నిరంజన్ జ్యోతి, ఇతర అగ్ర నాయకుల ప్రచారం చేయడం వల్ల రావు పద్మ తాను గెలుస్తాననే నమ్మకంతో ఉన్నారు. ఇవి చదవండి: జంగ్ తెలంగాణ: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది! -
రేపు సెలవు ఇవ్వడం లేదు.. ఈసీకి వరుస ఫిర్యాదులు
హైదరాబాద్: రేపు (నవంబర్ 30) జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు వెల్లువెత్తాయి. నగరంలోని పలు ఎంఎన్సీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్‌కు సంబంధించిన ఓటర్ హెల్ప్‌లైన్ 1950 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఓటేసేందుకు గురువారం తమ కంపెనీల యాజమాన్యాలు సెలవు ఇవ్వడం లేదని వాపోతున్నారు. పని చేయాల్సిందేనంటూ ఒత్తిడి తెస్తున్నారని, ఉద్యోగం కావాలా? ఓటు కావాలా? అంటున్నారని సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ ఓటు వేసేలా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అయితే కొన్ని ప్రైవేటు కంపెనీల యాజమాన్యాలు తమకు సెలవు ఇవ్వడం లేదంటూ ఉద్యోగులు ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. -
మహ్మద్ అజారుద్దీన్‌పై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్ధీన్‌పై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణంతో ఫిల్మ్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో రేపు పోలింగ్ జరగనుంది. ఇన్నిరోజుల నుంచి రాజకీయ పార్టీలు ముమ్మరంగా సాగించిన ఎన్నికల ప్రచారానికి మంగళవారమే తెరపడింది. ప్రచారానికి గడువు ముగిసిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తే.. చట్టపరమైన చర్యలను ఈసీ తీసుకుంటుంది. -
మంత్రి కేటీఆర్‌పై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భవన్లో మంత్రి కేటీఆర్ చేస్తున్న దీక్ష దివస్‌పై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉన్న టైమ్ లో దీక్ష దివస్ చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తక్షణమే దీక్షా దివస్‌ను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. తెలంగాణ భవన్లో నేడు దీక్షా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అనే నినాదాన్ని ఇచ్చి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది దీక్షా దివస్‌ను జరుపుతున్నారు. ఎన్నికల సందర్భంగా కార్యక్రమం జరపడంపై ఈసీ ఆంక్షలు విధించింది. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో వేడుకలు నిర్వహించరాదని సూచించింది. దీంతో, తెలంగాణ భవన్‌కు ఎన్నికల కమిషన్ స్వ్కాడ్ టీమ్ చేరుకుని.. కార్యక్రమాన్ని నిలిపివేయాలని కోరింది. ఇది కొత్త కార్యక్రమం కాదని.. ఎప్పటి నుంచో చేస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు, లీగల్ టీమ్ సూచించారు. అనంతరం, డీసీపీతో కూడా వారు మాట్లాడారు. దీంతో, ఈ కార్యక్రమాన్ని బహిరంగంగా కాకుండా తెలంగాణ భవన్ లోపల నిర్వహించుకోవాలని వారికి పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలో భవన్ లోపలే కార్యక్రమం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక, కమిషన్ సూచనల మేరకు తెలంగాణ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించినట్టు సమాచారం. ఇక, వేడుకల కోసం కేటీఆర్ తెలంగాణ భవన్‌కు వెళ్లారు. దీక్ష దివస్ సందర్భంగా కేటీఆర్ రక్తదానం చేశారు. ఇదీ చదవండి: తెలంగాణ భవన్ వద్ద భారీగా పోలీసుల మోహరింపు.. -
TS Elections: పోలింగ్ శాతం పైకా? కిందకా?
రేపే తెలంగాణలో పోలింగ్. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత చూసుకుంటే మూడోసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి (సాంకేతికంగా రెండోసారే). పైగా రెండు దఫాలుగా అధికారంలో కొనసాగిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా? లేదంటే ప్రజా తీర్పు మరోలా ఉండనుందా? అనే చర్చా రాజకీయ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఓటర్లు ఏమేర పోటెత్తుతారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తెలంగాణ ఏర్పాటు కంటే ముందు ఉమ్మడి రాష్ట్రంలో 1983 నుంచి జరిగిన ఎన్నికల్లో ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. సగటున 67.57% పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నేపథ్యంతో 2014లో జరిగిన ఎన్నికలు ఉమ్మడి రాష్ట్రంలోనే జరిగాయి. పైగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలతో కలిపే జరిగాయి. అయితే పది జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రాంతంలో అప్పటికి 2.81 కోట్ల ఓటర్లు ఉండగా.. దాదాపు 74 శాతం నమోదు అయ్యిందని అప్పటి ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్ ప్రకటించారు. సొంత రాష్ట్ర కల నెరవేరిన జోష్‌లో ఓటు హక్కు అత్యధికంగా సంఖ్యలో వినియోగించుకున్నారనే విశ్లేషణలు నడిచాయి. కానీ, అసెంబ్లీ ఎన్నికల కోసం కేవలం 69.5 శాతమే ఓటింగ్ నమోదు అయ్యిందని ఆ తర్వాత రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. మరోవైపు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ వివరాల్ని వెల్లడించిన అప్పటి ఎన్నికల అధికారి రజత్‌కుమార్ 73.20 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని ప్రకటించారు. ఆ సమయంలో గ్రామీణ ఓటింగ్ ఎక్కువగా నమోదు అయ్యింది. అర్బన్ ఓటర్లు చాలావరకు ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. ఇక ఇప్పుడు 2023 ఎన్నికల విషయానికొస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా 3.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన గతంలో కంటే మెరుగ్గా జరిపినట్లు .. అలాగే ఓటు హక్కు వినియోగంపైనా అవగాహన కల్పించినట్లు చెబుతోంది. మరోవైపు దివ్యాంగులు, 80 ఏండ్లు దాటిన వారికి ఓట్ ఫ్రమ్ ఓటు ద్వారా ఇంటి వద్దనే ఓటుహక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా 28 వేల మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు కూడా. అన్నింటికి మించి 10 లక్షల కొత్త ఓటర్లు ఈసారి ఓటేయబోతున్నారు. ఈ క్రమంలో మునుపెన్నడూ లేనివిధంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడా పోలింగ్ శాతం పెంపుదలపై దృష్టి సారించడం గమనార్హం. ఇలా ఎలా చూసుకున్నా.. ఈసారి అత్యధిక ఓటింగ్ నమోదు కావొచ్చని.. అందునా అర్బన్ ఓటింగ్ శాతం పెరుగుతుందని ఈసీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. -
పాలకుర్తిని వీడాలని ఝాన్సీరెడ్డికి నోటీసులు
పాలకుర్తి: ఎన్నికల ప్రచార గడువు ముగిసిన నేపథ్యంలో స్థానికేతరులు పాలకుర్తి నియోజకవర్గాన్ని వీడాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్, ఎన్ఆర్ఐ ఝాన్సీరెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేయడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది. మంగళవారం రాత్రి డీఎస్పీ వెంకటేశ్వరబాబు తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయానికి వెళ్లి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఇదెక్కడి అన్యాయమంటూ ఝాన్సీరెడ్డి పోలీసులను ప్రశ్నించారు. తన కోడలు యశస్వినిరెడ్డిని బరిలో నిలిపానని, తాను నియోజకవర్గంలోని చెర్లపాలాన్ని దత్తత తీసుకున్నానని, ఇక్కడ పన్నులు కడుతున్నానని, తనను నియోజకవర్గం వీడాలనడం సరికాదన్నారు. కుట్ర పూరితంగా తనకు నోటీసులు జారీ చేశారన్నారు. దీనికి మంత్రి దయాకర్‌రావు బాధ్యత వహించాలన్నారు. కనీసం ఆడవాళ్లు అని చూడకుండా ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించారు. -
TS: నేతల నసీబ్ మార్చేసే నియోజకవర్గం ఇది!
సాక్షి, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. జిల్లా అంతటా పోటీ చేసి గెలుపొందారు. రాష్ట్ర స్థాయిలో చక్రం తిప్పారు. ఒకే నియోజకవర్గం నుంచి ఎదిగి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆ నియోజకవర్గం ఏదో చూద్దాం. అక్కడ నుంచి ఎదిగి చక్రాలు తిప్పిన ఆ నేతలపై ఓ లుక్కేద్దాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎన్నికల సమయంలోనే ఆ ప్రత్యేకతలు బయటకొస్తాయి. ప్రచారం పొందుతాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్థన్నపేట నియోజకవర్గం అలాగే ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. ఈ నియోజకవర్గం నుంచి ఎందరో నేతలు ఎదిగారు. ఓరుగల్లు జిల్లా అంతటా విస్తరించారు. అన్ని చోట్ల నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలుపొందారు. రాష్ట్ర మంత్రులయ్యారు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చక్రాలు తిప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎర్రబెల్లి దయాకరరావు, ఎర్రబెల్లి వరదరాజేశ్వరరావు, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, బోయినపల్లి వినోద్‌కుమార్, కడియం శ్రీహరి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వన్నాల శ్రీరాములు...ఇలా చాలా మంది నేతలు వర్థన్నపేట నియోజకవర్గానికి చెందినవారే. వీరిలో పురుషోత్తమరావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వర్ధన్నపేట శాసనసభ నియోజకవర్గం పట్టణం, పల్లెలు కలిసి వరంగల్ మహానగరం చుట్టూ విస్తరించి ఉంది. వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో ఉన్న వర్ధన్నపేట నియోజకవర్గం ఆధ్యాత్మిక, వాణిజ్య, వైద్య, విద్యరంగాల్లో పేరుగాంచింది. వర్ధన్నపేట, పర్వతగిరి, ఐనవోలు, హనుమకొండ, ఖిలావరంగల్, కాజీపేట, హసన్‌పర్తి, వరంగల్ మండలాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వర్ధన్నపేట నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో జరిగిన పునర్విభజనలో వర్థన్నపేట ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కొండేటి శ్రీధర్ విజయం సాధించారు. 2014, 2018 ఎన్నికల్లో తెరాస తరపున బరిలో నిలిచిన అరూరి రమేశ్ గెలుపొందారు. హ్యాట్రిక్ సాధిస్తానంటూ మూడోసారి ఆరూరి రమేష్ వర్థన్నపేట నుంచి బరిలో దిగారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటూ.. పాలకుర్తి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచి 4వ సారి బరిలో నిలిచిన ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీఎంపి బోయినపల్లి వినోద్‌కుమార్, మాజీ మంత్రి పురుషోత్తమరావు స్వగ్రామం వర్థన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సొంత గ్రామం ఇదే నియోజకవర్గంలోని ఐనవోలు మండలం పున్నేలు. ఇలా ఎందరో ప్రముఖ నాయకులను అందించిన గడ్డగా వర్థన్నపేట రాష్ట్రంలోనే పేరు పొందింది. ఇవి చదవండి: గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్ -
ఈ నియోజకవర్గ ఓటర్లు చరిత్ర తిరగరాస్తారా?
ఆ నియోజకవర్గ ఓటర్ల తీర్పు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయం ముఖచిత్రంలో ఆసక్తికర చర్చగా మారింది. ఎంతటి ఉద్దండులైనా సరే, ఒక్కసారికి మించి గెలిచిన చరిత్ర లేదు. ఏదో ఒక కారణంతో వారికి పదవి గండం తప్పడం లేదు. మరి ఈ సారి పోటీ చేసే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆ చరిత్ర తిరగ రాస్తారా.. మళ్లీ గెలుపు యోగం ఉందా.. అక్కడి ప్రజల తీర్పు ఎలా ఉండబోతుంది. రాజకీయ చైతన్యానికి, ప్రజా పోరాటాలకు కేరాఫ్ అడ్రస్ ఓరుగల్లు. ఎంతోమంది గొప్ప గొప్ప నేతలకు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ ఈ అడ్డ. అలాంటి ఓరుగల్లు గడ్డపైన ఓ విచిత్ర తీర్పు ఆసక్తికరంగా మారింది. అదే వరంగల్ నియోజకవర్గం. వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత ఎవరైనా ఒక్కసారికి మించి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిన చరిత్ర లేదు. మంచి మంచి దిగ్గజాలకు కూడా ఇక్కడ రెండోసారి ఓటమి తప్పలేదు.వరంగల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గంగా రూపాంతరం చెందింది. 2009లో అప్పటి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య ఇక్కడి నుండి గెలుపొందారు. నియోజకవర్గం పునర్విభజనకు ముందు వరుసగా మూడు పర్యాయాలు గెలిచిన ఆయన, 2014 ఎన్నికల్లో కొండా సురేఖ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బస్వరాజు సారయ్య కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఊహించని పరిణామాలు నేపథ్యంలో 2018 ఎన్నికల్లో కొండా సురేఖకు టిక్కెట్ దక్కలేదు. దీంతో బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరారు కొండా సురేఖ దంపతలు.. ఏకంగా ఈ నియోకవర్గాన్నే వదిలి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2018 లో పరకాల నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే 2009 నుంచి ఇప్పటి వరకు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచినవారు లేరు. ఇక, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నన్నపునేని నరేందర్ ఇక్కడి నుండి గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నరేందర్ తిరిగి మళ్లీ అధికార బీఆర్ఎస్ పార్టీ నుండి టిక్కెట్ సాధించి బరిలోకి దిగారు. ఆయనపై సొంత పార్టీలోనే ఇప్పుడు తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవడం ఓరుగల్లు హాట్ టాపిక్ గా మారింది. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుందా. అనే చర్చ జరుగుతుంది. వరంగల్ తూర్పులో కొనసాగుతున్న చరిత్ర రిపీట్ అవుతుందా. సిట్టింగ్ ఎమ్మెల్యే నరేందర్ ఆ చరిత్ర ను తిరగ రాస్తారా. అనే చర్చ ఇప్పుడు ఓరుగల్లు వాసుల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
పోటీలో సీనియర్లు.. గండం గట్టెక్కాలంటే గెలిచి తీరాల్సిందే.. లేదంటే!
ఎన్నికల్లో గెలవడం లేదా ఓడిపోవడం అనేది మామూలు విషయమే. కాని పదే పదే ఓడిపోయే నేతలకు రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. అందుకే ఈసారి చాలా మంది నేతలు చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్నారు. ఇప్పుడు ఓడితే వచ్చేసారి టిక్కెట్ రాదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. అందుకే కసితో ఎన్నికల పోరాటంలో పాల్గొంటున్నారు. ఓటమి నుంచి తప్పించుకునేందుకు అన్ని మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ వారెవరు? ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి గెలవాలనే అనుకుంటారు. అందుకోసమే శ్రమిస్తారు. అయతే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే కొందరు అభ్యర్థులకు మాత్రం జీవన్మరణ సమస్యగా మారింది. ఇప్పటికే రెండు లేదా మూడుసార్లు ఓడిపోయినా.. ఆయా పార్టీలు వారికి ఈసారికి అవకాశం ఇచ్చాయి. ఇప్పుడు గనుక ఓడిపోతే..ఇక తమ రాజకీయ జీవితం ఖతం అయిపోయినట్లే అనే భయం ఆ అభ్యర్థులను వెంటాడుతోంది. ఇలా రెండు, మూడు సార్లు ఓడిపోయి.. ఇప్పుడు బరిలో దిగినవారు అధికార బీఆర్ఎస్లో మాత్రం పెద్దగా లేరు. కాంగ్రెస్, బీజేపీల్లో ఇటువంటి అభ్యర్థులు ఎక్కువగానే ఉన్నారు. ఇప్పుడు వారందరి గుండెళ్ళో రైళ్ళు పరుగెడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నవారిలో ఏడెనిమిది మంది అభ్యర్థులు రెండు మూడు సార్లుగా వరుసగా ఓడిపోతున్నవారే. గత రెండు ఎన్నికల్లో కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఇప్పుడు నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా నిజామాబాద్‌లో గెలిచి తీరాలనే పట్టుదలతో ప్రచారం చేస్తున్నారు. ఇక కరీంనగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ ది ఇదే పరిస్థితి.. ఈసారి సింపతితో గెలుస్తా అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు లక్ష్మణ్. ఇప్పటికే మూడు సార్లు ఓడిన ఆది శ్రీనివాస్ మరోసారి వేములవాడ బరిలో దిగుతున్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిన పొన్నం ప్రభాకర్ ఆ తర్వాత ఎంపీగా ఓడిపోయారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన పొన్నం ప్రభాకర్ ఈసారి ఎలాగైనా గెలవాలని వ్యూహాలకు పదును పెడుతున్నారు. గండ్ర సత్యనారాయణ, గడ్డం ప్రసాద్, కేఎల్ఆర్, ప్రేమ్ సాగర్ రావు లాంటి నేతల పరిస్థితి ఇదే. ఇప్పటికే రెండు మూడు సార్లు ఓడిన నేతలు రాజకీయంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక బీజేపీ లోను కొందరు నేతల పరిస్థితి ఇలాగే ఉంది. సనత్ నగర్ నుంచి ఇప్పటికే పలుమార్లు అదృష్టం పరిక్షించుకున్న సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి మరోసారి బీజేపీ అభ్యర్థిగా సనత్ నగర్ బరిలో దిగారు. ఇది నాకు చివరి ఎన్నిక అని ప్రచారం చేస్తున్నారట మర్రి. మరోనేత మహేశ్వర్ రెడ్డి వరుసగా రెండు సార్లు ఓటమి పాలయ్యి ఈ సారి మళ్ళీ నిర్మల్ బరిలో దిగారు. తల్లోజు ఆచారి పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో విజయం గుమ్మం దాకా వచ్చినట్లే వచ్చి వెనక్కి పోయింది. ఈ సారి గెలుపు పై ఆచారి ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీనగర్ అభ్యర్థి సామ రంగారెడ్డి కూడా వరుస ఓటములతో చతికిల పడ్డారు. సూర్యాపేట నుంచి బరిలో ఉన్న సంకినేని వెకటేశ్వరరావు , రామచందర్ రావు, కూన శ్రీశైలం గౌడ్ లది ఇదే పరిస్థితి. అన్ని పార్టీల్లోనూ 15 నుంచి 20 మంది రెండు లేదా మూడు సార్లు వరుసగా ఓడిపోయారు. అందుకే ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడుతున్నారు. ఇప్పుడు గనుక ఓడితే ఇక తమ రాజకీయ భవిష్యత్తుకు ఎండ్ కార్డ్ తప్పదని వారంతా ఆందోళన చెందుతున్నారు. మరి ప్రజలు వారిపట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.