త్వరలో మంచి రోజులు వస్తాయి | Former CM KCR consoled the ranks of BRS | Sakshi
Sakshi News home page

త్వరలో మంచి రోజులు వస్తాయి

Dec 8 2023 4:40 AM | Updated on Dec 8 2023 4:40 AM

Former CM KCR consoled the ranks of BRS - Sakshi

కొండపాక(గజ్వేల్‌): త్వరలో మంచి రోజులు వస్తాయని, బీఆర్‌ఎస్‌ శ్రేణులు అధై ర్య పడవద్దని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల ప్రజా ప్రతినిధులు ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో కేసీఆర్‌ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన మండల ఏర్పాటు కలను సాకారం చేశారంటూ వారు కేసీఆర్‌కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్న విషయాన్ని కేసీఆర్‌కు విన్నవించారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ త్వరలో మంచి రోజులు వస్తాయంటూ ప్రజా ప్రతినిధు ల్లో ధైర్యాన్ని నింపారు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో మునుపటిలాగే నడచుకోవాలని నిర్దేశం చేశారు. పార్టీ గెలుపు కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దేవి రవీందర్, సర్పంచ్‌లు కిరణ్‌కుమార్‌చారి, మహిపాల్, కనకయ్య, ఎంపీటీసీ భూములుగౌడ్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement