ఆసుపత్రిలో కేసీఆర్‌.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు.. | Sakshi
Sakshi News home page

ఆసుపత్రిలో కేసీఆర్‌.. సీఎం రేవంత్‌ కీలక ఆదేశాలు..

Published Fri, Dec 8 2023 1:46 PM

CM Revanth Reacts Over KCR Health Condition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు తీవ్ర గాయమైన నేపథ్యంలో సీఎం రేవంత్‌ స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు రేవంత్‌ తెలిపారు. కేసీఆర్‌ను మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. 

కాగా, సీఎం రేవంత్‌ ట్విట్టర్‌ వేదికగా..‘మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది. ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది. కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’    అంటూ కామెంట్స్‌ చేశారు. అంతకుముందు, కేసీఆర్‌ చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రి వద్ద ప్రభుత్వం భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

ఇదిలా ఉండగా.. కేసీఆర్‌ గురువారం అర్ధరాత్రి తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో కాలు జారి పడిపోవడంతో ఎడమ కాలి తొంటికి తీవ్ర గాయమైంది. తుంటికి రెండు చోట్ల గాయమైనట్టు వైద్యులు తెలిపారు. దీంతో, తుంటి భాగంగాలో స్టీల్‌ ప్లేట్‌ వేసే అవకాశం ఉంది. ఇక, కేసీఆర్‌ ఆరోగ్యంపై యశోద డాక్టర్లు హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేశారు. సిటీ స్కాన్‌ అనంతరం.. ఎడమ హిప్ రీప్లేస్‌మెంట్ అవసరమని వైద్యులు సూచించారు. ఇలాంటి కేసుల్లో కోలుకునేందుకు ఆరు నుంచి ఎనిమది వారాల రెస్ట్‌ అవసరమన్నారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు సర్జరీ చేయనున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. 

Advertisement
 

తప్పక చదవండి

Advertisement