breaking news
-
‘అభయ హస్తం’పై తొలి సంతకం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రేవంత్‌రెడ్డి ‘అభయ హస్తం’ ఫైలుపై తొలి సంతకం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 6 గ్యారంటీల హామీల అమలును సుగమం చేసేలా దానిని రూపొందించారు. గతంలో తాను ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌కు చెందిన దివ్యాంగురాలు రజనికి కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తూ నియామక పత్రాలను సీఎస్ శాంతికుమారితో కలసి రేవంత్‌రెడ్డి అందజేశారు. మాట నిలబెట్టుకున్న సీఎం: హైదరాబాద్‌లోని న్యూ బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన వెంకటస్వామి కుమార్తె రజని. అక్టోబర్ 17న గాందీ భవన్‌కు వచ్చిన ఆమె.. తన వైకల్యం వల్ల ఉద్యో గం దొరకడం లేదని, ఆదుకోవాలని రేవంత్‌రెడ్డికి విన్నవించుకున్నారు. ఆమె వివరాలు తెలుసుకున్న రేవంత్.. అధికారంలోకి రాగానే ఉద్యోగం ఇస్తామని మాటిచ్చారు. గురువారం రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. రజనిని వేదికపైకి ఆహ్వనించి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఆమెకు తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థలో ప్రాజెక్టు మేనేజర్‌గా నెలకు రూ.50వేల వేతనంతో కాంట్రాక్టు ఉద్యోగం ఇచ్చారు. మాటను నిలబెట్టుకున్నారంటూ సీఎం రేవంత్‌కు రజని, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
సామాజిక ‘కూర్పు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన కేబినెట్‌ను సామాజిక కోణంలో ఏర్చికూర్చినట్టు స్పష్టమవు తోంది. సీనియార్టీ ప్రాతిపదికతో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన నేతలతో తొలిదఫా మంత్రివర్గాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేశారు. కొత్త కేబినెట్లో దళిత వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్కకు మాత్రమే డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. కనీసం ఇద్దరికి ఈ హోదా వస్తుందనే ప్రచారం జరిగినప్పటికీ రేవంత్‌రెడ్డితో పాటు సీఎం పదవి కోసం పోటీ పడిన భట్టికి మాత్రమే ఈ హోదా లభించడం గమనార్హం.ఇక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిలు మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో సీఎంతో కలిపి నలుగురు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలకు కేబినెట్లో అవకాశం లభించినట్టైంది. కొండా సురేఖ (పద్మశాలి), పొన్నం ప్రభాకర్ (గౌడ్) లను బీసీ వర్గాల నుంచి ఎంపిక చేయగా, దళిత వర్గాల నుంచి దామోదర రాజనర్సింహకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (బ్రాహ్మణ), తుమ్మల నాగేశ్వర రావు (కమ్మ), జూపల్లి కృష్ణారావు (వెలమ), ధనసరి అనసూయ (ఎస్టీ)లకు మంత్రిమండలిలో స్థానం లభించింది. మొత్తం మీద అగ్రవర్ణాలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన మొత్తం 12 మందితో తెలంగాణ మంత్రిమండలి కొలువు దీరడం విశేషం. కాగా వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మైనార్టీ వర్గాలకు చెందిన ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో గెలవకపోవడంతో తొలి దఫా కేబినెట్లో ఆ వర్గానికి స్థానం లభించలేదు. నాలుగు జిల్లాలకు నో.. జిల్లాల వారీగా పరిశీలిస్తే రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాలకు గాను 6 జిల్లాల నేతలకు మాత్రమే కేబి నెట్లో ప్రాతినిధ్యం లభించింది. ఖమ్మం నుంచి ముగ్గురు, నల్లగొండ నుంచి ఇద్దరు, మహ బూబ్ నగర్ నుంచి సీఎంతో కలిపి ఇద్దరు, కరీంనగర్ నుంచి ఇద్దరు, వరంగల్ నుంచి ఇద్దరు, మెదక్ నుంచి ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. హైదరా బాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందక పోవడంతో ఆ జిల్లాకు అవకాశం లభించలేదు. రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలా బాద్ జిల్లాల నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ వారికి తొలి విడతలో అవకాశం ఇవ్వలేదు. కేబి నెట్లో మరో 17 మంది మంత్రులుగా ఉండే అవ కాశం ఉండగా ప్రస్తుతం 12 మంది ప్రమాణం చేశారు. ఖాళీగా ఉన్న ఆరు బెర్తులను వీలును బట్టి భర్తీ చేస్తారని, పూర్తిస్థాయి కేబినెట్ కొలువు తీరేలోపు అన్ని సామాజిక వర్గాలు, ప్రాంతాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఫస్ట్ టైమర్స్ నలుగురు.. భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క మొదటిసారి మంత్రులయ్యారు. ఇక రేవంత్‌రెడ్డి కూడా ఇంతకుముందు మంత్రిగా పని చేయకుండానే ఏకంగా సీఎం కావడం గమనార్హం. జెడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పని చేసిన ఆయన ఇప్పటివరకు రాష్ట్ర మంత్రి పదవి బాధ్యతలు మాత్రం నిర్వర్తించలేదు. ఇక డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన భట్టి ఆంధ్రాబ్యాంక్ డైరెక్టర్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, చీఫ్ విప్, డిప్యూటీ స్పీకర్, సీఎల్పీ నేత పదవుల్లో పనిచేశారు. ఒక్కసారి కూడా మంత్రి కాకుండానే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. పొంగులేటి, పొన్నం ఎమ్మెల్యేలుగా ఎన్నికవడం కూడా తొలిసారే కావడం గమనార్హం. -
రేవంత్‌రెడ్డి అనే నేను..
ఉదయం నుంచి కాంగ్రెస్ అగ్రనేతల రాక, ఆహ్వానాలు.. మధ్యాహ్నం ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారాలు, సభ.. కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం.. అధిష్టానం నేతలకు వీడ్కోలు.. సాయంత్రం సచివాలయం వద్ద హడావుడి.. సీఎం చాంబర్లో రేవంత్ బాధ్యతల స్వీకరణ.. తర్వాత కాసేపటికే కొత్త కేబినెట్ తొలి సమావేశం.. రాత్రిదాకా వాడీవేడిగా చర్చలు.. మొత్తంగా రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిరోజు హడావుడిగా కనిపించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్‌రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు. వారంతా తాజ్‌కృష్ణ హోటల్‌కు వెళ్లగా.. రేవంత్ తన నివాసానికి వెళ్లి, అక్కడి నుంచి కుటుంబంతో కలసి జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మళ్లీ తాజ్ కృష్ణ హోటల్‌కు చేరుకుని, కాంగ్రెస్ అగ్రనేతలతో కలసి ఎల్బీ స్టేడియానికి వచ్చారు. గవర్నర్ తమిళిసై సీఎంగా రేవంత్‌తో, ఇతర మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక గవర్నర్, ఏఐసీసీ నేతలు వెళ్లిపోగా.. రేవంత్ ప్రజలను ఉద్దేశించి సీఎంగా తొలి ప్రసంగం చేశారు. తర్వాత మళ్లీ తాజ్ కృష్ణ హోటల్‌కు వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతో కలసి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి వీడ్కోలు పలికారు. అనంతరం రేవంత్‌రెడ్డి సచివాలయానికి వచ్చారు. గౌరవ వందనం స్వీకరించి, సచివాలయమంతా కలియతిరిగారు. సీఎం చాంబర్లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత తొలి కేబినెట్ భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై మంత్రివర్గం చర్చించింది. ఇక శనివారం అసెంబ్లీ సమావేశం నిర్వహించి కొత్త ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో గురువారం మధ్యా హ్నం 1:19 గంటలకు ఆయనతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు. రేవంత్‌తోపాటు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్ర మార్క, కేబినెట్ మంత్రులుగా ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ధనసరి అన సూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియాగాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాందీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ, కర్ణాటక, హిమాచల్ సీఎంలు సిద్ధరామయ్య, సుఖి్వందర్సింగ్ సుక్కు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతోపాటు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పవిత్ర హృదయంతో అంటూ ఇద్దరు.. ఒకరు ఇంగ్లిష్‌లో.. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు 9 మంది మంత్రులు దైవసాక్షిగా ప్రమాణం చేయగా.. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మాత్రం పవిత్ర హృదయంతో అంటూ ప్రతిజ్ఞ చేశారు. దామోదర రాజనర్సింహ ఇంగ్లి‹Ùలో, మిగతా అందరూ తెలుగులో ప్రమాణం చేశారు. మధ్యాహ్నం 1:04 గంటలకు రేవంత్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నా కొంత ఆలస్యమైంది. ట్రాఫిక్ సమస్య కారణంగా గవర్నర్ 1:17 గంటలకు సభా వేదిక వద్దకు వచ్చారు. రేవంత్ వేదిక దిగి వెళ్లి ఆమెకు స్వాగతం పలికారు. ఆ వెంటనే ప్రమాణ స్వీకారాలు మొదలయ్యా యి. 28 నిమిషాల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం 1:46 గంటలకు ముగిసింది. తర్వాత గవర్నర్ తమిళిసై, కాంగ్రెస్ అగ్రనేతలు వెళ్లిపోయారు. ఓపెన్ టాప్ జీపులో.. కలియదిరిగి.. సోనియాగాంధీతో కలసి రేవంత్‌రెడ్డి ఓపెన్‌టాప్ జీప్‌లో ఎల్బీ స్టేడియంలోకి వచ్చారు. సోనియా గాంధీ ముందు నిలబడగా.. ఆమెకు కాస్త వెనుకగా రేవంత్ నిలబడి స్టేడియంలో కలియదిరిగారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలకు అభివాదం చేస్తూ వేదిక వద్దకు చేరుకున్నారు. తర్వాత రేవంత్ స్వయంగా సోనియాను తోడ్కొని వేదికపైకి వచ్చారు. రాహుల్, ప్రియాంక నడుచుకుంటూ, ప్రజలకు అభివాదం చేస్తూ వేదికపైకి చేరుకున్నారు. కార్యక్రమం ముగిశాక సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు రేవంత్ స్వయంగా వీడ్కోలు పలికారు. తర్వాత మళ్లీ వేదికపైకి వచ్చి ముఖ్యమంత్రిగా తన తొలి ప్రసంగం చేశారు. సీతక్క.. హోరెత్తిన స్టేడియం మంత్రులందరిలో సీతక్క ప్రమాణ స్వీకారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రిగా సీతక్క పేరు ప్రకటించగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో హోరెత్తింది. ఆ హోరులో సీతక్క ఒక నిమిషం పాటు ఆగిపోవాల్సి వచ్చింది. ఇది చూసి వేదికపై ఉన్న పెద్దలు, నేతలంతా ఆశ్చర్యపోయారు. ప్రమాణం కొనసాగించాలంటూ గవర్నర్ తమిళిసై సైగ చేయడంతో సీతక్క ఆ హోరులోనే ప్రమాణ స్వీకారం కొనసాగించారు. తర్వాత సోనియా వద్దకు వెళ్లి పాదాభివందనం చేశారు. సోనియా లేచి నిలబడి సీతక్కను హత్తుకుని అభినందించారు. అగ్రనేతలతో.. ఒకే వాహనంలో.. గురువారం ఉదయం రేవంత్‌రెడ్డి తన నివాసం నుంచి బయలుదేరి పెద్దమ్మ గుడికి వెళ్లారు. అక్కడ పూజలు చేసిన తర్వాత తాజ్‌కృష్ణ హోటల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి భారీ కాన్వాయ్‌గా ఎల్బీ స్టేడియానికి బయలుదేరారు. కాంగ్రెస్ అగ్రనేతలు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంకలతో కలసి రేవంత్ ఒకే వాహనంలో కూర్చున్నారు. సోనియా సభావేదికపై వచ్చాక రేవంత్‌రెడ్డి మనువరాలిని చూసి ముద్దాడారు. ప్రమాణ స్వీకారాలు ముగిశాక.. రేవంత్‌రెడ్డి వేదికపైనే ఉన్న తన సతీమణితో కలసి సోనియా దగ్గరికి వెళ్లి పాదాభివందనం చేశారు. తన కుమార్తెను, అల్లుడిని సోనియా, రాహుల్, ప్రియాంకలకు పరిచయం చేశారు. ప్రమాణ స్వీకారం.. పదనిసలు ► గురువారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే, కేసీ వేణుగోపాల్‌లకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రేవంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ► ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మొదట, చివరిలో నల్లగొండ గద్దర్ స్వయంగా రాసి, పాడిన ‘మూడు రంగుల జెండా పట్టి’ పాట పార్టీ శ్రేణులకు హుషారెక్కించింది. ► సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దూరంగా ఉండే సోనియాగాంధీ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ం కొలువుదీరే సందర్భంగా హాజరవడం గమనార్హం. గురువారం ఎల్బీ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమెతోపాటు, రాహుల్, ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ► మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరిని రేవంత్‌రెడ్డి దగ్గరికి తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత మంత్రులు వేదికపై ఉన్న సోనియా, రాహుల్, ప్రియాంక, ఇతర అగ్రనేతలకు మర్యాదపూర్వకంగా నమస్కరించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ప్రతి మంత్రిని భుజం తట్టి ఆశీర్వదించారు. ► ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా హాజరయ్యారు. ► రేవంత్ ప్రసంగిస్తూ.. ‘ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే, అక్కడ ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలు బద్దలుగొట్టాం. ఇకపై అందరూ ప్రగతిభవన్‌కు రావొచ్చు’ అని పేర్కొన్నారు. ఈ సమయంలో స్టేడియం మొత్తం చప్పట్లతో మారుమోగింది. ► ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి వస్తున్న పలువురు ప్రముఖుల వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయాయి. కాగా,ఏపీకి చెందిన టీడీపీ నాయకులు ఆ పార్టీ జెండాలు పట్టుకొని స్టేడియంలో హల్చల్ చేసేందుకు ప్రయత్నించారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తలు మండిపడుతూ.. టీడీపీ కార్యకర్తలను చితకబాదడంతో అక్కడి నుంచి పారిపోయారు. కాంగ్రెస్ సభలో టీడీపీ జెండాలు ఏమిటని, మళ్లీ టీడీపీ జెండాలు కనిపిస్తే పీకి పారేయాలని సీనియర్ లీడర్లు కార్యకర్తలకు సూచించారు. -
తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు ఇవే
సాక్షి, హైదరాబాద్: ఆరు గ్యారంటీలపై కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ఆరు గ్యారంటీలను అమలు ప్రక్రియలో భాగంగా అన్ని అంశాలపై చర్చించామని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లలో మార్పు చూపిస్తాం. రేపు 2 గ్యారంటీలకు సంబంధించి ఆయా శాఖలతో సీఎం చర్చిస్తారు. 2014 నుంచి 2023 వరకు ప్రభుత్వ శాఖల ఖర్చుపై చర్చించాం. అన్ని శాఖల ఆదాయ వ్యయాలపై శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ నెల 9న రెండు గ్యారెంటీలు అమల్లోకి తెస్తాం’’ అని మంత్రి వెల్లడించారు. ►మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఎల్లుండి నుంచి అమలు ►ఆరోగ్యశ్రీ పరిమితి పది లక్షలకు పెంపు ►ఎల్లుండి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ►రైతులకు, పరిశ్రమలకు 24 గంటల విద్యుత్ -
TS: మంత్రులుగా వారందరికీ ఇది పరీక్ష సమయం
తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టినందుకు ముందుగా అభినందనలు. రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత క్లుప్తంగా చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ప్రజాస్వామ్యం తిరిగి వచ్చిందని, ప్రజలకు స్వేచ్చ లభించిందని, తెలంగాణకు పట్టిన చీడ విరగడ అయిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇక ప్రగతి భవన్ ప్రజా దర్బార్‌గా అందుబాటులోకి రాబోతోందని ప్రకటించారు. అందుకు తగ్గట్లుగానే వెంటనే ప్రగతి భవన్ వద్ద కంచెలను తొలగించారు.వెంటనే ప్రగతి భవన్ పేరు మార్చారు. ✍️జ్యోతీరావు పూలే ప్రజాభవన్ అని పేరు పెట్టి అక్కడ ప్రజా దర్బార్ నిర్వహించబోతున్నట్లు రేవంత్ తెలిపారు. దానికి ఎవరైనా స్వేచ్చగా రావచ్చని ఆయన పిలుపు ఇచ్చారు. ఇది హర్షణీయమైన సంగతే. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌ను నిర్మించారు కాని, ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు. దానిని విపక్షం ఎప్పటికప్పుడు విమర్శిస్తూనే ఉండేది. అలాగే పాత సచివాలయం పడగొట్టి ఆధునిక సచివాలయం భారీ ఎత్తున నిర్మించారు. కాని అందులోకి కూడా ఆయన పెద్దగా వెళ్లలేదు. ఇప్పుడు అది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉపయోగపడుతోంది. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ అని అంటారు. ఆ విషయం మరోసారి కనిపించింది. రేవంత్ తో పాటు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వేదిక అంతా గందరగోళంగా మారింది. ఎవరెవరో ఆ వేదికపై కలియతిరుగుతూ సందడి చేశారు. ఒక రకంగా ఇది అవధులు లేని ప్రజాస్వామ్యమేమో అనిపించింది. ✍️తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లభించిందని రేవంత్ అన్నట్లుగా చాలామంది ఆ వేదికపై సంచరించారు. ఒక పక్క మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగుతున్నా వారి వెనుకే కొందరు మాట్లాడుకుంటూ ఉండడం, వారిని అధికారులు నివారించవలసి రావడం వంటి ఘట్టాలు అగుపించాయి. ఒక మాజీ ఎంపీ అయితే కలియతిరుగుతూ టీవీలలో కనిపించారు. అంత మాత్రాన ఏదో పెద్ద తప్పు జరిగిపోయిందని కాదు. సాధారణంగా ప్రమాణ స్వీకార వేదికపై కేవలం గవర్నర్, ముఖ్యమంత్రి, మహా అయితే కొద్ది మంది ముఖ్య అతిథులు ఉంటారు. మిగిలినవారంతా వేదిక ఎదురుగానో, పక్కన మరో వేదికపైనో ఉంటారు. ప్రమాణ స్వీకారం పూర్తి అయిన తర్వాత, గవర్నర్ వెళ్లిపోయిన తదుపరి పెద్ద నాయకులంతా ఒక వేదికపైకి వచ్చి ప్రజలకు అభివాదాలు చేస్తారు. కాని ఈ వేదిక అంతా గందరగోళంగా మారడంతో ఏఐసీసీ అగ్రనేతలు సైతం కిందికి దిగి వెళ్లిపోయారనిపిస్తుంది.అయినా ఫర్వాలేదు. కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ✍️ప్రజలు వేల సంఖ్యలో తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రేవంత్ ప్రమాణం చేస్తున్నప్పుడు, ఆయా మంత్రులు ప్రమాణ స్వీకార సమయంలో పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు. అందరికన్నా సీతక్క మంత్రిగా ప్రమాణం చేస్తున్నప్పుడు చప్పట్లు మారుమోగాయి. రేవంత్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు ఫైల్ పై సంతకం చేశారు. ఆ విషయాన్ని ప్రజలకు తన స్పీచ్ లో వివరించి ఉండాల్సింది. ఒక దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తానన్న హామీని కూడా ఆయన నెరవేర్చారు. మంత్రివర్గ కూర్పు గురించి విశ్లేషించుకోవడం కూడా ఆసక్తికరంగానే ఉంటుంది. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడానికి ముందు రెండుసార్లు ఎమ్మెల్యే అయినా, ఒకసారి ఎంపీ అయినా రాష్ట్రంలో కాని, కేంద్రంలో కాని మంత్రి పదవి చేయలేదు. దానికి కారణం ఆయన ప్రతిపక్షంలో ఉండడమే. ✍️మూడోసారి శాసనసభకు ఎన్నికైన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి బాధ్యతను ఆయన చేపట్టారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నాలుగోసారి ఎమ్మెల్యే అయ్యాక ఈ అవకాశం వచ్చింది. అంతకు ముందు ఆయన ఎమ్మెల్సీ, విప్, ఉప సభాపతి వంటి పదవులు చేపట్టారు. మిగిలినవారిలో అందరికన్నా సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయన 1985లోనే తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అదే టరమ్ లో ఎన్.టి.ఆర్.క్యాబినెట్లో మంత్రిగా కూడా ఉన్నారు. తదుపరి 1994,1999లలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్.టి.ఆర్.ముఖ్యమంత్రిగా పదవీచ్యుతుడు అయ్యాక 1995లో ఏర్పడిన చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా ఉండి 2004 వరకు కొనసాగారు. ✍️2009లో మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. కాని ప్రతిపక్షంలో ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన గెలవలేకపోయారు. అయినా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈయనను టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి ఆహ్వానించి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఆ తర్వాత ఉప ఎన్నికలో మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు. 2018 ఎన్నికలలో గెలవలేకపోయారు. తిరిగి 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చి ఎమ్మెల్యేగా విజయడంకా మోగించి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి అయ్యారు. ఈ రకంగా ఆయన నలుగురు క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. ✍️మంత్రి దామోదర రాజనరసింహ 1989లో తొలిసారి శాసనసభకు ఎన్నికయ్యారు. తదుపరి 2004, 2009లలో, మళ్లీ 2023లో శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిల క్యాబినెట్లలో పనిచేశారు. కిరణ్ సీఎంగా ఉన్నప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా 1999 లో తొలిసారి శాసనసభ్యులయ్యారు. ఉత్తం కుమార్ అంతకు ముందు ఓటమి చవిచూసినా, 1999 నుంచి గెలుస్తూనే ఉన్నారు. ఉత్తంకుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీలో కిరణ్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. 2018 ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా పనిచేశారు. 2019లో లోక్ సభకు ఎన్నికయ్యారు. 2023లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందారు. ✍️కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం కోసం మంత్రి పదవిని వదలుకున్నారు. 2018లో ఓటమి చెందినా 2019 లో ఎంపీగా గెలిచారు. తిరిగి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కాగలిగారు. మరో మంత్రి కొండా సురేఖ కూడా సీనియర్ నేతే. ఆమె కూడా 1999లోనే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు.ఆమె ఉమ్మడి ఏపీలో వైఎస్ క్యాబినెట్లో ఉన్నారు. తర్వాత రోశయ్య క్యాబినెట్ లో కొద్దికాలం ఉండి రాజీనామా చేశారు. అప్పట్లో వైఎస్ జగన్ కు మద్దతుగా ఆమె నిలబడి అనర్హత వేటుకు గురయ్యారు.2014లో టిఆర్ఎస్ పక్షాన ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చి ఈసారి మంత్రి అయ్యారు. మరో మంత్రి జూపల్లె కృష్ణారావు 1999లో ఇండిపెండెంట్‌గా 2004లో కాంగ్రెస్ పక్షాన గెలిచారు. 2009లో కూడా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా కూడా మూడు మంత్రివర్గాలలో పనిచేశారు. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా పదవికి రాజీనామా చేశారు.ఎమ్మెల్యే పదవి కూడా వదలుకుని తిరిగి టిఆర్ఎస్ పక్షాన ఉప ఎన్నిక లో నెగ్గారు. ✍️రాష్ట్ర విభజన తర్వాత 2014లో గెలిచి కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు.2018 లో ఓటమి చెందారు.కొంతకాలం క్రితం టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ లో చేరి 2023లో గెలిచి మంత్రి అయ్యారు.మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 1999 లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2004,2009లలో కూడా గెలిచారు. ఉమ్మడి ఎపిలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో సభ్యుడుగా ఉంటూ చివరిలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. 2018,2023 లలో గెలుపొంది, రేవంత్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. పొన్నం ప్రభాకర్ సీనియర్ నేత గతంలో ఎమ్.పిగా ఎన్నికయ్యారు.ప్రస్తుతం మొదటిసారిగా ఎమ్మెల్యే అయి మంత్రి పదవి పొందారు. అలాగే మరో మాజీ ఎమ్.పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తొలిసారి ఎమ్మెల్యే అయి మంత్రి పదవి పొందారు. ✍️తొలుత టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సీతక్క తదుపరి కాంగ్రెస్ నుంచి రెండుసార్లు గెలిచి రేవంత్ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు. రేవంత్ తో పాటు ఉత్తంకుమార్, వెంకటరెడ్డి, పొంగులేటిలు రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. తుమ్మల నాగేశ్వరరావు కమ్మ వర్గం అయితే, ఎస్సిల నుంచి మల్లు భట్టి,దామోదర రాజనరసింహ, ఎస్టీల నుంచి సీతక్క, బీసీ వర్గాల నుంచి పొన్నం ప్రభాకర్ (గౌడ), కొండా సురేఖ (పద్మశాలి) పదవులు పొందారు. ✍️దుద్దిళ్ల శ్రీధర్ బాబు బ్రాహ్మణవర్గం కాగా, జూపల్లె కృష్ణారావు వెలమ సామాజికవర్గం వారు. రేవంత్, తుమ్మల, సీతక్కలు టీడీపీ మూలాలు కలిగినవారైతే, ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్లుభట్టి, దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ , శ్రీధర్ బాబులు పూర్తిగా కాంగ్రెస్‌లోనే ఉన్నారు. కొండా సురేఖ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్లలో కూడా ఉన్నారు. జూపల్లె కృష్ణారావు కాంగ్రెస్ మూలం కలిగిన నేతే అయినా తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్లోకి వెళ్లారు. పొంగులేటి వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీగా ఎన్నికై తదుపరి టీఆర్ఎస్లో చేరి అనంతరం కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎన్నికలకు ముందు తుమ్మల, పొంగులేటి,జూపల్లె లు కాంగ్రెస్ లోకి వచ్చి మంత్రులు అవడం విశేషం. వాస్తవం చెప్పాలంటే ఒక్క తుమ్మలకు తప్ప మిగిలినవారెవరికి మంత్రులుగా విశేష అనుభవం లేదనే అనుకోవాలి. వారందరికి ఇది పరీక్ష సమయం. తమ ,తమ శాఖలను పూర్తిగా అధ్యయనం చేసి , బాధ్యతలను నిర్వర్తించవలసి ఉంటుంది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
సీఎంగా రేవంత్ తొలి ప్రసంగం.. ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: పోరాటాలు, త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రజలను ఉద్దేశించి తొలిసారి ఆయన మాట్లాడుతూ.. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి కోసం ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ తెలంగాణ ఏర్పాటు చేసిందని, దశాబ్ద కాలపు నిరంకుశ పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ‘‘ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమరుల ఆశయ సాధనకు ఇందిరమ్మ రాజ్యం ప్రతినబూనింది. ప్రమాణ స్వీకారం మొదలైనపుడే అక్కడ ప్రగతి భవన్ గడీ ఇనుప కంచెలు బద్దలు కొట్టాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా... ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములు. ఇవాళ ప్రగతి భవన్ చుట్టూ కంచెలు బద్దలు కొట్టాం. రేపు ఉదయం 10 గంటలకు జ్యోతీరావు పూలే ప్రజా భవన్ లో ప్రజా దర్బారు నిర్వహిస్తాం’’ అని రేవంత్ పేర్కొన్నారు. ‘‘మేం పాలకులం కాదు.. మేం సేవకులం.. మీరు ఇచ్చిన అవకాశాన్ని ఈ ప్రాంత అభివృద్ధికి వినియోగిస్తాం. కార్యకర్తల కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా.. గుండెల్లో పెట్టుకుంటా’’ అని రేవంత్ చెప్పారు. చదవండి: తెలంగాణ మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసింది వీరే -
తెలంగాణ కొత్త మంత్రులు.. వారికి కేటాయించిన శాఖలు ఇవే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నూతన సర్కార్ కొలువుదీరింది. ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణస్వీకారం చేయించారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నూతన ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కింది విధంగా శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. భట్టి విక్రమార్క- డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి- హోం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి-మున్సిపల్ శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు-ఆర్థికశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి-నీటి పారుదలశాఖ మంత్రి కొండా సురేఖ-మహిళా సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ- వైద్య ఆరోగ్యశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు- పౌరసరఫరాలశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్- బీసీ సంక్షేమశాఖ మంత్రి సీతక్క- గిరిజన సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు- రోడ్లు, భవనాల శాఖ మంత్రి -
సీఎం పదవిపై భట్టి ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి రాకపోవడంపై భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవిని తాను ఆశించిన మాట వాస్తవమేనని అన్నారు. కానీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. కేంద్ర నాయకులు ఏ పదవి ఇచ్చినా.. నిబద్ధతతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఒక ప్రభుత్వంలో అందరికీ పదవులు దక్కడం సాధ్యం కాదని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తే.. భట్టి విక్రమార్కకు సీఎం పదవి ఖాయమని ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. అటు.. పాదయాత్రతోనూ భట్టి మంచి ప్రజాధరణ పొందారు. ఎస్సీ సామాజిక వర్గానికి అత్యున్నత పదవి కట్టబెట్టిన ఘనత కాంగ్రెస్‌కు దక్కనుందని మేధావులు ఊహించారు. భట్టి కూడా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవిపై కేంద్ర అధిష్ఠానం తర్జన భర్జన పడింది. చివరకు రేవంత్ పేరును ఖరారు చేశారు. రేవంత్‌తో పాటు 11 మంది మంత్రుల పేర్లను కూడా అధిష్ఠానం ఎంపిక చేసింది. వారంతా గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదీ చదవండి: తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే.. -
TS CM Revanth Reddy: తెలంగాణ నూతన సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై.. రేవంత్‌రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయనతో పాటు మరో 11 మంది నాయకులు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో 2006లో మిడ్జెల్ జెడ్పీటీసీగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరారు. 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి ఎంఎల్సీగా గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లోనూ మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైనా.. మరసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. 2021లో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎంపికై 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సీఎం పదవిని చేపట్టారు. ఇదీ చదవండి: తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే.. -
తొలిసారి మంత్రి పదవి చేపట్టేది వీరే..
హైదరాబాద్: తెలంగాణలో మరికాసేపట్లో ప్రభుత్వం కొలువుదీరనుంది. టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేసిన రేవంత్ రెడ్డితో పాటు 11 మంది నాయకులు మంత్రి పదవులు చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ జాబితాను కాంగ్రెస్ అధిష్ఠానం బహిర్గతం చేసింది. తొలిసారి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనుండగా, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తొలిసారి మంత్రి పదవి చేపట్టినవారవుతారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. మొత్తం 119 స్థానాలకు గాను 64 స్థానాల్లో కాంగ్రెస్ నెగ్గగా.. సీపీఎం 1 స్థానంలో విజయం సాధించింది. అనంతరం ముఖ్యమంత్రి పదవిపై తర్జనభర్జన చేసిన కాంగ్రెస్ కేంద్ర అధిష్ఠానం ఎట్టకేలకు రేవంత్‌ను నిర్ణయించింది. ఆయనతో పాటు మరో 11 మందికి మంత్రి పదవులను కూడా ఫైనల్ చేసింది. ఎల్బీ స్టేడియంలో నేడు వీరంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న 11 మంది నాయకుల జాబితాలో భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ ఉన్నారు. ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ? -
వైఎస్సార్‌కు నివాళులర్పించిన భట్టి
హైదరాబాద్: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న మల్లు భట్టి విక్రమార్క.. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు. తన నివాసంలోని పూజ గదిలో ఉన్న వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజలు నిర్వహించారు. వైఎస్సార్‌పై తనకున్న అభిమానాన్ని భట్టి చాటుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. భట్టి విక్రమార్క మల్లు గారు తన నివాసంలోని పూజ గదిలో ఈరోజు ఉదయం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు #BhattiVikramarkaMallu#YSRLivesOn pic.twitter.com/8O9oo7iSsh— Bhatti Vikramarka Mallu (@BhattiCLP) December 7, 2023 తెలంగాణలో నేడు ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతోంది. రేవంత్ రెడ్డి సీఎంగా పదవి చేపట్టనున్నారు. మంత్రులుగా భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖతో సహా మొత్తం 11 మంది మంత్రి పదవులకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరయ్యారు. ఇదీ చదవండి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ? -
ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఆర్థిక శాఖ?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం గురువారం కొలువుదీరనుంది. అందులో తొమ్మిది నుంచి 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు గాంధీ భవన్ వర్గాల ద్వారా తెలిసింది. వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉండనున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రుల శాఖల కేటాయింపుపై ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేయనుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఉత్తంకుమార్ రెడ్డికి ఆర్థిక శాఖ అప్పగించనున్నట్లు తెలిసింది. సీనియర్ నాయకులైన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన వారు కావడంతో వారి సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చారు. రాజగోపాల్‌రెడ్డికి మరో పదవి మునుగోడు నుంచి రెండోసారి గెలుపొందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఆయనకు మంత్రి పదవి లేదంటే మరేదైనా ప్రాధాన్యం కలిగిన పదవిని ఇచ్చే అవకాశం ఉంది. నేడు ప్రమాణ స్వీకారోత్సవం ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాలకు గాను 11 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందగా, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గురువారం తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన మంత్రివర్గంలో నల్లగొండ జిల్లాకు చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలకు చోటు దక్కింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రి వర్గంలో మొదటిసారి ఐటీ, క్రీడలు, యూత్, కమ్యూనికేషన్లు, ఓడరేవులు, విమానశ్రయాలు, సహజవాయువు పరిశ్రమలకు మంత్రిగా పనిచేశారు. ఆ తరువాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ మంత్రిగా పనిచేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆ తరువాత జిల్లా నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి మంత్రి పదవికి అవకాశం కల్పించారు. ఆయన గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలో ఉత్తమ్ పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వీరిద్దరూ మంత్రులుగా పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వమే రెండుసార్లు అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గంలో జిల్లా నుంచి మాజీ మంత్రులు ఇద్దరికి ఇప్పుడు మంత్రి పదవులు దక్కాయి. -
తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. రేవంత్‌తో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. తెలంగాణ సీఎంగా ఆరు గ్యారంటీల తొలిఫైల్‌పై రేవంత్ సంతకం చేశారు. దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగ నియామక పత్రంపై సీఎం అందజేశారు. డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, డి. అనసూయ సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్ త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది గత ప్రభుత్వం.. ప్రజల బాధలు పట్టించుకోలేదు పదేళ్లు బాధలను ప్రజలు మౌనంగా భరించారు తెలంగాణలో శాంతిభద్రతలు కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణను అభివృద్ధి చేస్తా అమరవీరుల కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేస్తుంది పొన్నం ప్రభాకర్ కామెంట్స్ మంత్రి అవుతానని ముందే ఊహించా ఏ పోర్ట్ పోలీయో ఇచ్చినా సమ్మతమే మంత్రి కావాలనే కోరిక నెరవేరింది మంత్రి అయినా ప్రజా సేవకుడిగా పని చేస్తాను సాక్షి టీవీతో పొంగులేటి తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే మా పాలన ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం గత ప్రభుత్వంలా కక్షపూరితంగా మేం వ్యవహరించం కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కామెంట్స్ అబద్ధాలతో తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారు కేసీఆర్ రిటైర్ అయ్యి ఫాం హౌస్‌కే పరిమితమైతే మంచిది తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఖరారు వికారాబాద్ నుంచి ఎన్నికైన గడ్డం ప్రసాద్‌కుమార్ ఎల్బీ స్టేడియంకు చేరుకున్న ఉత్తమ్, సీతక్క, పొన్నం ఎల్బీబీ స్టేడియంకు చేరుకున్న కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు 12:10PM, Dec 7, 2023 కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్ తనపై నమ్మకంతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు రాజకీయంగా ఎన్నో అవకాశాలిచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియా, రాహుల్, ప్రియాంక, రేవంత్‌లకు ధన్యవాదాలు ఈ జీవితం ప్రజలకే అంకితం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఏ మంత్రి పదవి ఇచ్చినా నిజాయితీతో పనిచేస్తా 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటా ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో మరకలేకుండా పని చేశా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం, ప్రజా పరిపాలన రాబోతుంది ఆరు గ్యారెంటీల హామీని అమలు చేయబోతున్నాం 11: 35AM, Dec 7,2023 హోటల్ ఎల్లా నుంచి ఎల్బీ స్టేడియం బయలు దేరిన ఎమ్మెల్యేలు 11: 10AM, Dec 7,2023 హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖ్ శంషాబాద్ విమానాశ్రయంలో సాదర స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి. శంషాబాద్ నుంచి నేరుగా తాజ్ కృష్ణ హోటల్ కు చేరుకోనున్న రేవంత్ రెడ్డి 10: 50AM, Dec 7, 2023 భట్టి విక్రమార్క నివాసానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డిప్యూటీ సీఎం గా ఎన్నికైన భట్టికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 10: 20AM, Dec 7, 2023 జూబ్లీహిల్స్ లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం.. మంత్రివర్గంలో పొంగులేటికి చోటుదక్కడంపై సంతోషం వ్యక్తం చేస్తున్న అనుచరులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు గెలవడం వెనక కీలకంగా వ్యవహరించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నల్గొండ జిల్లాలో సైతం కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం ప్రత్యేక హెలికాప్టర్ లో వెళ్లి ప్రచారం నిర్వహించిన పొంగులేటి 10: 15AM, Dec 7, 2023 హోటల్ తాజ్ కృష్ణకు చేరుకున్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ. 9:50AM, Dec 7, 2023 పొన్నం ప్రభాకర్ కు స్వయంగా ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి. మంత్రిగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి పొన్నం ఇంట సందడి.. స్వీట్ తినిపించి అభినందించిన కుటుంబసభ్యులు తల్లి మల్లమ్మ ఆశీర్వాదం తీసుకున్న పొన్నం ప్రభాకర్. పొన్నంకు మంత్రివర్గంలో స్థానం లభించడంతో కుటుంబ సభ్యులతో పాటు అభిమానుల్లో ఆనందోత్సవాలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న భట్టి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ, పొంగులేటి, తుమ్మల, జూపల్లి కృష్ణారావు, కొండ సురేఖ కాబోయే మంత్రులు వివరాలను రాజ్‌భవన్‌కు తెలియజేసిన రేవంత్ కాబోయే మంత్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుపుతున్న ఠాక్రే తెలంగాణ రాష్ట్ర నూతన మంత్రి వర్గంలో 11మందికి చోటు నేటి (గురువారం) మధ్యాహ్నం కొత్త మంత్రివర్గం ప్రమాణం ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న భట్టి 9:15AM, Dec 7, 2023 శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బయల్దేరిన రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో మూడు స్టేజీల నిర్మాణం ప్రధాన స్టేజీకి ఇరువైపులా రెండు వేదికలు 500 మంది కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రమాణీస్వీకారానికి అమరవీరుల కుటుంబాలకు ఆహ్వానం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం తర్వాత కాంగ్రెస్ కృతజ్ఞత సభ ఎల్బీ స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు 3వేల మందితో భద్రతా ఏర్పాట్లు స్టేడియం లోపల, బయట మెటల్ డిటెక్టర్లు, పోలీస్ జాగిలాలతో తనిఖీలు స్టేడియం లోపలికి వెళ్లే ప్రతీ గేటు వద్ద డిటెక్టర్లు ఏర్పాటు నిజాం కాలేజీ నుంచి బషీర్‌బాగ్ చౌరస్తా వరకూ వాహనాల పార్కింగ్ హైదరాబాద్‌కు సోనియా, రాహుల్ నేడు హైదరాబాద్‌కు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక ఉదయం 9:30కి హైదరాబాద్ చేరుకోనున్న సోనియా, రాహుల్, ప్రియాంక మధ్యాహ్నం 1.04 గంటలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణం ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వేడుక కోసం ఎల్బీ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఆరు గ్యారంటీల అమలు ఫైల్‌పై రేవంత్ తొలి సంతకం చేసే చాన్స్ మధ్యాహ్నం 3 గంటలకు సీఎంగా సచివాలయంలోకి ఎంట్రీ భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్ నేతలు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వివరాలు వెల్లడించారు. కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలు ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. ఏర్పాట్లు ఇలా.. జూబ్లీహిల్స్‌లోని రేవంత్‌రెడ్డి నివాసం నుంచి ఎల్బీ స్టేడియం వరకు ఉన్న మార్గం పర్యవేక్షణకు ప్రత్యేక రూట్ పార్టీ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఆయా మార్గాలను ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలతో అడుగడుగునా తనిఖీ చేయిస్తున్నారు. ఎల్బీ స్టేడియం చుట్టూ అనునిత్యం ప్యాట్రోలింగ్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపుతున్నారు. బందోబస్తు, భద్రత విధుల్లో సీఎం సెక్యూరిటీ విభాగంతో పాటు ఆక్టోపస్, శాంతి భద్రతలు, టాస్క్‌ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సీఏఆర్ విభాగాలు, సాయుధ బలగాల సిబ్బంది పాల్గోనున్నారు. గురువారం ఉదయం నుంచే ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు ముమ్మరం చేయడంతో పాటు పెద్ద ఎత్తున మఫ్టీ పోలీసులను మోహరించనున్నారు. రూఫ్ టాప్ వాచ్ కోసం స్టేడియం చుట్టుపక్కల ఎత్తెన బిల్డింగ్స్‌పైన సుశిక్షితులైన సాయుధ బలగాలను మోహరిస్తున్నారు. స్టేడియం చుట్టూ రహదారుల్లో నిలిచిపోయిన ప్రజల సౌకర్యార్థం దాదాపు ఆరు భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని పోలీసులు ప్రతిపాదించారు. -
రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీకి త్వరలోనే కొత్త సారథి రాబోతున్నారా? ఈ ప్రశ్నకు పార్టీవర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, గతంలో బండి సంజయ్ స్థానంలో నియమితులైనప్పుడే..అసెంబ్లీ ఎన్నికలు ముగిసేదాకే ఈ బాధ్యతలు నిర్వహిస్తానని జాతీయ నాయకత్వానికి స్పష్టం చేసినట్టు సమాచారం. అందుకు జాతీయ నాయకత్వం కూడా సానుకూలంగా స్పందించిందని చెబుతున్నారు. కాగా నాయకత్వం ఒత్తిడి మేరకు అప్పట్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన కిషన్‌రెడ్డి, ఇటీవలి ఎన్నికల ఫలితాల దృష్ట్యా కూడా..లోక్‌సభ ఎన్నికల దాకా కొనసాగేందుకు సుముఖంగా లేరని అంటున్నారు. ప్రస్తుతం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లకు సీఎంల నియామకం కసరత్తులో బీజేపీ అగ్రనాయకత్వం తలమునకలై ఉంది. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాలు కూడా జరుగుతున్నందున తెలంగాణలో బీజేపీ సాధించిన ఫలితాలు, ఇతర పరిణామాలపై జాతీయ నాయకత్వం పెద్దగా దృష్టి సారించలేదని చెబుతున్నారు. అయితే ఆ మూడు రాష్ట్రాలకు సీఎంల ఎంపికపై స్పష్టత వచ్చి, వారు ప్రమాణస్వీకారం చేసే లోగానే రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో కిషన్‌రెడ్డి ఉన్నట్టు పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తొలుత రాజీనామా సమర్పించాలని, ఆ తర్వాత నాయకత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానితో నిమిత్తం లేకుండా ముందుకు సాగాలని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. భిన్న వాదనలు జాతీయ పార్టీకి లోక్‌సభ ఎన్నికలు కీలకం కావడంతో పాటు ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి గతంలో గెల్చిన నాలుగు సీట్ల కంటే అధిక స్థానాలు గెలవాలనే లక్ష్యం పెట్టుకోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర నాయకత్వ మార్పు సాధ్యం కాకపోవచ్చుననే అభిప్రాయం ఒకవైపు వినిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికలు ముగిసేదాకా కిషన్‌రెడ్డిని కొనసాగించే అవకాశాలున్నాయని కొందరు నేతలు చెబుతున్నారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కేవలం 8 సీట్లకే పరిమితం కావడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇది పార్టీ ముఖ్య నేతలను ఆవేదనకు గురి చేసినట్లు చెబుతున్నారు. మరోవైపు తన సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్కటి కూడా బీజేపీ గెలవకపోవడంతో ముందుగా తన నియోజకవర్గంలో పరిస్థితిని చక్కదిద్దుకోవాలనే ఆలోచనతో కిషన్‌రెడ్డి ఉన్నట్టుగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగేందుకు ఆయన ఒప్పుకోక పోవచ్చునని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. -
ఇక ‘పంచాయతీ’ సమరం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమౌతోంది. ప్రస్తుత గ్రామ పంచాయతీ పాలకమండళ్ల పదవీకాలం ఫిబ్రవరి 1తో ముగియనున్న నేపథ్యంలో.. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) నిమగ్నమైంది. రాజ్యాంగం ప్రకారం పంచాయతీరాజ్ (పీఆర్) సంస్థల ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి ముందే, నూతన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పీఆర్ సంస్థల టర్మ్ ముగియడానికి మూడు నెలల ముందే ఎన్నికలు పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతో జనవరిలో లేదా ఫిబ్రవరిలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతినివ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల షెడ్యూల్‌తో సహా ప్రతిపాదనలు పంపించనున్నట్టు ఎస్ఈసీ వర్గాలు వెల్లడించాయి. దాదాపు నెల రోజుల పాటు ఈ ఎన్నికల ప్రక్రియ సాగనుంది. అయితే వచ్చే మార్చి, ఏప్రిల్‌లలో లోక్‌సభ ఎన్నికలు జరిగే అవకాశాలుండటం, ఆ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉన్నందున ఈలోగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదనే వాదన కూడా వినిపిస్తోంది. కొత్త సర్కార్ కుదరదంటుందా? పంచాయతీ ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిది కావడంతో, వెంటనే మరో ఎన్నికల సమరానికి కొత్త ప్రభుత్వం మొగ్గు చూపక పోవచ్చుననే అభిప్రాయాన్ని ఉన్నతాధికారులు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ తన ఎన్నికల ప్రణాళికలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతామని, ఉప కులాల వారీగా కూడా రిజర్వేషన్లు ఇస్తామని, ఆరు నెలల్లో దీనికి సంబంధించి బీసీ కమిషన్ నివేదిక తెప్పించుకున్నాక తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వకుళాభరణం కృష్ణమోహన్ నేతృత్వంలోని బీసీ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిఉంది. అయితే ఈ ప్రక్రియ పూర్తవడానికి కొంత సమయం పట్టొచ్చునని అంచనా వేస్తున్నారు. వరుసగా జీపీ, ఎంపీపీ, జెడ్పీపీ, మున్సిపల్ పోల్స్ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుత గ్రామ పంచాయతీ (జీపీ), ఆ తర్వాత కొన్ని నెలలకే మండల, జిల్లా ప్రజా పరిషత్ (ఎంపీపీ, జెడ్పీపీ), మరికొన్ని నెలల తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. జీపీ ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ ఆఫీసర్లు, పోలింగ్ సిబ్బంది ఎంపిక, నియామకం అనేది కీలకమైన నేపథ్యంలో ఈ నెల 30 లోగా దీనికి సంబంధించిన కసరత్తు పూర్తి చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ఎస్ఈసీ ఆదేశించింది. ఈ ప్రక్రియకు సంబంధించి అనుసరించాల్సిన విధానంపై, ఈ ఎన్నికల నిర్వహణపై శిక్షణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లకు ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ సర్క్యులర్ పంపించారు. పోలింగ్ బూత్‌లలో 200 మంది ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారిని నియమించాలని సూచించారు. 201 నుంచి 400 ఓటర్ల దాకా ఒక ప్రిసైడింగ్ అధికారి, ఇద్దరు పోలింగ్ అధికారులను, 401 నుంచి 650 వరకు ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ అధికారి, ముగ్గురు పోలింగ్ అధికారులను నియమించాలని తెలిపారు. ఏదైనా వార్డులో ఓటర్ల సంఖ్య 650 దాటితే రెండు పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. గతంలో మాదిరిగా ప్రతి జిల్లాలో మూడు విడతలుగా ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తున్నందున, మొదటి దశలో ఎన్నికలు నిర్వహించిన రిటర్నింగ్, ప్రిసైడింగ్, పోలింగ్ ఆఫీసర్ల సేవలను మూడో దశ ఎన్నికల నిర్వహణకు ఉపయోగించుకోవాలని సూచించారు. -
లోక్ నాయకులెవరో!
సాక్షి, సిటీబ్యూరో: శాసనసభ ఎన్నికల ఫలితాలు రానున్న లోక్‌సభ ఎన్నికలను మరింత ఆసక్తికరంగా మార్చాయి. గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్, బీజేపీ కంటే బీఆర్ఎస్కు మెజారిటీ స్థానాలు దక్కాయి. రాజధాని పరిధిలో నాలుగు పార్లమెంట్ స్థానాల పరిధిలో 28 అసెంబ్లీ సీట్లున్నాయి. వీటిలో 17 స్థానాలు బీఆర్ఎస్ దక్కించుకోగా.. ఎంఐఎం ఏడు, కాంగ్రెస్ 3, బీజేపీ ఒక స్థానాన్ని గెలుపొందాయి. గోషామహల్లో కమలం వికసించగా.. గ్రామీణ సెగ్మెంట్లయిన పరిగి, తాండూరు, వికారాబాద్‌లు “హస్త’గతమయ్యాయి. మిగిలిన అన్ని స్థానాలు గులాబీ వశమయ్యాయి. నాంపల్లి అసెంబ్లీతో సహా హైదరాబాద్ లోక్‌సభలో సెగ్మెంట్లలో పతంగి ఎగిరింది. ఇలాంటి మిశ్రమ ఫలితాల నడుమ రానున్న పార్లమెంట్ ఎన్నికలు కూడా నగరంలో అనూహ్య ఫలితాలకు వేదికగా మారే అవకాశం లేకపోలేదు. తగ్గిన ఓట్ల శాతం.. రాజధాని పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ స్థానాలున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు వచ్చిన ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మినహా మల్కాజిగిరి, చేవెళ్ల, సికింద్రాబాద్ ఎంపీలు రేవంత్ రెడ్డి, రంజిత్ రెడ్డి, కిషన్ రెడ్డి నియోజకవర్గాల పరిధిలోని ఫలితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. రంజిత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో గత ఎన్నికలలో బీఆర్ఎస్కు 40.62 శాతం ఓట్లు రాగా.. తాజా అసెంబ్లీ ఎన్నికలలో ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్కు వచ్చిన ఓట్ల శాతం 24.91. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభలో గతంలో బీజేపీకి 42.05 శాతం ఓట్లు రాగా.. తాజా ఫలితాలలో కేవలం 10.31 శాతం మాత్రమే ఓట్లొచ్చాయి. ఇక.. రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో గతంలో కాంగ్రెస్‌కు 38.63 శాతం ఓట్లు రాగా.. తాజా అసెంబ్లీ ఫలితాలలో 15.91 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. హైదరాబాద్‌లో మజ్లిస్‌దే హవా.. హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా శాసనసభ నియోజకవర్గాలు వస్తాయి. ఈ పార్లమెంట్ స్థానంలో మజ్లిస్ పార్టీదే జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా తొమ్మిది లోకసభ ఎన్నికలలో హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని మజ్లిస్ కైవసం చేసుకుంటుంది. గత నాలుగు ఎన్నికలలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించగా.. అంతకుముందు ఐదు ఎన్నికలలో అసద్ తండ్రి సుల్తాన్ సల్లావుద్దీన్ ఒవైసీ గెలుపొందారు. గత ఎన్నికలలో గ్రేటర్‌లోని నాలుగు పార్లమెంట్ స్థానాలలో అత్యధికంగా హైదరాబాద్ లోక్‌సభలో 2,82,186 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఓవైసీ గెలుపొందారు. అత్యల్పంగా మల్కాజిగిరి లోక్‌సభలో 10,919 ఓట్ల మెజారిటీతో రేవంత్ రెడ్డి విజయం సాధించారు. చేవెళ్ల స్థానంలో 14,317 ఓట్ల మెజారిటీతో రంజిత్ రెడ్డి, సికింద్రాబాద్‌లో 62,114 ఓట్ల మెజారిటీతో కిషన్ రెడ్డి విజయం సాధించారు. నాలుగు పార్లమెంట్ స్థానాలలో మొత్తం 41,840 నోటా ఓట్లు పడ్డాయి. అత్యధికంగా మల్కాజిగిరిలో 17,895, అత్యల్పంగా హైదరాబాద్‌లో 5,663 నోటాకు ఓట్లు పోలయ్యాయి. -
కేడర్‌కు భరోసా!
సాక్షి, హైదరాబాద్: తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో అధికార పీఠానికి దూరమైన భారత్ రాష్ట్ర సమితి భవిష్యత్ కార్యాచరణపై దృష్టి సారించింది. ఎన్నికల ఫలితాలను వివిధ కోణాల్లో విశ్లేషిస్తూనే మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంపై పార్టీ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. పార్టీ తరఫున గెలుపొందిన నూతన ఎమ్మెల్యేలతో పాటు ఓడిన అభ్యర్థులు, ఇతర ముఖ్య నేతలు కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఆయన ఫామ్‌హౌస్‌కు బారులు తీరుతున్నారు. ప్రజా జీవితంలో గెలుపోటములు సహజమని తనను కలిసిన నేతలకు సర్ది చెబుతూనే నిరంతరం ప్రజల్లో ఉండేందుకు సన్నద్ధం కావాలని సూచిస్తున్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా కేడర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలపడంతో పాటు వారిలో ధైర్యం నింపాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తాజాగా నేతలకు విజ్ఞప్తి చేశారు. దీంతో ఎమ్మెల్యేలతో పాటు ఓటమి పాలైన నేతలు మండలాల వారీగా పార్టీ కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని, తాము అండగా ఉంటామంటూ కేడర్‌లో స్ఫూర్తి నింపే ప్రయత్నం ప్రారంభించారు. క్షేత్ర స్థాయి కార్యకలాపాలపై దృష్టి పార్టీకి 60 లక్షల మంది పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉన్నా అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితం దక్కకపోవడంపై బీఆర్ఎస్ లోతుగా విశ్లేషణ జరుపుతోంది. అసెంబ్లీ సెగ్మెంట్లు, మండలాలు, బూత్ ల వారీగా పార్టీ అభ్యర్థులకు పోలైన ఓట్లు, ప్రభావితం చేసిన అంశాలను పోస్ట్‌మార్టం చేస్తోంది. ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ పథకాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పార్టీ యంత్రాంగం విఫలమైనట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీల వల్ల కూడా నష్టం జరిగినట్లు అంచనా వేసింది. ఎమ్మెల్యేలు కేంద్రంగా పార్టీ కార్యకలాపా లు నిర్వహించడం, ద్వితీయ శ్రేణి యంత్రాంగంపై పార్టీ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడం కూడా ఓటమికి కారణమైందనే నివేదికలు అందాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణలో భాగంగా క్షేత్రస్థాయి కార్యక్రమాలపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. పార్టీ జిల్లా కార్యాలయాల్లో కార్యకర్తలకు శిక్షణ తెలంగాణ భవన్ పేరిట అన్ని జిల్లా కేంద్రాల్లోనూ పార్టీ కార్యాలయాలు నిర్మించినా నేటికీ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాలేదు. వీటిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తెచ్చేలా కార్యకర్తలకు నిరంతరం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయా లని పార్టీ నిర్ణయించింది. కొత్త తరానికి తెలంగాణ ఉద్యమం, బీఆర్ఎస్ పాత్ర, పదేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి తదితరాలను వివరించేలా కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. సోషల్ మీడియా విభాగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు క్షేత్ర స్థాయిలో కేడర్‌కు సోషల్ మీడియా ద్వారా చేయాల్సిన ప్రచా రంపై శిక్షణ ఇవ్వనున్నారు. ప్రభుత్వ పనితీరును నిశితంగా పరిశీలిస్తూ లోపాలపై ఎప్పటికప్పుడు ప్రతిస్పందించేందుకు వీలుగా ‘వార్‌రూమ్’ను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇకపై కేటీఆర్ ప్రతిరోజూ నిర్దేశిత సమయంలో తెలంగాణ భవన్లో నాయకులు, కేడర్‌కు అందుబాటులో ఉండేలా కార్యాచరణ సిద్ధమవుతోంది. కాగా ఈ నెల 9న పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రజల హక్కుల కోసం కొట్లాడుతాం: కేటీఆర్ సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన పార్టీగా బీఆర్ఎస్ ప్రజల గొంతుకై పనిచేస్తుందని, ప్రజల హక్కుల కోసం కొట్లాడుతుందని కేటీఆర్ చెప్పారు. బుధవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంబేడ్కర్ చిత్రపటానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ పడొద్దని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సాధారణమని చెప్పారు. అయితే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటువేసిన వాళ్లు సైతం ఫోన్లు చేసి, వీడియో మెసేజ్‌లు పెట్టి.. కేసీఆర్ సీఎం కాలేదా? అని బాధపడుతున్నారని తెలిపారు. ఇప్పుడు కూడా ప్రజలు మనకు 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారని, వారి విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు తదితర నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్, కర్నె ప్రభాకర్‌లు కేటీఆర్‌తో సమావేశమయ్యారు. -
దక్షిణాదిలో ఎలా?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దక్షిణాదిలో విస్తరించాలన్న బీజేపీ ఆశలపై నీళ్లు చల్లాయి. ఇటీవల ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లను బీజేపీ కైవసం చేసుకోగా, మధ్యప్రదేశ్‌లో ప్రజావ్యతిరేకతను అధిగమించి మళ్లీ అధికారంలోకి రాగలిగింది. ఈ ఏడాది మొదట్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరగడంతో అధికారంలోకి వస్తామని లేదా అధిక సంఖ్యలో సీట్లు సాధించి కింగ్‌మేకర్ లేదా ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని బీజేపీ నాయకత్వం అంచనా వేసింది. కానీ ఫలితాల్లో డబుల్ డిజిట్ కూడా దాటలేకపోయింది. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలతో దేశవ్యాప్తంగా మరీ ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న రాష్రాల్లోనూ నిలిచి ఉత్తరాది, ఇతర ప్రాంతాల్లో మరింత బలోపేతమవుతున్న బీజేపీ దక్షిణాదిలో మాత్రం ఎందుకు విస్తరించలేకపోతు న్నది? అందుకు దారితీస్తున్న, ప్రభావం చూపు తున్న అంశాలేమిటి అన్న దానిపై జాతీయనాయకత్వం దృష్టి పెట్టినట్టు పార్టీవర్గాల సమాచారం. వరుస ఓటములతో.. కర్ణాటకలో బీజేపీ అధికారాన్ని కోల్పోగా, తెలంగాణలో ఓటమితో బీజేపీ శ్రేణులు నిరాశలో ఉన్నాయి. డీలా పడిన పార్టీ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండింటితో సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో సత్తా చాటకపోతే భవిష్యత్‌లో రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే అభిప్రా యం పార్టీలో వ్యక్తమవుతోంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నాలుగు సీట్లు గెలవ గా, వచ్చే ఎన్నికల్లో కనీసం 8 నుంచి 9 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తేనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ టమిని అధిగమించినట్టు అవుతుందనే చర్చ అంతర్గతంగా ముఖ్యనేతల్లో సాగుతున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలోనే లోక్‌సభ ఎన్నికల కల్లా దక్షిణాదిలో మరీ ముఖ్యంగా కర్ణాటక, తెలంగాణల్లో పార్టీ పరిస్థితిని చక్కదిద్దడంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు దృష్టి పెట్టినట్టు తెలిసింది. ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఉత్తరాదిలో బలంగా ఉన్నా దక్షిణాదిలో ఇంకా పూర్తిస్థాయిలో పట్టు దొరక్కపోవడానికి కారణాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే దక్షిణాదికి సంబంధించి ప్రత్యేక ఎ జెండాకు తుది రూపం ఇస్తున్నట్టు సమాచారం. దక్షిణాదిని ఆనుకొని పొరుగున రాష్ట్రాలు కలుపుకుని మొత్తం 11 రాష్ట్రాల్లో 181 ఎంపీ సీట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో వాటిలో 53 స్థానాల్లో బీజేపీ గెలుపొందింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఆ సంఖ్యను దాటి ఎక్కువ మొత్తంలో సీట్లు గెలిచే దిశగా కచ్చితమైన వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికతో బీజేపీ ముందుకెళ్లనుంది. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని రాష్ట్రపార్టీలకు జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. -
నేడే పట్టాభిషేకం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి సర్వం సిద్ధమైంది. కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పి) నేతగా ఎన్నికైన రేవంత్‌రెడ్డితో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయిస్తారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారం అనంతరం రేవంత్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీల అమలుపై ప్రకటన చేయనున్నారు. ఈ వేదికపైనే ఆయా గ్యారంటీలకు సంబంధించిన ఫైల్‌పై రేవంత్ సీఎంగా తొలి సంతకం చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. పకడ్బందీగా ఏర్పాట్లు: సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం కోసం ఎల్బీ స్టేడియంను ముస్తాబు చేశారు. భారీ వేదికను సిద్ధం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియా గాందీ, రాహుల్, ప్రియాంకలతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, టీపీసీసీ సీనియర్ నేతలు వేదికపై ఆసీనులు కానున్నారు. కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరుకానున్నట్టు టీపీసీసీ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి బుధవారం డీజీపీ రవిగుప్తాతో కలసి ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, ఇతర ప్రముఖులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా అన్నీ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలో తాగునీరు, ఇతర సౌకర్యాలన్నీ కల్పించాలని సూచించారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న నేపథ్యంలో వారి కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను సిద్ధం చేయాలని.. వాహనాల పార్కింగ్, బందోబస్తు విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక రేవంత్‌రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని.. తన చాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఇతర సీనియర్ ఐఏఎస్ అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పాలన పరిస్థితులు, ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకారానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా, సీనియర్ నేతలు కె.నారాయణ, సయ్యద్ అజీజ్ పాషా, చాడ వెంకటరెడ్డి తదితరులు హాజరుకానున్నారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఈ వివరాలు వెల్లడించారు. కట్టుదిట్టంగా భద్రత.. ట్రాఫిక్ ఆంక్షలు ఎల్బీ స్టేడియంలో రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం, తర్వాత సచివాలయానికి వెళ్లనుండటం నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నిఘా పెట్టింది. గురువారం ఉదయం నుంచే ఎల్బీ స్టేడియం, సచివాలయం పరిసరాల్లో సుమారు 2వేల మంది పోలీసులను మోహరించనున్నారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసం నుంచి ఎల్బీ స్టేడియం రూట్ పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. బందోబస్తుపై బలగాలు బుధవారం మధ్యాహ్నమే రిహార్సల్స్ పూర్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో నిఘా, తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. -
భట్టికి రెవెన్యూ.. ఉత్తమ్‌కు ఆర్థికం?
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో అధికారం చేపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు కీలకంగా మారింది. ఎక్కువ మంది సీనియర్లు ఉండటం, ప్రాధాన్య శాఖల కోసం పోటీపడుతుండటంతో ఉత్కంఠ నెలకొంది. పలువురు సీనియర్లకు మంత్రులుగా అవకాశం ఖాయమైనా.. వారికి కేటాయించే శాఖలేమిటనేది ఇంకా తేలలేదు. బుధవారం అర్ధరాత్రి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. సీఎంగా రేవంత్, మంత్రులుగా మరో 12 మంది వరకు ప్రమాణం చేస్తారని తెలిసింది. ఈ జాబితాలో సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో భట్టికి రెవెన్యూ, ఉత్తమ్‌కు ఆర్థికశాఖ ఇవ్వవచ్చని.. మరో సీనియర్ నేతకు హోంశాఖ ఇవ్వనున్నారని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. కానీ పక్కాగా స్పష్టత రావడం లేదు. తొలి రోజున ప్రమాణం చేసేది ఎందరు? వాస్తవానికి గురువారం రేవంత్‌రెడ్డి ఒక్కరే ప్రమాణం చేస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ తర్వాత సంఖ్య పెరుగుతూ వచ్చింది. రేవంత్‌తోపాటు ఐదుగురు అని ఓసారి, ఆరుగురు అని మరోసారి, మొత్తం తొమ్మిది మంది ప్రమాణ స్వీకారం చేస్తారని ఇంకోసారి వార్తలు వచ్చాయి. చివరిగా 12 మంది వరకు తొలిరోజునే ప్రమాణం చేయనున్నట్టు గాందీభవన్ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమంలో పూర్తిస్థాయి మంత్రివర్గం కొలువుదీరకపోతే.. మిగతావారు ఈనెల 9న, లేదా మరో రోజున ప్రమాణం చేస్తారని వివరించాయి. కొందరు సీనియర్ల శాఖలు ఢిల్లీలోనే ఖాయం రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాకుండా 17 మంది మంత్రులను నియమించే వెసులుబాటు ఉంది. కాంగ్రెస్ తరఫున గెలిచిన వారిలో 24 మంది ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పారీ్టలో సీనియర్లు, ఇతర కోటాల్లో మరో ముగ్గురికిపైనే నేతలు మంత్రి పదవుల పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కేబినెట్ బెర్తుల కోసం అటూఇటూగా 30మంది వరకు పేర్లను పరిశీలించిన ఏఐసీసీ.. పలువురిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న దానిపై రేవంత్‌కు దిశానిర్దేశం చేసిందని, రేవంత్ విచక్షణ మేరకు మరికొందరిని కేబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. దీనితోపాటు కొందరు సీనియర్లకు శాఖల కేటాయింపుపై ఢిల్లీలోనే స్పష్టత వచ్చిందని.. డిప్యూటీ సీఎం హోదాలో భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ, ఉత్తమ్‌కు ఆర్థిక శాఖ ఇవ్వనున్నారని గాందీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ రెండు శాఖలతోపాటు హోంశాఖ కోసం పలువురు సీనియర్లు పోటీపడుతున్నారని తెలిసింది. దామోదర రాజనర్సింహ, శ్రీధర్బాబులకూ కీలక శాఖలు దక్కనున్నట్టు సమాచారం. అధిష్టానం సూచనలకు అనుగుణంగా.. ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి ఆయా మంత్రులకు శాఖలను కేటాయిస్తారు. మంత్రి పదవుల రేసులో ఉన్నది వీరే.. మంత్రి పదవుల కోసం సీనియర్లతోపాటు కొందరు జూనియర్ ఎమ్మెల్యేలు కూడా వివిధ కోటాల కింద పోటీ పడుతున్నారు. సామాజికవర్గాల ప్రాతిపదికన జూనియర్లను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి రావడంతో ఈ జాబితా పెరిగిపోయింది. సీనియర్ల జాబితాలో.. భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్‌రెడ్డి జి.వివేక్, జి.వినోద్, తుమ్మల నాగేశ్వర్రావు, దొంతి మాధవరెడ్డి, బాలూ నాయక్, టి.రామ్మోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. జూనియర్ల జాబితాలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఆది శ్రీనివాస్, ఈర్ల శంకర్, వాకిటి శ్రీహరి, బీర్ల అయిలయ్యల పేర్లున్నాయి. వీరితోపాటు అద్దంకి దయాకర్, షబ్బీర్‌అలీ, బలరాం నాయక్ తదితరులు సామాజిక వర్గాలు, ఇతర కోటాల్లో మంత్రి పదవి ఆశిస్తున్నట్టు తెలిసింది. వీరిలో ఎవరెవరికి మంత్రులుగా అవకాశం వస్తుంది? వారిలో గురువారం ఎందరు ప్రమాణ స్వీకారం చేస్తారు? ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించనున్నారన్నది గురువారం తేలిపోనుంది. కేబినెట్‌పై ఢిల్లీలో మల్లగుల్లాలు రేవంత్‌రెడ్డి మంగళవారం రాత్రి ఢిల్లలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్‌తో మంత్రివర్గ కూర్పుపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. సీనియర్లు ఉత్తమ్, భట్టి తదితరులు వెలిబుచ్చిన అభిప్రాయాలను ఈ సందర్భంగా రేవంత్‌కు డీకే వివరించినట్టు తెలిసింది. తర్వాత బుధవారం ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లతో రేవంత్ జరిపిన భేటీల్లోనూ మంత్రి పదవులపై చర్చించినా.. ఓ నిర్ణయానికి రాలేకపోయినట్టు సమాచారం. రేవంత్ హైదరాబాద్‌కు వచ్చేందుకు బుధవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఎయిర్‌పోర్టుకు బయలుదేరారు. కానీ మధ్యలో ఉండగానే అధిష్టానం పెద్దల పిలుపు మేరకు వెనక్కి వెళ్లారు. మహారాష్ట్ర సదన్‌లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావు ఠాక్రేతో భేటీ అయి అరగంటకుపైగా చర్చించారు. మరోవైపు ఢిల్లీలోనే డీకే శివకుమార్‌తో ఉత్తమ్, భట్టి, జి.వినోద్, శ్రీధర్‌బాబు, ప్రేమ్‌సాగర్‌రావు, మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు విడివిడిగా భేటీ అయ్యారు. తమకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని, ప్రాధాన్య శాఖలు కేటాయించాలని కోరారు. రేవంత్‌ను కలవని సీనియర్లు! మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం దాకా ఢిల్లీలోనే ఉన్న రేవంత్‌రెడ్డి ఓవైపు.. ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు తదితర సీనియర్లు మరోవైపు ఏఐసీసీ పెద్దలతో భేటీలు జరిపారు. కానీ సీనియర్లు ఎవరూ కూడా రేవంత్‌ను కలవలేదు. ఆయన అధిష్టానం పెద్దలను కలసినప్పుడూ వారు దూరంగానే ఉండటం చర్చనీయాంశంగా మారింది. -
కేసీఆర్ కోసం చింతమడక ప్రజల పడిగాపులు
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ తాజా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును కలవడానికి వెళ్లిన చింతమడక వాసులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆయన్ని కలిసేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. దీంతో చాలా సేపు బయటే ఎదురు చూడాల్సి వచ్చింది చింతమడక వాసులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌కు సంఘీభావం తెలిపేందుకు ఆయన స్వగ్రామం చింతమడక నుంచి 500 మంది.. ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వచ్చారు. అయితే ఫామ్ హౌజ్ చెక్ పోస్ట్ వద్ద ఉన్న భద్రతా సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. అనుమతి లేనిదే లోపలికి పంపమని చెప్పారు. దీంతో లోపలి నుంచి అనుమతి వచ్చేంత వరకు వాళ్లు అక్కడే నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాదాపు మూడు గంటల పాటు వాళ్లు ఫామ్‌హౌజ్ చెక్‌పోస్ట్ వద్ద ఆగిపోవడంతో.. ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత లోపలి నుంచి అనుమతి రావడంతో వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ముఖ్యమంత్రిగా రాజీనామా చేసినా.. బీఆర్ఎస్ అధ్యక్ష హోదాతో పాటు తాజా మాజీ సీఎం కావడంతో ఇంకా సెక్యూరిటీ కొనసాగుతోంది. -
ఆ మాట ఇచ్చి నిలబెట్టుకున్నా: కేటీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సిరిసిల్లలో ఓటుకు డబ్బులు, మందు పంచనని మాట ఇచ్చి నిలబెట్టుకున్నా.. ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి ఆయన నివాళుర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, పోరాటాలు మాకేం కొత్త కాదు.. కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ప్రజల గొంతుకై మాట్లాడతాం. పవర్ పాలిటిక్స్‌లో అధికారం రావడం, పోవడం సహజం. నిరాశపడాల్సిన అవసరంలేదు. ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం’’ అని పేర్కొన్నారు. ఇదీ చదవండి: తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్ -
తెలంగాణలో రేపు కొలువుదీరనున్న కొత్త సర్కార్
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రేపు(గురువారం) కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. మధ్యాహ్నం 1.04 నిమిషాలకు సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో సామాజిక న్యాయం పాటించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రాష్ట్ర కేబినెట్‌తో పాటు ఇతర కీలక పదవుల్లో ఆయా వర్గాలకు ప్రాధాన్యం కల్పించే దిశలో కసరత్తు చేస్తోంది. మరోవైపు, మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. మంత్రి వర్గ కూర్పుపై ఢిల్లీలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. వరుసగా ఏఐసీసీ నేతలతో రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్‌తో ప్రమాణం చేసేది ఆరుగురేనని సమాచారం. ఒక డిప్యూటీ సీఎం, ఐదుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ ఎవరనేది తేలాక.. మరోసారి మంత్రి వర్గ విస్తరణ జరగనున్నట్లు తెలిసింది. తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ? 1. సీఎం - రేవంత్ రెడ్డి 2. డిప్యూటీ సీఎం - భట్టి విక్రమార్క 3. దామోదర రాజనర్సింహ ( మాదిగ) 4.గడ్డం వివేక్ ( మాల) 5. సీతక్క( ఎస్టీ) 6. పొన్నం ప్రభాకర్(గౌడ్) 7. కొండా సురేఖ ( మున్నూరు కాపు) 8. ఉత్తం కుమార్ రెడ్డి 9. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 10. కోమటి రెడ్డి వెంకట రెడ్డి 11. మల్ రెడ్డి రంగారెడ్డి 12. తుమ్మల నాగేశ్వర రావు ( ఖమ్మం) 13. దుద్దిల్ల శ్రీధర్ బాబు( బ్రాహ్మణ) 14. షబ్బీర్ ఆలీ 15. జూపల్లి కృష్ణారావు 16. శ్రీహరి ముదిరాజ్ 17. వీర్లపల్లి శంకర్ (ఎంబిసి) స్పీకర్ : రేవూరి ప్రకాశ్ రెడ్డి / శ్రీధర్ బాబు చదవండి: మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా.. -
మాటిచ్చిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు సీఎంగా..
తెలంగాణలో తొలి ఉద్యోగం నాకే రాబోతున్నందుకు సంతోషంగా ఉంది. రేవంత్ రెడ్డి సార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. గాంధీ భవన్ వెళ్లినప్పుడు ఆయన నాకు ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీ ఆయన నెరవేరుస్తుండడం హ్యాపీగా ఉంది.. :::రజిని అధికారంలోకి గనుక వస్తే.. అంటూ హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో సర్కార్ ఏర్పాటు అవుతున్న తరుణంలో వాటిని నెరవేర్చేందుకు సిద్ధమైపోయింది. రేపు డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్ ప్రమాణం ముఖ్యమంత్రిగా చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు గ్యారెంటీ హామీలు నెరవేర్చడంపైనా ఆయన స్పష్టమైన ఒక ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే.. తొలి ఉద్యోగం కూడా ఎవరికి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో తొలి ఉద్యోగం రజినీ అనే యువతికి దక్కనుంది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేయాలని అధికార యంత్రాంగాన్ని రేవంత్‌రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తొలి ఉద్యోగం రజినీకి ఇస్తాం అని స్వయంగా ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడా గ్యారెంటీని నెరవేర్చేందుకు రెడీ అయిపోయారు. అక్టోబర్ 17వ తేదీన.. నాంపల్లికి చెందిన రజిని అనే ఓ దివ్యాంగురాలు గాంధీభవన్‌కు వెళ్లి రేవంత్‌రెడ్డిని కలిశారు. రజిని రెండేళ్ల క్రితం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం వెతుకుతోంది. పీజీ చేసిన తనకు ఇటు ప్రభుత్వంలోనూ అటు ప్రైవేటులోనూ ఉద్యోగం రావట్లేదని తన బాధను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చెప్పింది. అప్పుడు రేవంత్ రెడ్డి .. ‘‘కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొదటి ఉద్యోగం నీకే ఇస్తాం. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో కాంగ్రెస్ సీఎం ప్రమాణ స్వీకార సభ ఉంటుంది. ఆ సభకు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ వస్తారు. ఆ సభలోనే మొదటి ఉద్యోగం నీకేనమ్మా. ఇది నా గ్యారెంటీ’’ అంటూ రేవంత్ ఆమెకు హామీ ఇచ్చారు. అంతేకాదు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు మీద స్వయంగా ఆయన రజినీ పేరు రాసి.. కింద సంతకం కూడా చేశారు. As PCC President of Telangana , promised first job to Rajini, a physically challenged girl from Nampally as soon as #Congress comes to power. I filled the Congress guarantee card with Rajini's name. Rajini, who completed post graduation expressed her grief that she is not… pic.twitter.com/JFSha8a56M — Revanth Reddy (@revanth_anumula) October 17, 2023 నెలన్నర తర్వాత.. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో తొలి ఉద్యోగం రజినికే దక్కబోతోంది. కానీ, ప్రమాణ స్వీకారమే రెండు రోజులు ముందుగానే జరుగుతోంది. -
TS: ఎవరికి వారే.. మంత్రి పదవుల కోసం ఢిల్లీలో లాబీయింగ్
సాక్షి, ఢిల్లీ: మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ ప్రారంభించారు. తెలంగాణ మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు, ప్రేమ్ సాగర్‌రావుతో పాటు పలువురు అధిష్టానం పెద్దలను కలిశారు. డీకే శివకుమార్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు.. మంత్రి పదవుల్లో స్థానం కల్పించాలని కోరినట్లు సమాచారం. అధిష్టానంపైనే సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. డీకే శివకుమార్‌ను కలిసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు.. మంత్రి పదవి కోసం విజ్ఞప్తి చేశారు. ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మర్యాదపూర్వకంగానే డీకేను కలిశానని, కాంగ్రెస్ అధిష్టానం మేరకు నడుచుకుంటామని తెలిపారు. మంత్రి పదవిని ఇస్తే తీసుకుంటా.. ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేశా.. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని శ్రీధర్‌బాబు తెలిపారు. అధిష్టానమే మంత్రి పదవుల్ని నిర్ణయిస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అంటున్నారు. నిన్న సీఎం ప్రకటన తర్వాత సీనియర్లందరికీ న్యాయం జరుగుతుందని ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాంగ్రెస్ నాయకులంతా కలిసి పని చేయాలని ఖర్గే పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు