breaking news
-
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈసీ గుడ్‌న్యూస్ !
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు డీఏ విడుదల చేసేందుకు ఎన్నికల సంఘం(ఈసీ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగులకు మొత్తం మూడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఒకటి రిలీజ్ చేసేందుకు అనుతివ్వాల్సిందగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈసీని కోరింది. డీఏ చెల్లింపులు ఎందుకు ఆలస్యమయ్యాయని, ఇప్పుడే ఎందుకివ్వాల్సి వస్తోందని ఈసీ ప్రభుత్వాన్ని అడిగినట్లు తెలిసింది. దీనికి ప్రభుత్వ సమాధానం సంతృప్తికరంగా ఉండటంతో డీఏ విడుదలకు ఈసీ ఓకే అంది. కాగా, ప్రభుత్వంతో పాటు ఉద్యోగసంఘాలు కూడా డీఏ విడుదలపై ఈసీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశాయి. ఇప్పటికే రాష్ట్రంలో పోలింగ్ ముగిసినందున ఈసీ వారి విజ్ఞప్తికి అంగీకరించింది. ఇదీచదవండి..కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా..నాది మెరిట్ కోటా : రేవంత్‌రెడ్డి -
కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా : రేవంత్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: రాజకీయాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ది మేనేజ్మెంట్ కోటా అని, తనది మెరిట్ కోటా అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కౌంటింగ్‌కు ఒకరోజు ముందు శనివారం రేవంత్ ఇంటి వద్ద ఆయన అభిమానులు రేవంత్ సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు, కేటీఆర్‌కు మధ్య ఎలాంటి పోలికా లేదని కాంగ్రెస్ రాజకీయ పోరాటమంతా కేసీఆర్‌తోనేనని రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షునిగా, మల్కాజిగిరి ఎంపీగా ఉన్న రేంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే వెల్లడైన తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు దాదాపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్ పార్టీలోనే కొందరు రేవంత్‌రెడ్డి సీఎం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. బక్క జడ్సన్ లాంటి ఎస్సీనేత రేవంత్‌కు సీఎం పదవి ఇవ్వొద్దు అని ఇప్పటికే పార్టీ అధిష్టానానికి ప్లకార్డులు ప్రదర్శించి మరీ విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుని కాంగ్రెస్‌కు మద్దతిచ్చిన వైఎస్ఆర్టీపీ అధినేత వైఎస్ షర్మిల కూడా పరోక్షంగా రేవంత్ సీఎం అభ్యర్థిత్వాన్ని తోసిపుచ్చారు. పార్టీలో ఆయనకన్నా విశ్వసనీయత కలిగిన నేతలున్నారని మీడియా సమావేశంలోనే డైరెక్టుగా చెప్పారు. ఇదీచదవండి..రంగంలోకి డీకే.. స్పెషల్ ఫ్లైట్లు రెడీ! -
రాహుల్ వ్యాఖ్యల మర్మమేంటి?.. సీఎంగా సీతక్క?
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా రేపు(ఆదివారం) నాలుగు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవునున్నాయి. ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. ఇక, అందరి దృష్టి ముఖ్యంగా తెలంగాణ ఫలితాలపైనే ఉంది. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా? లేక, కర్ణాటకలో మాదిరిగా కాంగ్రెస్ భారీ మెజార్టీతో గెలుస్తుందా? అనే చర్చ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి. ఇంతకీ రాహుల్ ఏమన్నాడంటే.. కాగా, శుక్రవారం కేరళలోని కొచ్చిలో మహిళా కాంగ్రెస్ నేతల సదస్సు ‘ఉత్సాహ్’ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణంలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, వారిని మరింత ప్రోత్సహించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. పార్టీలో ఇంకా చాలా మంది మహిళా నాయకులను తయారు చేయాలని, దేశంలో వచ్చే పదేళ్లలో 50 శాతం మంది మహిళా ముఖ్యమంత్రులు ఉండాలన్నదే తమ కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మహిళా ముఖ్యమంత్రి ఎవరూ లేరని అన్నారు. ముఖ్యమంత్రులు కావడానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగిన మహిళా నాయకులు కాంగ్రెస్‌లో ఎంతోమంది ఉన్నారని చెప్పారు. ప్రయత్నించాలి, లక్ష్యం సాధించాలి అని సూచించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రేవంత్ వ్యాఖ్యల వెనుక.. అయితే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సపోర్టుగా ఒకానొక సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే.. ములుగు ఎమ్మెల్యే సీతక్కను సీఎంను చేస్తామని కామెంట్స్ చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. దీంతో, సీతక్కను ముఖ్యమంత్రిని చేస్తారా? అనే అంశం తెరపైకి వచ్చింది. ఇక, సీతక్క విషయానికి వస్తే.. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ములుగు ఏజెన్సీ నుంచి గెలిచి.. అసెంబ్లీ వేదికగా పలుమార్లు బీఆర్ఎస్పై ప్రశ్నల వర్షం కురిపించారు. పలు సందర్బాల్లో సీతక్కను బీఆర్ఎస్ సభ్యులు సైతం అభినందించిన ఘటనలు ఉన్నాయి. మరోవైపు.. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లును మద్దుతిస్తున్న సమయంలో కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. రాజకీయంగా మహిళలకు మద్దతివ్వాలన్నారు. కానీ, ఎన్నికల విషయం వచ్చే సరికి.. తెలంగాణలో కేవలం 11 మంది మహిళా అభ్యర్థులకు మాత్రమే సీట్లు ఇచ్చారు. దీంతో, కాంగ్రెస్ తీరును కూడా కొందరు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంతమంది మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారని ఘాటు విమర్శలు చేస్తున్నారు. Congress is ruling Rajasthan, Himachal, Chhattisgarh, Karnataka. How many women Chief Ministers? Even deputy CM? Himachal Congress doesn't even have a woman minister. Telangana their CM candidate is not woman. Check how many woman ministers in Rajasthan and Karnataka. https://t.co/bnCXCf5TaF — Ankur Singh (@iAnkurSingh) December 1, 2023 కాంగ్రెస్ మహిళా అభ్యర్థులు వీరే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మొత్తం 11 మంది మహిళలకు అవకాశమిచ్చింది. అందులో నలుగురు హైదరాబాద్‌లోని నియోజకవర్గాల నుంచి పోటీలో ఉన్నారు. మూడు ఎస్సీ నియోజకవర్గాలు, ఒక ఎస్టీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అవకాశం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో విజయారెడ్డి, సనత్ నగర్ నుంచి కోట నీలిమ, గోషా మహల్లో మొగిలి సునీత, సికింద్రాబాద్ కంటోన్మెంట్(ఎస్సీ) స్థానంలో జీవీ వెన్నెలను పోటీలో నిలిపింది. వీరు కాకుండా గద్వాలలో సరిత తిరుపతయ్య, కోదాలలో నలమాడ పద్మావతి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్(ఎస్సీ) స్థానంలో సింగపురం ఇందిర, పాలకుర్తిలో మామిడాల యశస్విని రెడ్డి, వరంగల్ ఈస్ట్‌లో కొండా సురేఖ, ములుగు(ఎస్టీ)లో సీతక్క, సత్తుపల్లి(ఎస్సీ) స్థానంలో మట్టా రాగమయి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. -
డీకే శివకుమార్ బిగ్ స్కెచ్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షిఫ్ట్..!
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో ఎగ్జిట్‌పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపడంతో ఆ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు ప్రారంభించింది. తమ పార్టీ తరపున గెలిచే ఎమ్మెల్యేలు చేయి జారిపోకుండా అన్ని చర్యలు తీసుకుంటోంది. ఫలితాల్లో పార్టీ మ్యాజిక్ ఫిగర్ దాటితే ఎలాంటి సమస్యలు ఉండవు కానీ అలాకాని పక్షంలో ఎమ్మెల్యేల హార్స్ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉండడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు పెద్ద స్కెచ్‌నే వేసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కొందరు సీఎం కేసీఆర్‌కు టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎగరేసుకుపోకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు నడపడంలో దిట్ట అయిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను రంగంలోకి దిగారు. కౌంటింగ్‌కు ఒక రోజు ముందే శనివారం సాయంత్రమే డీకే సహా ఆరుగురు కర్ణాటక మంత్రులు హైదరాబాద్ రానున్నట్లు సమాచారం. కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అభ్యర్థులంతా హైదరాబాద్‌లోని హోటల్ తాజ్ కృష్ణాకు రావాలని డీకే అండ్ కో ఇప్పటికే అభ్యర్థులను కోరినట్లు తెలిసింది. అభ్యర్థులతో డీకే ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచాం. ఫలితాల వెల్లడి తర్వాత గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానాల్లో డీకే బ్యాచ్ బెంగళూరు షిఫ్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా,శనివారం ఉదయం తెలంగాణఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కలిసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు కూడా గెలవబోయే కాంగ్రెస్ అభ్యర్థుల విషయమై ఒక స్పెషల్ రిక్వెస్ట్ చేశారు. తమ పార్టీ చీఫ్ పోలింగ్ ఏజెంట్‌కే ఎమ్మెల్యేల గెలుపు ధృవీకరణ పత్రాలు అందజేయాలని కోరారు. దీనినిబట్టి పోటీచేసిన అభ్యర్థులు లోకల్‌గా అందుబాటులో ఉండరని తేలిపోయింది. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత ఓ జాతీయ టీవీ ఛానల్‌తో మాట్లాడిన డీకే శివకుమార్ సీఎం కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కేసీఆర్ ఇప్పటికే మా అభ్యర్థుల్లో కొంత మందికి టచ్‌లోకి వచ్చారని చెప్పారు. అయితే ఈసారి కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాక్కోవడం అంత ఈజీ కాదని డీకే స్పష్టం చేశారు.2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకంగా లెజిస్లేచర్ పార్టీని విలీనం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరిన విషయం తెలిసిందే. ఇదీచదవండి..తెలంగాణ ఎన్నికలు 2023.. నేటి సమగ్ర సమాచారం -
నయా పాలి‘ట్రిక్స్’.. గెలిచేది సారే.. వచ్చేది కారే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నిలక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. అయితే, ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్‌పోల్స్‌పై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని ఎక్కువ సంఖ్యలో ఎగ్జిట్‌పోల్స్ సంస్థలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో సైలెంట్ వేవ్‌తో బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదని కొందరు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో బెంగాల్‌కు చెందిన ప్రొఫెసర్ సంజయ్ కుమార్ తాజాగా మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో మాదిరిగానే సెలైంట్ వేవ్‌తో తెలంగాణలో కూడా బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. బీఆర్ఎస్కు ప్రజల్లో ఉన్న ఆదరణ, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తిరిగి పార్టీని గెలిపించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. Silent wave is mostly favorable to BRS just like the same happened in West Bengal - Prof. Sanjay Kumar pic.twitter.com/eii3WZ7Kqc — చార్వాక (@Charwaka99) December 1, 2023 మరోవైపు.. కొందరు సోషల్ మీడియాలో వేదికగా కూడా కేసీఆర్‌కు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఎన్నిలకల్లో ‘చేయి’ ఎత్తి ‘కారు’ను ఆపడం సాధ్యమేనా అని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, ఎవరి విశ్లేషణలో వారు బిజీగా ఉన్నారు. మరోవైపు, గెలుపు ఓటములు ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తమ వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడిస్తూ పంచ్‌లు విసురుతున్నారు. నాకెందుకో ఈసారి కూడా తెలంగాణ లో "కార్" తిరుగుతుందని అనిపిస్తుంది,.. "చెయ్యి" ఎత్తి "కార్" ని ఆపగలం అనుకుంటున్నారు కానీ, అది సాధ్యం కాదని రేపు తెలుస్తుంది...😄 #TelanganaElections #KTR #BRSParty #KCRHattrick #KCROnceAgain — పంచభట్ల సారంగపాణి (@Siddart9Praveen) December 2, 2023 ఇక, థర్డ్ విజన్ నాగన్న సర్వే ఎగ్జిట్‌పోల్స్ కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా సమీకరణాలను వెల్లడించింది. బీఆర్ఎస్ దాదాపు 60-68 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌కు 33-40 సీట్లు వస్తామయని తెలిపింది. Now Third Eye Vision Naganna Survey has also been released and the Prediction is clear BRS party led by #KCR garu is forming Government once again in #TelanganaAssemblyElections2023 థర్డ్ ఐ విజన్ నాగన్న సర్వే కూడా ఎన్నికల్లో కేసిఆర్ గారి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తిరిగి… pic.twitter.com/0F0H8VFeYI — Dinesh Chowdary (@dcstunner999) November 29, 2023 -
కాంగ్రెస్ సీఎం అభ్యర్థి.. వారిద్దరూ అర్హులే: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రేపు(ఆదివారం) ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక, ఎగ్జిట్‌పోల్స్ కాంగ్రెస్‌కు ఫేవర్‌గా ఫలితాలను వెల్లడించాయి. దీంతో, కాంగ్రెస్‌లో సీఎం ఎవరు? అనే చర్చ నడుస్తోంది. ఈ తరుణంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, వైఎస్ షర్మిల శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో సమర్థులైన సీఎం అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారు. భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్ రెడ్డి సీఎం పదవికి అర్హులు. బ్లాక్మెయిలర్స్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు. ముఖ్యమంత్రి ఎవరూ అనేది ఆ పార్టీ నేతలు తేల్చుకుంటారు అని కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా బైబై కేసీఆర్ సూటుకేసును ఆమె ప్రదర్శించారు. ఇదిలా ఉండగా.. తాజాగా కాంగ్రెస్ నేతలు ఎన్నికల సీఈవో వికాస్‌రాజ్‌ను కలిశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రూ. 6వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నదని తెలిపారు. రైతుబంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారని ఆరోపించారు. భూరికార్డులు మారుస్తున్నట్టు కాంగ్రెస్ నేతలకు సమాచారం ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడంలేదని తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరినట్టు చెప్పారు. YS Sharmila Sensational Comments on Congress CM Candidate | Revanth Reddy#YSSharmila #CongressCMCandidate #RevanthReddy #UttamKumarreddy #BhattiVikramarka #SakshiTV pic.twitter.com/tAcjiNrlmA — Sakshi TV Official (@sakshitvdigital) December 2, 2023 ఇది కూడా చదవండి: ఎన్నికల ఫలితాల వేళ సీతక్క ఎమోషనల్ కామెంట్స్ -
కుట్రలతో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క ఆవేదన
సాక్షి, ములుగు: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఓట్ల కౌంటింగ్ జరుగనుంది. మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటిక ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర వివరాలను వెల్లడించాయి. దీంతో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, సీతక్క శనివారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే. ప్రతి ఇంటా వెలుగులే. బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు. నన్ను ఆడబిడ్డగా ములుగు ప్రజలు ఆదిరించారు. చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు. నా జీవితానికి ఇంకేం కావాలి. నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు. నేనెప్పుడూ మీ సేవకురాలినే. నేను ములుగు ప్రజల వెంటే ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను. నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నాను. వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు. వారికి ఆడబిడ్డ ఉసురు తగులుతుంది. నన్ను అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారు. నా కార్యకర్తలను డబ్బులతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు. ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటాను. పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తాను. ఎన్నికల్లో కష్టపడ్డ అందరికీ కృతజ్ఞతలు అంటూ కామెంట్స్ చేశారు. -
కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ కొడతారా?
కేసీఆర్ గజ్వేల్‌లో హ్యాట్రిక్ కొడతాడు!.. నా పందెం ఇంత లే.. గజ్వేల్‌లో ఈటలనే గెలుస్తాడు! అంతకంటే డబుల్ నా పందెం హరీష్‌రావు లాస్ట్ ఎలక్షన్ల వచ్చిన మెజారిటీ ఈసారి క్రాస్ చేస్తాడని నా బెట్ దాటడని నా బెట్ ఖమ్మంలో పువ్వాడ-తుమ్మల పోటీలో గెలుపు ఆయనదే.. బర్రెలక్క ఈ ఎలక్షన్స్‌లో కచ్చితంగా గెలుస్తుందని ఇంత సొమ్ము వేస్తున్నా.. మరికొన్ని గంటల్లో తెలంగాణ అసెంబ్లీ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ అంతటా నెలకొంది. ఈ సమయంలోనే పందెం రాయుళ్ల జోరు పెంచారు. గత నెల రోజుల నుంచి ఎలక్షన్ బెట్టింగ్ ఈ తంతు నడుస్తున్నప్పటికీ.. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు, కౌంటింగ్‌కు సమయం దగ్గరపడడంతో ఇప్పుడు పందెం కాసే సొమ్ము అమాంతం పెరిగిపోయినట్లు తెలుస్తోంది. ప్రధానంగా పెద్ద లీడర్ సాబ్‌ల మీద, తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందన్న దానిపై బెట్టింగ్ నడుస్తున్నట్లు సమాచారం. కాయ్ రాజా కాయ్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. నేతల మీద జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. మొత్తం 33 జిల్లాల్లో.. ఎంపిక చేసిన నేతలపైనే పందేలు వేస్తున్నారు. బెట్టింగ్స్ కోసమే సర్వేలు చేయించుకున్న కొందరు.. లక్షల నుంచి కోట్లలో కాస్తున్నారు. ముఖ్య నేతల మీద, మంత్రుల గెలుపోటముల మీద ఓ లెక్క లేకుండా వేస్తున్నారు. హైదరాబాద్, తెలంగాణలో బెట్టింగ్ నిర్వహిస్తే పట్టుబడే అవకాశం ఉందని గుర్తించిన బుకీలు.. ఇతర ప్రాంతాల నుంచి దందా సాగిస్తున్నారు. హైదరాబాద్ సెటిలర్స్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ఏపీకి సమీపంలో ఉన్న ప్రాంతాలపై బెట్టింగ్స్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. షాకింగ్ బెట్. ఇంట్రెస్టింగ్ రేటు దుబ్బాకలో రఘునందన్‌రావు గెలుస్తాడా? ఓడిపోతాడా?.. సంగారెడ్డిలో రఘునందన్‌రావు మళ్లీ నెగ్గుతాడా?ఇలా.. ఆప్షన్లతో బెట్టింగులు నడుస్తున్నాయి. కామారెడ్డి, గజ్వేల్ మీద బెట్టింగ్ ముఠాల స్పెషల్ ఫోకస్ ఉంది. ఈ రెండు సెగ్మెంట్లలో కేసీఆర్ పోటీ చేస్తుండడమే ప్రధాన కారణమని చెపనక్కర్లేదు. కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తారు అనేదానికంటే.. గజ్వేల్‌లో ఈటల నెగ్గుతారనే ఇంకా ఎక్కువ సొమ్ముతో పందెం వేస్తున్నారు. అంతెందుకు విదేశాల నుంచి కూడా యాప్స్ బెట్టింగ్ వ్యవహారం నడుస్తోందని టాక్. సిద్ధిపేట నియోజకవర్గంలో హరీష్‌రావు గత ఎన్నికల్లో 1 లక్షా 19 వేల మెజారిటీ సాధించారు. ఈసారి ఆ మెజారిటీ రికార్డును దాటేస్తారా? అని పందెం వేస్తున్నారు. పలువురు తెలంగాణ మంత్రులు పోటీ చేస్తున్న స్థానాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు పందెం రాయుళ్లు. ఖమ్మంలో తుమ్మల-పువ్వాడ ఫైట్ మీద, పాలకుర్తిలో ఎర్రబెల్లి ఓడిపోతారని, కేటీఆర్ మెజార్టీ ఎలా ఉండబోతుందని, ఆదిలాబాద్-కరీంనగర్లో బీఆర్ఎస్కు జీరో సీట్లు అని.. ఇలా రకరకాల ఆఫ్షన్లతో పందెలు వేస్తున్నట్లు తెలుస్తోంది. పైసలే కాదు.. పొలిటికల్ బెట్టింగ్‌లో.. డబ్బులే కాదు భూములను కూడా పందెంలో పెడుతున్నారు కొందరు. సిర్పూర్ నియోజకవర్గం పరిధిలో గెలుపోటములపై లక్షల్లో సొమ్ముతో పాటు పొలాలను కూడా కొందరు తాకట్టు పెడుతున్నట్లు సమాచారం. మొత్తంగా తెలంగాణ ఎన్నికల ఫలితాల బెట్టింగ్ విలువ రూ.10 వేల కోట్ల రూపాయల దాకా ఉండొచ్చనేది ఒక అంచనా. -
టీ కాంగ్రెస్ బిగ్‌ప్లాన్.. అంతా ఆయన చేతుల్లోనే!
సాక్షి, హైదరాబాద్: డీకే శివకుమార్.. కర్ణాటక ఎన్నికల ఫలితాల సమయాల్లో, అక్కడ రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడల్లా ఎక్కువగా వినిపించే పేరు. నెగ్గిన అభ్యర్థుల్ని జంప్ కాకుండా.. సంక్షోభ సమయాల్లో పార్టీ ఎమ్మెల్యేలను ఏకతాటిపై ఉంచడంలో ఈయన ఎక్స్పర్ట్. అందుకే పాలిటిక్స్‌లో ట్రబుల్ షూటర్ అనే పేరొచ్చింది ఆయనకి. క్లిష్టపరిస్థితుల్లో పార్టీని ఆదుకునే డీకేఎస్.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కట్టబెట్టిన విజయం కాంగ్రెస్‌కు మరువలేనిది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ.. కాంగ్రెస్ అధిష్టానం ఆయన సేవల్ని మళ్లీ వినియోగించుకుంటోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డీకేఎస్‌ను నమ్ముకుంది. తెలంగాణ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆయన క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేసి ప్రచారంలో పాల్గొన్నారాయన. కర్ణాటక సంక్షేమ రిఫరెన్స్‌తో బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారాయన. ఇప్పుడు.. రేపు ఫలితాల సమయంలో ఆయన ఇక్కడే మకాం వేసి చక్రం తిప్పబోతున్నారు. మ్యాజిక్ ఫిగర్‌కు అటు ఇటుగా ఫలితాలు ఉంటే.. పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా బాధ్యత ఆయన చేతుల్లోకి వెళ్లింది. తెలంగాణ ఫలితాలు వెలువడ్డాక.. ఆ నెగ్గిన వాళ్లను బెంగళూరుకు తరలిస్తారనే ప్రచారం ఒకటి తొలుత నడిచింది. అయితే ఆ ఊహాగానాల్ని స్వయంగా డీకేఎస్ కొట్టిపారేశారు. ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలించబోమని.. ఆ అవసరం లేదని అన్నారాయన. అలాగే.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడుతుండగా.. అంతకు ఒక్కరోజు ముందే ఆయన హైదరాబాద్‌లో ల్యాండ్ కానున్నారు. కాంగ్రెస్ బిగ్‌ప్లాన్ ఫలితాల రోజున తెలంగాణ కాంగ్రెస్ బిగ్‌ప్లాన్ అమలు చేయబోతోంది. ఏఐసీసీ ప్రతీ నియోజకవర్గానికి ఒక పరిశీలకుడ్ని నియమించింది. సదరు అభ్యర్థి నెగ్గాక.. ఎమ్మెల్యే సర్టిఫికెట్తో ఆ పరిశీలకుడు నేరుగా హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌కు తీసుకొస్తారు. అక్కడ డీకేఎస్ సమక్షంలోనే వాళ్లు ఉండనున్నారు. ఒకవేళ సంపూర్ణ మెజారిటీ వచ్చినా కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేయాలని డీకేఎస్ భావిస్తున్నారట. ఎమ్మెల్యేలను ఎట్టిపరిస్థితుల్లో ప్రలోభాలకు గురి కాకుండా చూసుకునే బాధ్యత ఇప్పుడే ఆయన స్వయంగా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. మాకు పూర్తి మెజారిటీ వస్తుంది. మేం ఎలాంటి క్యాంపు రాజకీయాలు పెట్టడం లేదు. కొంత మంది మా ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మాకు సమాచారం ఉంది. కానీ, మా వాళ్లు పార్టీకి విధేయులు. లొంగరు..’’ డీకేఎస్ తాజాగా ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇదీ చదవండి: ఆగమెందుకు.. మళ్లీ మనమే -
పాతబస్తీలో పతంగ్ జోరేనా...!
చార్మినార్: పాతబస్తీలోని చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా నియోజకవర్గాలు మజ్లిస్ పార్టీకి కంచుకోటగా ఉన్నాయి. ఈసారి జరిగిన ఎన్నికల్లో గతంలో లాగే మజ్లిస్ పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీ నియోజకవర్గాల్లో మజ్లిస్ పార్టీ బలం–అత్యధిక సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉండటమే. చార్మినార్ నియోజకవర్గం నుంచి మజ్లిస్ పార్టీ అభ్యరి్థకి గట్టి పోటీ ఎదురైనప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ సరళి మారి మజ్లిస్ పార్టీకి అనుకూలంగా ఏర్పడింది. యథేచ్ఛగా బోగస్ ఓట్లు పోలయ్యాయి. ఎక్కడా గుర్తింపు కార్డుల కోసం సంబంధిత అధికారులు విచారణ (అడగకపోవడం) చేయకపోవడంతో ఎవరు పడితే వారు స్లిప్‌లతో బోగస్ ఓట్లు వేశారు. యాకుత్‌పురాలో మజ్లిస్ పారీ్టకి ఎంబీటీ గట్టి పోటీనిచి్చంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే.. ► యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి ఎంబీటీ అభ్యరి్థగా ఎన్నికల బరిలో నిలిచిన మాజీ కార్పొరేటర్ అంజదుల్లాఖాన్, మజ్లిస్ పార్టీ అభ్యర్థి మాజీద్ హుస్సేన్ మేరాజ్‌కి గట్టి పోటీ నిచ్చారు. నిజానికి ఈ నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో నియోజకవర్గం ఓటర్లు మార్పును కోరుతుండటంతో మజ్లిస్ పార్టీకి కాకుండా ఎంబీటీకి అధిక సంఖ్యలో ఓట్లు పోలైనట్లు సమాచారం. గతంలో ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీకి ఈసారి యాకుత్‌పురా నుంచి టికెట్ దక్క లేదు. ఆయన స్థానంలో నాంపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ మేరాజ్‌కు టికెట్ లభించడం.. ఆయన స్థానికేతరుడు కావడంతో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లాఖాన్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ► అయితే ఇక్కడి నుంచి ఎన్నికల బరిలోకి దిగిన మజ్లీసేతర పారీ్టలైన బీఆర్ఎస్ అభ్యర్థి సామా సుందర్‌రెడ్డి కేవలం ఐఎస్ సదన్ డివిజన్, గౌలిపురా డివిజన్లలో మాత్రమే ఎన్నికల ప్రచారం నిర్వహించి.. మిగిలిన డివిజన్లలోని ఓటర్లకు అతని ముఖం ఎలా ఉంటుందో చూపించ లేదు. ► ఇక బీజేపీ అభ్యర్థి వీరేందర్ యాదవ్ సైతం గౌలిపురా, కుర్మగూడ డివిజన్లకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు ఐఎస్‌సదన్ డివిజన్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించి చేతులు దులుపుకున్నారు. ► యాకుత్‌పురా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రవిరాజ్ అసలు ఎన్నికల ప్రచారమే నిర్వహించ లేదు. కేవలం ఒకటి రెండు చోట్ల పాదయాత్రలు నిర్వహించిన ఆయన ఒక దశలో ఎన్నికల కార్యాలయానికి తాళాలు వేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ► ఇలా యాకుత్‌పురాలో మజ్లీసేతర పారీ్టలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల పోటీ నామమాత్రమే. చారి్మనార్‌లో మజ్లిస్‌కు గట్టి పోటీనిచి్చన కాంగ్రెస్, బీజేపీ.. ► చార్మినార్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మహ్మద్ ముజీబ్ ఉల్లా షరీఫ్‌తో పాటు బీజేపీ అభ్యర్థి మెఘారాణి అగర్వాల్ పోటాపోటీగా ఎన్నికల బరిలో ఉన్నప్పటికీ..మజ్లిస్ పార్టీ అభ్యర్థి మీర్ జులీ్ఫకర్ అలీ విజయం సాధించనున్నారు. ► ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ సలావుద్దీన్ లోధీ నామమాత్రమే. చాంద్రాయణగుట్టలో మజ్లిస్‌కు పోటీ నిచ్చిన బీజేపీ.. ► చాంద్రాయణగుట్టలో ఈసారి కూడా మజ్లిస్ పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ విజయం సాధించనున్నారు. ► బీజేపీ తరఫున భాగ్యనగర్ గణేష్‌ఉత్సవ సమితి కార్యదర్శి కౌడి మహేందర్ ఎన్నికల బరిలో ఉండి ప్రచారంలో దూసుకు పోయారు. అయినప్పటికీ ఇక్కడి నుంచి అక్బరుద్దీన్ ఒవైసీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ► చాంద్రాయణగుట్టలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారం సక్రమంగా నిర్వహించకపోవడంతో వీరిరువురి ముఖాలు సైతం నియోజకవర్గం ఓటర్లకు తెలియకుండా పోయింది. బహదూర్‌పురాలో కనిపించని బీఆర్ఎస్.. ► బహదూర్‌పురా నియోజకవర్గం మజ్లిస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి మజ్లిస్ పార్టీ జెండాపై ఎవరూ పోటీ చేసినా గెలిచే అవకాశాలున్నాయి. ఇప్పటికే నియోజకవర్గం నుంచి హాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే మొజంఖాన్‌కు ఈసారి టికెట్ లభించ లేదు. ఈయన స్థానంలో మోబిన్ ఎన్నికల బరిలో దిగగా.. భారీ మెజారిటీతో విజయం సాధించనున్నారు. ► ఈ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి ఆయనకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులిపాటి రాజేష్‌కుమార్ గట్టిగా పోటీనిచ్చారు. ► ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి మీర్ ఇనాయత్ అలీ బాక్రీతో పాటు బీజేపీ అభ్యర్థి వై.నరేష్‌ల పోటీ నామమాత్రమే. -
ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్ ఎంత?
తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాల ప్రభావం ఏపీ రాజకీయాలపై ఎంతవరకు ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రత్యేకించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సంబంధ, బాంధవ్యాలు, రాజకీయ అనుబంధాల నేపథ్యంలో దీనికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. నిజానికి తెలంగాణలో ఎలాంటి ఫలితం వచ్చినా ఏపీ రాజకీయాలపై పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఏపీ రాజకీయ పరిస్థితులకు తెలంగాణ రాజకీయాలు భిన్నంగా ఉన్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ప్రధాన ప్రత్యర్ధులుగా ఉన్నాయి. ఏపీలో అందుకు భిన్నమైన వాతావరణం ఉంది. ఏపీలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు ఒక్క శాతం లోపే ఓట్లు ఉన్నాయని ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి. ✍️వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాజకీయాలలో జోక్యం చేసుకోవడం లేదు. ఎవరైనా ఆ పార్టీ నేతలు ఒకరిద్దరు అక్కడ ఏదైనా చేస్తున్నా అది వారి వ్యక్తిగతం అని చెప్పాలి. బీఆర్ ఎస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేస్తుంటే, సీపీఐతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ అనధికారికంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తోంది. ఆ పార్టీకి సంబంధించి కొందరు కాంగ్రెస్ ర్యాలీలలో టీడీపీ జెండాలతో తిరుగుతున్నారు. అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడా ఖండించలేదు. తమ మద్దతు ఎవరికి లేదని చెప్పలేదు. దాంతో కాంగ్రెస్‌కు ఆయన అనుకూలంగా ఉన్నారన్న సంకేతాలు వెళ్లాయి. ✍️తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్‌కు ఉపయోగపడాలని, అందుకే టీడీపీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడం లేదని చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. ఇక ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న పార్టీగా ఉన్న జనసేన మాత్రం తెలంగాణలో బీజేపీతో కలిసి ఎనిమిది చోట్ల పోటీ చేస్తోంది. బీజేపీ సభలలో పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగాలు చేశారు. బీజేపీతో పొత్తులో ఉంటూనే, హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో చంద్రబాబు నాయుడుతో భేటీ అవడం విశేషం. అయినా చంద్రబాబును తెలంగాణలో జనసేనకు మద్దతు ఇవ్వాలని కోరలేదు. చంద్రబాబు కూడా జనసేనను బలపరచండని టీడీపీ అభిమానులకు పిలుపు ఇవ్వలేదు. ఆ రకంగా సొంత పార్టీ అభ్యర్ధులకు పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారన్న అభిప్రాయం వస్తుంది. ✍️బీజేపీతో జనసేన తెలంగాణలో కలిసి ఏపీలో మాత్రం ఆ పార్టీతో కాపురం చేయకుండా టీడీపీతో సహజీవనం చేయడం రాజకీయాలలో వింతగా మారింది. దీనిని వావివరసలు లేని రాజకీయంగా వైసీపీ నేత పేర్ని నాని ఇప్పటికే విమర్శించారు. ఈ విధంగా చూస్తే తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం టీడీపీ, జనసేనలపైనే ఎక్కువగా ఉంటుంది. టీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేనలకు షాక్ అవుతుంది. వారు కోరుకున్నట్లు కాంగ్రెస్ కాని, బీజేపీ కాని గెలవకపోతే వారికి నిరుత్సాహం అవుతుంది. చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్కు చెందిన కొందరు నేతలు కూడా ఖండించినా, టీడీపీ శ్రేణులు కాని, టీడీపీని ఓన్ చేసే ఒక సామాజికవర్గం వారు కాని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారన్న భావన ఉంది. ✍️బీఆర్ఎస్ గెలిస్తే ఏపీలో ఆటోమాటిక్‌గా వైసిపికి అడ్వాంటేజ్‌గా ఉండవచ్చన్నది వారి భయం అని చెబుతున్నారు. టీడీపీకి మద్దతు ఇచ్చే సామాజికవర్గం ఇలా వ్యవహరిస్తుండేసరికి కొందరు టీఆర్ఎస్ అభ్యర్ధులు ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి అభిమానుల పేరుతో సమావేశాలు నిర్వహించి వారి మద్దతు అభ్యర్ధించడం విశేషం. టీఆర్ఎస్ గెలిస్తే సహజంగానే టీడీపీని వ్యతిరేకించే శక్తులకు సంతోషంగా ఉంటుంది. దీనివల్ల ఏపీలో వైసీపీకి పెద్ద ప్రయోజనం ఉండకపోయినా, తెలంగాణలో ఆ పార్టీ అభిమానులుగా ఉన్నవారిలో సంతృప్తి కలిగిస్తుంది. ఇప్పటికే పలు సర్వేలు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రావచ్చని సూచిస్తున్నాయి. ఇది చంద్రబాబు అరెస్టు వల్ల వచ్చిన సానుభూతి అని టీడీపీ మద్దతు మీడియా ప్రచారం చేస్తుంది. ఆ వర్గం టివీ చానల్లో ఇప్పటికే దీనిపై చర్చ జరిగింది. ✍️కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న ఒక సర్వే సంస్థ ప్రతినిధి అదే చర్చలో తమకు చంద్రబాబు అరెస్టు సానుభూతి ప్రభావం ఎక్కడా కనిపించలేదని చెప్పడంతో ఆ టీవీవారు అవక్కాయ్యారు. అలాగే చంద్రబాబు బహిరంగంగా ఏ సంగతి చెప్పలేని నిస్సహాయస్థితి. ఆయన ఎప్పుడూ చేసే తెరచాటు రాజకీయం నెరపవచ్చు. సోషల్ మీడియాలో ఇదేదో తమ గొప్పగా కూడా ప్రచారం చేసుకున్నా ఆశ్చర్యం లేదు. అయినా ఏపీలో ఈ కారణంగా ఓట్లు వేస్తారని అనుకుంటే భ్రమే. అక్కడి పరిస్థితుల ఆధారంగానే ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. జనసేన అభ్యర్ధులు ఎవరైనా ఒకరు గెలిస్తే అదే తమకు గొప్ప విజయంగా ఆ పార్టీవారు ప్రచారం చేసుకుంటారు. ✍️ఎవరూ గెలవకపోతే మాత్రం జనసేన నీరుకారిపోతుంది. దీంతో ఏపీలో కూడా పవన్ కళ్యాణ్ బలం పై పూర్తి సంశయాలు వస్తాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వారు పవన్‌ను చులకనగా తీసుకుని బాగా తక్కువ సీట్లు కేటాయించడానికి ప్రయత్నిస్తారు. కాగా టీడీపీ అభిమానులకు, కమ్మ సామాజికవర్గం వారికి కాపునాడు ఒక విజ్ఞప్తి చేసింది. దీని ప్రకారం కుకట్పల్లి వంటి నియోజకవర్గాలలో కమ్మ వారంతా జనసేనకు ఓట్లు వేయాలని కోరింది. కాని అక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి కమ్మ వర్గం అయినందున వారిలో ఎక్కువమంది అటువైపే మొగ్గు చూపారని అంటున్నారు. తత్ఫలితంగా జనసేన అభ్యర్ధి అక్కడ ఓడిపోతే, ఈ రెండు పార్టీల మధ్య, ముఖ్యంగా కమ్మ, కాపు వర్గాల మధ్య అంతరం ఏర్పడుతుంది. ✍️జనసేనకు కమ్మ సామాజికవర్గం మద్దతు ఇవ్వనప్పుడు తాము ఏపీలో ఎందుకు టీడీపీకి మద్దతు ఇవ్వాలని కాపు సామాజికవర్గ నేతలు, జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తారు. దీనికి సమాధానం ఇవ్వడం పవన్‌కు కష్టం అవుతుంది. దాంతో ఈ రెండు పార్టీల పొత్తు మీద అనుమానాలు ఏర్పడతాయి. పవన్ కోరుకున్నట్లు టీడీపీకి ఎందుకు సరెండర్ అవ్వాలని అడుగుతారు. ఈ నేపథ్యంలో పవన్ ముందస్తుగా ఏపీలో పార్టీ సమావేశం జరిపి టీడీపీతో పొత్తు గురించి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని కార్యకర్తలను హెచ్చరించారని భావించవచ్చు. కాంగ్రెస్ కనుక తెలంగాణలో గెలిస్తే టీడీపీలో కొంత ఆశ ఏర్పడుతుంది. ✍️తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ప్రయత్నించవచ్చు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రదానంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే దానిని చంద్రబాబు తనకు అనుకూలంగా మార్చుకునే యత్నం చేస్తారు. దీనివల్ల ఏపీలో టీడీపీకి ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియదు కాని, కొంత నష్టం కూడా ఉండవచ్చు. రేవంత్ మాత్రం తెలివిగా రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం ఉండదని,ప్రభుత్వాల మధ్య సంబంధాలు మామూలుగానే ఉంటాయని అంటున్నారు. పైగా చంద్రబాబు తనకు రాజకీయ గురువు కాదని, సహచరులమేనని ఇప్పటికే ఒక ఇంటర్వ్యులో ప్రకటించారు. ఆయన కూడా అనవసరంగా ఏపీతో కయ్యానికి వెళ్లడానికి వెనుకాడవచ్చు. ✍️బీజేపీ తెలంగాణలో గెలిచే అవకాశం కనబడడం లేదు. అయినా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన టీడీపీపై వారికి కోపం రావచ్చు. ఏపీలో బీజేపీతో కూడా కలవాలన్న టీడీపీ యోచనకు బ్రేక్ పడవచ్చు. కాని జనసేన వారు బీజేపీ నుంచి విడిపోయిన తర్వాతే టీడీపీతో పొత్తు పెట్టుకోవల్సి ఉంటుంది. దాని ప్రభావం కూడా ఆ రెండు పార్టీల సంబంధాలపై పడవచ్చు. ఏపీలో మాత్రం టీడీపీ, జనసేనలు ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలిసే అవకాశం లేదు. మరో విశ్లేషణ కూడా ఉంటుంది. ఒక వేళ తెలంగాణలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ పార్టీల హామీలు వెంటనే అమలు చేయడం అసాధ్యమైన విషయం. ✍️ప్రత్యేకించి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అయితే మరీ కష్టం. ముందుగా రైతు బంధు కింద ఎకరాకు పదిహేనువేల చొప్పున ఇవ్వవలసి ఉంటుంది. అలాగే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయలేకపోయినా, వారిచ్చిన గ్యారంటీలను అమలు చేయకపోయినా ఆ పార్టీకి జనంలో వ్యతిరేకత వస్తుంది. ఏపీలో చంద్రబాబు కూడా అలాంటి వాగ్దానాలనే చేసినందున వాటిని జనం నమ్మని పరిస్థితి మరింత గట్టిగా ఏర్పడుతుంది. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, రాకపోయినా ఇబ్బంది తెలుగుదేశం పార్టీకే అవుతుంది తప్ప వైసీపీపై పెద్ద ప్రభావం ఉండదు. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పటికే తన వాగ్దానాలను దాదాపు పూర్తిగా అమలు చేసి జనంలో తిరుగుతోంది కనుక. ✍️ఏపీలో బీజేపీ ఎలాంటి వైఖరి అవలంభిస్తుందన్నది తేలవలసి ఉంది. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిన టీడీపీతో ఏపీలో పొత్తుపెట్టుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వంటివారు కోరుకుంటుండవచ్చు. ఆ ప్రతిపాదనను పార్టీ హైకమాండ్ ఆమోదిస్తుందా? లేదా? అన్నది కూడా చూడవలసి ఉంటుంది. తెలంగాణలో బీజేపీకి మంచి ఓట్ షేర్ వస్తే ఏపీలో కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయవచ్చు. కాని అది అంత తేలికకాదు. కాకపోతే తెలుగుదేశం పార్టీకి బీజేపీతో ఎలా ఉండాలో తెలియక గందరగోళం అవుతుంది. ✍️బీజేపీని అడ్డం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా జగన్ ప్రభుత్వానికి ఇక్కట్లు సృష్టించాలన్న ప్లాన్ టీడీపీలో ఉంది. అది సాధ్యం కాకపోవచ్చు. ఇక వైసీపీ ఇప్పటికే టీడీపీ, జనసేనల కూటమిని, ఆ పార్టీకి బాకాలు ఊదే ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలను ఎదుర్కోవడానికి సిద్దమైనందున తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నా పెద్ద సమస్య కాదు. మొదటినుంచి కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. అంతేకాదు. టీఆర్ఎస్ రెండు టరమ్లు పాలన చేసింది కనుక సహజంగానే వైసీపీకి ఆ పాయింట్ కలిసి వస్తుంది. దీనిని బట్టి జాగ్రత్తగా పరిశీలిస్తే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా, బీఆర్ఎస్ గెలిచినా దాని ప్రభావం తెలుగుదేశం, జనసేనలపైనే అధికంగా ఉంటుందని అర్ధం చేసుకోవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
భూరికార్డులు మారుస్తున్నారు.. వేల కోట్లు కాంట్రాక్టర్ల ఖాతాలోకి: కాంగ్రెస్ నేతలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి వికాస్ రాజ్‌ను కాంగ్రెస్ నేతలు కోరారు. శనివారం ఉదయం ఈసీ కార్యాలయానికి వెళ్లిన నాలుగు అంశాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు చేసింది. తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్(సీఈవో)ను కలిసిన అనంతరం బయటకు వచ్చిన కాంగ్రెస్ నేతల తరఫున ఉత్తమ్ కుమార్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు. రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు. రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు. భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారు.. .. ఈ విషయాలన్నీ సీఈవో దృష్టికి తీసుకెళ్లాం. అసైన్డ్ భూముల రికార్డులు మార్చకుండా చూడాలని కోరాం. ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం’’ అని ఉత్తమ్ వివరించారు. డిసెంబర్ 4వ తేదీన జరగబోయే కేబినెట్ భేటీలో కేసీఆర్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నిలువరించాలని కాంగ్రెస్ నేతలు ఈసీని కోరినట్లు తెలుస్తోంది. ఈసీని కలిసిన బృందంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ గౌడ్ తదితరులు ఉన్నారు. -
తెలంగాణ ఎన్నికలు.. నేటి అప్డేట్స్
జంగ్ తెలంగాణ.. అసెంబ్లీ ఎన్నికలు 2023 లైవ్ అప్డేట్స్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ రేపటి కౌంటింగ్ నేపథ్యంలో కేటీఆర్ ‘ఎక్స్’ (ట్విటర్)లో కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ హ్యట్రిక్ లోడింగ్ 3.0... వేడుకలకు సిద్ధంగా ఉండండి.. గెలుపుపై ధీమా Hattrick Loading 3.0 👍 Get ready to celebrate guys 🎉 pic.twitter.com/4wJRJujU4w — KTR (@KTRBRS) December 2, 2023 రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం లోని ఆర్డీఓ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత 29 వ తేదీ నాటి పోస్టల్ బ్యాలెట్లను స్ట్రాంగ్ రూమ్ కిపంపించని అధికారులు.. విషయం తెలిసి ఆర్డీఓ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్న కాంగ్రెస్ శ్రేణులు కాంగ్రెస్ నాయకుల ఆందోళనతో కొద్ది సేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ లను స్ట్రాంగ్ రూమ్ కు తరలించిన అధికారులు పోస్టల్ బ్యాలెట్ తరలించిన తరువాతే ఇప్పుడు సీల్ వేసిన అధికారులు పోలింగ్ జరిగి రెండు రోజులు దాటినా స్ట్రాంగ్ రూమ్ కు తాళం లేకపోవడం కాంగ్రెస్ నాయకుల తీవ్ర అభ్యంతరం ఆర్డీఓ ను నిలదీస్తున్న కాంగ్రెస్ శ్రేణులు, ఉద్రిక్తత కర్ణాటక నుండి ఎమ్మెల్యేలను పిలిచిన కాంగ్రెస్ ఒక్కో నియోకవర్గానికి ఒక్కో ఎమ్మెల్యేను పంపనున్న కాంగ్రెస్ గెలిచిన అభ్యర్థులను హైదరాబాద్ తీసుకొని వచ్చే బాధ్యత గజ్వేల్ ఫలితాలు ఆలస్యం!: కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రేపు తెలంగాణ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 10గం. తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం గజ్వేల్ నియోజకవర్గం ఫలితం ఆలస్యంగా వెల్లడి పోటీ అభ్యర్థులు ఎక్కువగా(44 మంది) ఉండడమే కారణమన్న కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ రాత్రి 8గం. తర్వాతే గజ్వేల్ ఫలితం రావొచ్చనే అంచనా 23 రౌండ్లలో కౌంటింగ్ ఇప్పటికే మాక్ కౌంటింగ్ పూర్తైందన్న కలెక్టర్ చాలా ఇబ్బంది పెట్టారు: సీతక్క ములుగు జిల్లాలో క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే సీతక్క వ్యాఖ్యలు బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలు, కుట్ర రాజకీయాలతో చాలా ఇబ్బంది పెట్టారు నన్ను ఆడబిడ్డల ములుగు ప్రజలు ఆదరించారు చిన్న పిల్లలు కూడా నాకే మద్దతు ఇచ్చి అక్కున చేర్చుకున్నారు నా జీవితానికి ఇంకేం కావాలి నా గెలుపుకోసం కష్టపడ్డ అందరికీ ధన్యవాదాలు నేనెప్పుడూ మీ సేవకు రాలినే నేను ములుగు ప్రజల వెంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమంతో అభివృద్ధి చేస్తాను నన్ను రీల్ అన్నారు. నేను కష్టకాలంలో ప్రజల వెంటే ఉన్నా వారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పారు ఆడబిడ్డ ఉసురు తగులుతుంది మార్ఫింగ్ వీడియో, ఫోటోలతో దుష్ప్రచారం చేశారు నా కార్యకర్తలను పైసలతో కొనుగోలు చేసి తప్పుడు ప్రకటనలు ఇప్పించారు ఏ కష్టం వచ్చినా జనం వెంటే ఉంటా పార్లమెంట్ ఎన్నికల్లో రాహూల్ ప్రధాని అయ్యేలా కృషి చేస్తా ఎన్నికల్లో కష్ట పడ్డ అందరికీ కృతజ్ఞతలు వచ్చేది ఇందిరమ్మ రాజ్యం. వెలుగులే ప్రతి ఇంటా.. కేసీఆర్‌కు బైబై చెప్తున్నారు: షర్మిల ఫలితాల ముందర.. వైఎస్సార్టీపీ నేత షర్మిల స్పందన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు బైబై చెప్పారని కామెంట్ బైబై కేసీఆర్ సూట్‌కేసును ప్రదర్శించిన షర్మిల కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థులుగా సమర్థులైనవాళ్లు ఉన్నారు ఉత్తమ్, భట్టిలాంటి వాళ్లు ఉన్నారు బ్లాక్మెయిలర్స్ మాత్రం ముఖ్యమంత్రి కాకూడదు సీఎం అభ్యర్థి ఎవరనేది ఆ పార్టీ వాళ్లు నిర్ణయించుకుంటారు సీఈవోను కలిసిన తర్వాత మీడియాతో కాంగ్రెస్ నేత ఉత్తమ్.. బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన కాంట్రాక్టర్లకు నిధులు మంజూరు చేయిస్తున్నారు రూ.6 వేల కోట్లను తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు బీఆర్ఎస్ సర్కార్ ప్రయత్నిస్తోంది రైతు బంధు నిధుల్ని కాంట్రాక్టర్ల బిల్లులకు మళ్లిస్తున్నారు భూరికార్డులు మారుస్తున్నట్లు కూడా మాకు సమాచారం ఉంది రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని భూముల్ని ధరణి పోర్టల్‌లోకి మారుస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం నిబంధనలు పాటించడం లేదు అసైన్డ్ భూముల రికార్డుల్ని మార్చకుండా చూడాలని సీఈవోను కోరాం ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని కోరాం ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు దుర్వినియోగం కాకుండా చూడాలని కోరాం మొత్తం నాలుగు అంశాలపై ఫిర్యాదు చేశాం రంగారెడ్డి జిల్లాలో ఆ మూడు నియోజకవర్గాల లెక్కింపు కోసం.. ఇబ్రహీంపట్నం సీవీఆర్ ఇంజినీరింగ్ కాలేజ్ లో రేపు ఉదయం ప్రారంభంకానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇబ్రహీంపట్నం,మహేశ్వరం,కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు కౌంటింగ్ కేంద్రాల చుట్టూ మూడు అంచల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇబ్రహీం పట్నం నియోజకవర్గం 14 టేబుల్ 25 రౌండ్లు లెక్కింపు కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు విజయావకాశాలపై వీహెచ్ స్పందన తెలంగాణలో కాంగ్రెస్ విజయావకాశాలపై సీనియర్ నేత వీహెచ్ స్పందన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది దళితబంధు, డబుల్ బెడ్రూంల విషయంలో ప్రజలు విసిగిపోయారు మై హీరో: కవిత ట్వీట్ మై హీరో అంటూ తండ్రి కేసీఆర్ వీడియోను షేర్ చేసిన కవిత My hero❤️#KCR#JaiTelangana pic.twitter.com/LU5AEuOCi7 — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 2, 2023 ఈసీ కార్యాలయానికి కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికల కమిషనర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ ఈసీ కార్యాలయానికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, మధు యాష్కీ, ఉత్తమ్, పొంగులేటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఫిర్యాదు డిసెంబర్ 4న ఏర్పాటు చేయనున్న కేబినెట్ భేటీపైనా ఫిర్యాదు ప్రభుత్వ లావాదేవీలపై నిఘా ఉంచాలని ఫిర్యాదు చేయనున్న టీ కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ కీలక భేటీ హైదరాబాద్ హైదర్ గూడ ఎమ్మెల్యే. క్వార్టర్స్ లో భేటీ అయిన టీ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఇంఛార్జి మాణిక్‌రావ్ ఠాక్రే అధ్యకతన భేటీ అయిన రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ పలువురు ముఖ్య నేతలు.. కౌంటింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు,ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహం అమలు చేయాలనేదాని పై చర్చ కౌటింగ్ నేపథ్యంలో రేపు తెలంగాణ అంతటా మద్యం దుకాణాలు బంద్ ఎల్బీ నగర్ ఏర్పాట్లు ఇలా.. రేపు జరగబోయే ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి ఎల్బీనగర్ నియోజకవర్గంకి సంబంధించి సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలను, ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ చౌహాన్, ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ మూడంచెల భద్రత నడుమ ఇండోర్ స్టేడియం ఎలాంటి ర్యాలీలు, విజయోస్తవ సంబురాలు చేయయూడదని ఇప్పటికే నేతలకు ఆదేశాలు కౌటింగ్ కేంద్రం చుట్టూ అరకిలోమీటరు దూరం వరకు 144 సెక్షన్ అమలు కౌంటింగ్.. కౌంట్‌డౌన్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి రాష్ట్రవ్యాప్తంగా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 49 కేంద్రాల్లో కౌంటింగ్ ఉదయం 8గంటలకే తెరుచుకోనున్న బాక్స్‌లు తొలి అరగంట బ్యాలెట్.. ఆ తర్వాతే ఈవీఎంల్లో పోలైన ఓట్ల లెక్కింపు కౌంటింగ్ పై సీఈఓ వికాస్ రాజ్ టెలీ కాన్ఫరెన్స్ పాల్గొన్న జిల్లా ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులు కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించిన ఎన్నికల సంఘం ప్రధాన అధికారులు అప్రమత్తంగా ఉండండి: డీజీపీ రేపు జరుగనున్న ఓట్ల కౌంటింగ్ అప్రమత్తంగా ఉండాలని ఉన్నతస్థాయి అధికారులకు డీజీపీ అంజనీకుమార్ ఆదేశం కౌంటింగ్ ఏర్పాట్లపై సీపీలు, ఎస్పీలతో ఇవాళ డీజీపీ టెలీ కాన్ఫరెన్స్ అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సూచన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి పాల్వంచ అనుబోస్ ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. కౌంటింగ్ కేంద్రం అనుబోస్ కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గాల వారీగా కౌంటింగ్‌కు ఏర్పాట్లు.. రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు మొత్తం 80 రౌండ్లలో.. జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు కొత్తగూడెం నియోజకవర్గంలోని 253 బూత్లలకు సంబంధించి 18 రౌండ్స్ లో కౌంటింగ్ ఇల్లందు నియోజకవర్గం లోని 241 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్ పినపాక నియోజకవర్గం లోని 244 బూత్ లలో 17 రౌండ్స్ లో కౌంటింగ్ అశ్వారావుపేట నియోజకవర్గం లోని 184 బూత్ లలో 13 రౌండ్స్ లో కౌంటింగ్ భద్రాచలం నియోజకవర్గం లోని 176 బూత్ లలో 12 రౌండ్స్ లో కౌంటింగ్ జిల్లా లో భాగానే నమోదైన పోలింగ్ జిల్లా వ్యాప్తంగా 78.67 శాతం పోలింగ్ నమోదు జిల్లాలో అత్యధికంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో 80.13 శాతం పోలింగ్ నమోదు కౌంటింగ్ విధుల్లో.. 5,250 మంది సిబ్బంది క్లాస్ ఓటు బీఆర్ఎస్కే: పోచారం బీఆర్ఎస్ విజయావకాశాలపై స్పీకర్ పోచారం శ్రీనివాస్ స్పందన బీఆర్ఎస్కు 70-75 సీట్లు పక్కా మాస్-క్లాస్ ఓటర్ల పల్స్ వేరు క్లాస్ ఓటర్లంతా బీఆర్ఎస్ వైపు ఉన్నారు సైలెంట్ ఓటు KCRకు అనుకూలంగా ఉంది కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. కరీంనగర్ జిల్లా నాలుగు నియోజకవర్గాలు కరీంనగర్, చొప్పదండి, హుజురాబాద్, మానకొండూర్.. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఓట్ల లెక్కింపు ఒక్కో గదిలో 14 టేబుల్స్ ఏర్పాటు కరీంనగర్ ఓట్ల లెక్కింపు 28 రౌండ్లు మానకొండూరు ఓట్ల లెక్కింపు 23 రౌండ్లు చొప్పదండి ఓట్ల లెక్కింపు 24 రౌండ్లు హుజురాబాద్ ఓట్ల లెక్కింపు 22 రౌండ్లు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిరిసిల్ల, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాలు... బద్దెనపల్లి గురుకుల పాఠశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు.. వేములవాడ ఓట్ల లెక్కింపు 19 రౌండ్లు....పొస్టల్ బ్యాలెట్ కొసం 3 టేబుల్స్ సిరిసిల్ల ఓట్ల లెక్కింపు కొరకు 21 రౌండ్లు , పోస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం, మంథని మూడు నియోజకవర్గాలు.. మంథని జేఎన్టీయూ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు రామగుండం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 11 రౌండ్లు పొస్టల్ బ్యాలెట్ కొసం 4 టేబుల్స్. పెద్దపల్లి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్,15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ 4 టేబుల్స్ ఏర్పాటు మంథని ఓట్ల లెక్కింపు కొరకు 14 టేబుల్స్, 14 రౌండ్లలో లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు జగిత్యాల జిల్లాలో జగిత్యాల, కొరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల కోసం వీఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ ఏర్పాట్లు జగిత్యాల నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలొ ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం 4 టేబుల్స్ ఏర్పాటు కోరుట్ల నియోజకవర్గం కోసం14 టేబుల్స్ పై 14 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కోసం నాలుగు టెబుల్స్ ధర్మపురి నియోజకవర్గం కోసం 14 టేబుల్స్ 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పొస్టల్ బ్యాలెట్ కొసం నాలుగు టేబుల్స్ ఏర్పాటు బెట్టింగ్‌లో పొలం కూడా..? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరుగా పందేలు అభ్యర్థుల గెలుపోటములు.. మెజార్టీ ఎంత సాధిస్తారనేదానిపై బెట్ యాప్‌ల సాయంతో నెలరోజులుగా బెట్టింగులు వేస్తున్న ముఠా సిర్పూర్లో లక్షల్లో బెట్టింగ్ డబ్బులతో పాటు పొలంపైనా పందేలు వేస్తున్న కొందరు తన రెండు ఎకరాల భూమిని పందేంలో ఉంచిన ఓ వ్యక్తి! బీజేపీ ధీమా ఏంటంటే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి విచిత్ర పరిస్థితి పోలింగ్ ముందుదాకా ప్రభుత్వం రాబోతోందంటూ ప్రకటనలు ఆ స్టేట్‌మెంట్‌తోనే అగ్రనేతల హడావిడి ఎగ్జిట్‌పోల్స్‌తో ఢీలా పడ్డ పార్టీ కేడర్ తాజాగా బీజేపీ మరో ధీమా 2018 కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామంటూ లీడర్ల స్టేట్మెంట్లు ఓట్లు-సీట్లు పెరుగుతాయని అంచనా 2018లో కేవలం 14 లక్షల ఓట్లు ఈసారి మాత్రం పోలైన ఓట్లలో.. 20 శాతం ఓట్లు వస్తాయని బీజేపీ అంచనా ..అయినా బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనే! తెలంగాణ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ భవితవ్యంపై టెన్షన్ పడుతున్న అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తామని.. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ధీమా నిన్న ప్రగతి భవన్లో నేతలతో సమావేశం వార్ రూమ్ నివేదికపైనా సుదీర్ఘమైన చర్చ బయటకు వచ్చిన విక్టరీ సింబల్ చూపించిన కొందరు నేతలు హైదరాబాద్ దాటిన తర్వాత మళ్లీ గెలుస్తామా? లేదా? అని చర్చలు నేతల అధైర్యంతో.. కేడర్‌లోనూ ఆందోళన సీనియర్లలోనూ కొందరికి ఓటమి భయం? ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్‌లో జోష్ 10:06AM రేపు కాంగ్రెస్ బిగ్ ప్లాన్ రేపు డిసెంబర్ 3న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి అభ్యర్థులు చేజారకుండా అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ రేపు కాంగ్రెస్ అభ్యర్థుల వెంట ఏఐసీసీ పరిశీలకులు గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలను నేరుగా హైదరాబాద్ తాజ్‌కృష్ణకు తీసుకురానున్న పరిశీలకులు మంచి మెజారిటీ వస్తే నో క్యాంప్ ఇవాళే హైదరాబాద్‌కు కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ ఈ మొత్తం వ్యవహారాలను డీకే శివకుమార్‌కే అప్పగించిన అధిష్టానం హమ్మయ్యా.. ఇక రిలాక్స్ తెలంగాణలో రిలాక్స్ అవుతున్న పొలిటీషియన్స్ ఇంతకాలం ప్రచారంతో బిజీబిజీ రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు.. ఇంటింటికి తిరిగి ప్రచారం అలసిపోయిన లీడర్లు పోలింగ్ ముగియడంతో ఇళ్లకు చేరుకున్న వైనం కుటుంబ సభ్యులతో గడుపుతూ కూల్ అవుతున్న నేతలు రేపు ఎలాగూ కౌంటింగ్ టెన్షన్ గ్యాలరీ కోసం క్లిక్ చేయండి ఖమ్మం జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు ఇలా.. ఖమ్మం జిల్లా లో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి తల్లంపాడు శ్రీ చైతన్య ఇంజనీర్ కళాశాల లో స్ట్రాంగ్ రూం.. అక్కడే కౌంటింగ్ కేంద్రం శ్రీ చైతన్య కళాశాల వద్ద కేంద్ర బలగాలతో భద్రత నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ కు ఏర్పట్లు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానున్న కౌంటింగ్ ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్ళు పోలింగ్ బూత్ ల వారీగా రౌండ్స్ కేటాయింపు 104 రౌండ్లలో ఖమ్మం జిల్లా లోని 5 నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తి చేయనున్న అధికారులు ఖమ్మం నియోజకవర్గం లోని 355 బూత్ లకు సంబంధించి 25 రౌండ్స్ లో కౌంటింగ్ పాలేరు నియోజకవర్గం లోని 289 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్ మధిర నియోజకవర్గం లోని 268 బూత్ లలో 19 రౌండ్స్ లో కౌంటింగ్ వైరా నియోజకవర్గం లోని 252 బూత్ లలో 18 రౌండ్స్ లో కౌంటింగ్ సత్తుపల్లి నియోజకవర్గం లోని 292 బూత్ లలో 20 రౌండ్స్ లో కౌంటింగ్ జిల్లా లో భారీగా నమోదైన పోలింగ్ 5250 మంది సిబ్బంది కౌంటింగ్ విధుల్లో పాల్గొంటున్నారు జిల్లా వ్యాప్తంగా 83.83 శాతం పోలింగ్ నమోదు జిల్లా లో అత్యధికంగా పాలేరు నియోజకవర్గంలో 90.91 శాతం పోలింగ్ నమోదు కేసీఆర్‌పై నమ్మకం ఉంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు అనుకూలంగా పలువురి పోస్టులు కేసీఆర్‌పై నమ్మకం ఉందంటూ వ్యాఖ్యలు ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల నేపథ్యంతో ఢీలా పడిన బీఆర్ఎస్ శ్రేణులు ఇప్పటికే ప్రగతి భవన్ మీటింగ్ ధైర్యం నూరిపోసిన కేసీఆర్ అండ్ కేటీఆర్ ప్రజల కారువైపే ఉన్నారంటూ.. ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామంటూ నేతలకు భరోసా ఎగ్జిట్ పోల్స్ చెత్త అంటూ ఖండన ఎగ్జాక్ట్(కచ్చితమైన) పోల్స్ తమకు అనుకూలంగా ఉంటాయంటూ ప్రకటనలు అదే సమయంలో కేసీఆర్, బీఆర్ఎస్ సర్కార్‌కు అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విశ్వాసం 09:40 AM 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ మహబూబాబాద్ లోని సోషల్ వెల్ఫేర్ మహిళ గురుకులంలో రేపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయము 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం.మొదట పోస్టల్ బ్యాలెట్,మరియు హోం ఓటింగ్ ఓట్ల లెక్కింపు ఉదయం 8:30 నిమిషాలకు ఈవీయము ఓట్ల లెక్కింపు ప్రారంభం మహబూబాబాద్ నియోజకవర్గంలోని 5 మండలాల్లో కలిపి 283 పోలింగ్ బూతులు కలవు,మొత్తం ఓటర్ల సంఖ్య 2 లక్షల 53 వేల 342 పోలింగ్ శాతము 82.34.పోలైన ఓట్లు మొత్తం 2 లక్షల 8 వేల 958 ఓట్లు మొత్తం కౌంటింగ్ కి 14 టేబుల్స్ ఏర్పాటు,ఒక్కో టేబుల్ కి ఒక్కో ఈవీఎం లెక్కింపు, ప్రతి రౌండ్ కి 14 ఈవీఎం లెక్కింపు మొత్తం 20 రౌండ్లలో మహబూబాబాద్ కౌంటింగ్ ప్రతి రౌండ్ కౌంటింగ్ కి 20 నిమిషాల సమయము పట్టే అవకాశం మొదటి రౌండ్ పలితము కొద్దిగా ఆలస్యము అయ్యే అవకాశం 9:30 నిమిషాలకు మొదటి ఈవీఎం రిజల్ట్! మధ్యాహ్నాం 2 గంటల వరకు చివరి ఫలితం తేలే ఛాన్స్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు స్ట్రాంగ్ రూంలు ఉదయము 6 గంటలకే ఓపెన్ చేసే అవకాశం 09:23 AM జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏర్పాట్లు పూర్తి రేపు ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు ఉదయం 8గంటలకు పోస్టల్ బ్యాలెట్ తో ఓట్ల లెక్కింపు ప్రారంభం 14 టేబుల్స్ ఏర్పాటు చేసి 23 రౌండ్లలో ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడి 14 టేబుళ్లలో ఒక్కో టేబుల్‌కు నలుగురు సిబ్బంది చొప్పున మొత్తం 56 మంది సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొంటారు. ముగ్గురు నోడల్ ఆఫీసర్లు, ఆరుగురు కౌంటింగ్ సూపర్వైజ ర్లు, 12మంది కౌంటింగ్ అసిస్టెంట్లు కౌంటింగ్ విధుల్లో పాల్గొంటారు. ఈవీఎంలను అంబేద్కర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచి ప్రత్యేక పోలీసు బందోబస్తును ఏర్పాటు 09:15 AM కుట్ర జరుగుతోందంటూ కాంగ్రెస్ ఫిర్యాదు తెలంగాణ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్(సీఈవో) వికాస్ రాజ్‌ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతోపాటు ముఖ్య నాయకులు కూడా ప్రస్తుత ప్రభుత్వం రైతు బంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లింపునకు మళ్లిస్తున్నారని ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే కుట్ర జరుగుతోందని ఫిర్యాదు ప్రభుత్వ లావాదేవీలపై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్ లో అటు ఢిల్లీ లో ఎన్నికల సంఘం, ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేస్తామంటున్న కాంగ్రెస్ 07:59 AM తెలంగాణ ఫలితాలు.. కాయ్‌రాజా కాయ్! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై జోరుగా సాగుతున్న బెట్టింగులు? ఏపీలోనూ యాప్‌ల ద్వారా బెట్టింగ్‌లు సాగుతున్నట్లు సమాచారం గెలుపుపై అన్ని పార్టీల ధీమా ఎగ్జిట్‌పోల్స్ వచ్చాక.. రెట్టింపు అవుతున్న బెట్టింగ్ సొమ్ము ఫలానా పార్టీకి ఇన్ని సీట్లు అంటేనే బెట్ వేయాలంటూ జోరుగా పందేలు సామాజికవర్గాలు, అనుకూల,ప్రతికూల అంశాలపై లెక్కలేసుకుని మరీ.. కీలక నేతల గెలుపోటములపైనా భారీగా.. కీలక నేతల మెజార్టీ ఫిగర్పైనా బెట్టింగులు బెట్టింగ్ ముఠాలపై పోలీసుల నజర్ 07:31 AM ఆ అంచనాలు నిజం అవుతాయా? తప్పుతాయా? ఆసక్తికరంగా తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు కాంగ్రెస్‌కే ఎక్కువ అవకాశాలున్నాయంటూ మెజార్టీ సర్వే సంస్థల వెల్లడి పోలింగ్ ముగిసిన సాయంత్రం 5గం. వరకే అభిప్రాయ సేకరణ కానీ.. ఆ తర్వాత జరిగిన ఓటింగ్ తమకు కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్ ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో.. కాంగ్రెస్ సంబురాలు అధైర్య పడొద్దంటూ బీఆర్ఎస్ కేడర్‌కు కేసీఆర్ ధైర్యం ఎగ్జిట్‌పోల్స్‌ను రబ్బిష్ అంటూ కొట్టిపారేసిన కేటీఆర్ ఎగ్జిట్ పోల్స్‌ను తామూ తారుమారు చేస్తామంటూ బీజేపీ ప్రకటన ఫలితాలు షాకింగ్‌గా ఉంటాయంటూ బీజేపీ నేత బండి సంజయ్ వ్యాఖ్యలు 07:22 AM ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రేపటి కౌంటింగ్ ఇలా.. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని పది అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు అధికారుల ఏర్పాట్లు నాలుగు జిల్లాలో కౌంటింగ్ కేంద్రాలు ఇలా.. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో టీటీడీసీ కేంద్రంలో ఆదిలాబాద్ , బోథ్ నియోజకవర్గాల ఓట్లను లెక్కించనున్న అధికారులు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం లో పీవీటీజీ బాలికల పాఠశాలలో ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు మంచిర్యాల జిల్లా ముల్కల ఇంజనీరింగ్ కళశాలలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూరు ఓట్ల లెక్కింపు నిర్మల్ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్ , ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కౌంటింగ్ సందర్భంగా.. ఆయా కేంద్రాల వద్ద ఆంక్షల అమలు.. 144 సెక్షన్ విధింపు ఉదయం 6గం. నుంచి సాయంత్రం 6గం. ఆంక్షలు అమలు కౌంటింగ్ కేంద్రాల వద్ద సంబురాలు నిషేధం 7:16 AM కాంగ్రెస్ గెలవబోతోంది: రేవంత్‌రెడ్డి ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో జోష్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ వస్తుందనే ధీమా విజయం తమదేనంటూ నేతల సంబురాలు.. టీపీసీసీ రేవంత్‌రెడ్డి ఇంటికి క్యూ ఓట్ల లెక్కింపు వరకూ ఈవీఎంల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని రేవంత్ సూచన 9న కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.. అదే రోజు గ్యారంటీ హామీలపై మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకుంటుందంటూ నేతల ప్రకటనలు నేడు సీఈవో వికాస్‌రాజ్‌ను కలవనున్న టీ కాంగ్రెస్ నేతల బృందం ఓటమి భయంతో కేసీఆర్ రైతు బంధు నిధుల్ని దారి మళ్లిస్తున్నారనే ఆరోపణతో ఫిర్యాదు చేయనున్న కాంగ్రెస్ నేతలు 07:09 AM పటిష్ట భద్రత.. పక్కా ఏర్పాట్లతో కౌంటింగ్: సీఈవో వికాజ్‌రాజ్ స్ట్రాంగ్‌రూంలలో ఈవీఎంలు మొత్తం 40 కంపెనీల కేంద్ర బలగాలు ఈవీఎంల బందోబస్తులో రేపు తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం అభ్యర్థుల్లో 221 మంది మహిళలు, ఒకరు ట్రాన్స్‌జెండర్ పోలింగ్ అనంతరం అన్నింటినీ పార్టీ అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలోనే స్ట్రాంగ్‌రూంలకు ఈవీఎంల తరలింపు స్ట్రాంగ్‌రూంలకు అన్ని రకాలుగా భద్రత చర్యలు సీసీ కెమెరాలు ఏర్పాటు 49 ప్రాంతాల్లో లెక్కింపు కేంద్రాలు కౌంటింగ్ కోసం మొత్తం 1,766 టేబుల్స్ ఏర్పాటు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉండే టేబుల్స్14 కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద నలుగురు ఎన్నికల సిబ్బంది జీహెచ్ఎంసీ పరిధిలో 500 పోలింగ్ కేంద్రాల కంటే ఎక్కువగా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో 28 టేబుల్స్, మిగిలిన నియోజకవర్గాల్లో 14 చొప్పున పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం ప్రత్యేకంగా 500 ఓట్లకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా సమాంతరంగా కొనసాగింపు.. పోస్టల్ బ్యాలెట్ ద్వారా 1.80 లక్షల మంది ఎన్నికల సిబ్బంది ఓటు హక్కు వినియోగం ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభం పోస్టల్ ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అరగంట తర్వాత.. 8.30 నుంచి ఈవీఎంల లెక్కింపు 07:00 AM మళ్లీ హైదరాబాద్‌కు డీకేఎస్ మళ్లీ తెలంగాణకు రానున్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కౌంటింగ్.. ఫలితాల నేపథ్యంలో రేపు సాయంత్రం హైదరాబాద్‌కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పరిశీలకుడిగా డీకేఎస్‌ను నియమించిన ఏఐసీసీ రిసార్ట్ రాజకీయాల అవసరం ఉండబోదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డీకేఎస్ 06:57 AM ఆగం కావొద్దు.. మనమే వస్తాం: కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరికి వారిలోనే ధీమా పార్టీ కేడర్‌ను ధైర్యం నూరిపోసిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలతో నిన్న భేటీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి గాబరా పడొద్దు.. మళ్లీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ భరోసా ఫలితాలు వెల్లడయ్యే వరకూ ప్రశాంతంగా ఉండండి.. 3న అందరం కలిసి సంబరాలు చేసుకుందాం చివరి గంటలో జరిగిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా ఉండొచ్చని కేసీఆర్ అభిప్రాయం ప్రగతి భవన్ నుంచి బయటకు వస్తూ విక్టరీ సింబల్ చూపించిన పలువురు నేతలు డిసెంబర్ 4వ తేదీన సచివాలయంలో కేబినెట్ భేటీకి సీఎం కేసీఆర్ నిర్ణయం 06:54 AM నగరంలో రేపు అక్కడ ఆంక్షలు ఆదివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా లెక్కింపు కేంద్రాల వద్ద ఆంక్షలు ఉత్తర్వులు జారీ చేసిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్లు ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు అమలులో ఆంక్షలు కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు మైక్‌లు, మ్యూజిక్ సిస్టమ్, ప్రసంగాలు చేయడం, నిషేధిత ఫోటోలు, సింబల్స్, ప్లకార్డులు ప్రదర్శించకూడదు విధి నిర్వహణలో ఉన్న పోలీసు, మిలటరీ, ఎలక్షన్ అధికారులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు రోడ్లు, బహిరంగ ప్రదేశాలలో టపాసులు కాల్చడంపై నిషేధం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఆదివారం మద్యం దుకాణాల బంద్ 06:40 AM రేపే కౌంటింగ్.. తెలంగాణలో రేపే అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉదయం 8గం. నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్ మధ్యాహ్నాం కల్లా ఫలితాలపై రానున్న క్లారిటీ తేలనున్న 2,290 మంది అభ్యర్థుల భవితవ్యం ప్రధాన పార్టీల్లో ఉత్కంఠ వన్ సైడెడ్‌గా ఎగ్జిట్ పోల్స్ అయినా గెలుపుపై ఎవరికి వారే ధీమా 06:38 AM అత్యల్పంగా రాజధానిలోనే.. పోలింగ్ కేంద్రాలకు మోహం చాటేసిన రాజధాని వాసులు జిల్లా వారీగా.. హైదరాబాద్‌లో అత్యల్పంగా నమోదు అయిన పోలింగ్ కేవలం 47.88 శాతం మాత్రమే రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గం వారీగా.. అత్యల్పంగా యాకుత్ పురాలో కేవలం 39.64 శాతం ఓటింగ్ మలక్‌పేట్‌లో 41.32 శాతం, చార్మినార్‌లో 43.27 శాతం, చాంద్రాయణగుట్టలో 45.26 శాతం బహదూర్ పురాలో 45.50 శాతం, జూబ్లీహిల్స్ లో 47.49 శాతం, అతిపెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లిలో 48.75 శాతం, ఎల్బీనగర్లో 49.07శాతం, కంటోన్మెంట్లో 49.36 శాతం పోలింగ్ మేడ్చల్ - మల్కాజ్ గిరిలో 56.17 శాతం, రంగారెడ్డిలో 59.94 శాతం, హన్మకొండలో 68.81 శాతం ఓటింగ్ 06:36 AM పోలింగ్ ఇలా.. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,26,02,793 మంది పోలింగ్ పాల్గొన్న 2,32,59,256 మంది ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లలో.. .. 1,15,84,728 మంది పురుషులు, మహిళలు 1,16,73,722 మంది, ఇతరులు 806 మంది జిల్లాల వారీగా చూస్తే.. యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 90.36 శాతం పోలింగ్ నియోజకవర్గాల వారీగా చూస్తే.. నల్గొండ మునుగోడులో 91.89 శాతం ఓటింగ్ ఖమ్మం పాలేరులో 90.89, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో 90.77 శాతం పోలింగ్ 06:32 AM ఫైనల్ ఓటింగ్ పర్సంటేజ్ ఇలా.. నవంబర్ 30వ తేదీ గురువారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గం. నుంచి సాయంత్రం 5.గం దాకా.. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గం. కే ముగింపు అప్పటికే లైన్లో ఉన్నవాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం రాత్రి 10:30గం. దాకా కూడా క్యూలో ఓటర్లు ఆలస్యంగా శుక్రవారం సాయంత్రం అధికారిక పోలింగ్ శాతం విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో నమోదైన తుది పోలింగ్ శాతం 71.34 శాతం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 73.37 శాతం నమోదు గతంలో కంటే రెండు శాతం పోలింగ్ తగ్గింది -
ప్రశాంతంగా నిద్రపోయా: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా నిద్రపోయా. ఎగ్జిట్ పోల్స్‌లో ఏదో జరుగుతున్నట్లు చూపొచ్చు. కానీ ఎగ్జాక్ట్ పోల్స్ మాకు శుభవార్తను అందజేస్తాయి’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు వ్యాఖ్యానించారు. శుక్రవారం ప్రగతిభవన్లోనే ఉన్న కేటీఆర్.. సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీలో పాల్గొన్నారు. అనంతరం అక్కడే ఉన్న మంత్రి హరీశ్‌రావు కూడా మాట్లాడుతూ..శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం వంద రోజుల పాటు శ్రమించిన కార్యకర్తల సేవలు వెలకట్టలేనివని ప్రశంసించారు. -
కాంగ్రెస్‌కే పూర్తి మెజారిటీ.. ఇండియా టుడే సర్వే
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను సాధిస్తుందని ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ సర్వే పేర్కొంది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. అధికార బీఆర్ఎస్కు 36 శాతం ఓట్లతో 34–44 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీ 42 శాతం ఓట్లతో 63–73 సీట్లు సాధించి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది. బీజేపీకి 14శాతం ఓట్లతో 4 నుంచి 8 సీట్లు రావొచ్చని.. ఎంఐఎం 8శాతం ఓట్లతో 5–7 సీట్లు సాధించవచ్చని తెలిపింది. రాష్ట్రంలో గురువారం పోలింగ్ ముగియగానే.. జాతీయ, ప్రాంతీయ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ సర్వేలను విడుదల చేశాయి. చాలా వరకు కాంగ్రెస్ వైపు మొగ్గు ఉన్నట్టు పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా శుక్రవారం తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించింది. బీఆర్ఎస్ సర్కారుపై వివిధ వర్గాల ప్రజల్లో ఏర్పడిన వ్యతిరేకత ఎగ్జిట్‌పోల్ సర్వేలో కనిపించిందని పేర్కొంది. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలా మందికి మళ్లీ టికెట్ ఇవ్వడం, వారిపై స్థానికంగా నెలకొన్న తీవ్ర వ్యతిరేకత ప్రభావం చూపిందని విశ్లేషించింది. ప్రాంతాల వారీగా పరిశీలన జరిపి రాష్ట్రంలో ఉత్తర, మధ్య (సెంట్రల్), దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల వారీగా ఇండియాటుడే–యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. ఉత్తర తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు సాగిందని.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్దే పైచేయిగా ఉందని వివరించింది. దక్షిణ, మధ్య తెలంగాణలలో కాంగ్రెస్ పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచిందని, ఈ ప్రాంతాల నుంచే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ► ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్కు 13, కాంగ్రెస్‌కు 15, బీజేపీకి 5 సీట్లు రావొచ్చని పేర్కొంది. ► దక్షిణ తెలంగాణలో బీఆర్ఎస్కు 6, కాంగ్రెస్‌కు 27, బీజేపీకి ఒక స్థానం వస్తాయని అంచనా వేసింది. ► మధ్య తెలంగాణలో బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 22 సీట్లు సాధించవచ్చని తెలిపింది. ► హైదరాబాద్‌లో బీఆర్ఎస్ 11, కాంగ్రెస్ 3, బీజేపీ 1, ఎంఐఎం 6 చోట్ల గెలిచే అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది. ► తెలంగాణ తదుపరి సీఎంగా కేసీఆర్ ఉంటే బాగుంటుందని 32శాతం మంది, రేవంత్‌రెడ్డి కావాలని 21 శాతం మంది, ఇతర కాంగ్రెస్ నాయకుడు సీఎం కావాలని 22 శాతం మంది, బీజేపీ నాయకుడు ఉంటే బాగుంటుందని 12 శాతం మంది తమ సర్వేలో పేర్కొన్నట్టు వెల్లడించింది. ఇండియా టుడే– యాక్సిస్ మైఇండియా ఎగ్జిట్‌పోల్ అంచనాలివీ పార్టీ-- సీట్లు-- ఓట్ల శాతం బీఆర్ఎస్ 34–44 32 శాతం కాంగ్రెస్ 63–73 42 శాతం బీజేపీ 4–8 14 శాతం ఇతరులు (ఎంఐఎం సహా) 5–8 (ఎంఐఎం–8%, ఇతరులు–4%) -
అభ్యర్థులకు తడిసిమోపెడు..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు తడిసి మోపైడెంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య ఈసారి తీవ్ర పోటీ నెలకొంది. దీంతో అభ్యర్థులు సభలు సమావేశాల నిర్వహణకు అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించారు. మరోవైపు ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బుల పంపిణీపాటు గిఫ్ట్‌లు, చికెన్, మటన్, మందు వంటి వాటిలో ప్రలోభ పెట్టారు. ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కొందరు అభ్యర్థులు ధైర్యంగా ఖర్చు చేయగా, మరికొందరు అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టారు. ఇంకొందరైతే ఆ ఖర్చులను తట్టుకోలేక, ఓటర్లకు డబ్బులు ఇచ్చే పరిస్థితి లేక చేతులెత్తాయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. నామినేషన్ల రోజు నాటి నుంచే.. నామినేషన్ల పర్వం ప్రారంభమైన నాటి నుంచి ఖర్చుల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి అభ్యర్థులంతా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది మందిని పిలిపించుకున్నారు. ఒక్కోక్కరికి రూ.200 నుంచి రూ.300 చెల్లించారు. గ్రామాల్లో రోజూ ఆయా పార్టీల అభ్యర్థులు కొంత మందిని టీమ్‌గా ఏర్పాటు చేసి ఇల్లిల్లూ తిరుగుతూ తమ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని స్టిక్కర్లు అంటిస్తూ.. కరపత్రాలు పంచుతూ ప్రచారం చేశారు. బూత్‌ల వారీగా డబ్బుల పంపిణీ.. ప్రచార ఖర్చులకు తోడు బూత్‌లో ప్రచారం చేసే వారి ఖర్చుల నిమిత్తం రోజుకు ఒక పార్టీ బూత్‌కు రూ.5 వేల చొప్పున ఇవ్వగా, మరో పార్టీ రూ.10 వేలకు పైగా చెల్లించింది. వార్డు లీడర్లకు, ముఖ్యమైన వారికి సాయంత్రమైతే మందు పార్టీల ఖర్చు అదనంగా పెట్టుకోవాల్సి వచ్చిందని ఓ నాయకుడు వివరించారు. ఈ ఖర్చులను కొంత మంది అభ్యర్థులు తట్టుకోలేక నాలుగైదు రోజుల పాటు బూత్‌లలో డబ్బుల పంపిణీ నిలిపివేశారు. మందు, విందులు అదనం.. నామినేషన్ల ప్రక్రియ నాటి నుంచే గ్రామాలు, వార్డుల వారీగా కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు ఆయా వృత్తి సంఘాలతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. వారికి మందు, విందు ఏర్పాటు చేశారు. కొందరు రూ.500 చొప్పున అక్కడే పంపిణీ చేశారు. పోలింగ్‌కు ముందు డబ్బుల పంపిణీ పోలింగ్‌కు ముందు రోజు నుంచి అభ్యర్థులు భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చింది. ఒక్కో నియోజకవర్గంలో సగటున లక్ష మందికిపైగా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు అభ్యర్థులు ఓటుకు రూ.వేయి, రూ.1500 పంపిణీ చేయగా, మరికొందరు రూ.200 నుంచి రూ.800 వరకు ఇచ్చారు. వీటితో పాటు మద్యం ఆఫ్, ఫుల్ బాటిళ్లను కూడా పంపిణీ చేశారు. కొందరు రూ.2 వేల చొప్పున పంపిణీ చేస్తే.. ఇంకొందరు రూ.2,500 పంపిణీ చేసినట్లు తెలిసింది. రెండు మూడు నియోజకవర్గాల్లో అధికార పార్టీ అభ్యర్థులే డబ్బుల్లేక చేతులెత్తేసినట్లు చర్చ జరుగుతోంది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయని పార్టీల కోసం ఓటర్లు చివరి వరకు ఎదురుచూసి, డబ్బులు ఇచ్చిన వారికి అనుకూలంగా వ్యవహరించినట్లు తెలిసింది. -
మ్యాజిక్ ఫిగర్.. ఎంతెంత దూరం?
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలైన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో గెలుపోటములపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈసారైనా అధికారంలోకి వస్తున్నామా, లేదా అన్నదానిపై అభ్యర్థులు, ముఖ్య నేతలు, పార్టీ కేడర్‌లో ఉత్కంఠ కనిపిస్తోంది. పోలింగ్ సరళి అనుకూలమనే లెక్కలు, ‘చేతి’కి మొగ్గు ఉందన్న ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు నిజమవుతాయా, మ్యాజిక్ ఫిగర్ దాటి పవర్లోకి వస్తామా అన్న దానిపైనే శుక్రవారం పొద్దంతా కాంగ్రెస్ శ్రేణులు చర్చలతో గడిపాయి. కౌంటింగ్‌కు మరోరోజు ఉన్న నేపథ్యంలో.. ఎన్ని స్థానాల్లో గెలుస్తాం? ఎక్కడెక్కడ గట్టి పోటీ అవకాశముంది? ఎక్కడెక్కడ ఓడిపోవచ్చు? దక్షిణ తెలంగాణను నిజంగానే స్వీప్ చేస్తున్నామా? ఉత్తర తెలంగాణలో బలం పెరిగిందా? హైదరాబాద్, శివారు నియోజకవర్గాల పరిస్థితేంటి? అన్న అంశాలపై నేతలు లెక్కలు వేసుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడి నుంచి గ్రామస్థాయి కార్యకర్త వరకు ఇదే తీరు కావడం గమనార్హం. ఉత్కంఠలో అభ్యర్థులు ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్ అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠలో ఉన్నారు. తాము గెలుస్తామా లేదా అన్నదానిపై లెక్కలు వేసుకుంటున్నారు. గ్రామ, మండల స్థాయి నేతలతో భేటీ అవుతూ.. ఏ గ్రా మంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి? అందులో తమ కు పడిన ఓట్లెన్ని? ఏ మండలంలో ఎంత మెజార్టీ వస్తుంది? ఎంత తక్కువ వస్తాయనే అంశాలతో క్షేత్రస్థాయిలో పోలింగ్ సరళిపై అంచనాలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆదివారం జరగనున్న కౌంటింగ్ కోసం ఏజెంట్లు, వారికి కావాల్సిన పత్రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలింగ్ రోజున ఎంత జాగ్రత్తగా ఉన్నామో, కౌంటింగ్ కేంద్రాల్లోనూ అంతే జాగ్రత్తగా ఉండాలని, ఎక్కడా తేడా రాకుండా కౌంటింగ్‌ను పరిశీలించాలని ఏజెంట్లకు సూచనలిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏఐసీసీతో సంప్రదింపులు తెలంగాణ ఫలితం సానుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో.. టీపీసీసీ నాయకత్వం ఎప్పటికప్పుడు ఏఐసీసీ నాయకత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తదితరులు తమ నియోజకవర్గాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఢిల్లీ పెద్దలతో టచ్‌లో ఉన్నారు. రాష్ట్రంలోని పరిస్థితిని వారికి వివరిస్తూ, ఏయే పరిణామాలు తలెత్తితే ఎలా ఎలా వ్యవహరించాలన్న దానిపై హైకమాండ్ నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారు. మరోవైపు వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా పోలింగ్ సరళిపై ఇచ్చిన నివేదికలో పార్టీకి అధికారం వస్తుందని పేర్కొన్నట్టు తెలిసింది. దీనికి అనుగుణంగా టీపీసీసీ నాయకత్వం ఏర్పాట్లు చేసుకుంటోంది. హైదరాబాద్‌లోని రేవంత్, భట్టి నివాసాలకు పలువురు పార్టీ నేతలు వెళ్లి చర్చలు జరిపారు. పోలింగ్ సరళి ఎలా జరిగింది? ఏ జిల్లాలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయన్న దానిపై చర్చించారు. పూర్తి మెజార్టీ రాకుంటే ఏం చేద్దాం? ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నా.. ఆదివారం వెలువడే ఫలితాల్లో పార్టీకి వచ్చే సీట్లను బట్టి పావులు ఏఐసీసీ, టీపీసీసీ ప్రణాళికలు రచిస్తున్నాయి. అధికారం చేపట్టేందుకు అవసరమైన దానికంటే ఎక్కువ స్థానాల్లో గెలిస్తే ఎలాంటి సమస్యా ఉండదని నేతలు పేర్కొంటున్నారు. కానీ ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచినా పూర్తి మెజార్టీ రాకుంటే.. గెలిచిన నాయకులందరినీ తక్షణమే కర్ణాటకకు తరలించి క్యాంపు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు కూడా చేపట్టిందని.. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను హైదరాబాద్‌కు పంపాలని నిర్ణయించిందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. డీకే శివకుమార్ శనివారం మధ్యాహ్నం కల్లా హైదరాబాద్‌కు వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి. ఇక కొన్నిసీట్లు తక్కువపడితే ఎంఐఎం మద్దతు తీసుకోవాలా, వద్దా? అన్న అంశంపైనా ఏఐసీసీతో టీపీసీసీ నేతల సంప్రదింపుల సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది. -
18 నుంచి 22 సీట్లు గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో 18 నుంచి 22 సీట్ల వరకు గెలుస్తామని బీజేపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. పార్టీ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో 10 నుంచి 12, అలాగే గ్రేటర్ పరిధిలో 4, రంగారెడ్డి, వరంగల్, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్క సీటు గెలుపుపై బీజేపీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. కొన్ని నియోజకవర్గాల్లోని వివిధ పోలింగ్ బూత్‌లలో గురువారం రాత్రి దాకా పోలింగ్ కొనసాగడంతో ఆయా ప్రాంతాల నుంచి పార్టీ కార్యాలయానికి సమాచారం ఆలస్యంగా చేరింది. క్షేత్రస్థాయి సమాచారం, పార్టీ నాయకుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం ముఖ్యనేతలు పార్టీ గెలిచే స్థానాలపై ఈ అంచనాకు వచ్చినట్లు చెపుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లతో బీజేపీ ముఖాముఖిగా పోటీపడుతున్న సీట్లతో పాటు, ఈ మూడుపార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొన్న నియోజకవర్గాల్లో కొన్నిచోట్ల అనూహ్య ఫలితాలు వస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. కనీసం 25 నుంచి 30 సీట్లలో గట్టి పోటీనివ్వడంతో పాటు, పార్టీ బలంగా ఉన్న చోట్ల ఓటింగ్ శాతం పెరగడం ద్వారా 15 నుంచి 20 శాతం దాకా బీజేపీ ఓటింగ్ శాతం నమోదు చేస్తుందని విశ్వసిస్తున్నారు. కాగా, పార్టీ అభ్యర్థులు పోటీ చేసిన 111 నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం పెరగడం, ఇతర సానుకూల అంశాలపై నేతలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గురు, శుక్రవారాల్లో వివిధ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్‌పోల్స్ ఫలితాల్లో బీజేపీకి అంతగా సానుకూలత కనిపించకపోవడం పట్ల పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికారికంగా వెలువడ్డాక వాస్తవ పరిస్థితిని బేరీజు వేయాల్సి ఉంటుందని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు. -
ఆగమెందుకు.. మళ్లీ మనమే: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘ఆగమాగం, పరేశాన్ ఎందుకు అయితున్నరు. మళ్లా మనమే గెలుస్తున్నం. ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందించబోతున్నాం. రెండు రోజులు నిమ్మళంగా ఉండండి. 3వ తేదీన అందరం కలసి సంబురాలు చేసుకుందాం..’’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు సూచించారు. శుక్రవారం పొద్దంతా ఓటింగ్ సరళి, ఇతర అంశాలపై సమీక్షించిన సందర్భంగా నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఈ నెల 4న (సోమవారం) మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుందని సీఎంవో నుంచి ప్రకటన వెలువడింది. ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుండటంతో.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు, కేబినెట్ భేటీ నిర్వహణకు నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రగతిభవన్‌కు బారులు తీరిన నేతలు సీఎం కేసీఆర్ గురువారం సాయంత్రమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి ప్రగతిభవన్‌కు చేరుకోగా.. శుక్రవారం ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలు ప్రగతిభవన్‌కు బారులు తీరారు. పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు, మంత్రి నిరంజన్‌రెడ్డి, మధుసూదనాచారి, బాల్క సుమన్‌తోపాటు నల్గొండ, హైదరాబాద్ తదితర జిల్లాలకు చెందిన నేతలు వచ్చి సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆదివారం వెలువడే ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్కే సానుకూలంగా ఉంటాయని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు తెలిసింది. కేసీఆర్‌తో భేటీ తర్వాత ప్రగతిభవన్ నుంచి బయటకు వచ్చిన నేతలంతా.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొనడం గమనార్హం. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కవిత నివాసంలో భేటీ అయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావులతో సమీక్ష పార్టీ అధినేత కేసీఆర్‌తో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మంత్రి హరీశ్‌రావు ఇద్దరూ ప్రగతిభవన్‌లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. జిల్లాలు, అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా వార్రూమ్ల నుంచి, వివిధ వర్గాల నుంచి అందిన గణాంకాలు, నివేదికలతోపాటు నియోజకవర్గ ఇన్చార్జులు, అభ్యర్థుల నుంచి అందిన వివరాలను విశ్లేంచారు. కీలక నియోజకవర్గాలు గజ్వేల్, కామారెడ్డి, కొడంగల్‌లో ఓటింగ్ సరళిపైనా పోస్టుమార్టం చేశారు. పార్టీ సాంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు బీఆర్ఎస్కు అనుకూలంగానే ఓటింగ్‌లో పాల్గొన్నారని ఈ సందర్భంగా కేసీఆర్ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. హంగ్ ఫలితాలకు అవకాశం లేదని, స్పష్టమైన మెజారిటీతోనే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ కాదు.. ఎగ్జాక్ట్ పోల్స్ లెక్క! అసెంబ్లీ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ తనను కలసిన నేతలతో పేర్కొన్నట్టు తెలిసింది. బీఆర్ఎస్ పకడ్బందీగా చేసిన పోల్ మేనేజ్‌మెంట్‌తోపాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీ చీల్చిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే బీఆర్ఎస్కే సానుకూలత ఉందని చెప్పినట్టు సమాచారం. ఎగ్జిట్ పోల్స్ కాకుండా ఎగ్జాక్ట్ పోల్‌నే లెక్క అని పేర్కొన్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపు సందర్భంగా పాటించాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారని.. ఏజెంట్ల నియామకం మొదలు ప్రక్రియ పూర్తయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారని సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడే క్రమంలో పార్టీ అభ్యర్థులతో టచ్‌లో ఉండాలని కేటీఆర్, హరీశ్‌రావులకు సూచించారని తెలిసింది. -
రేవంత్‌రెడ్డిని సీఎం చెయ్యొద్దు
పంజగుట్ట (హైదరాబాద్): టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయవద్దని, ఆయన బీఆర్ఎస్ పార్టీ కోవర్టు అని ఏఐసీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. రేవంత్‌రెడ్డి, కల్వకుంట్ల కవిత స్నేహితురాలు ఎన్ఆర్ఐ మందుల వినుత ఇద్దరూ వ్యాపారంలో భాగస్వామ్యులని ఏఐసీసీ మాజీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జడ్సన్ వెల్లడించారు. తెలంగాణను ఒక దొంగ చేతినుంచి మరో దొంగకు తాళాలు అప్పగించవద్దని కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని రేవంత్‌రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేశారని, 53 మంది ఓడిపోయే అభ్యర్థులకు టికెట్లు ఇచ్చారని విమర్శించారు. తన వ్యాఖ్యలవల్ల పార్టీకి నష్టం కలగకూడదనే ఇన్నిరోజులు ఆధారాలు బయటపెట్టలేదని అందుకే ఎన్నికలయ్యాక సమావేశం పెట్టినట్లు శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన పేర్కొన్నారు. 2012లో అప్పటి తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, కేసీఆర్ కూతురు కవిత మిత్రురాలైన ఎన్ఆర్ఐ మందుల వినుత డైరెక్టర్లుగా ఆడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని నెలకొల్పారని 2009 నుంచి 2014 వరకు తెలంగాణ ఉద్యమం సమయంలోనే కేసీఆర్ ఆస్తులు విపరీతంగా పెరిగాయని చెప్పారు. స్వయంగా ఓటుకు కోట్లు కేసులో తనంతటతానే పట్టుబడేలా కవిత, కేసీఆర్‌తో రేవంత్‌రెడ్డి కుట్రపన్నినట్లు ఆరోపించారు. అనంతరం చంద్రబాబును బెదిరించి భారీగా డబ్బులు గుంజి ఆ సొమ్ముతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేశారని తెలిపారు. -
ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్.. తెలంగాణలో అధికారం ఎవరిదంటే?
సాక్షి, ఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే పలు సర్వేలు ఆసక్తికర వివరాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే-మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ సర్వే కీలక నెంబర్లను వెల్లడించింది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు ఇండియా టుడే ఎగ్జిట్‌పోల్స్ పేర్కొంది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. BRS.. 34-44 Congress.. 63-73 BJP.. 4-8 Others.. 5-8 ఇక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు స్పష్టం పేర్కొంది ఇండియా టుడే. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటు దాదాపు లేనట్టేనని ఇండియా టుడే తెలిపింది. ఇక, గురువారం ఎగ్జిట్‌పోల్స్‌లో పలు సర్వేలు కాంగ్రెస్, బీజేపీకి రెండింటికి ఛాన్స్ ఉందని తెలిపిన విషయం తెలిసిందే. According INDIA Today - Axis my India Congress winning 68 seats I. Telangana!#ExitPolls #ExitPolls2023 #ExitPoll pic.twitter.com/WoeSqLf8t1 — Ashish Singh (@AshishSinghKiJi) December 1, 2023 -
ఎగ్జిట్‌పోల్స్ ఎఫెక్ట్.. ‘వేల కోట్ల చెల్లింపులకు బీఆర్ఎస్ ప్లాన్!’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రానున్నట్టు ఎక్కువ సంఖ్యలో పోల్స్ సంస్థలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, తాజాగా భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్స్ తేల్చాయి. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను దీవించారు. డిసెంబర్ మూడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. పదేళ్లుగా బీఆర్ఎస్ నేతలు భూదోపిడీలకు పాల్పడ్డారు. లక్షల కోట్ల విలువైన భూములు ప్రజలకు, ప్రభుత్వానికి చెందకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ధరణిని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ పరిధిలో వేలాది ఎకరాలు దోచుకున్నారు. అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి అడ్డగోలు పనులు చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. రెవెన్యూ వ్యవస్థను అప్రమత్తం చేస్తున్నాం. కాంట్రాక్టర్లకు వేల కోట్ల చెల్లింపులు ఈ రెండు, మూడు రోజుల్లో చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక ప్రభుత్వం నుండి మరొక ప్రభుత్వం మారుతున్న క్రమంలో ఇష్టరాజ్యoగా వ్యవహరించకుండా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం. రాష్ట్రంలో ఎన్నికల కౌంటింగ్ సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్రమతంగా ఉండాలి. తెలంగాణలో గత ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో ధర్మపురి, హుజూర్ నగర్, మంచిర్యాల, ఇబ్రహీంపట్నం, తుంగతుర్తిలో ఇబ్బందులు నెలకొన్నాయి. ప్రస్తుతం కోర్టులలో కేసులు కూడా ఇంకా నడుస్తున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తలు కౌంటింగ్ పూర్తయ్యేవరకు అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు మార్పు కోసం తీసుకున్న నిర్ణయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా రేవంత్ మాట్లాడుతూ.. కేసీఆర్ ఓటమి భయంతో రైతుబంధు నిధులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. కమీషన్ల కోసం రైతుబంధు నిధులు కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అసైన్డ్ మెంట్ భూములను ఇతరుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసే పక్రియ జరుగుతోంది. ప్రభుత్వ అన్ని ట్రాన్సాక్షన్స్‌పై నిఘా పెట్టాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ట్రాన్సాక్షన్‌పై విజిలెన్స్ నిఘా పెట్టాలని ఇటు హైదరాబాద్‌లో అటు ఢిల్లీలో ఎన్నికల సంఘం, ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇది కూడా చదవండి: కేసీఆర్ షాకింగ్ ట్విస్ట్.. డిసెంబర్ నాలుగున బీఆర్ఎస్ కేబినెట్ భేటీ -
కేసీఆర్ గెలుస్తారు.. లేదు వాళ్లదే విజయం.. కోట్లలో బెట్టింగ్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. ఇక, ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ సైతం ఆసక్తికర ఫలితాలను వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికారం ఎవరిది అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు.. కొందరు నేతలు మాత్రమ ఎగ్జిట్‌పోల్స్ ఫైనల్ కాదు.. విజయం తమదంటే తమదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణ రాజకీయాలు, ఎన్నికలపై ఏపీలో జోరుగా బెట్టింగ్ జరుగుతోంది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతుందని కొందరు.. లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మరికొందరు జోరుగా పందాలు కాస్తున్నారు. వందల కోట్లతో తెలంగాణ ఫలితాలపై పందాలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కోట్ల రూపాయల నగదు చేతులు మారుతున్నట్టు సమాచారం.. మరోవైపు.. రెండు సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ముఖ్యంగా గజ్వేల్‌లో ఎంత మెజార్టీ వస్తుందని కూడా బెట్టింగ్ రాయుళ్లు బెట్టింగ్ ఖాస్తున్నట్టు సమాచారం. అదేవిధంగా సిద్దిపేటలో ఈసారి మంత్రికి హారీశ్ రావుకి గతం కంటే ఎక్కువ వస్తుందా? లేదా తగ్గుతుందా అంటూ బెట్టింగ్ జరుగుతోంది. మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతారా? లేదా గెలుస్తారా? అని కూడా తెలంగాణ, ఏపీలో భారీగా బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ప్రధానంగా ఖమ్మంలో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేస్తుందంటూ మరో బెట్టింగ్ నడుస్తోంది. అలాగే, బీజేపీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది. ఏయే స్థానాల్లో గెలుస్తుందని కోట్లలో బెట్టింగ్ నడుస్తున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ఈసారి ఉల్లంఘన కేసులు ఎన్నంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఇక, ఓట్ల లెక్కింపు ఈనెల మూడో తేదీన(ఆదివారం) జరుగనుంది. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కోసం ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. దీంతో, ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. నలభై కంపెనీల బలగాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. అలాగే, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 1,766 లెక్కింపు టేబుళ్లు ప్లాన్ చేశారు. కౌంటింగ్ కేంద్రాల్లో 131 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లను ఏర్పాటు చేయగా.. ఆరు నియోజకవర్గాల్లో 500కు పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని అధికారులు వెల్లడించారు. అలాగే, ఉదయం 10 గంటలకు మొదటి ఫలితం వెల్లడవుతుందన్న ఈసీ పేర్కొంది. ప్రతీ టేబుల్‌పై మైక్రో అబ్జర్వర్.. కౌంటింగ్ సూపర్ వైజర్.. ఇద్దరు అసిస్టెంట్లు ఉంటారు. ఇక, ఎన్నికల నిబంధనలపై 2023లో 13 వేల కేసులు నమోదైనట్టు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక, 2018 ఎన్నికల్లో నిబంధనల ఉల్లంఘనలపై 2,400 కేసులు అయినట్టు స్పష్టం చేశారు. -
ఖమ్మంలో ఎవరిదో పైచేయి?
ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ రాష్ట్రంలోనే హాట్ సీట్ గా మారింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బరిలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇద్దరు కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే కావడంతో ఇక్కడ లోకల్ గా పొలిటికల్ వార్ రంజుగా మారింది. ఒకరికొకరు సై అంటే సయ్యంటూ ప్రచారం సాగించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3,15, 801 మంది ఓటర్లు ఉండగా, అందులో పురుష ఓటర్లు 1,51, 673 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 1,64, 006 మంది ఉండగా, ట్రాన్స్ జెండర్లు 47 మంది ఉన్నారు. ఇందులో సుమార 48 వేల ఓట్లు కమ్మ సామాజిక వర్గానికి చెందినవే ఉన్నాయి. మొత్తం ఓట్లలో కమ్మ ఓట్ల సంఖ్య తక్కువే అయినా... ఆ సామాజికవర్గం ఇతరులను ప్రభావితం చేయగలుగుతుందనే అంచనాతోనే ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి మద్దతు కోసం ఆరాటపడుతున్నారు. అందుకే వారి ఓట్లు, వారు ప్రభావితం చేయగలిగే ఓట్లే ఖమ్మం సీటులో గెలుపు ఓటముల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. అటు గులాబీ పార్టీ.. ఇటు హస్తం పార్టీల అభ్యర్థులు కమ్మ సామాజిక వర్గం వారే కావడంతో ఆ వర్గం ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారనే చర్చ ఖమ్మంలో హాట్ హాట్ చర్చలకు దారి తీస్తోంది. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలే నువ్వా నేనా అన్న రీతిలో ముఖాముఖీ తలపడ్డాయి. 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన పువ్వాడ అజయ్‌కుమార్...టీడీపీ తరపున పోటీ చేసిన తుమ్మల నాగేశ్వరరావును సుమారు 6 వేల ఓట్ల తేడాతో ఓడించారు. ఆ తర్వాత ఇద్దరూ గులాబీ పార్టీలో చేరిపోయారు. తుమ్మల నాగేశ్వరరావు 2016లో పాలేరుకు జరిగిన ఉప ఎన్నికలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2018 సాధారణ ఎన్నికల్లో పాలేరు నుంచి తుమ్మల మళ్ళీ ఓటమి చెందారు. పువ్వాడ అజయ్ 2018 ఎన్నికల్లో ఖమ్మం నుంచి విజయం సాధించి కేసీఆర్ రెండో మంత్రివర్గంలో మంత్రి పదవి పొందారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ తన పాత ప్రత్యర్థితోనే ఖమ్మంలో తలపడ్డారు. ఇక బీజేపీ-జనసేనల పొత్తులో భాగంగా ఇక్కడ జనసేనకు టికెట్ కేటాయించారు. జనసేన తరఫున మిర్యాల రామకృష్ణ బరిలో నిలిచారు. ఇక సీపీఎం నుంచి యర్ర శ్రీకాంత్ పోరుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో సీపీఎం నేరుగా పోరుకు దిగింది.