తిరుమలలో ఎమ్మెల్యే వివేక్‌.. సింగరేణిపై కీలక వ్యాఖ్యలు | Congress MLA Vivek Key Comments Over Singareni | Sakshi
Sakshi News home page

తిరుమలలో ఎమ్మెల్యే వివేక్‌.. సింగరేణిపై కీలక వ్యాఖ్యలు

Dec 9 2023 9:19 AM | Updated on Dec 9 2023 4:40 PM

Congress MLA Vivek Key Comments Over Singareni - Sakshi

సాక్షి, తిరుమల: చెన్నూరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి తిరుమల పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని వివేక్‌ దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని వివేక్‌ మొక్కులు చెల్లించుకున్నారు. 

అనంతరం, వివేక్‌ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో నియంతృత్వ పాలన అంతమైంది. ప్రజల ఆకాంక్ష మేరకు ప్రజా ప్రభుత్వం వచ్చింది. సింగరేణిలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. మిషన్ భగీరథ ఫెయిల్ అయింది, ఎక్కడా మంచి నీరు రావడం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో దోపిడీ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.

పది సంవత్సరాలలో  ప్రజాధనం దుర్వినియోగంపై శ్వేతపత్రం తీసుకురావాల్సి ఉంది. అవినీతి సొమ్ముతో ఇతర రాష్ట్రాలలో రాజకీయాలకు దుర్వినియోగం చేశారు. ధరణి పోర్టల్‌తో కల్వకుంట్ల కుటుంబం భూ దందాకు పాల్పడింది.రాష్ట్రంలో దోపిడిపై శ్వేత పత్రం విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించడం జరిగింది అని కామెంట్స్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement