breaking news
-
ఆ విషయంపై క్లారిటీ కావాలి: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ పెట్టుబడిపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదని.. క్లారిటీ కావాలంటూ కొత్త ప్రభుత్వాన్ని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తోందన్నారు. శనివారం అసెంబ్లీ సమావేశాల ముగింపు అనంతరం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. విమర్శలు చేయడానికి తాము రాలేదన్నారు. ‘‘ఓ వైపు వర్షాలు పడుతున్నాయి. బోనస్ ఎప్పుడు ఇస్తారో ప్రభుత్వం చెప్పాలి. రైతు బంధు రూ.15 వేలు ఇస్తామని చెప్పారు. డిసెంబర్ 9న ఇస్తామని చెప్పింది కానీ ఇవ్వటం లేదు. మేం అధికారంలో ఉన్నపుడు నవంబర్ చివరి వారం, డిసెంబర్ మొదటి వారంలో వేశాం. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా ఎప్పటి లోగా ఇస్తారో స్పష్టత ఇవ్వాలి. యాసంగి పంట వేసే సమయం వచ్చింది దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. డిసెంబర్ 9న వచ్చిన ప్రభుత్వం నుంచి స్పందన లేదు’’ అని హరీష్‌రావు విమర్శించారు. ఇదీ చదవండి: మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం -
Telangana: మంత్రులకు శాఖల కేటాయింపు.. ఐటీ మంత్రి ఎవరంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు నేడు శాఖలను కేటాయించారు. మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. దీంతో, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై క్లారిటీ తీసుకొని కేటాయింపు జరిగింది. కీలకమైన హోంశాఖ సీఎం రేవంత్ వద్దే ఉంది. మంత్రులు, వారి శాఖలు ఇవే.. రేవంత్ రెడ్డి.. హోం శాఖ, మున్సిపాలిటీ, విద్య మల్లు భట్టి విక్రమార్క: ఆర్థిక శాఖ, విద్యుత్ దామోదర రాజనర్సింహ: వైద్య, ఆరోగ్యశాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి: సివిల్ సప్లై, నీటి పారుదల, సీతక్క: పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఉమెన్ వెల్ఫర్ శ్రీధర్‌బాబు: ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు కొండా సురేఖ: అటవీ శాఖ, దేవాదాయ, పర్యావరణ పొంగులేటి శ్రీనివాస్: సమాచార శాఖ, రెవెన్యూ, హౌసింగ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ జూపల్లి: ఎక్సైజ్, పర్యాటక శాఖ, పురావస్తు తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయ శాఖ, చేనేత, అనుబంధ సంస్థలు పొన్నం ప్రభాకర్: రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ -
తిరుమలలో ఎమ్మెల్యే వివేక్.. సింగరేణిపై కీలక వ్యాఖ్యలు
సాక్షి, తిరుమల: చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని వివేక్ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని వివేక్ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం, వివేక్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చింది. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఎక్కడా మంచి నీరు రావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం. పది సంవత్సరాలలో ప్రజాధనం దుర్వినియోగంపై శ్వేతపత్రం తీసుకురావాల్సి ఉంది. అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారు. ధరణి పోర్టల్‌తో కల్వకుంట్ల కుటుంబం భూ దందాకు పాల్పడింది.రాష్ట్రంలో దోపిడిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించడం జరిగింది అని కామెంట్స్ చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ గురువారానికి వాయిదా
Live Updates.. తెలంగాణ శాసనసభ వచ్చే గురువారానికి వాయిదా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించిన ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయని ఇద్దరు మంత్రులు ప్రమాణం చేయని ఉత్తమ్‌కుమార్, కోమటిరెడ్డి వారిద్దరూ ఎంపీలుగానే ఉన్నారు. ఇంకా ఎంపీ పదవులకు రాజీనామా చేయని కారణంగా నేడు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయలేదు. రాజ్‌భవన్‌కు బీజేపీ ఎమ్మెల్యేలు.. బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఎంపికపై గవర్నర్‌కు ఫిర్యాదు. గవర్నర్ తమిళిసై లేకపోవడంతో రాజ్‌భవన్ సెక్రటరీకి వినతి పత్రం అందజేత బీజేపీ ఎమ్మెల్యేలు సీనియర్లు కాదని మజ్లిస్ ఎమ్మెల్యేను కావాలనే ప్రొటెం స్పీకర్ చేశారని ఫిర్యాదు. శాసనసభ సంప్రదాయాలను కాలరాస్తున్నారని ఆగ్రహం. నేడు రెండు పథకాలకు శ్రీకారం.. మధ్యాహ్నం ఒంటి గంటకు అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద రెండు పథకాలను ప్రారంభించనున్న సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం పేదలందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల ఉచిత వైద్య సదుపాయం చేయూత. కొలువుదీరిన 2 రోజుల్లోనే 2 గ్యారంటీలకు శ్రీకారం. నేడే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం. 👉 ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచిత ప్రయాణం. 👉 రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సాయం 10 లక్షలు. ప్రగతి పథం.. సకల జనహితం.. మన ప్రజా ప్రభుత్వం!… pic.twitter.com/stqOjkF10T — Telangana Congress (@INCTelangana) December 9, 2023 అందుకే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాం: కిషన్‌రెడ్డి శాసనసభ గౌరవాన్ని కాలరాసేలా ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తోంది. సీనియర్ సభ్యులు ఉన్నా ఎంఐఎంతో ఒప్పందం మేరకు అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించింది. సభా నియమాలను తుంగలో తొక్కడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది అందుకే ఇవాళ అసెంబ్లీని బహిష్కరించాలని నిర్ణయించాం ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఎంఐఎం ఒకటేనన్న కాంగ్రెస్ అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎలా నియమించింది. సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించి ఆయన ఆధ్వర్యంలోనే స్పీకర్ ఎన్నిక జరగాలని డిమాండ్ చేస్తున్నాం ఇదే విషయాన్ని గవర్నర్‌ను కలిసి కోరుతాం గాంధీభవన్‌లో సీఎం రేవంత్ కామెంట్స్.. భుజాలు కాయలు కాసేలాగా కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు కార్యకర్తల వల్లే మేం సీట్లలో కూర్చున్నాం ఎన్ని రాజకీయ ప్రకంపనలు ఎదురైనా ఉక్కు సంకల్పంతో సోనియా తెలంగాణ ఇచ్చారు తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు తెలంగాణ తల్లి సోనియా లాగే ఉంటుందని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు లక్షలాది తెలంగాణ బిడ్డలకు సోనియానే తల్లి డిసెంబర్ ఏడో తేదీన సోనియా ఎల్బీ స్టేడియంలోకి ఎంటర్ అయ్యే క్షణాలని నేను ఎప్పటికీ మర్చిపోలేను డిసెంబర్ 9, 2017న గాంధీ భవన్లో అడుగుపెట్టాను డిసెంబర్ 9, 2023న ప్రభుత్వం ఏర్పాటు అయింది పాలకుడిగా కాకుండా సేవకుడిగా ఉంటాను పది సంవత్సరాలు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కున్నారు కార్యకర్తలకు మాట ఇస్తున్నాను. ఈ ప్రభుత్వం కార్యకర్తలది సోనియా గాంధీ 100 సంవత్సరాలు సంతోషంగా జీవించాలి శాసనసభలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలి ►సభకు హాజరైన 109 మంది ఎమ్మెల్యేలు. ►అనారోగ్యం కారణంగా సభకు హాజరు కాని కేసీఆర్, కేటీఆర్ ►సభకు బీజేపీ సభ్యులు ఎనిమిది మంది గైర్హాజరు ►మొదట రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, శ్రీధర్ బాబు ప్రమాణ స్వీకారం.. ►ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్న ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ. ►తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ► తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన 51 మంది ఎమ్మెల్యేలు ►అసెంబ్లీ సమావేశాలకు బాయ్‌కాట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు ►కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశం ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►రేవంత్‌కు స్వాగతం పలికిన మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీ ►అసెంబ్లీ ఆవరణలోని బంగారు మైసమ్మ ఆలయంలో రేవంత్ ప్రత్యేక పూజలు. ►అసెంబ్లీకి చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ►భట్టి తో పాటు అసెంబ్లీకి వచ్చిన పొంగులేటి, తుమ్మల గన్‌పార్క్ వద్ద కోలాహలం గన్‌పార్క్ వద్దకు చేరుకున్న బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఎదురుపడిన రెండు పార్టీల నేతలు గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన బీజేపీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకుంటున్న మంత్రులు కొత్త మంత్రులు అసెంబ్లీకి చేరుకుంటున్నారు. అసెంబ్లీకి చేరుకున్న మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ గాంధీ భవన్లో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు.. గాంధీభవన్‌లో సోనియ బర్త్ డే సెలబ్రేషన్స్.. 78 కిలోల కేట్ కట్ చేసి శుభాకాంక్షలు చెపుకున్న కాంగ్రెస్ నేతలు సోనియా పుట్టినరోజు సందర్బంగా కేక్ కట్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, వీహెచ్, మాణిక్‌రావ్ ఠాక్రే ఇతర నేతలు డిప్యూటీ సీఎం భట్టి ,మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ,తుమ్మల, సీతక్క, కొండా సురేఖ ,పొన్నం ప్రభాకర్, హాజరైన పార్టీ నేతలు. భట్టి కామెంట్స్.. గాంధీభవన్ ఆశయాలను నెరవేరుస్తాం సోనియా గాంధీ కలలు కన్న సంక్షేమ రాజ్యాన్ని స్థాపిస్తాం. ప్రజలు మెచ్చేలా పాలన ఉంటుంది రాష్ట్ర సంపద ప్రజలకు పంచుతాం. తెలంగాణభవన్‌లో ముగిసిన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం బీఆర్ఎస్ ఎల్పీ నేతగా కేసీఆర్‌ను ఎన్నుకున్న పార్టీ ఎమ్మెల్యేలు బస్సులో అసెంబ్లీకి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణభవన్ నుంచి గన్‌పార్క్‌కు బయలుదేరిన ఎమ్మెల్యేలు గన్‌పార్క్ వద్ద నివాళులు అర్పించనున్నారు అసెంబ్లీకి హాజరుకానున్న ఎమ్మెల్యేలు కేసీఆర్ పేరును ప్రతిపాదించిన పోచారం.. బలపరచిన తలసాని, కడియం శ్రీహరి శాసనభాపక్ష మిగతా కమిటీని ఎంపిక చేసే బాధ్యత కేసీఆర్‌కు అప్పగింత. బీజేపీ నేతల కీలక నిర్ణయం.. అసెంబ్లీ బహిష్కరించాలని బీజేపీ నిర్ణయం ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రమాణం చేయవద్దని డిసైడ్ అయిన కమలం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ ముందు ప్రమాణం చేసేందుకు ససేమీరా అన్న బీజేపీ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకోనున్న ఎమ్మెల్యేలు ఈరోజు ఉదయం 10:30 గంటకు మీడియాతో మాట్లాడనున్న కిషన్ రెడ్డి ►అసెంబ్లీ ప్రారంభానికి ముందే మంత్రులకు శాఖల కేటాయింపు ►శాఖల కేటాయింపుపై ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. ►ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ►అక్బరుద్దీన్ ఒవైసీతో ప్రమాణం చేయించిన గవర్నర్ తమిళిసై #WATCH | AIMIM MLA Akbaruddin Owaisi takes oath as Pro-tem Speaker of Telangana Legislative Assembly, in Raj Bhawan, Hyderabad pic.twitter.com/PpMoZhOvjy — ANI (@ANI) December 9, 2023 ►ప్రొటెం స్పీకర్ ప్రమాణానికి బీజేపీ దూరం ►బీఆర్ఎస్ నుంచి హాజరైన పోచారం శ్రీనివాస్, మాజీ మంత్రి హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి. ►రాజ్‌భవన్ దర్బార్ హాల్లో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం ►కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మాజీ స్పీకర్ పోచారం, మంత్రులు ►తెలంగాణ మూడో శాసన సభకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ►చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యేగా ఉన్న అక్బరుద్దీన్ ►రాజ్‌భవన్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి. ►కాసేపట్లో రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం. ►అక్బరుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించనున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ►నేడు ప్రమాణ స్వీకారానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరం. ►తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు తొలిసారిగా కొలువు దీరనుంది. ►తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం, ధన్యవాద తీర్మానం తదితరాల కోసం నాలుగు రోజుల పాటు అసెంబ్లీ తొలి సమావేశాలు జరుగనున్నాయి. తొలిసారిగా అసెంబ్లీకి 51 మంది ►అన్ని పార్టీల తరఫున కలుపుకుని మొత్తం 51 మంది తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు మహిళలు కాగా, కరీంనగర్ జిల్లా నుంచి 8 మంది తొలిసారిగా ఎన్నికైన వారున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఇద్దరు తొలిసారి అడు గు పెడుతున్నారు. 51 మందిలో 18 మంది క్రియాశీల రాజకీయాల్లోకి ఆరంగేట్రం చేస్తున్న వారే. రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం ►తొలిరోజు సమావేశంలో కొత్తగా ఎన్నికైన 119 మంది ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏఐఎంఐఎం సీనియర్ శాసన సభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నామినేట్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి నోటిఫికేషన్ జారీ చేశారు. ►ప్రొటెమ్ స్పీకర్‌గా అక్బరుద్దీన్‌తో రాజ్‌భవన్‌లో శనివారం ఉదయం 8.30కు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ►సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ►ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ప్రొటెమ్ స్పీకర్ అధ్యక్షతన తెలంగాణ మూడో శాసనసభ తొలిరోజు సమావేశం ప్రారంభమవుతుంది. ►తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ►ఆ తర్వాత తెలుగు అక్షరమాలలోని అక్షర క్రమంలో ఎన్నికైన ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. బీఆర్ఎస్కు విపక్ష హోదా ►శాసనసభలో మొత్తం 119 మంది సభ్యులకు గాను తెలంగాణ మూడో శాసనసభలో అధికార కాంగ్రెస్‌కు 64, మిత్రపక్షం సీపీఐకి ఒకరు చొప్పున ఎమ్మెల్యేల బలం ఉంది. బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఏఐఎంఐఎంకు ఏడుగురు సభ్యుల బలం కలిగి ఉన్నాయి. అధికార కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్న బీఆర్ఎస్కు విపక్ష హోదా దక్కే అవకాశముంది. ►బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ►ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. ►బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. ►కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. నేడు స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ ►శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత స్పీకర్ ఎన్నిక కోసం శనివారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ శాసనసభ్యుడిగా ఎన్నికైన మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ను శాసనసభ స్పీకర్‌గా కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన శనివారం సాయంత్రం సీఎం రేవంత్, మంత్రివర్గం సమక్షంలో నామినేషన్ సమర్పిస్తారని తెలిసింది. ►కాగా రెండో రోజు ఆదివారం స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత బాధ్యతల స్వీకరణ కార్యక్రమం, ఆ తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయి. ఈ నెల 11న సోమవారం జరిగే మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత వాయిదా పడే సభ తిరిగి 12వ తేదీ మంగళవారం ఉదయం ప్రారంభమవుతుంది. నాలుగో రోజు సమావేశంలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపిన తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడుతుంది. -
తేలని శాఖలు
ఎంపీ పదవికి రేవంత్ రాజీనామా కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి, తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. మల్కాజిగిరి పార్లమెంటు నియోజక వర్గం నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఆయన, స్పీకర్ ఓం బిర్లాను కలిసి తన రాజీనామా సమర్పించారు. సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేసిన నేతలకు శాఖల కేటాయింపుపై సస్పెన్స్ కొనసాగుతోంది. శుక్రవారం ఈ అంశంపై స్పష్టత వస్తుందని భావించినా ఏమీ తేల్లేదు. ఈ అంశంపై చర్చించేందుకు ఢిల్లీ కి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ కావాల్సి ఉన్నప్పటికీ వా రంతా బిజీ బిజీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికలు జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ రోజంతా సమీక్షల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ దాదాపు రెండు గంటల సేపు భేటీ అయి శాఖల కేటాయింపుపై చర్చించారు. హోం, ఆరిక్థ, రెవెన్యూ, వైద్యం, మునిసిపల్, విద్యుత్, నీటిపారుదల వంటి కీలక శాఖల కేటాయింపుపై సీనియర్ల నుంచి వస్తున్న వినతులపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రులుగా పనిచేసిన సీనియర్లకే కీలక శాఖలు ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు వంటి సీనియర్లకు కీలక శాఖలు ఇవ్వాలని, వారి సేవలను వినియోగించుకోవాలని కేసీ సూచించినట్లు సమాచారం. అయితే ఎవరికి ఏ శాఖ ఇచ్చేలా నిర్ణయం జరిగిందన్న విషయం బయటకు రాలేదు. కాగా ఈ భేటీ అనంతరం కేసీ, ఠాక్రే, రేవంత్ కలిసి ఖర్గే నివాసానికి వెళ్లారు. కాసేపటి తర్వాత రాహుల్ కూడా వారితో చేరారు. అర్ధరాత్రి వరకు చర్చలు కొనసాగాయి. శనివారం ఉదయానికి ఈ అంశంపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి? అనే దానిపై మరోసారి చర్చిద్దామని వేణుగోపాల్ సూచించడంతో దీనిపై నిర్ణయాన్ని పెండింగ్‌లో పెట్టినట్లు సమాచారం. -
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్!
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు శనివారం ఉదయం 9 గంటలకు బీఆర్ఎస్ తరపున శాసనసభకు ఎన్నికైన 38 మంది ఎమ్మెల్యేలు తెలంగాణభవన్‌లో భేటీ అవుతున్నారు. తుంటి ఎముక చికిత్స కోసం ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ ఈ భేటీకి హాజరయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ఎమ్మెల్యేల భేటీకి అధ్యక్షత వహిస్తారు. కేసీఆర్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు వీలుగా ఈ భేటీలో ప్రవేశపెట్టే తీర్మానాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆమోదిస్తారు. శాసనసభాపక్ష నేత ఎన్నిక అనంతరం పార్టీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ ఆల్పాహారం చేస్తారు. అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక వాహనంలో అసెంబ్లీ ప్రాంగణం ఎదుట ఉన్న గన్‌పార్కుకు చేరుకొని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రారంభమయ్యే తెలంగాణ మూడో శాసనసభ తొలి విడత సమావేశాలకు బీఆర్ఎస్ సభ్యులు హాజరవుతారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో నిబంధనలకు అనుగుణంగా ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ తరపున ఎన్నికైన నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారు. విపక్ష నేతగా ఉండేందుకు కేసీఆర్ మొగ్గు శాసనసభలో 119 మంది సభ్యులకుగాను బీఆర్ఎస్ తర పున 39 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీలో బలమైన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అవతరించిన నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష నేతకు కేబినెట్ హోదా దక్కుతుంది. మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో విపక్ష నేతగా ఉండేందుకు మొగ్గు చూపినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కేటీఆర్ లేదా మాజీ మంత్రి హరీశ్‌రావు బీఆర్ఎస్ శాసనసభా పక్షనేతగా వ్యవహరిస్తారనే ప్రచారం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్, శాసనసభా పక్ష నేతగా హరీశ్‌రావుకు చెరో పదవి అప్పగిస్తారని బీఆర్ఎస్లో చర్చ కూడా జరిగింది. తాము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని ప్రకటించిన బీఆర్ఎస్ తరపున కేసీఆర్ శాసనసభా పక్ష నేతగా వ్యవహరిస్తే అటు పారీ్టకి, ఇటు ప్రజలకు మేలు జరుగుతుందనే భావన వ్యక్తమైనట్టు సమాచారం. -
‘ట్రోలింగ్’ వెనుక ఎవరున్నారు?
సాక్షి, హైదరాబాద్: వివిధ సామాజిక మాధ్యమాల్లో పార్టీ నేతలే లక్ష్యంగా ‘ట్రోలింగ్’సాగడంపై బీజేపీలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది సీట్లకే పరిమితం కావడాన్ని ఎత్తిచూపుతూ పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వివిధ రకాల మీమ్స్, సందేశాలు ప్రచారం చేస్తుండటాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఇతర నేతలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ప్రచారం చేయడం వల్ల పరోక్షంగా బీజేపీ ఇమేజీ కూడా దెబ్బతింటోందని అంటున్నారు. పార్టీని, నేతలను లక్ష్యంగా చేసుకుని సామాజిక మాధ్య మాల్లో పెడుతున్న పోస్టులను చూసి ముఖ్యనేతలు మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. ఇలాంటి వాటివల్ల అంతిమంగా పార్టీకే నష్టం జరగనున్నందున ట్రోలింగ్ అంశంపై నాయకత్వం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రతికూల ప్రచా రం పట్ల పార్టీ నాయకులు, శ్రేణులు అప్రమత్తమై అలాంటి వాటిని ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో పాటు షేరింగ్‌లు చేయకుండా జాగ్రత్తలు తీసు కోవాలని పార్టీలో అంతర్గత సూచనలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఇలాంటి అభ్యంతరకర పోస్టులను తిప్పికొడుతూ పోస్టింగ్‌లు కూడా పెట్టాలని సూచించినట్టు తెలిసింది. శాసన సభ ఎన్నికల నేపథ్యంలో కొంతకాలంగా పార్టీ లోని కొందరు నేతలు సొంతంగా సోషల్ మీడి యా టీమ్‌లను ఏర్పాటు చేసుకుని తమ ప్రచా రాన్ని సాగిస్తున్న విషయం విదితమే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం పార్టీని, నేతలను టార్గెట్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న పోస్టింగ్‌లు, కొందరు నేతలను టార్గెట్ చేస్తూ పనిగట్టుకుని ట్రోలింగ్ చేయడం వెనక పార్టీలోని వారే ఉన్నారనే అనుమానాలు కూడా వ్యక్త మతున్నాయి. వీటి వెనక ఎవరున్నారు, అసలు ఆయా నేతలను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అందుకు కారణాలు ఏమిటన్న దానిపై రాష్ట్ర పార్టీ లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఓ వైపు పాలన.. మరోవైపు పదవులు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండు కీలక టాస్క్‌లు ఎదుర్కోబోతున్నారు. ఓ వైపు పాలనతో పాటు మరోవైపు పదవుల పందేరం కూడా ఆయనకు పెద్ద పరీక్షగా మారే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేక పదేళ్లు కావడం, తెలంగాణ వచ్చిన తర్వాత తొలిసారి అధికారంలోకి రావడంతో వేలాది మంది పార్టీ నేతలు పదవుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వీరికి పోస్టుల పంపిణీ ఒక ఎత్తయితే ఆ పదవుల పందేరం ఫలితంగా ఎదుర్కొనే పరిస్థితులను సమన్వయం చేయాల్సి ఉండడం పెద్ద టాస్క్ అనే చర్చ గాందీభవన్ వర్గాల్లో జరుగుతోంది. పదవుల పంపిణీతో పాటు పాలనా వ్యవహారాలపై దృష్టి సారించి తనదైన మార్కు పరిపాలన అందించడం కోసం రేవంత్ జోడెడ్ల స్వారీ చేయాల్సిందేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఢిల్లీనే కీలకం...: రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా నియామకం మొదలు నుంచి సీఎంగా ఎంపికయ్యేంతవరకు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు ఆయన్ను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆ కొందరు నేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదు. అధిష్టానం వద్ద పట్టుపట్టి తామూ కీలకం అన్న ’గుర్తింపు’సాధించడంలో సఫలీకృతులయ్యారన్న వాదనలూ ఉన్నాయి. ఇందుకోసం అధిష్టానం పెద్దలు కూడా సహకరించారనే చర్చ జరుగుతోంది. రేవంత్‌రెడ్డి నాయకత్వం పట్ల ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో ఏకాభిప్రాయంతో కూడిన సానుకూలత ఉన్నప్పటికీ సొంత పార్టీలోని కొందరు నాయకుల వైఖరి ఆయనకు పగ్గాలు అప్పగించేందుకు అడ్డంకి కాకూడదన్న ఆలోచనతోనే హైకమాండ్ రాజీధోరణిని అందిపుచ్చుకుందని గాంధీభవన్ వర్గాలంటున్నా యి. ఈ ధోరణి మరికొన్నాళ్లు కొనసాగుతుందని, పాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, తనదైన మార్కు వేసేంతవరకు పార్టీలోని సీనియర్లతో సీఎం రేవంత్‌కు సమన్వయం తప్పదని చెపుతున్నాయి. ఠాక్రేతో పాటు సీనియర్లను సమన్వయం చేసుకునే.. ఇప్పటికే మంత్రివర్గం కూర్పు, శాఖల పంపిణీలో కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం మార్కు రాజకీయాలు స్పష్టం కాగా, భవిష్యత్తులో జరిగే నామినేటెడ్ పదవుల పంపకంలోనూ హైకమాండ్ జోక్యం ఉంటుందని చెబుతున్నారు. హైకమాండ్ సూచనల మేరకు సీనియర్ కాంగ్రెస్ నేతల ప్రతిపాదనలపై ఆయన సమన్వయంతో వ్యవహరించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పదవుల పందేరం కోసం రాష్ట్రంలోని కొందరు ముఖ్య కాంగ్రెస్ నాయకులతో పాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రేతో మాట్లాడి సమన్వయం చేసుకోవాలని అధిష్టానం ప్రతిపాదించిందని సమాచారం. -
ప్రజాస్వామ్య పద్ధతిలో సభ నిర్వహిస్తా
సాక్షి, హైదరాబాద్: పాలక, ప్రతిపక్ష సభ్యులను సమన్వయం చేసుకుంటూ శాసనసభ ఔ న్నత్యం ఇనుమడింపజేసేలా ప్రజాస్వామ్య ప ద్ధతిలో సభా కార్యక్రమాలు నిర్వహిస్తానని వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఎన్నికకానున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. స్పీకర్ పదవికి కాంగ్రెస్ తనను ఎంపిక చేయడం చాలా సంతోషంగా ఉందని... దళితుడికి ఇంత పెద్ద హోదా కేవలం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమన్నారు. ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లోనే... మంత్రి పదవి వస్తుందని అనుకున్నా... నాతో పాటు నియోజకవర్గ, జిల్లా ప్రజలు కూడా ఈసారి నాకు మంత్రి పదవి వస్తుందని అనుకున్నాం. కానీ పార్టీ అధిష్టానం ఇంకా గొప్పగా ఆలోచించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెద్ద బాధ్యత అప్పగించారు. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తను నేను. పార్టీ ఏ పదవి ఇచ్చినా కాదనకుండా చేసుకుంటూపోతా. కాంగ్రెస్ పేరుకు దెబ్బ తగలకుండా ఇచ్చిన పదవికి గౌరవం తెచ్చేలా పనిచేస్తా. రెండు పర్యాయాలుస్పీకర్ నామమాత్ర పాత్రనే... గత రెండు పర్యాయాలు శాసనసభ కార్యక్రమాల నిర్వహణను రాష్ట్ర ప్రజలంతా గమనించారు. నియంతృత్వ ధోరణిలో ప్రతిపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా సభానాయకుడే సభలో నిర్ణయాలు తీసుకున్న పరిస్థితిని గమనించాం. స్పీకర్ పాత్ర నామమాత్రమైంది. నేను స్పీకర్‌గా ఎన్నికైతే ప్రజాస్వామ్య పద్ధతిలో, సభ గౌరవం తగ్గకుండా, స్పీకర్ విలువ పెంచేలా సభను నడిపిస్తా. మహామహులు సభలో ఉన్నా... సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మాజీ సీఎం కేసీఆర్ ఇతర సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు. పాలక, ప్రతిపక్షాల సభ్యులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతా. ఇప్పటి వరకు పాలక పక్షం చెప్పిందే వేదంగా సాగేది. సభలో ప్రతిపక్షాలకు కూడా తగిన సమయం ఇస్తా. అందరినీ కలుపుకొని ముందుకు వెళతా. మొదటి దళిత స్పీకర్‌ను నేనే అవుతా... నేను ఎన్నికైతే తెలంగాణ శాసనసభలో తొలి దళిత స్పీకర్‌గా నాదే రికార్డు అవుతుంది. ఉమ్మడి ఏపీలో ప్రతిభాభారతి తొలి దళిత స్పీకర్‌గా ఉండేవారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఇంత పెద్ద పదవి దక్కింది కూడా నాకే. -
అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం: రాజాసింగ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని బహిష్కరిస్తున్నామని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులు శనివారం ప్రమాణం చేసేందుకు ఉద్దేశించిన ఈ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకావడం లేదన్నారు. శనివారం ఉదయం తమ పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డితో ఎమ్మెల్యేలు సమావేశమై, ఆయా అంశాలపై చర్చిస్తామని తెలిపారు. బీజేఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శుక్రవారం రాజాసింగ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా ఎంఐఎం శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీని ప్రొటెమ్ స్పీకర్‌గా నియమించినందున తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రజాకార్ల సైన్యానికి నాయకత్వం వహించిన ఖాసిం రజ్వీ వారసులైన ఎంఐఎం పార్టీ నేతల ఎదుట ప్రమాణం చేయదలుచుకోలేదని రాజాసింగ్ చెప్పారు. ఆ తర్వాత స్పీకర్ ఎదుట ఎప్పుడైనా ప్రమాణం చేస్తామని తెలిపారు. 2018లోనూ ప్రొటెమ్ స్పీకర్‌గా ఉన్నందున ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్‌ఖాన్ ఎదుట రాజాసింగ్ ప్రమాణం చేయలేదు. -
ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాం: మంత్రి పొన్నం
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలు వినేందుకే ప్రజాదర్బార్ ఏర్పాటు చేశామని, వీలైనంత త్వరలోనే వారి సమస్యల్ని పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వినేందుకే ప్రగతిభవన్‌కు ఉండే అడ్డుగోడలను తొలగించి ప్రజాభవన్‌గా మార్చామని పొన్నం తెలిపారు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న నేపథ్యంలో పొన్నం ప్రభాకర్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కె.సత్యనారాయణతో పాటు సీపీఐ నాయకులను కలిసేందుకు శుక్రవారం హైదరాబాద్‌లోని మఖ్దూమ్‌భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కూనంనేని సాంబశివరావు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పశ్యపద్మతో సమావేశమయ్యారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను చెప్పుకునేందుకు, ప్రతిపక్ష నేతలు కలిసేందుకు కూడా అవకాశం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ విజయంలో సీపీఐ సంపూర్ణ సహకారం, మద్దతు ఉందని, భవిష్యత్‌లో కూడా తాము కలిసే ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ విజయంతో రాష్ట్రంలో ప్రజాస్వామిక పునాది పడిందన్నారు. సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సురవరం వారికి అభినందనలు తెలిపారు. -
దింపుడు కళ్లెం ఆశలన్నీ ఆవిరి..!
పోయింది. పరువంతా పోయింది. తెలంగాణ గట్టు మీద వేసిన పొలిటికల్ పిల్లిగంతులను ఓటర్లు అదిరిపోయే రేంజ్లో తిప్పికొట్టారు. తెలంగాణలో పార్టీ జెండా పీకేసినా.. చంద్రబాబుకి ఫలితం దక్కలేదు. ఓట్ల వేటలో దత్తపుత్రుడికి డిపాజిట్లు దక్కలేదు. ఇక్కడేదో చేసేసి.. ఆ ప్రభావంతో ఏపీలో ఏదేదో చేసేద్దామని పన్నిన కుట్రలు ఈవీఏంల సాక్షిగా కుళ్లు కంపు కొట్టేశాయి. ఇప్పుడు ఇక ఏపీ వంతు. ఎవరికి ఎవరు ఏం అవుతారు ? ఎవరు ఎవరితో కలుస్తారు ? పార్టీలు కలిసినంత మాత్రానా క్యాడర్ కలుస్తుందా ? టీడీపీ, జనసేన, మధ్యలో బీజేపీ. ఈ గజిబిజి గందరగోళానికి తెర పడేదెప్పుడు ? తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేస్తే.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ మీద లైట్ వెలగాలి. చంద్రబాబు గీసిన స్కెచ్ సారంశం అదే. అందులో భాగంగానే దత్తపుత్రుడ్ని కూడా రంగంలోకి దింపి.. బీజేపీతో పొత్తు సరాగాలు ఆలపించేలా చేసింది చంద్రబాబే అని రాజకీయ వర్గాల్లో టాక్. ఏపీ అదిరిపోయేలా తెలంగాణ ఎన్నికల్లో స్విచ్ వేయాలని చంద్రబాబు తలిస్తే.. బాబుకి, దత్తపుత్రుడికి తలతిరిగేలా ఓటర్లు షాక్ ఇచ్చారు. సీమాంధ్ర ఓటర్లంతా మావాళ్లే అని తెగచెప్పే విజనరీకి కనువిప్పు కలిగిస్తూ గ్రేటర్ అంతా బీఆర్ఎస్కి జై కొట్టింది. ఇక పవన్కళ్యాణ్కొచ్చిన కష్టమైతే పగొళ్లకి కూడా రాకూడదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒకవైపు డిపాజిట్లు పోయి బోరుమంటుంటే...మరోవైపు బర్రెలక్క పాటి విలువ లేదు ప్యాకేజీ స్టార్‌కి అంటూ మొదలైన పొలికలు జనసేనకి జ్వరం వచ్చేలా చేశాయంటున్నారు పొలిటికల్ ఎనలిస్ట్‌లు. సరే... ఏదో అనుకుంటే ఏదో అయింది. ఇక ఏపీ వైపు చూద్దామనుకునే లోపు...కథ మరో మలుపు తిరిగిందంటున్నాయి రాజకీయ వర్గాలు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెల్చుకున్న హిందీ బెల్ట్‌లోని మూడు రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ ఊపు చూస్తుంటే.. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీని సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. అందుకే బీజేపీకి దగ్గర కావడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ అవలంభించిన వైఖరితో.. బీజేపీ మరింతగా దూరం పెడుతోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ కూడా చేయకుండా పార్టీ ఓటు బ్యాంకుని కాంగ్రెస్ వైపు మళ్లించే చచ్చు వ్యూహానికి చంద్రబాబు పదును పెట్టారో.. ఇటు బీజేపీ కూడా ఓపెన్ అయిపోయింది. ఇప్పటి దాకా జనసేనతోనే పొత్తు అంటూ వచ్చిన బీజేపీ.. ఇప్పుడు "టీడీపీ కాంగ్రెస్‌తోనూ, ఇండియా కూటమిలోనూ ఉండొచ్చు. ఆ పార్టీతో మాకు సంబంధం ఏంటని" ఎదురు ప్రశ్నిస్తోంది. పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయ్యాక...ఇక ఆల్ ఈజ్ వెల్ అన్న భావనలోనే చంద్రబాబు వెళ్లిపోయారు. అటు పురంధేశ్వరి కూడా టీడీపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్టీ క్యాడర్ని ఆశ్చర్యపరిచారు. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుని వెనకేసుకురావడం, చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్‌కి జాతీయ స్థాయి నేతల అపాయింట్మెంట్ ఇప్పించడం కోసం విశ్వప్రయత్నాలు చేయడం. ఇలా చాలానే చేశారు. చివరకు మీరు...మాకు అధ్యక్షురాలా ? టీడీపీకా అంటూ బీజేపీ నేతలు బహిరంగంగా పురంధేశ్వరిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. క్లుప్తంగా చెప్పాలంటే...పురంధేశ్వరి కూడా టీడీపీని బీజేపీకి దగ్గర చేయలేకపోయింది. తెలంగాణ ఎన్నికల తర్వాత టీడీపీ ఇండియా కూటమిలో చేరుతుందేమో అనే దాకా బీజేపీ నేతలొచ్చేశారు. మరోవైపు క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన మధ్య సాగుతోన్న వార్ ఎపిసోడ్స్ ఇటు చంద్రబాబులో, అటు పవన్‌కళ్యాణ్‌లో టెన్షన్ పెంచేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల తర్వాత చంద్రబాబు-పవన్ భేటీ అయ్యారు. రోలు మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఈ భేటీని అభివర్ణిస్తున్నాయి రాజకీయ వర్గాలు. టీడీపీ ఎత్తుగడలు తెలంగాణలో చిత్తు అయ్యాయి. ఈ తరుణంలో డిపాజిట్లు కోల్పోయిన పవన్ తన కష్టాలు చెప్పుకుంటే...ఆయన ఓదార్చేదేం ఉంటుంది ? ఈ విషయం పక్కన పెడితే...ఈ రెండు పార్టీలకు ఇప్పుడు ఏపీలో...క్షేత్రస్థాయిలో క్యాడర్ నుంచి కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. క్యాడర్ కన్నా, పార్టీ కన్నా టీడీపీనే మిన్న అన్న సంకేతాలను పంపిన దత్తపుత్రుడు తీరుతో.. జనసైనికులు షాక్ అవుతున్నారట. జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతున్నా...పట్టుమని పదిమంది లీడర్లు లేరు. క్షేత్రస్థాయిలో పార్టీకి బలం లేదు. పార్టీని బలోపేతం చేయడం పై కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఫోకస్ పెట్టలేదు. కేవలం చంద్రబాబు ఆదేశాల మేరకు, చంద్ర బాబుకి అవసరం అయినప్పుడు స్పందిస్తూ వచ్చారు పవన్‌కళ్యాణ్. బలమైన రాజకీయ నిర్మాణం లేకపోయినా...ఈ పదేళ్లు జనసేనని క్షేత్రస్థాయిలో మోస్తూ వచ్చిన వాళ్లంతా...తాము టీడీపీ ప్రయోజనాల కోసమే పనిచేయాలన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో.. రాబోయే రోజుల్లో టీడీపీ, జనసేన కలిసి చేసే రాజకీయానికి ఇటు క్యాడర్ నుంచి, అటు లీడర్స్ నుంచి ఎంత వరకు మద్దతు వస్తుందన్నది ప్రశ్నార్థకమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇదీ చదవండి: కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీకి ఈ దుస్థితి ఏమిటో? -
తెలంగాణ కమల బృందంలో మార్పులుంటాయా?
బీజేపీ హైకమాండ్ తెలంగాణ కాషాయ పార్టీని ప్రక్షాళన చేయాలని భావిస్తోందా? ఇప్పుడు రాష్ట్ర బీజేపీలో చర్చనీయాంశంగా మారిన అంశం. కమలం పార్టీ రాష్ట్ర సారథిగా ఎన్నికలకు ముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించారు. బీజేపీ హైకమాండ్ ఒత్తిడితో పార్టీ పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డి శక్తి మేర కష్టపడ్డారు. ఎన్నికల్లో 8 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అనూహ్యంగా ఓటు శాతాన్ని పెంచుకుంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు ఇతరులకు ఇవ్వాలని కిషన్ రెడ్డి పార్టీ అధిష్టానానికి విన్నవించుకున్నారు. రాష్ట్ర పార్టీ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై బీజేపీ హైకమాండ్ కసరత్తు మొదలుపెట్టింది. తెలంగాణ కాషాయ దళపతిగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై పార్టీలో విస్తృత చర్చ కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో కొత్తగా ఎటువంటి ప్రయోగాలు చేయకుండా కంటిన్యూ కావాలని ఓ వైపు యోచిస్తోంది. అయితే రాష్ట్ర నేతల మధ్య సమన్వయం లేకపోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. రాష్ట్ర స్థాయి నేతలు ఎవరికి వారు సోషల్ మీడియాలో సొంత పార్టీలో ప్రత్యర్థులను డీగ్రేడ్ చేస్తూ కామెంట్స్ పెట్టడం పార్టీకి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇక పార్టీ ఫుల్ టైమర్ గా పనిచేసిన రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ వెళ్లిపోయిన తర్వాత... కొత్తగా ఎవరిని నియమించలేదు. దీంతో రాష్ట్ర పార్టీ నేతల సమన్వయం పెద్ద తలనొప్పిగా మారింది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. రాష్ట్ర పార్టీగా అధ్యక్షుడిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు డా లక్ష్మణ్ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులుగా, పార్లమెంటరీ బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఇక ఎంపీ బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. వీరందరిని పక్కన పెట్టి కొత్త నేతను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం. గతంలో బండారు దత్తాత్రేయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శిగా పనిచేసి... మహారాజ్ గంజ్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇటీవల మధ్యప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా విష్ణుదత్త శర్మను నియమించింది. ఇతను ఏబీవీపీ జాతీయ సంఘటన కార్యదర్శి, ఫుల్ టైమర్ గా పనిచేశారు. అదేతరహాలో తెలంగాణ బీజేపీ పగ్గాలు... గతంలో ఇక్కడ రాష్ట్ర సంఘటన కార్యదర్శిగా పనిచేసిన మంత్రి శ్రీనివాస్ కు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై జాతీయ పార్టీ కసరత్తు చేస్తున్నారు. చండిఘడ్ కేంద్రంగా పంజాబ్ సంఘటన కార్యదర్శిగా పనిచేస్తున్న మంత్రి శ్రీనివాస్ కు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగిస్తారా ? కొత్త ప్రయోగం చేస్తారా ? లేదా అన్నది చూడాలి. మరోవైపు మధ్యప్రదేశ్ బీజేపీ ఇంఛార్జ్ గా ఉన్న మురళీధర్ రావు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ హైకమాండ్ ప్రయోగం చేస్తుందా ? లేదా ? అన్నది చూడాలి. ఇదీ చదవండి: వాళ్లు ఓడిపోవడం ఏమిటో? -
ఆసుపత్రిలో కేసీఆర్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా, సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అంతకుముందు, కేసీఆర్ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వద్ద ప్రభుత్వం భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని… — Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 ఇదిలా ఉండగా.. కేసీఆర్ గురువారం అర్ధరాత్రి తన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్లో కాలు జారి పడిపోవడంతో ఎడమ కాలి తొంటికి తీవ్ర గాయమైంది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉంది. ఇక, కేసీఆర్ ఆరోగ్యంపై యశోద డాక్టర్లు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. సిటీ స్కాన్ అనంతరం.. ఎడమ హిప్ రీప్లేస్మెంట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్ అవసరమన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. -
TS:సీఎం ఆదేశించినా ఆబ్సెంట్..రివ్యూకు రాని ట్రాన్స్‌కో సీఎండీ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ కొత్త సీఎం రేవంత్‌రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షకు ఇప్పటికే రాజీనామా చేసిన ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు హాజరు కాలేదు. ఆయన రాజీనామాను ఆమోదించవద్దని, సమీక్షకు ప్రభాకర్‌రావు హాజరయ్యేలా చూడాలని గురువారం విద్యుత్ శాఖ కార్యదర్శిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభాకర్‌రావు సమీక్షకు గైర్హాజరవడం ప్రాధాన్యత సంతరించుకుంది. విద్యుత్ శాఖలో డిస్కంలకు ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయని అధికారులు సీఎం రేవంత్‌రెడ్డికి వివరించారు. దీంతో అసలు శాఖలో ఏం జరుగుతోందన్న కోణంలో సీఎం అధికారులను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో భాగంగా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వారికి ఉచితంగా కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ అమలు కోసమే విద్యుత్ శాఖ వ్యవహారాలపై పూర్తి అవగాహన కోసం సీఎం సమగ్ర రివ్యూ జరుపుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందు ఉదయమే సీఎం రేవంత్‌రెడ్డి ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ ఆదాయ, వ్యయాలపై సీఎం సమీక్షలో ఆరా తీశారు. రేపటి నుంచి ప్రారంభించనున్న మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం హామీపై సమీక్షలో ఆర్టీసీ అధికారులకు సీఎం పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి రవాణాశాఖ త్వరలో పూర్తి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల్లో రోజుకు 12 నుంచి 13 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4 కోట్ల దాకా భారం పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. నన్ను పిలవలేదు.. సీఎండీ ప్రభాకర్‌రావు విద్యుత్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష వ్యవహారంపై తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు స్పందించారు. సీఎం సమీక్ష గురించి తనకు సమాచారం లేదని, తనను సమీక్షకు ఎవరూ పిలవలేదని ప్రభాకర్‌రావు మీడియాకు చెప్పడం గమనార్హం. ముఖ్యమంత్రి పిలిస్తే సమీక్షకు ఎందుకు వెళ్లనని ఆయన ప్రశ్నించారు. ఇదీచదవండి..జీవన్‌రెడ్డికి షాక్‌ల మీద షాక్‌లు -
TS:ఐటీ మంత్రి ఎవరో..?
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డితో పాటు 11 మంది మంత్రులు బాధ్యతలు చేపట్టారు. అయితే వీరికి ఇంకా శాఖలు కేటాయించలేదు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకే ఒక్క పోర్ట్‌ఫోలియోపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వంలో కేటీఆర్ నిర్వహించిన ఐటీ శాఖ కొత్త ప్రభుత్వంలో ఎవరికి కేటాయిస్తారన్నది హాట్‌టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ శాఖను కేటీఆర్ డైనమిక్‌గా నిర్వహించి బాగా పాపులర్ అయ్యారు. ఐటీ శాఖలో కేటీఆర్ చేసిన కృషి వల్లే బీఆర్ఎస్ హైదరాబాద్‌లో క్లీన్‌స్వీప్ చేసిందన్న వాదనా ఉంది. ఇప్పుడు శాఖ తీసుకునే మంత్రిని యూత్ కేటీఆర్‌తో పోల్చడం ఖాయం. కొత్తగా ఐటీ శాఖ తీసుకునే మంత్రి కేటీఆర్ రేంజ్లో శాఖ నిర్వహించకపోతే యువత అసంతృప్తికి గురయ్యే చాన్స్ లేకపోలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కొత్త ప్రభుత్వంలో ఈ శాఖ కేటాయింపు విషయం ఆసక్తికరంగా మారింది. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన వారిలో ఎక్కువ మంది సీనియర్లే. వీరిలో ఎవరికీ గతంలో ఐటీ శాఖ నిర్వహించిన అనుభవం లేదు. మంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారిలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి లేదంటే శ్రీధర్‌బాబుకు ఐటీ శాఖ ఇచ్చే అవకాశాలున్నయని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇదే నిజమైతే వీరిద్దరూ కేటీఆర్‌కు ధీటుగా ఐటీ శాఖను నిర్వహించగలుగుతారా అన్నది తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గంలో ఇంకో ఆరుగురు మంత్రులను తీసుకోవాల్సి ఉంది. త్వరలోనే ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారని తెలుస్తోంది. కొత్తగా మంత్రులు కానున్న వారి జాబితాలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్‌మోహన్‌రావుల పేర్లు ఉండవచ్చని కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. వీరిద్దరిలో ఎవరికి మంత్రి పదవి దక్కినా వారికి ఖాయంగా ఐటీ కేటాయించే అవకాశం ఉందని సమాచారం. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కలకుంట్ల మదన్‌మోహన్‌రావుకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. అమెరికాలో ఐటీ బిజినెస్‌ను కూడా ఈయన నడుపుతున్నారు. గతంలో రాహుల్‌గాంధీ టీంలో పనిచేసిన ఈయన కాంగ్రెస్ పార్టీకి ఐటీ పరంగా సేవలందించారు. సభ్యత్వ నమోదు, ఎన్నికల్లో అనలిటిక్స్ వంటి విషయాల్లో ఈయన పార్టీ కోసం ఎంతో కృషి చేసినట్లు చెబుతారు. దీంతో మదన్‌మోహన్‌రావుకు ఐటీ శాఖ వచ్చే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. యువకులకు, వ్యాపార రంగంలో పరిచయాలు ఉన్న వారికి ఐటీ శాఖ కేటాయిస్తేనే కేటీఆర్‌కు ధీటుగా ఆ శాఖలో పనిచేయగలుగుతారని యువత భావిస్తోంది. ఐటీ మంత్రిగా కేటీఆర్ హైదరాబాద్‌కు కొత్తగా ఎన్నో కంపెనీలు తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ ఎంఎన్సీ కంపెనీలతో మరిన్ని పెట్టుబడులు పెట్టించి ఎంతో మంది యువతకు ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇలా కేటీఆర్ స్థాయిలో పనిచేసి ఐటీలో బ్రాండ్ హైదరాబాద్‌ను నిలబెట్టాలంటే ఐటీ రంగంపైన అవగాహన, అనుభవం ఉన్నవారైతేనే బెటర్ అన్న అభిప్రాయాన్ని ఎక్కువ మంది యువకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదీచదవండి..మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయం.. యశోదకు తరలింపు -
పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. సీఎం జగన్‌కు ధన్యవాదాలు: రేవంత్
సాక్షి, హైదరాబాద్: సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ ఇరుగుపొరుగు రాష్ట్రాలన్నింటితో స్నేహభావాన్ని, అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని కాంక్షిస్తున్నట్లు తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం పదవి చేపట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలపై రేవంత్ రెడ్డి ప్రతిస్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన రేవంత్..‘శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం.. అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది’ అంటూ వ్యాఖ్యానించారు. శుభాకాంక్షలు తెలిపిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. సాటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు, పొరుగు రాష్ట్రాలతో స్నేహభావం… అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. https://t.co/UsR4GyPqDR — Revanth Reddy (@revanth_anumula) December 8, 2023 అంతకుముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేవంత్‌కు శుభాకాంక్షలు చెబతూ..‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని వ్యాఖ్యనించిన విషయం తెలిసిందే. తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు. ప్రమాణస్వీకారం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, మంత్రులకు శుభాకాంక్షలు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం, సహకారం పరిఢవిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. — YS Jagan Mohan Reddy (@ysjagan) December 7, 2023 -
కేసీఆర్‌కు గాయం.. స్పందించిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తీవ్ర గాయమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఈ సందర్బంగా కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఆరోగ్యశాఖ కార్యదర్శిని యశోద ఆసుపత్రికి పంపించారు సీఎం రేవంత్. కాగా, ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. Distressed to know that former Telangana CM Shri KCR Garu has suffered an injury. I pray for his speedy recovery and good health. — Narendra Modi (@narendramodi) December 8, 2023 మరోవైపు, కేసీఆర్ గాయంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విట్టర్లో కవిత..‘బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు స్వల్ప గాయం కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో నిపుణుల సంరక్షణలో ఉన్నారు. మద్దతు, శుభాకాంక్షలు వెల్లువెత్తడంతో, నాన్న త్వరలో పూర్తిగా కోలుకోనున్నారు. అందరి ప్రేమకు కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్ చేశారు. BRS supremo KCR Garu sustained a minor injury and is currently under expert care in the hospital. With the support and well-wishes pouring in, Dad will be absolutely fine soon. Grateful for all the love 🙏🏼 — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 8, 2023 ఇదిలా ఉండగా.. మాజీ సీఎం కేసీఆర్ నిన్న(గురువారం) అర్ధరాత్రి ఆయన ఫామ్‌హౌస్‌లోని బాత్రూమ్లో కాలు జారి కిందపడిపోయారు. ఈ సందర్భంగా ఎడమ కాలి తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. అలాగే, తుంటి భాగంగాలో స్టీల్ ప్లేట్ వేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రమాదంలో తుంటి బాల్ డ్యామేజీ అయినట్టు వైద్యులు చెబుతున్నారు. దీంతో, ఆయనను సోమాజిగూడలోని యశోదకు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత యశోద ఆసుపత్రిలోనే ఉన్నారు. వీరితో చర్చించిన తర్వాతే కేసీఆర్‌కు సర్జరీ చేసే అవకాశం ఉంది. -
కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ.. టీడీపీకి ఈ దుస్థితి ఏమిటో?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తారా? లేక ఆయన పని మానుకుని పొరుగు రాష్ట్రం ఏపీలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తారా?రేవంత్ ఏమి చేస్తారో కాని, టీడీపీ కార్యకర్తలు కొందరు చేసిన హడావుడి చూస్తుంటే రేవంత్ ఇంకా టీడీపీలోనే ఉన్నారనుకుంటున్నారేమో అన్న సందేహం వస్తుంది. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ జెండాలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ పంచలో కనిపించిన తీరు ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తుంది. కాంగ్రెస్‌కు అధికారికంగా మద్దతు ఇవ్వనప్పటికీ కొందరు టీడీపీ కార్యకర్తలు,నేతలు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు పాల్గొన్న సభలలో టీడీపీ జెండాలు పట్టుకుని తిరిగారు. ✍️తాము అధికారంలోకి వచ్చామని కాంగ్రెస్ వారు సంబరాలు చేసుకుంటుంటే వారికన్నా ఎక్కువగా టీడీపీ జెండాలతో వీరు హడావుడి చేయడం.. ఇదంతా చూసేవారికి విడ్డూరం అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు అనుసరించే రెండు కళ్లు, మూడు కళ్ల సిద్దాంతానికి అనుగుణంగానే ఇది ఉంది. తమకు సంబంధం లేకుండానే జరిగిందని టీడీపీ నేతలు చెబితే చెప్పవచ్చు. కాని కాంగ్రెస్ పార్టీ వెంట టీడీపీ కార్యకర్తలు తిరుగుతుంటే పార్టీ అధిష్టానం ఖండించాలి కదా!లేదా తమ మద్దతు కాంగ్రెస్ కు ఇవ్వడం లేదని, లేదా ఇచ్చామని తెలియచేయాలి కదా! అలాంటివి ఏమీ చేయకుండా రహస్య మద్దతు ఇవ్వడంలోని ఆంతర్యం ఏమిటి?టీడీపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడుగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ పదవికి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలగకుండా ఉండేందుకే ఎన్నికల బరినుంచి టీడీపీ వైదొలగాలని చంద్రబాబు చెప్పారని ప్రకటించారు. ✍️దానిని ఇంతవరకు చంద్రబాబు కాని, ఆయన తరపున మరెవరూ కాని కాదనలేదు. కాసాని తర్వాత ఇంకొకరిని పార్టీ అధ్యక్షుడుగా పెట్టలేదు. ఏపీలో మిత్రపక్షంగా ఉన్న జనసేన తెలంగాణలో పోటీ చేసిన ఎనిమిది స్థానాలకు కనీస మద్దతు ఇవ్వలేదు.ఇదంతా కాంగ్రెస్ కోసమే చేశామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.టీడీపీ నుంచి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన రేవంత్‌రెడ్డికి ఉపయోగపడేందుకే ఇలా వ్యవహరించామని ఆ వర్గాలు బాహాటంగానే వెల్లడిస్తున్నాయి. కాకపోతే అధికారికంగా పేర్కొనడం లేదు. ఇదంతా దేని గురించి. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమకు ఏపీలో ఉపయోగపడతారన్నది వారి భావన. ఏపీలో వీరు నేరాభియోగాలకు గురై తెలంగాణలో ఉంటే అరెస్టు కాకుండా రేవంత్ ప్రభుత్వం అడ్డుకుంటుందన్నది వీరి నమ్మకం కావచ్చు. ✍️ఏపీలో ఎన్నికలు వస్తే టీడీపీకి రేవంత్‌కు ఆర్ధిక సాయం చేస్తారన్నది వీరి ఆశ. రేవంత్ రెడ్డి టీడీపీలో సుమారు తొమ్మిది,పదేళ్లు ఉన్న మాట నిజమే. టీడీపీ మహానాడులో ఆయన ఆవేశపూరిత ప్రసంగాలు చేసిన సంగతి వాస్తవమే. ఆ సందర్భంలో కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ, పివి నరసింహారావు,రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటివారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. సోనియాగాంధీని బలిదేవత అని ఉండవచ్చు. అయినా తన చాకచక్యంతో కాంగ్రెస్ లో చేరి పిసిసి అధ్యక్షుడు అయ్యారు. ఆ తర్వాత ఇందిరమ్మ రాజ్యం తెస్తానని అంటున్నారు. రాహుల్ గాంధీ గొప్ప నేత అని చెబుతున్నారు. సోనియాగాంధీ తెలంగాణ అమ్మ అని అంటున్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలు గొప్పవని ప్రబోధిస్తున్నారు. అంతే తప్ప తెలుగుదేశం సిద్దాంతాన్ని అమలు చేస్తానని అనడం లేదు. చంద్రబాబుకు విధేయుడుగా ఉంటానని ప్రకటించడం లేదు. ✍️తెలంగాణలో తన ప్రబుత్వ ఎజెండాను వదలి ఏపీలో టీడీపీ కోసం ,చంద్రబాబు కోసం పనిచేస్తానని చెప్పడం లేదు. అయినా టీడీపీ నేతలు ఏపీలో తమ రాజకీయ ప్రయోజనం కోసం రేవంత్ ఉపయోగపడతాడని విశ్వసిస్తున్నారు. తమవల్లే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నంత సీన్ చేస్తున్నారు. నిజానికి వారి వల్ల కాంగ్రెస్‌కు నష్టం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ కు రాలేదంటే అదంతా టీడీపీ వారు చేసిన నిర్వాకం వల్లే. రేవంత్ ప్రాతినిద్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్ సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క చోట కూడా కాంగ్రెస్ గెలవలేదు. రేవంత్ ను ఉపయోగించుకోవడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌ను ఎన్నిరకాలుగా వీలైతే అన్నిరకాలుగా ఇబ్బంది పెట్టి రాజకీయంగా ప్రయోజనం పొందాలన్నది టీడీపీ దురాశ. టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి రేవంత్ ముఖ్యమంత్రి అయితే తామే ప్రభుత్వం నడపవచ్చని భావిస్తున్నాయని చెబుతున్నారు. ✍️నిజమే! ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు, రేవంత్‌రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉండవచ్చు.అంతమాత్రాన వారు చెప్పినట్లే ఈయన పని చేయడం మొదలైతే అనతికాలంలోనే తన ప్రభుత్వాన్ని తానే అప్రతిష్టపాలు చేసుకుంటారని గమనించాలి. కేసీఆర్ ప్రభుత్వంపై ఈగ వాలకుండా ఈనాడు వంటి మీడియా కృషి చేసినా, జనంలో వ్యతిరేకతను ఆపలేకపోయారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని రక్షించలేకపోయారు. దీనిని రేవంత్ అర్ధం చేసుకోకపోతే ఆయనకే ప్రమాదం. గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చడం కోసం చంద్రబాబు తరపున ఏభై లక్షల డబ్బు తీసుకువెళ్లి నామినేటెడ్ ఎమ్మెల్యే కి ఇస్తూ ఎసిబికి పట్టుబడిన ఘటనను ఆయన గుర్తుంచుకోవాలి. దానివల్ల ఆయన రాజకీయ జీవితంలో ఎంత పరాభవం పాలయ్యాడో మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా ఏపీ రాజకీయాల కోసం అనవసరంగా టీడీపీ ట్రాప్ లో పడితే ఆయనకే నష్టం. ✍️తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆ మానిఫెస్టోని అమలు చేయడమే పెద్ద సవాల్. దానిపైనే ఆయన దృష్టి పెట్టుకోవాలి. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి ఏడాదికి సుమారు లక్షనుంచి లక్షన్నర కోట్లు అవసరం అవుతాయని అంచనా. వచ్చే పార్లమెంటు ఎన్నికల లోపు వాటిని అమలు చేయలేకపోతే కాంగ్రెస్ బదనాం అయిపోతుంది. దానిని ఎలా సాధించాలన్నది రేవంత్ ఆలోచించాలి. అలా కాకుండా ఏపీ టీడీపీ వారు కోరుకుంటున్నట్లు వ్యవహరించారో ఇక అంతే సంగతి. తెలుగుదేశం పార్టీ వారు తన పేరు తరచు వాడుకోకుండా చూడకపోతే కూడా ఆయనకు చికాకులు వస్తుంటాయి. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీలో ఎలాంటి కుట్రలు చేస్తుంటారో రేవంత్ కు తెలియనివి కావు. తెలంగాణలో గత సారి కాంగ్రెస్ తో నేరుగా పొత్తు పెట్టుకుని ఓటమి తర్వాత 2019 ఎన్నికలలో దానిని ఏపీలో గాలికి వదలివేశారు. ✍️2023 తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ కు చంద్రబాబు పరోక్ష మద్దతు ఇచ్చినా, 2024 ఎన్నికలలో ఏపీలో బీజేపీ స్నేహం కోసం అర్రులు చాస్తున్నారు.అలాగే బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనతో టీడీపీ కొనసాగిస్తున్న అక్రమ సంబంధం గురించి రేవంత్ కు తెలియకుండా ఉంటుందా?ఏపీలో శాసనసభ ఎన్నికలు జరిగే సమయంలోనే దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. అంటే తెలంగాణలో కూడా ఎన్నికల హడావుడి ఉంటుంది. పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలుచుకోలేకపోతే దాని ప్రభావం ఆయనపై ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్ తో నేరుగా టీడీపీ పొత్తు పెట్టుకుని పనిచేస్తే వేరే విషయం. దానిని ఎవరూ కాదనరు. ✍️రేవంత్ రెడ్డి కూడా పార్టీపరంగా బహిరంగంగానే సాయపడవచ్చు. అందుకు చంద్రబాబు సిద్దపడతారా?ఆయన ఒకవైపు బీజేపీతో, మరోవైపు కాంగ్రెస్ తో రాజకీయం చేయాలని చూస్తున్నారు. ఈ రాజకీయాలలో రేవంత్ ఇరుక్కుంటే కాంగ్రెస్‌లో ఆయన వ్యతిరేక వర్గీయులు దానిని అడ్వాంటేజ్‌గా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రేవంత్ రెడ్డి ఇంతవరకు ఎలా వ్యవహరించినా ఎవరూ మరీ అంత సీరియస్‌గా తీసుకోలేదు. కాని ముఖ్యమంత్రి అయ్యాక సరైన ధోరణిలో వెళ్లకుండా టీడీపీ భావజాలాన్ని మర్చిపోకుండా ఉంటే మాత్రం ఆయన రాజకీయ మనుగడనే దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందువల్ల రేవంత్ తెలంగాణ ప్రజల కోసం, కాంగ్రెస్ ప్రయోజనాల కోసం పనిచేస్తారో, లేక పొరుగు రాష్ట్రంలో టీడీపీ కోసం, కొందరు పత్రికాధిపతుల కోసం పనిచేస్తారో తేల్చుకోవాలని చెప్పకతప్పదు. కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
Live Updates.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ మంత్రులకు శాఖల కేటాయింపులపై చర్చ సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ రావు థాకరే ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్.. కాసేపట్లో ఢిల్లీకి రేవంత్ సీఎం రేవంత్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, మిగతా బెర్తులపై అధిష్టానంతో రేవంత్ చర్చించనున్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సెషన్ అసెంబ్లీలో మంత్రుల ప్రమాణ స్వీకారం. విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరు కాని సీఎండీ ప్రభాకర్ రావు. సమావేశానికి రావాలని ఆదేశించినా హాజరు కాని ప్రభాకర్ రావు. విద్యుత్ శాఖలో ఇప్పటి వరకు రూ.85వేల కోట్ల అప్పులు ఉన్నాయన్న అధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై సీఎం రేవంత్ సమీక్ష సమీక్షకు హాజరైన రవాణాశాఖ, ఆర్టీసీ ఉన్నతాధికారులు మహిళలకు ఉచిత ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల చేయనున్న ప్రభుత్వం. రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. విధివిధానాలను రూపొందించాలని అధికారులకు రేవంత్ ఆదేశం. ఆర్టీసీ పరిస్థితులు, ఆదాయం, వ్యయంపై సీఎం రేవంత్ ఆరా. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీపై రోజుకు రూ.4కోట్ల భారం పడే అవకాశం. ఆర్టీసీ బస్సుల్లో రోజూ 12-13 లక్షల మంది ప్రయాణం. ►కాసేపట్లో విద్యుత్ శాఖ, ఆర్టీసీపై సీఎం రేవంత్ సమీక్ష ►మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై రివ్యూ. ►మహిళలకు ఉచిత ప్రయాణంపై నేడు మార్గదర్శకాలు. ►నిన్న తొలి కేబినెట్లోనే విద్యుత్ శాఖపై వాడీవేడి చర్చ ►నేడు సమీక్షకు ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ ప్రభాకర్ రెడ్డి హాజరుకావాలన్న సీఎం రేవంత్. ►ప్రజా దర్బార్ ముగించుకుని సెక్రటేరియట్ బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి ►విద్యుత్ శాఖపై సెక్రటేరియట్లో రివ్యూ చేయనున్న సీఎం రేవంత్ ►సీఎం రేవంత్‌ను కలిసిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు ►జెన్కో ఏఈ నియామక పరీక్ష వాయిదా వేయాలని వినతి. ►సీఎం రేవంత్‌ను కలిసి సమస్యలు చెప్పుకుంటున్న ప్రజలు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించిన సీఎం రేవంత్. ప్రజా దర్బార్‌లో సీఎంను కలిసిన కొండపోచమ్మ ముంపు బాధితులు. ఇప్పటి వరకు నష్టపరిహారం అందలేదని సీఎంకు వివరించిన బాధితులు. ►ఇక, ప్రజా దర్బార్‌కు ప్రత్యేక యంత్రాగం. ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును పరిశీలించేందుకు 20 మంది సిబ్బంది. వచ్చిన ఫిర్యాదులను జిల్లా కలెక్టర్లకు, సంబంధిత శాఖ అధికారులకు సిఫార్స్ చేస్తున్న సీఎం రేవంత్. వచ్చిన ఫిర్యాదులపై మళ్లీ సమీక్ష చేయాలని నిర్ణయించుకున్న సీఎం రేవంత్. ప్రతీ నెల వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై సమీక్ష. ►కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా దర్బార్ ప్రారంభమైంది. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తున్నారు. ►జూబ్లీహిల్స్ నివాసం నుంచి జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు బయలు దేరిన సీఎం రేవంత్ రెడ్డి.. ►మరికాసేపట్లో ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్‌కు హాజరు కానున్న సీఎం రేవంత్ ►కాసేపట్లో ప్రజా దర్బార్.. ►ప్రజా దర్భార్‌లో కోసం భారీగా వచ్చిన ప్రజలు.. గడీల పాలన అంతం కోసం ఇనుప కంచెలను తొలగించి, జ్యోతిరావు పూలే ప్రజా భవన్ కు తెలంగాణ ప్రజలను ఆహ్వానించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. ప్రజా దర్బార్ లో తమ సమస్యలను విన్నవించుకునేందుకు ప్రజా భవన్ కు తరలివచ్చిన ప్రజలు.@revanth_anumula#PrajalaTelanganaSarkaar pic.twitter.com/quqLv4pKeT — Telangana Congress (@INCTelangana) December 8, 2023 తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నిన్న(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు. ఇదిలా ఉండగా.. నేడు, జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రజా భవన్(ప్రగతి భవన్)లో నేటి నుంచి ప్రజా దర్బార్‌ను నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రజా దర్బర్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఎన్నికల సమయంలో రోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, విద్యుత్‌పై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. సెక్రటేరియట్లో విద్యుత్ శాఖపై మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేపట్టనున్నారు. సీఏండీ ప్రభాకర్ రావును రివ్యూకు అటెండ్ అయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థలో 85వేల కోట్ల అప్పులపై ఆరా తీయనున్నారు. నేడు సంబంధిత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరోవైపు, విద్యుత్ సంక్షోభం సృష్టించే కుట్ర జరిగిందని తొలి క్యాబినెట్ సమావేశంలో వ్యాఖ్యానించిన సీఎం రేవంత్. అయితే, తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యే వరకు విద్యుత్ కొనుగోళ్లపై శ్వేతపత్రం విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. Praja Telangana - ప్రజల తెలంగాణ 10 గంటలకు ప్రజాభవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్. -- తమ వినతులతో ప్రజా భవన్ కు భారీగా చేరుకున్న ప్రజలు. Telangana Chief Minister Revanth Reddy Praja Darbar at Praja Bhavan at 10 o'clock. -- People reached the Praja… pic.twitter.com/aZUhEhzd43 — Congress for Telangana (@Congress4TS) December 8, 2023 -
త్వరలో మంచి రోజులు వస్తాయి
కొండపాక(గజ్వేల్): త్వరలో మంచి రోజులు వస్తాయని, బీఆర్ఎస్ శ్రేణులు అధై ర్య పడవద్దని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల ప్రజా ప్రతినిధులు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మండల ఏర్పాటు కలను సాకారం చేశారంటూ వారు కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్న విషయాన్ని కేసీఆర్‌కు విన్నవించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ త్వరలో మంచి రోజులు వస్తాయంటూ ప్రజా ప్రతినిధు ల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మునుపటిలాగే నడచుకోవాలని నిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్, సర్పంచ్‌లు కిరణ్‌కుమార్‌చారి, మహిపాల్, కనకయ్య, ఎంపీటీసీ భూములుగౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు. -
సీఎం కుర్చీలో రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్‌రెడ్డి గురువారం సచివాలయంలో లాంఛనంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. సాయంత్రం 4.20 గంటలకు సతీమణితో కలసి సచివాలయానికి చేరుకున్న రేవంత్‌కు.. ప్రధానద్వారం వద్ద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, పలువురు ఉన్నతాధికారులు పోలీసు అధికార బ్యాండ్ మోగుతుండగా ఘనంగా స్వాగతం పలికారు. రేవంత్ అక్కడి నుంచి నడుచుకుంటూనే సచివాలయం లోపలికి వెళ్లారు. సీఎం చాంబర్ వద్ద ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత సతీమణి గీతతో కలసి రేవంత్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం సాయంత్రం 4.46 నిమిషాలకు ముఖ్యమంత్రి అధికారిక కుర్చీలో ఆసీనులయ్యారు. సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు, ప్రజాప్రతిధులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత సచివాలయంలోనే రేవంత్ అధ్యక్షతన నూతన మంత్రివర్గ తొలి సమావేశం జరిగింది. తెరుచుకున్న సచివాలయం ద్వారాలు రాష్ట్ర నూతన సచివాలయం ద్వారాలు గురువారం ప్రజలందరి కోసం తెరుచుకున్నాయి. సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక సచివాలయానికి వస్తారని తెలియడంతో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు సచివాలయానికి చేరుకున్నారు. అధికారులు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలకు పాస్‌లు ఇచ్చి లోపలికి అనుమతించారు. దీంతో సచివాలయం లోపల సందడి కనిపించింది. తొలిసారిగా జర్నలిస్టులను పాస్‌ల అవసరం లేకుండా మీడియా గుర్తింపు కార్డులు చూసి కొత్త సచివాలయంలోకి అనుమతించారు. గతంలో సచివాలయంలోకి జర్నలిస్టుల ప్రవేశంపై పెట్టిన ఆంక్షలను ఎత్తివేయడం, ప్రధాన భవనం లోపలే మీడియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించడంపై మీడియా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. -
ఇదీ తెలంగాణ మంత్రుల బయోడేటా
జూపల్లి కృష్ణారావు పుట్టిన తేదీ: ఆగస్టు 10, 1955 స్వస్థలం: పెద్దదగడ, చిన్నంబావి మండలం (వనపర్తి జిల్లా) విద్యార్హత: బీఏ తల్లిదండ్రులు: జూపల్లి రత్నమ్మ – శేషగిరిరావు భార్య, పిల్లలు: జె.సుజన, వరుణ్, అరుణ్ రాజకీయ నేపథ్యం: బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే: కొల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1999 (కాంగ్రెస్), 2004 (స్వతంత్ర), 2009 (కాంగ్రెస్), 2012 ఉపఎన్నిక, 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి: 2009 నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య కేబినెట్లలో ఆహార, పౌరసరఫరాలు, తూనికలు – కొలతలు, వినిమయ వ్యవహారాల శాఖల మంత్రిగా, ఆ తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ, ధర్మాదాయ, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో కేసీఆర్ కేబినెట్లో తొలుత ఐటీ, పరిశ్రమలు, ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. కొండా సురేఖ పుట్టిన తేదీ: 19 ఆగస్టు 1965 స్వస్థలం: వంచనగిరి, గీసు కొండ మండలం (వరంగల్ జిల్లా) విద్యార్హత: బీకాం తల్లిదండ్రులు: తుమ్మ రా«ద – చంద్రమౌళి భర్త: కొండా మురళీధర్ రావు మాజీ ఎమ్మెల్సీ కూతురు: సుష్మితాపటేల్ రాజకీయ నేపథ్యం: 1995లో వంచనగిరి ఎంపీటీసీగా రాజకీయ జీవితం ప్రారంభించి గీసుకొండ ఎంపీపీ నుంచి మంత్రి దాకా ఆమె ప్రస్థానం కొనసాగింది. ఎమ్మెల్యే: శాయంపేట సెగ్మెంట్ నుంచి 1999, 2004 (కాంగ్రెస్), పరకాల నుంచి 2009 (కాంగ్రెస్), వరంగల్ తూర్పు నుంచి 2014 (టీఆర్ఎస్), 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి: 2009 వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో శిశు మహిళా సంక్షేమ అభివృద్ధిశాఖ మంత్రి. పార్టీ పదవులు: పీసీసీ సభ్యురాలు, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ కోశాధికారి, ఏఐసీసీ సభ్యురాలు. కెప్టెన్ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పుట్టిన తేదీ: జూన్ 20, 1962 స్వస్థలం: తాటిపాముల, తిరుమలగిరి మండలం (సూర్యాపేట జిల్లా) విద్యార్హత: నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. (సీనియర్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్నారు) తల్లిదండ్రులు: ఉషాదేవి– పురుషోత్తంరెడ్డి భార్య: పద్మావతి (కోదాడ ఎమ్మెల్యే) రాజకీయ నేపథ్యం: రాష్ట్రపతి భవన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే: 1999, 2004లో కోదాడ నుంచి, 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు మంత్రి: ఉమ్మడి ఏపీలో కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎంపీ: 2019 లోక్‌సభఎన్నికల్లో నల్లగొండ నుంచి ఎన్నిక పార్టీ పదవులు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీపీసీసీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావు పుట్టిన తేదీ: మే 20, 1953, స్వస్థలం: గండుగులపల్లి, దమ్మపేట మండలం (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) తల్లిదండ్రులు: మాణిక్యమ్మ– లక్ష్మయ్య, విద్యాభ్యాసం: బీకాం భార్య: భ్రమరాంబ, కుమారుడు యుగంధర్, కుమార్తెలు డాక్టర్ జగన్మోహిని, చంద్రిక రాజకీయ నేపథ్యం: టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా, టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజాగా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హయాంలో ఉమ్మడి ఏపీలో చిన్ననీటి పారుదల శాఖ, ప్రొహిబిషన్, భారీ, మధ్యతరహా నీటి పారుదలశాఖ, ఎక్సైజ్, ఆర్అండ్బీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్అండ్బీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెల్యే: 1985, 1994, 1999 (సత్తుపల్లి), 2009 (ఖమ్మం), 2016 (పాలేరు), 2023 (ఖమ్మం) మంత్రి: ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, కేసీఆర్ కేబినెట్లలో ఎమ్మెల్సీ: టీఆర్ఎస్ నుంచి 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ధనసరి అనసూయ (సీతక్క) పుట్టిన తేదీ: జూలై 9, 1971 స్వస్థలం: జగన్నపేట, ములుగు మండలం (ములుగు జిల్లా) విద్యార్హత : ఎల్ఎల్బీ, ఆదివాసీల జీవనం – సంప్రదాయాలు – నైపుణ్యంపై పరిశోధన చేసి ఉస్మానియూ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్నారు. తల్లిదండ్రులు: సమ్మక్క–సారయ్య, భర్త, పిల్లలు: రామన్న, సూర్య (కుమారుడు) రాజకీయ నేపథ్యం: 10వ తరగతి పూర్తయ్యాక 1988లో విప్లవోద్యమంలో చేరిక. సీపీఐ (ఎంఎల్) జనశక్తిలో చేరిక, ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి దళ లీడర్‌గా ప్రధాన భూమిక. 1997లో సాధారణ క్షమాభిక్ష పథకం కింద పోలీసులకు లొంగిపోయారు. 2001లో టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే: ములుగు అసెంబ్లీ సెగ్మెంట్‌కు 2009 (టీడీపీ), 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే. పార్టీ పదవులు: తెలుగు మహిళా రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, ప్రస్తుతం ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిన తేదీ: అక్టోబర్ 28, 1965, స్వస్థలం: నారాయణపురం, కల్లూరు మండలం(ఖమ్మం జిల్లా) తల్లిదండ్రులు: స్వరాజ్యం– రాఘవరెడ్డి, విద్యాభ్యాసం: బీఏ భార్య: మాధురి, కుమారుడు హర్షారెడ్డి, కుమార్తె సప్నిరెడ్డి రాజకీయ నేపథ్యం: 2013లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 2014లో ఖమ్మం లోక్‌సభ స్థానంలో వైఎస్సార్ సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2016 బీఆర్ఎస్లో చేరిన ఆయన 2014 సెప్టెంబర్ 1 నుంచి 2019 వరకు రవాణా, పర్యాటక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఈ ఏడాది జూలై 2న రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియమితులయ్యారు. ఎంపీ: 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఎమ్మెల్యే: 2023 పాలేరు సెగ్మెంట్‌కు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. సీలారపు దామోదర రాజనర్సింహ పుట్టిన తేదీ: డిసెంబర్ 5, 1958 స్వస్థలం: జోగిపేట (సంగారెడ్డి జిల్లా) విద్యార్హత: ఇంజనీరింగ్ తల్లిదండ్రులు: జానాబాయి– రాజనర్సింహ (మాజీ మంత్రి) భార్య, కూతురు: పద్మిని, త్రిష రాజకీయ నేపథ్యం: వారసత్వంగా రాజకీయాల్లో వచ్చారు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. ఎమ్మెల్యే: అందోల్ అసెంబ్లీ సెగ్మెంట్లో 1989, 2004, 2009, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి: 2006 వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్ విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్లోనూ పనిచేశారు. 2010–2014 వరకు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. పార్టీ పదవులు: సీడబ్ల్యూసీ శాశ్వత సభ్యుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ పుట్టిన తేదీ: డిసెంబర్ 9, 1967 స్వస్థలం: కరీంనగర్ విద్యార్హత: ఎంఏ, ఎల్ఎల్బీ తల్లిదండ్రులు: మల్లమ్మ–సత్తయ్యగౌడ్ భార్య, పిల్లలు: మంజుల, పృథ్వీ, ప్రణవ్ రాజకీయ నేపథ్యం: ఎస్ఆర్ఆర్ కాలేజీకి కాంగ్రెస్ అనుబంధ విభాగమైన ఎన్ఎస్యూ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. 2005–09 మధ్యకాలంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ పనిచేశారు. ఎంపీ: 2009 లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఎమ్మెల్యే: 2023 ఎన్నికల్లో హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పార్టీ పదవులు: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పుట్టినతేదీ: మే, 23 1965 స్వస్థలం: బ్రాహ్మణవెల్లెంల, నార్కట్‌పల్లి మండలం (నల్లగొండ జిల్లా) విద్యార్హత: ఇంజనీరింగ్ (సివిల్) తల్లిదండ్రులు: సుశీలమ్మ–పాపిరెడ్డి భార్య, పిల్లలు: భార్య సబిత, కూతురు శ్రీనిధిరెడ్డి, కుమారుడు ప్రతీక్‌రెడ్డి (కుమారుడు 2011లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు) రాజకీయ నేపథ్యం: 1986–1993 వరకు ఎస్ఎస్యూఐ నల్లగొండ జిల్లా ఇన్చార్జ్గా, 1993– 1998 వరకు యువజన కాంగ్రెస్ రాష్ట్రనేతగా పనిచేశారు. ఎమ్మెల్యే: నల్లగొండ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి 1999, 2004, 2009, 2014, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మంత్రి: వైఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో. ఎంపీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పుట్టిన తేదీ: జూన్ 6, 1969 స్వస్థలం: మంథని (పెద్దపల్లి జిల్లా) విద్యార్హత: ఢిల్లీ యూనివ ర్సిటీ నుంచి న్యాయశాస్త్రం, హెచ్‌సీయూ నుంచి పొలిటికల్ సైన్స్‌లో పీజీ తల్లిదండ్రులు : జయశ్రీ – దుద్దిళ్ల శ్రీపాదరావు (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్) భార్య, పిల్లలు: శైలజ రామయ్యర్ (సీనియర్ ఐఏఎస్), ఆదిత శ్రీపాద, అనిరుధ్ శ్రీపాద రాజకీయ నేపథ్యం: దుద్దిళ్ల శ్రీపాదరావును నక్సలైట్లు హత్య చేయడంతో ఆకస్మికంగా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యే: మంథని అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరఫున 1999, 2004, 2009, 2018, 2023 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. విప్: ఉమ్మడి ఏపీలో 2004–2009 వరకు మంత్రి: 2009–14లో వైఎస్.రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లలో ఉన్నత విద్యా శాఖ, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖల మంత్రిగా పనిచేశారు. పార్టీ పదవులు: ఏఐసీసీ సెక్రటరీ మల్లు భట్టి విక్రమార్క పుట్టిన తేదీ: జూన్ 15, 1961 స్వస్థలం: స్నానాల లక్ష్మీపురం, వైరా, ఖమ్మం జిల్లా. విద్యార్హత: ఎంఏ తల్లిదండ్రులు: మాణిక్యమ్మ – అఖిలాండ భార్య, పిల్లలు: నందిని, కుమారులు సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య రాజకీయ నేపథ్యం: మధిర సెగ్మెంట్ నుంచి 2009 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. ఆయన సోదరులైన మల్లు అనంతరాములు, మల్లు రవిలు నాగర్‌కర్నూల్ నుంచి ఎంపీలుగా ఎన్నికయ్యారు. అనంతరాములు పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఎమ్మెల్సీ: ఖమ్మం స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున 2007లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఎమ్మెల్యే: మధిర నుంచి 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వరుసగా గెలిచారు. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్: 2009 నుంచి 2011 ఉమ్మడి ఏపీ డిప్యూటీ స్పీకర్: 2011 నుంచి 2014 వరకు సీఎల్పీ నేత: 2019 నుంచి 2023 పార్టీ పదవులు: పీసీసీ కార్యదర్శి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ -
మేం మీ సేవకులం..
సాక్షి, హైదరాబాద్: తాము పాలకులం కాదని, సేవకులమని.. తమ ప్రజా ప్రభుత్వంలో ప్రజలే భాగస్వాములుగా పాలన సాగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సేవ చేసేందుకు ప్రజలు తమకు ఇచ్చిన అవకా శాన్ని బాధ్యతగా, ఎంతో గౌరవంగా నిర్వర్తిస్తానని చెప్పారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చిందని, తెలంగాణ నలుమూలలా సమాన అభివృద్ధి జరు గుతుందని పేర్కొన్నారు. పోరాటాలు, త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో దశాబ్దకాలంగా ప్రజాస్వామ్యం హత్యకు గురైందని, మానవ హక్కులకు భంగం కలిగిందని ఆరోపించారు. అందుకే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుండ గానే ప్రగతిభవన్ గడీ చుట్టూ నిర్మించిన ఇనుప కంచెలను బద్దలు కొట్టామని వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను, ఆలోచనలను, అభివృద్ధిని మిళితం చేసి తెలంగాణను సంక్షేమ రాజ్యంగా మారుస్తామ న్నారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడి యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తర్వా త ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘మిత్రులారా.. తెలంగాణ ఆషామాషీగా ఏర్పడ్డ రాష్ట్రం కాదు. పోరాటాలతో, త్యాగాల పునా దులపై ఏర్పడింది. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో ఆలోచ నలతో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించి తెలంగాణ లోని నాలుగు కోట్ల మంది ప్రజలకు స్వేచ్ఛనివ్వా లని, సామాజిక న్యాయం చేయాలని, ఆసిఫాబాద్ నుంచి అలంపూర్ వరకు, ఖమ్మం నుంచి కొడంగల్ వరకు సమాన అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటు చేసింది. కానీ దశాబ్దకాలంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం హత్యకు లోనైంది. మానవహక్కులకు భంగం కలిగింది. ఈ ప్రాంతంలో ప్రజలు బాధలు చెప్పుకొందామనుకున్నా.. ప్రభుత్వం నుంచి వినేవారు లేక దశాబ్దకాలంగా మౌనంగా భరించారు. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తమ ఆలోచనను ఉక్కు సంకల్పంగా మార్చి, ఎన్నికల్లో ఎన్నో త్యాగాలు చేసి, తమ రక్తాన్ని చెమటగా మార్చి, భుజాలు కాయలు కాసేలా కాంగ్రెస్ పార్టీ జెండాను మోశారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది ప్రజల రాజ్యాన్ని, ప్రజల పరిపాలనను అందించ డానికి.. తెలంగాణ రైతాంగం, విద్యార్థి, నిరుద్యోగ యువత, ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటు ప్రక్రి యతో తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. కొత్త మంత్రివర్గంతో తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం జరుగుతుంది. కొత్త ప్రభుత్వంలో నలుమూలలా సమాన అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ప్రమాణస్వీకారం మొదలైనప్పుడే గడీగా ఏర్పాటు చేసుకున్న ప్రగతిభవన్ చుట్టూ నిర్మించు కున్న ఇనుప కంచెలను బద్దలు కొట్టించాం. ఈ వేది కపై నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాట ఇస్తున్నా.. నా తెలంగాణ కుటుంబం ఎప్పుడు రావాలను కున్నా నిరభ్యంతరంగా ప్రగతిభవన్‌లోకి ప్రవేశించి తమ ఆలోచనలు, ఆకాంక్షలు, అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వంతో పంచుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో మీరు భాగస్వాములు. మీ ఆలోచనలను, ఈ ప్రాంత అభివృద్ధిని మిళితం చేసి సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే బాధ్యత మీ అభిమాన నేతగా, మీ రేవంతన్నగా నేను తీసుకుంటా. మాట నిలబెట్టుకుంటా. కార్యకర్తలకు అండగా ఉంటా.. కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, సోనియా అండతో, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో, రాహుల్‌గాంధీ సూచనలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపిస్తాం. ఈ ప్రభుత్వం ఏర్పడేందుకు లక్షలాది మంది కార్యకర్తలు ప్రాణాలను త్యాగం చేసేందుకు సిద్ధమయ్యారే తప్ప మువ్వన్నెల జెండాను విడిచిపెట్టలేదు. మీ కష్టాన్ని, శ్రమను గుర్తు పెట్టుకుంటా. గుండెల నిండా మీరిచ్చిన శక్తిని నింపుకొని ఈ పదేళ్లు కష్టపడ్డ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత తీసుకుంటా’’ అని రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణకు పట్టిన చీడ నుంచి విముక్తి కలిగించిన ప్రజలకు, కాంగ్రెస్ జాతీయ నేతలు, సీఎంలు, రాజకీయ పార్టీల నేతలు, సహచర ఎంపీలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జై కాంగ్రెస్.. జై సోనియమ్మ అంటూ ప్రసంగాన్ని ముగించారు. ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ ప్రగతిభవన్ చుట్టూ ఉన్న ఇనుప కంచెలను ఈరోజు బద్దలు కొట్టాం. రేపు (శుక్రవారం) ఉదయం పదిగంటలకు జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. తెలంగాణలోని ప్రతి ఒక్కరి హక్కులను కాపాడుతాం. అభివృద్ధి కోసం శాంతిభద్రతల ను కాపాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలతోనే కాకుండా ప్రపంచంతోనే పోటీపడేలా చేస్తాం. పేదలకు, నిస్సహాయుల కు సహాయకారిగా ఉంటాం. నిస్సహాయులె వరూ తమకెవరూ లేరని, తమకే దిక్కూ లేదని అనుకునే పరిస్థితి రానివ్వం. మీ సోదరుడిగా, మీ బిడ్డగా మీ బాధ్యతలను నేను నిర్వహిస్తా. ఈ రోజు నుంచి విద్యార్థి, నిరుద్యోగ, ఉద్యమ కారులకు, అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. -
మంత్రుల శాఖలపై గందరగోళం
సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వంలోని 11 మంది మంత్రులు ప్రమాణం చేసినప్పటికీ వారికి గురువారం ఎలాంటి శాఖలు కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్ అభీష్టం మేరకు జరిగే శాఖల కేటాయింపు అధికారికంగా జరగకపోవడం గమనార్హం. వాస్తవానికి, మంత్రులు ప్రమాణం చేసిన రోజునే సాయంత్రానికి సాధారణ పరిపాలన శాఖ ఆయా మంత్రులకు కేటాయించిన శాఖలపై అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది. కానీ నూతన ప్రభుత్వంలో అలా జరగలేదు. మధ్యాహ్నం 2 గంటల లోపే ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసినప్పటికీ రాత్రి వరకు ఇలాంటి ఉత్తర్వులేవీ రాలేదు. ఈలోపే ఫలానా మంత్రికి ఫలానా శాఖ కేటాయించారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. ఈ ప్రచారం ఆధారంగా పలువురు మంత్రుల అనుచరులు, సన్నిహితులు తమ నేతకు ఫలానా శాఖ కేటాయించారనే నిర్ధారణకు వచ్చారు. కానీ అలాంటిదేమీ లేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తలు నిజం కావని తెలిపాయి. ‘ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలు కేటాయించినట్టు వస్తున్న వార్తలు అవాస్తవం. ప్రభుత్వం ఇంకా మంత్రులకు శాఖలు కేటాయించలేదు. శాఖల కేటాయింపు వార్తలను ప్రజలు నమ్మొద్దు. మంత్రులకు శాఖల కేటాయింపు విషయంలో ప్రభుత్వం ఆదేశాలిస్తుంది. ఆ ఆదేశాలు జారీ చేసేంతవరకు శాఖల కేటాయింపుపై ప్రచారాలు నమ్మవద్దు.’ అని గాం«దీభవన్ నుంచి ప్రకటన వెలువడింది. కాగా కొత్త మంత్రులకు శుక్రవారం శాఖల కేటాయింపు జరిపే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.