breaking news
-
కాంగ్రెస్‌కు 2, బీఆర్ఎస్కు 1.. రాజ్యసభ ఎన్నికల్లో దక్కే స్థానాలు
సాక్షి, హైదరాబాద్: పార్టీ బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే..రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్‌కు రెండు, బీఆర్ఎస్కు ఒకటి కచ్చితంగా దక్కుతాయి. వచ్చే మార్చిలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్‌కుమార్, బడుగుల లింగయ్యయాదవ్‌లు రిటైర్ అవుతున్నారు. వీరిస్థానంలో ఇద్దరు కాంగ్రెస్ నుంచి, ఒకరు బీఆర్ఎస్ నుంచి రాజ్యసభలో అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అనూహ్య పరిణామాలు సంభవిస్తే తప్ప అటు అధికారపక్షంగానీ, ఇటు ప్రతిపక్షంగానీ రాజ్యసభ స్థానాల కోసం పోలింగ్ వరకూ వెళ్లేందుకు సిద్ధపడే పరిస్థితుల్లేవు. ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా రాష్ట్రంలోని రాజకీయపార్టీల సర్దుబాటు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదని, ప్రస్తుత అసెంబ్లీలో పార్టీల కాంబినేషన్ ప్రయోగాలకు సరిపోదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒకవేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నాలుగో అభ్యర్థిని బరిలో దింపితే మాత్రం రాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడినట్టే. రాజ్యసభ సభ్యుల కోటా ఓట్ల లెక్క ఇది ♦ రాజ్యసభ ఎన్నికల కోటా ఓట్లను (ఒక అభ్యర్థి గెలవడానికి అవసరమైనవి) ఎన్నికల నిర్వహణ నిబంధనలు–1961లోని 76వ నిబంధన ప్రకారం ఒక ఫార్ములాతో నిర్ధారిస్తారు. ఈ ఎన్నిక కోసమే రూపొందించిన ఫార్ములా ప్రకారం అసెంబ్లీలో సభ్యుల మొత్తంసంఖ్య కీలకం. ఈ సంఖ్యను ఎన్నికలు జరగాల్సిన రాజ్యసభ స్థానాలు ఎన్ని ఉంటే దానికి ఒకటి కలిపి ఆ సంఖ్యతో భాగిస్తారు. భాగించగా వచ్చిన ఫలితానికి ఒకటి కలుపుతారు. అప్పుడు కోటా సంఖ్య నిర్ధారణ అవుతుంది. ♦ ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో 119 మంది సభ్యులున్నారు. మార్చిలో మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. పై ఫార్ములా ప్రకారం 119ని నాలుగుతో భాగించాలి. అలా భాగించగా వచ్చే భాగఫలంలోని డెసిమల్స్ను పరిగణనలోకి తీసుకోరు. అప్పుడు 29 వస్తుంది. ఆ 29కి 1 కలుపుతారు. అప్పుడు ఒక్కో సభ్యుడు ఎన్నిక కావాల్సిన కోటా (గెలవడానికి అవసరమయ్యే ఓట్ల సంఖ్య) 30గా నిర్ధారణ అవుతుందన్నమాట. ఈ 30 ఓట్ల విలువను మాత్రం 100తో హెచ్చించి లెక్కకడుతారు. దీన్ని బట్టి మార్చిలో జరిగే మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికల్లో ఒక్క సభ్యుడు గెలవాలంటే కనీసం 30 ఓట్లు రావాలన్నమాట. ♦ ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 64 మంది సభ్యుల బలం ఉంది. మిత్రపక్షమైన సీపీఐకి ఒక సభ్యుడున్నారు. ఈ కూటమికి కచ్చితంగా రెండు స్థానాలు దక్కుతాయి. బీఆర్ఎస్కు 39 మంది సభ్యులున్నారు. ఈ పార్టీకి కూడా కచ్చితంగా ఒక స్థానం దక్కుతుంది. మూడు స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు వేస్తే ఎలాంటి సమస్యా ఉండదు. కానీ, నాలుగో నామినేషన్ పడితే మాత్రం ఎన్నికలు జరుగుతాయి. అయితే, ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీసం 10 మంది సభ్యులు అభ్యర్థిని ప్రతిపాదించాలి. ఈ లెక్కన కాంగ్రెస్, బీఆర్ఎస్లు మాత్రమే అభ్యర్థులను పోటీలో నిలిపే అవకాశాలున్నాయి. 8 మంది సభ్యులున్న బీజేపీ, ఏడుగురి బలం ఉన్న ఎంఐఎం, ఒక్క సభ్యుడు ఉన్న సీపీఐలు తమంతట తాముగా అభ్యర్థిని బరిలో నిలపలేవు. ♦ ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. మూడు స్థానాలకు ముగ్గురే నామినేషన్లు వేస్తే కోటాతో పనిలేదు. ఆ ముగ్గురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటిస్తారు. అలా కాకుండా ముగ్గురి కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసి పోలింగ్ జరిగితే మాత్రం ఈ పద్ధతిలో కోటా ఓట్లను లెక్కించి అవసరమైన మేర ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటిస్తారు. మొత్తం 119 సభ్యుల్లో ఎవరైనా పోలింగ్‌కు గైర్హాజరై ఓటు హక్కు వినియోగించుకోకపోతే అప్పుడు కోటా సంఖ్యలో మార్పు వస్తుంది. అప్పుడు అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్యకు బదులు ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్యను కీలకంగా తీసుకుని దాని ప్రకారం కోటా నిర్ధారించి ఆ మేరకు ఓట్లు సాధించిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. ♦ ఒకవేళ ఎవరైనా ఇద్దరు అభ్యర్థులకు సమాన సంఖ్యలో ఓట్లు వస్తే మాత్రం రెండో ప్రాధాన్యత ఓటు ప్రకారం విజేతగా నిర్ణయిస్తారు. అప్పటికీ విజేత నిర్ధారణ కాకపోతే మూడో ప్రాధాన్యత ఓట్లను పరిగణనలోకి తీసుకుని ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారిని విజేతగా ప్రకటిస్తారు. అయితే, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత ఓటు విలువ తగ్గుతూ వస్తుంది. శాసనమండలి ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను పాటిస్తారు. ♦ ఒకవేళ పోలింగ్ జరిగితే మూడు స్థానాలు గెలిచేందుకు అవసరమైన కోటా ఓట్లు 90 పోగా, కాంగ్రెస్–4, బీఆర్ఎస్–9, ఎంఐఎం–7, బీజేపీ–8, సీపీఐ–1 చొప్పున ఓట్లు మిగులుతాయి. ఈ కాంబినేషన్లో ఓట్లు కలిసే అవకాశమే లేదని, బీజేపీ ఓటింగ్‌కు గైర్హాజరు అయినా కోటా సంఖ్య 28 అవుతుందని, అప్పుడు కూడా కాంబినేషన్ కుదరదని, ఎంఐఎం బీఆర్ఎస్ వైపు నిలిచినా నాలుగో అభ్యర్థి గెలిచే అవకాశం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో నాలుగో అభ్యర్థిని బరిలోకి దింపకుండా ముగ్గురిని ఏకగ్రీవం చేసు కునేందుకే అధికార, ప్రతిపక్షాలు మొగ్గుచూపు తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
3 నుంచి లోక్‌సభ సన్నాహక భేటీలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల మూడో తేదీ నుంచి లోక్‌సభ ఎన్నికల కార్యాచరణ అమలుపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. జనవరి 3 నుంచి 21 వరకు రెండు విడతలుగా రోజుకో లోక్‌సభ నియోజకవర్గ సన్నాహక భేటీ నిర్వహించాలని నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో 13 నుంచి 15 వర కు విరామం ఇవ్వనున్నారు. ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సుమారు పది రోజుల పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు తదితర సీనియ ర్ నేతలకు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలోనే సన్నాహక సమావేశాలకు షెడ్యూల్ సిద్ధం చేశారు. జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవ ర్గంతో ప్రారంభమయ్యే భేటీలు 21న సికింద్రాబా ద్, హైదరాబాద్ సెగ్మెంట్లతో పూర్తవుతాయి. కేటీఆర్, సీనియర్ల సమక్షంలో.. కేటీఆర్‌తో పాటు కె.కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీశ్‌రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్య నాయకులు తెలంగాణ భవన్ వేదికగా ఈ సమావేశాలు నిర్వహిస్తారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల ఎంపీలు, సంబంధిత లోక్‌సభ సెగ్మెంట్లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జెడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లాపార్టీ అధ్యక్షులు ఇతర ముఖ్యనేతలు భేటీలకు హాజరవుతారు. పార్టీ పరంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వీరి అభిప్రాయాలు తీసుకుని పటిష్ట కార్యాచరణ రూపొందించనున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప శాతం ఓట్ల తేడాతోనే చాలా సీట్లు చేజారిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో పార్టీని బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఏ నియోజకవర్గ భేటీ ఎప్పుడు? జనవరి 3న ఆదిలాబాద్, 4న కరీంనగర్, 5న చేవెళ్ల, 6న పెద్దపల్లి,ౖ 7న నిజామాబాద్, 8న జహీరాబాద్, 9న ఖమ్మం, 10న వరంగల్, 11న మహబూబాబాద్, 12న భువనగిరి లోక్ సభ భేటీలు జరగనున్నాయి. 16న నల్లగొండ, 17న నాగర్‌కర్నూల్, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజిగిరి, 21 సికింద్రా బాద్, హైదరాబాద్ సమావేశాలు ఉంటాయి. -
ఇప్పుడైనా సర్దుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్య నేతలకు క్లాస్ తీసుకోవడం, అందుకు దారితీసిన పరిణామాలపై రాష్ట్ర పార్టీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఫలితాల సమీక్ష, లోక్‌సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా గురువారం రాష్ట్ర నేతల వ్యవహారశైలిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా, క్రమశిక్షణను ఉల్లంఘించినా ఎంత పెద్ద నాయకుడినైనా చర్య తీసుకోకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చాంశనీయమయ్యాయి. రాష్ట్రంలో పార్టీకి పెరిగిన మద్దతు, వివిధ సమస్యలపై చేపట్టిన పోరాటం ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని భావిస్తే 8 సీట్లకే పరిమితం కావడం తమకు అసంతృప్తిని కలిగించిందని అమిత్ షా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ ముగ్గురితో విడిగా భేటీ రాష్ట్ర కోర్‌కమిటీతో జరిగిన ఈ భేటీ ముగిశాక నేతలంతా బయటకు వెళుతుండగా, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయకార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ను వేచి ఉండాలని అమిత్ షా చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. అనంతరం ఆ ముగ్గురితో భేటీ అయ్యారని కొంతమంది, ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యారని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా ఆ ముగ్గురితో ప్రత్యేకంగా చర్చలు జరపడం చూస్తే వీరికి గట్టిగా క్లాస్ పీకారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పటి నుంచి ఆయనకు ఈటల రాజేందర్ మధ్య సరైన సమన్వయం లేకపోవడం, వీరి అనుచరులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని పరస్పరం బురదజల్లుకోవడం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన రహస్యమే. ఐతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ వీరి మధ్య ఆధిపత్యపోరు తగ్గకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టడం వంటి వాటిపై అందిన రిపోర్ట్ ఆధారంగానే అమిత్ షా ఈ భేటీల్లో తీవ్రంగా స్పందించినట్టుగా చెబుతున్నారు. పార్టీ విస్తృత భేటీ సందర్భంగా కూడా వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా ఎడ మొహం, పెడమొహంగానే ఉన్నారే గానీ కనీసం మాట్లాడుకున్నట్టు కనిపించలేదని ఆ సమావేశానికి హాజరైన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వారికి గట్టిగానే క్లాస్ పీకి ఉంటారని పార్టీ నాయకులు అంచనావేస్తున్నారు. భేటీ తర్వాత ఒకే ‘బండి’లో ఈటల భేటీ అనంతరం సంజయ్, ఈటల ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరుగుతున్న కొంగరకలాన్‌కు చేరుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. సమావేశంలో చేసిన తీర్మానాలపై మీడియాకు వీరిద్దరూ బైట్ ఇస్తారని తొలుత పార్టీ మీడియాసెల్ సమాచారం ఇచి్చంది. రాజకీయతీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఈటల దానికి సంబంధించిన విశేషాలను మీడియాకు వివరించారు. కానీ సంజయ్ మాత్రం మీడియా సమావేశానికి రాలేదు. ఏదేమైనా అమిత్ షా క్లాసుతోనైనా లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీలో అంతా సర్దుకుని నేతలంతా సమన్వయంతో పనిచేస్తారనే ఆశాభావం రాష్ట్ర శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రామా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించి కాలయాపన చేసేందుకే శ్వేతపత్రాలు, జ్యుడీషియ ల్ ఎంక్వైరీ, ప్రాజెక్టుల సందర్శన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త డ్రామాకు తెరతీసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి విమర్శించారు. కాలయాపనతో ఎన్నికల హామీ లను ప్రజలు మరిచిపోతారని ప్రభుత్వం భావిస్తోందని, ఆరు నెలల్లోపు హామీలు నెరవేర్చకుండా గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ, అవినీతి ఆరోపణలు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు. అవినీతికి హక్కుదారు కాంగ్రెస్ పార్టీ అని, గత ప్రభుత్వంపై వేసే ప్రతి విచారణను బీఆర్ఎస్ ఎదుర్కొని ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.లక్ష కోట్ల అవినీతి అవాస్తవమని తేలింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత సీఎం రేవంత్, రాహు ల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన ఆరో పణలు అవాస్తవమని శుక్రవారం మంత్రుల మేడి గడ్డ ప్రాజెక్టు సందర్శన సందర్భంగా తేలిందని కడియం అన్నారు. ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ. 93 వేల కోట్లు ఖర్చు చేస్తే రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కొత్తగా 98 వేల ఎకరాల ఆయకట్టు ఏర్పడిందని, 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగి నట్లు మంత్రులు తమ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌లోనే అంగీకరించారని పేర్కొన్నారు. బ్యారేజీ కుంగుబాటుపై సమగ్ర విచారణ 2014లో తెలంగాణ ఏర్పాటుతో ఏర్పడిన తమ ప్రభుత్వం.. నీటి లభ్యత, ఇతర సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని తుమ్మిడిహట్టి వద్ద ఎత్తిపోతల పథకం సాధ్యం కాదని తేలినందునే.. కాళేశ్వరం ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ ద్వారా రీ డిజైన్ చేసిందని కడియం శ్రీహరి చెప్పారు. 19.63 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు, 18.62 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ జరిగిందని తెలిపారు. సీడబ్ల్యూసీ సహా 11 రకాల అనుమతులు కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చిన తర్వాతే పనులు ప్రారంభించామన్నారు. డిసెంబర్ 2008లో తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగ్గా 2014 వరకు కేంద్రంలో, ఉమ్మడి ఏపీలో, మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా ఎనిమిదేళ్ల పాటు అనుమతులు ఎందుకు తెచ్చుకోలేదని ప్రశ్నించారు. ఈపీసీ విధానం తెచ్చి మొబిలైజేషన్ అడ్వాన్సులు తదితరాల పేరిట గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.6 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు సాగునీరు అందించలేదని అన్నారు. కేబినెట్ ఆమోదంతోనే ల్యాండ్ క్రూజర్ల కొనుగోలు వాస్తవాలను పక్కన పెట్టి ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన మంత్రులు జ్యుడీషియల్ ఎంక్వైరీని ప్రభావితం చేసేలా, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని కడియం ధ్వజమెత్తారు. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు పై సమగ్ర విచారణ జరిపి కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ల్యాండ్ క్రూజ ర్ల కొనుగోలు కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని, ఇలాంటి అంశాలపై పిచ్చి మాటలు మానుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు లంకెబిందెల కోసం అధికారంలోకి వ చ్చారా? బడ్జెట్ గణాంకాలు అధ్యయనం చేయ కుండానే హామీలిచ్చారా? అని ప్రశ్నించారు. -
TS: ఎంపీ ఎన్నికలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపాలై ప్రతిపక్షంలోకి వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టింది. అనుకున్న దాని కంటే ముందే ఎంపీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ఎన్నికలకు ద్వితీయ శ్రేణి నాయకత్వంతో పాటు క్యాడర్‌ను సంసిద్ధం చేసే పనిపై దృష్టిపెట్టంది. కొత్త సంవత్సరంలో జనవరి 3 వ తేదీ నుంచి ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశాలను పార్లమెంట్ నియోజకవర్గాల వారిగా నిర్వహించనుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్లో ఈ సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతలు సమావేశాలకు హాజరవుతారు. ఈ సమావేశాల షెడ్యూల్‌ను పార్టీ శుక్రవారం ప్రకటించింది. 3వ తేదీన ఆదిలాబాద్ 4న కరీంనగర్, 5 చేవెళ్ల, 6 పెద్దపల్లి, 7 నిజామాబాద్, 8 జహీరాబాద్, 9 ఖమ్మం,10 వరంగల్,11 మహబూబాబాద్, 12 భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాలు, సంక్రాంతి అనంతరం 16న నల్గొండ, 17న నాగర్ కర్నూలు, 18న మహబూబ్‌నగర్, 19న మెదక్, 20న మల్కాజ్గిరి, 21న సికింద్రాబాద్ నియోజకవర్గాల సమావేశాలు జరుగుతాయి. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశాల్లో గులాబీ నేతలు చర్చించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయో సమీక్షించుకొని ఆ తప్పులు మళ్లీ జరగకుండా ఎంపీ సీట్లు గెలుచుకునేందుకు అవలంబించాల్సిన కార్యాచరణను నిర్ణయించనున్నారు. ఇదీచదవండి..ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక కొత్త డ్రామాలు -
మేడిగడ్డ సందర్శన.. కాంగ్రెస్ మంత్రులకు కడియం కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రుల వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కౌంటర్ ఇచ్చారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు తెలిపారు. అంచనాలు పెంచి కట్టారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారని.. పవర్ జనరేట్ ప్రాజెక్టులు, సబ్ స్టేషన్లు, లిఫ్ట్‌లు ఏర్పాటు చేయడం వల్లే అంచనా పెరిగిందని పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద, 19, 20, 21 పిల్లర్లు కుంగడం దురదృష్టకరమని.. ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి విచారణ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ కూడా కోరుకుంటోందని తెలిపారు. జ్యూడిషియల్ ఎంక్వైరీ కచ్చితంగా చేయాలన్నారు కడియం. అయితే విచారణ జరగకముందే మంత్రులు తీర్పులు చెబుతున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చాలా విషయాల్లో అవగాహన ఉందని భావించానని..కానీ ఆయనే పూర్తిగా తెలుసుకోకుండా తీర్పునిస్తున్నారని మండిపడ్డారు. గతంలో తాను డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు సీఎం హోదాలో కేసీఆర్‌తో కలిసి ప్రధాని వద్దకు వెళ్లి కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగిన విషయాన్ని గుర్తు చేశారు. బీజేపీకి అడుగడుగునా విషం నింపుకుంది కాబట్టే హోదా ఇవ్వలేదని దుయ్యబట్టారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయా హోదా తీసుకురావాలని, ఇందుకు తాము కూడా మద్దతిస్తామని తెలిపారు. కాళేశ్వరం సందర్శన కోసం వెళ్లిన మంత్రులు.. అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారని అన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ఆర్ధిక వనరులు సమకూర్చుకోలేక జనాన్ని మోసం చేయటానికి కొత్త డ్రామాలకు తెర లేపారని విమర్శించారు. శ్వేత పత్రాలు అంటూ కొంత కాలయాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి అంటూ కాలం గడుపుతుందని మండిపడ్డారు. రూ. 93 వేల కోట్ల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ్మిడిహాట్టి దగ్గర కట్టింది కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రోజెక్ట్ మాత్రమేనని తెలిపారు. చదవండి: కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్ -
TS: బీజేపీ నేతలకు ‘షా’ టార్గెట్ ఇదే !
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అమిత్ షా పర్యటనపై కమలనాథులు ఏమనుకుంటున్నారు ? ఇక్కడ పార్టీ పరిస్థితులు షా చక్కదిద్దారా ? బండి సంజయ్ ఈటల రాజేందర్ మధ్య వివాదం సమిసిపోయిందా ? అసలు నేతలకు అమిత్ షా చెప్పిన గెలుపు సూత్రం ఏంటి ? పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా నేతలకు చేసిన మార్గదర్శనం ఏంటి? తెలంగాణ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రత్యేక దృష్టి సారించారు. అధికారం సాధించే వరకు తెలంగాణకు వస్తూనే ఉంటానని అమిత్ షా స్పష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు. పార్టీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్ , బండి సంజయ్ మధ్య కొనసాగుతున్న కోల్డ్ వార్ పై ప్రధానంగా చర్చించారు. బీజేపీ రాష్ట్ర సారథి కిషన్ రెడ్డి సమక్షంలోనే అమిత్ షా.. ఆ ఇద్దరికి క్లాస్ తీసుకున్నారట. కలిసి వెళ్లకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని సీరియస్ వార్నింగ్ ఇచ్చారట. సోషల్ మీడియాలో పరస్పరం విమర్శలు చేసుకోవడం పద్దతి కాదంటూ గట్టిగా చెప్పారట. నేతల మధ్య సమన్వయ లేమి సమస్య మరోసారి రిపీట్ కాకుండా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని అమిత్ షా సూచించారు. తెలంగాణ కమల దళం ఎదుర్కొంటున్న సమన్వయ లేమి సమస్యకు అమిత్ షా పరిష్కారం చూపించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతం ఓట్లతో.. 10 సీట్లను సాధిస్తే మంచి భవిష్యత్ ఉంటుందని నేతలకు అమిత్ షా భరోసా ఇచ్చారు. నేతలను సమన్వయం చేసుకునే బాధ్యతలను కిషన్ రెడ్డికి అప్పగించారు. బీఆర్ఎస్ మునిగిపోయిన పార్టీ అని... కాంగ్రెస్ మునిగిపోనున్న పార్టీ అని నేతలతో భేటీలో అమిత్ షా అన్నట్లు సమాచారం. తెలంగాణలో భవిష్యత్ బీజేపీ దేనని పార్టీ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు అమిత్ షా. మరోవైపు ఈటల రాజేందర్, చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ వీడతారనే ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్‌కు అటు.. ఇటు ఉన్న మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలపై ఆశలు పెట్టుకున్న నేతలే... కొండా, ఈటల పార్టీ వీడుతున్నారనే ప్రచారం చేయిస్తున్నారని వీరిద్దరి అనుచరులు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో పది సీట్లు కొట్టాలని భావిస్తున్న కమలనాథుల ఆశలు ఏ మేరకు వర్కవుట్ అవుతాయో చూడాలి. ఇదీచదవండి..ప్రజాభవన్ ఘటనలో కొత్త కోణం.. మాజీ ఎమ్మెల్యే తనయుడిని ఎలా తప్పించారంటే -
ఇక చాలు ఆపండి ఇప్పటికే వర్గపోరుతో నష్టపోయాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వర్గ విభేదాలు, కొందరు ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు, సమన్వయ లేమి కారణంగా బీజేపీ నష్టపోయిందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. ’పార్టీపరంగా పెద్ద హోదా ఉందని, తాము ఏం చేసినా చెల్లుతుందంటే కుదరదు.. పార్టీకి నష్టం కలిగించే విధంగా ప్రవర్తిస్తే ఎంతటి పెద్దవారినైనా ఉపేక్షించే పరిస్థితే ఉండదు. ’అని స్పష్టం చేసినట్టు పార్టీ వర్గాల సమాచారం. అసెంబ్లీ ఫలితాలు తమను నిరాశపరిచాయని ఆయన వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. కొందరు ముఖ్యనేతల ఆధిపత్యపోరు, సోషల్ మీడియా వేదికగా ఒక వర్గంపై మరో వర్గం వ్యతిరేక పోస్టులు పెట్టడం వల్ల పార్టీ ఇమేజ్‌కి, పార్టీకి నష్టం జరిగిందనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో 30 స్థానాల్లో పార్టీ గెలుస్తుందని తాము ఆశించామని, ఐతే పైన పేర్కొన్న కారణాల వల్ల అనుకున్న స్థాయిలో ఎమ్మెల్యే సీట్లు గెలవలేకపోయామని పేర్కొన్నట్టు తెలిసింది. గురువారం రాష్ట్ర పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొనేందుకు అమిత్‌షా నగరానికి వచ్చిన సందర్భంగా తొలుత నోవాటెల్ హోటల్లో కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీనేతలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటి మోహన్‌రావు తదితరులు భేటీ అయ్యారు. వారిద్దరినుద్దేశించే ఆ వ్యాఖ్యలా? పార్టీ నేతల్లో ముఖ్యంగా సంజయ్, ఈటల మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తి, ఎడమొహం పెడమొహంగా ఉంటున్నందు వల్ల వారిని ఉద్దేశించే పరోక్షంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారంటూ పార్టీనాయకులు గుసగుసలాడుకుంటున్నారు. కొందరు నేతల ముందే సీనియర్లకు అమిత్ షా క్లాస్ తీసుకున్నట్టు తెలిసింది. పరస్పర ఆరోపణలను పక్కనపెట్టి పార్టీ కోసం పని చేయాలని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. లోక్‌సభకు సన్నద్ధం కావడంతో పాటు నేతల మధ్య మెరుగైన సమన్వయానికి కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డికి ఆదేశించినట్టు సమాచారం. జరిగిందేదో జరిగింది... 10 ఎంపీ స్థానాలు గెలిచేలా.. ఇక జరిగిందేదో జరిగింది.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం తెలంగాణ నుంచి 10 ఎంపీ స్థానాల్లో గెలుపొందేలా నాయకులంతా విభేదాలన్నీ పక్కన పెట్టి సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నలుగురు సిట్టింగ్ ఎంపీలకే మళ్లీ పోటీకి అవకాశం కల్పిస్తామని, మిగిలిన సీట్లలో నాయకుల గెలుపు అవకాశాలపై నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను నిర్ణయిస్తామని చెప్పారని అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసినట్టు సమాచారం. -
ఇవి కాంగ్రెస్ అనుకూల ఫలితాలు కావు
సాక్షి, హైదరాబాద్, ఇబ్రహీంపట్నం రూరల్: ఇటీవల ముగిసిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా వచ్చినవి కావనీ, అవి కేవలం కేసీఆర్ సర్కార్, నాటి అధికార బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పు అని బీజే పీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్లేషించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ వంటిదేమీ పనిచేయలేదని, బీఆర్ఎస్కు వ్యతిరేక తీర్పుతో తెలంగాణ కుటుంబ పాలన నుంచి విముక్తి పొందినట్టు అయ్యిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబపాలన, అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు ఇది అని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ అంటే కేవలం కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కవిత మాత్రమే కనిపించే వారని, అందుకే ప్రజలు తిప్పికొట్టి ఫాంహౌస్‌కే పరిమితం చేశారని వ్యాఖ్యానించారు. అయితే కేసీఆర్ కంటే కాంగ్రెస్ ఏమీ తక్కువ కాదనీ, కాంగ్రెస్ దోపిడీ, అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ అవిశ్రాంత పోరాటం కొనసాగిస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ ఇప్పటికే మునిగిన పడవ కాగా, కాంగ్రెస్ మునిగిపోతున్న నావ అని, ప్రసుతమున్న పరిస్థితుల్లో కేంద్రంలో బీజేపీ మూడోసారి కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందనే ధీమా వ్యక్తం చేశారు. గురువారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని శ్లోక కన్వెన్షన్ సెంటర్లో జరిగిన పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా మాట్లాడారు. రా్రష్ఠంలో బీజేపీ అధికారంలోకి రాకపోయినా బీసీవర్గాల అభ్యున్నతికి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కట్టుబడి ఉందని తెలిపారు. అలాగే ఇతర రాష్ట్రాల్లోనూ బీసీ సీఎం నినాదానికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. మోదీకి పది ఎంపీ సీట్లు బహుమతిగా ఇవ్వండి లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి 10 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని పార్టీ శ్రేణులను కోరారు. ఆ మేరకు వచ్చే ఎన్నికల్లో తెలంగాణ నుంచి 35% ఓటింగ్ సాధించి పది ఎంపీ సీట్లు గెలిచేలా కృషి చేస్తామంటూ పార్టీ మండల అధ్యక్షులు ఆపై రాష్ట్రస్థాయి వరకు నాయకులందరితో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే సీటు గెలిస్తే ఐదేళ్లలో 8 స్థానాలకు పెరిగామని, 8 స్థానాల నుంచి మళ్లీ వచ్చే అసెంబ్లీ నాటికి 95 స్థానాలకు బీజేపీ పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే వరకు వస్తూనే ఉంటా ’’గురువారం నేను హైదరాబాద్‌కు వస్తున్నపుడు ఇద్దరు జర్నలిస్టులు మళ్లీ తెలంగాణకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేదాకా మళ్లీ మళ్లీ రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువసార్లు వెళ్తాను’’అని వారికి సమాధానం ఇచ్చానని అమిత్ షా చెప్పారు. ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో నాయకులు, కేడర్‌లో నిరాశ రావడం సహజమేనని, ఐతే బీజేపీ ఎన్నికల కోసమే పోరాడే పార్టీ కాదని, దేశం కోసం, భరతమాత కోసం పోరాడే పార్టీ అని స్పష్టం చేస్తున్నానని చెప్పారు. ’’1950నాటి నుంచి బీజేపీ ఎన్నో ఎన్నికల్లో పోటీచేసింది, అనేకసార్లు డిపాజిట్లు కూడా కోల్పోయింది, రెండుసీట్ల నుంచి 300కు పైగా సీట్లతో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన చరిత్రను సొంతం చేసుకుంది.. నాడు వచ్చిన ఫలితాలతో నిరాశ చెంది ఉంటే ఈ స్థాయి ఫలితాలు సాధించగలిగే వాళ్లమా’’అని ఆయన ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లోనూ 300కు పైగా సీట్లు సాధించి వరుసగా మూడోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతోందన్నారు. ఆ సంకల్పం తీసుకోండి ’’గుజరాత్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ముందు జరిగిన ఎన్నికల్లో 9% ఓట్లు సాధించింది.. ఆ తర్వాత మూడింట రెండు వంతుల మెజారిటీతో అధికారానికి వచ్చింది.. దాంతో పోలిస్తే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో 14% ఓటింగ్ వచ్చినందున, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడా మూడింట 2వంతుల మెజారిటీతో పార్టీ అధికారంలోకి వచ్చేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సంకల్పం తీసుకోవాలి’’అని అమిత్‌షా పిలుపునిచ్చారు. పీఎంగా మోదీ.. రాహుల్..మీకు ఎవరు కావాలి? వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థులుగా మోదీ, రాహుల్‌గాంధీ ఉంటే ఎవరు ప్రధాని కావాలి అంటూ అమిత్ షా అడగ్గా.. మోదీ.. మోదీ అని శ్రేణులు బిగ్గరగా అరిచి మరీ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మోదీ గెలుపు చారిత్రక అవసరమని, ప్రజల్లోకి వెళ్లి మళ్లీ మోదీని గెలిపిద్దామని కోరుతూ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, జాతీయ కార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్ బలపరుస్తూ మాట్లాడగా దానిని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ సత్తా చూపిస్తాంః కిషన్‌రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ సత్తా చూపిస్తామని చెప్పారు. కచ్చితంగా డబుల్ డిజిట్ సంఖ్యలో ఎంపీలను గె లుస్తామని చెప్పారు. జాతీయ ప్రధానకార్యదర్శులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, బండి సంజయ్, జాతీ య ఉపాధ్యక్షురాలు పార్లమెంటరీ బో ర్టు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, ఎంపీలు అర్వింద్ ధర్మపురి, సోయం బాపూరావు, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, పార్టీనేతలు పొంగులేటి సుధాకరరెడ్డి, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు. బీజేఎల్పీ నేత ఎన్నిక వాయిదా ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పాయల్ శంకర్, రామారావు పాటిల్, జైపాల్‌రెడ్డి, డా.పాల్వాయి హరీ‹Ùబాబును రాష్ట్ర నేతలు అమిత్ షాకు పరిచయం చేశారు. వారిని ఆయన అభినందించారు. ఐతే సమావేశానంతరం అమిత్‌షా సమక్షంలో సమావేశం నిర్వహించి బీజేఎల్పినేతను ఎన్నుకోవాల్సి ఉండగా సమయాభావం వల్ల జరగలేదు. మరోసారి వచ్చినప్పుడు నిర్ణయిద్దామని రాష్ట్ర పార్టీనేతలకు చెప్పిన అమిత్ షా గురువారం రాత్రి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యరు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా చార్మినార్/దూద్‌బౌలి: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గురువారం మధ్యాహ్నం చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం ట్రస్టీ శశికళ ఆలయ మర్యాదలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం జరిగిన సామూహిక పూజ హారతిలో ఆయన పాల్గొన్నారు. -
పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలి
సాక్షి,హైదరాబాద్: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, రాహుల్ గాందీని ప్రధాన మంత్రిని చేయాలని టీపీసీసీ నేతలు పిలుపునిచ్చారు. గురువారం గాంధీ భవన్లో 139వ అఖిల భారత జాతీ య కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, సేవా దళ్ వందేళ్ల ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లు జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసన్, పార్టీ ఫిషరీస్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ జెండాను మహేశ్‌కుమార్‌గౌడ్ ఆవిష్కరించగా.. సేవాదళ్ ర్యాలీని జగ్గారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు మా ట్లాడుతూ, 1885లో బొంబాయిలో 72 మందితో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ.. నేడు 140 కోట్ల ప్రజల హృదయాలను గెలుచుకుందన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల్లో జాతీయ భావాన్ని రేకెత్తించి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిందన్నారు. స్వాతంత్య్రం వచి్చన తర్వాత ఒకవైపు ప్రజల కనీస అవసరాలు తీర్చడం, మరోవైపు దేశాన్ని పటిష్టం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేసిన సేవలను ప్రజలు మరవలేరన్నారు. సోనియా గాం«దీ, పీవీ, మన్మోహన్సింగ్ లాంటి వారు దేశం కోసం నిరంతరం శ్రమించారన్నారు. మంత్రి జూపల్లి శుభాకాంక్షలు భారత్.. ప్రపంచంలో సగర్వంగా నిలబడిందంటే కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకున్న సాహసోపేత నిర్ణయాల వల్లెనని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేశారు. మతతత్వ శక్తుల చేతిలో దేశం బందీగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. -
సన్నద్ధతపై సుదీర్ఘంగా
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల దిశగా సన్నద్ధ తను వేగవంతం చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కసరత్తు ముమ్మరం చేసింది. శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రి హరీశ్‌రావు గురువారం నందినగర్‌లోని నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జరిగిన ఈ సమావేశంలో.. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, కాంగ్రెస్, బీజేపీల సన్నద్ధత, ఎత్తుగడలు, వాటిపై పైచేయి సాధించడం, ఆయా పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు తదితర అంశాలపై చర్చించారు. కాగా ఆయా అంశాలపై కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక, అంగబలంతో పాటు బలమైన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను రెండు పార్టీలు బరిలోకి దించుతాయని బీఆర్ఎస్ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ సిట్టింగ్ ఎంపీలతో పాటు గత ఎన్నికల్లో ఓటమి పాలైన అభ్యర్థులకు మళ్లీ అవకాశం ఇస్తే ఎంత మేరకు పోటీ ఇవ్వగలరనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటిస్తే ఎదురయ్యే లాభ, నష్టాలపైనా మదింపు జరుగుతోంది. టికెట్‌పై కొందరికి సంకేతాలు చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం సిట్టింగ్ ఎంపీలు క్షేత్ర స్థాయిలో పని చేసుకునేందుకు కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల్లో గతంలో పోటీ చేసిన ఓటమి పాలైన బోయినపల్లి వినోద్ కుమార్, కల్వకుంట్ల కవిత, గెడాం నగేశ్‌కు కూడా టికెట్ దాదాపు ఖాయం కావడంతో వారు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఇలా కచ్చితంగా టికెట్ ఇవ్వాలని భావించిన నేతలకు మాత్రమే సంకేతాలు ఇచ్చి పార్టీ కేడర్‌ను సమన్వయ పరుచుకోవాల్సిందిగా సమాచారం ఇస్తున్నారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక, పార్టీ స్థితిగతులపై సర్వే సంస్థల నివేదికలతో పాటు వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారాన్ని క్రోడీకరిస్తున్నట్లు తెలిసింది. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందడంతో కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంది. అక్కడి నుంచి కేసీఆర్ బరిలోకి దిగుతారా లేక గతంలో ఇచ్చిన హామీ మేరకు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డికి టికెట్ ఇస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఆధిక్యం కనబరిచిన మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్‌సభ స్థానాలకు ఆచితూచి అభ్యర్థులను ఎంపిక చేయాలని కేటీఆర్, హరీశ్‌తో జరిగిన భేటీలో కేసీఆర్ అభిప్రాయపడినట్లు తెలిసింది. జనవరి 3 నుంచి జనంలోకి పార్టీ కేడర్‌తో అసెంబ్లీ నియోజకవర్గాలు లేదా నియోజకవర్గంలోని మండలాల వారీగా ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జనవరి 3వ తేదీ నుంచి క్షేత్ర స్థాయి కార్యకలాపాలు ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. సుమారు నెల రోజుల పాటు క్షేత్ర స్థాయిలో సమావేశాలు ముమ్మరంగా జరిగేలా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. కాగా ఫిబ్రవరి రెండో వారం నుంచి కేసీఆర్ స్వయంగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశముందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. -
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఖాయం
సాక్షి, హైదరాబాద్: సాధారణ ఎన్నికల తర్వాత ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ కాలం చెల్లిన మందులాంటి (ఎక్స్పైర్డ్ మెడిసిన్)వారని, ఆయన వచ్చే ఎన్నికల తర్వాత షెడ్డుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ 150 రోజులు, దాదాపు 4 వేలకు పైగా కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేశారని, ఆ స్ఫూర్తితోనే కర్ణాటకలో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధించిందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ తర్వాత మహారాష్ట్రలో రాహుల్ ప్రవేశించారని, వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ పార్టీ గెలుపు తథ్యమని జోస్యం చెప్పారు. నాగ్‌పూర్‌లో గురువారం జరిగిన కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ బీజేపీ డబుల్ ఇంజిన్ అని పదేపదే చెబుతోందని, డబుల్ ఇంజిన్ అంటే మోదీ, అదానీ అని రేవంత్ విమర్శించారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్లో అదానీ గురించి నోరు విప్పగానే ఆ ఇంజిన్ ఆగిపోయిందని ఎద్దేవా చేశారు. మోదీ ఎప్పుడూ చప్పన్ ఇంచ్ ఛాతీ అని గొప్పలు చెప్పుకుంటారని, కానీ ఆయన నేతృత్వంలో నడుస్తున్న లోక్‌సభలోనే ఒక సామాన్యుడు ప్రవేశించి హంగామా చేస్తుంటే ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. ‘మోదీ జీ..మీరు ఒక సామాన్య వ్యక్తిని పార్లమెంట్‌లోకి రాకుండా ఆపలేకపోయారు. రేపు ఎర్రకోట మీద కూడా కాంగ్రెస్ జెండా ఎగరకుండా ఆపడం కూడా మీతరం కాదు..’ అని అన్నారు. జనవరి 14 నుంచి రాహుల్‌గాంధీ ‘భారత్ న్యాయ యాత్ర’ మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు కొనసాగుతుందని, దీనితో మోదీ ఇంజిన్ షెడ్డుకు వెళ్లక తప్పదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందామని, పార్టీ శ్రేణులు వచ్చే ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయాలని రేవంత్ విజ్ఞప్తి చేశారు. -
ప్రజల బాగు ప్రతిపక్షాలకు ఇష్టం లేదు
అబ్దుల్లాపూర్‌మెట్: ప్రజలు బాగుండటం ప్రతిపక్షాలకు ఇష్టం లేదనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేయకుంటే బాగుండని బీఆర్ఎస్ కోరుకుంటోందని, అలాంటి ఆశలు నిజం కానివ్వబోమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు. అలాంటి పగటి కలలను కనడం బీఆర్ఎస్ మానుకోవాలని సూచించారు. ఆరు గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ గ్రామంలో స్థానిక ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం జరిగిన డిసెంబర్ 28నే ఆరు గ్యారంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ చేపట్టడం శుభపరిణామంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల చేత, ప్రజల కోసం ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. మా పార్టీలోకి వస్తేనే పథకాలు.. అలాంటి బెదిరింపులు ఉండవు తెలంగాణ రాష్ట్ర బిడ్డలైతే చాలు ఆరు గ్యారంటీ పథకాల్లో అవకాశం కల్పిస్తామని ఈ విషయంలో ఎలాంటి రాజకీయ పక్షపాతం ఉండదని ఆయన తేల్చిచెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా మా పార్టీలోకి వస్తేనే.. మా పార్టీ కండువాలు కప్పుకుంటేనే.. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పడం వంటిæ బెదిరింపులు కాంగ్రెస్ పాలనలో ఉండవని భట్టి స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వంలో రెవెన్యూ, పోలీస్తో పాటు ప్రతి వ్యవస్థ నా కోసమే ఉందన్న భావన ప్రతి పౌరుడికి కలిగిస్తామని చెప్పారు. పదేళ్లుగా మగ్గిపోయిన ప్రజలకు ఇప్పుడే ఊపిరి కోరి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరక పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో మగ్గిపోయారని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు రేషన్ కార్డులు, ఇళ్లు మంజూరు చేయకుండా గత ప్రభుత్వం దుర్మార్గపు పాలన కొనసాగించిందని విమర్శించారు. పదేళ్లుగా కాంగ్రెస్ పోరాటాలతో ప్రజలను చైతన్యవంతులను చేసి ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చిందని, ఇప్పుడు అర్హులైన అందరికీ న్యాయం జరుగుతుందని భరోసానిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన గంటలోపే రాష్ట్ర మహిళలందరికీ ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం కల్పించామని గుర్తు చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాజీవ్ ఆరోగ్యశ్రీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీ రాజ్ కమిషనర్ హనుమంతరావు, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కమిషనర్ శృతిఓజా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గౌతం పొట్రు, రాచకొండ సీపీ సుధీర్‌బాబు పాల్గొన్నారు. -
‘బీఆర్ఎస్ మునిగింది.. కాంగ్రెస్ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉంది’
సాక్షి, హైదరాబాద్: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే.. ఐదేళ్లలో ఎనిమిది స్థానాలకు పెరిగామని, 8 స్థానాల నుంచి మళ్లీ వచ్చే అసెంబ్లీ నాటికి 95 స్థానాలకు బీజేపీ పుంజుకుంటుందని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, మజ్లిస్‌తో అంటకాగిన కేసీఆర్ ఫాం హౌజ్‌కి పరిమితమయ్యారు. కేసీఆర్ కంటే కాంగ్రెస్ ఏం తక్కువ కాదు. కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద అవినీతి కుటుంబ పార్టీ. ఆ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందన్నారు. ‘బీఆర్ఎస్ మునిగింది.. కాంగ్రెస్ మునిగిపోయేందుకు సిద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సారి తెలంగాణ లో కనీసం 10 లోక్ సభ స్థానాలు గెలవాలి. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 35 శాతం ఓటింగ్ టార్గెట్ అన్న అమిత్‌షా.. 10 లోక్ సభ స్థానాల్లో గెలిచేలా కృషి చేస్తామని కేడర్‌తో అమిత్ షా ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ అభివృద్ధికి గత 9 ఏళ్లలో 9 లక్షల కోట్లు కేంద్రం సహకారం అందించిందని, ఎస్సీ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందని అమిత్ షా స్పష్టం చేశారు. ఇదీ చదవండి: TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్ -
TS: బీజేపీ ముఖ్య నేతలకు అమిత్‌షా క్లాస్
సాక్షి, హైదరాబాద్: ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయకండి.. పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలంటూ తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు ఆ పార్టీ అగ్రనేత అమిత్‌షా క్లాస్ పీకారు. పార్టీ ముఖ్య నేతలతో అమిత్‌షా సమావేశం హాట్‌హాట్ సాగింది. నేతల మధ్య గ్యాప్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది.. ఇది రిపీట్ కావొద్దంటూ షా హెచ్చరించారు. ఎంపీ టికెట్ ఆశావహులు, వారి బలబలాలపైన ఆరా తీసిన అమిత్ షా.. సిట్టింగ్ ఎంపీలకు అదే స్థానంలో పోటీ చేసేందుకు గ్రీన్ స్నిగల్ ఇచ్చారు. నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై కూడా ఆయన ఆరా తీశారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి నోవాటెల్ హోటల్‌కు చేరుకున్న అమిత్‌షా.. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపైనా ఆయన రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించారు. ఇదీ చదవండి: శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి.. -
వెన్నుపోట్లు.. కత్తిపోట్లు! ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆసక్తికర రాజకీయం..
సంగారెడ్డి: 'ఈ ఏడాది ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఇటీవల జరిగిన హోరాహోరీగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి జిల్లాలోనూ తన బలాన్ని పెంచుకుంది. ఈసారి రెండు మంత్రి పదవులు కూడా దక్కడం గమనార్హం. బీఆర్ఎస్ పార్టీ కూడా తన పట్టును నిలుపుకుంది. బీజేపీ ఈసారి ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా కోల్పోయింది. పలు పార్టీ నేతలు ఒక పార్టీ నుంచి మరోపారీ్టకి మారడంపోటీలో నిల్చున్న అభ్యర్థులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకోవడం చూశాం. ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన కత్తిదాడి రాష్ట్రంలో సంచలంగా మారింది.' – సాక్షిప్రతినిధి, సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రేసులోకి వచి్చంది. 11 అసెంబ్లీ స్థానాలకు నాలుగు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకొని నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది. అందోల్, నారాయణఖేడ్, మెదక్, హుస్నాబాద్‌లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అంతకు ముందు కేవలం ఒక్క సంగారెడ్డిలోనే కాంగ్రెస్ ప్రాతినిధ్యం వహించింది. బీఆర్ఎస్ కూడా ఏడు చోట్ల విజయం సాధించింది. సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్, నర్సాపూర్, గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. ‘స్థానిక'ంలో అవిశ్వాసాల జోరు.. స్థానిక సంస్థల్లో అవిశ్వాసాల రగడ ఈ ఏడాదే షురువైంది. మున్సిపాలిటీలు, సహకార సంఘాల చైర్మన్ పదవులపై సభ్యులు అవిశ్వాస తీర్మాణాల నోటీసులు ఇచ్చారు. సంగారెడ్డి, అందోల్, సదాశివపేట్, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్లపై అవిశ్వాసం పెడుతూ కౌన్సిలర్లు నోటీసులు ఇచ్చారు. ఎన్నికల ముందు ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే ఆయా చైర్మన్లు రాష్ట్ర అత్యున్నత న్యాయాస్థానాన్ని ఆశ్రయించడంతో అవిశ్వాసాల రగడం కొన్ని నెలలు సద్దుమనిగింది. ఎన్నికల అయిన వెంటనే మళ్లీ బల్దియాల్లో అవిశ్వాసాల లొల్లి షురువైంది. ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఈ అవిశ్వాసాల తీర్మాణాలు నెగ్గుతాయా? లేదా? అనే దానిపై కొత్త సంవత్సం 2024లో తేలనుంది. పార్టీలు మారిన నేతలు.. ఎన్నో ఏళ్లుగా ఆయా పార్టీల్లో కొనసాగిన నేతలు ఈ ఏడాది జరిగిన ఎన్నికల వేళ పార్టీలు మారారు. రాత్రికి రాత్రే కండువాలు మర్చారు. ప్రధానంగా కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది నేతలు బీఆర్ఎస్లో చేరారు. పార్టీలు మారిన ముఖ్యనేతల్లో టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఉన్న గాలి అనిల్‌కుమార్, మెదక్ డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జహీరాబాద్‌కు చెందిన నరోత్తం, టీపీసీసీ కార్యదర్శి మ్యాడం బాలకృష్ణ వంటి నాయకులంతా ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ను వీడారు. రెండు మంత్రి పదవులు.. కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కాయి. అందోల్ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సిలారపు దామోదర రాజనర్సింహకు అమాత్య పదవి వరించింది. గత ప్రభుత్వ హయాంలో సిద్దిపేట నుంచి ప్రాతినిథ్యం వహించిన హరీశ్‌రావు మంత్రిగా కొనసాగిన విషయం విధితమే. అయితే మాజీ మంత్రి హరీశ్ రావు పోర్టు పోలియో వైద్యారోగ్యశాఖ ప్రస్తుత మంత్రి దామోదర రాజనర్సింహకు దక్కడం గమనార్హం. ఉమ్మడి జిల్లా నుంచి సీఎం పదవి చేజారిపోయింది. గజ్వేల్ నుంచి రెండు పర్యాయాలు ప్రాతినిథ్యం వహించిన కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ఎల్పీ నేతగా కొనసాగే అవకాశాలున్నాయి. రెండు చోట్ల పోటీ చేయగా గజ్వేల్‌లో గెలిచారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్‌కు క్యాబినేట్లో చోటు దక్కింది. గతంలో సీఎం కేసీఆర్ మంత్రిగా పనిచేసిన రవాణాశాఖ ఈసారి పొన్నంకు దక్కడం గమనార్హం. ఉన్న ఒక్క స్థానాన్ని కోల్పోయిన బీజేపీ గత ఎన్నికల్లో దుబ్బాక నుంచి గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్‌రావు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆ పారీ్టకి ఉన్న ఒక్క ఎమ్మెల్యే స్థానం కోల్పోవాల్సి వచ్చింది. 2020లో జరిగిన ఉప ఎన్నికల్లో రఘునందన్‌రావు బీజేపీ అభ్యరి్థగా గెలుపొందిన విషయం విదితమే. మరోవైపు ఉమ్మ డి జిల్లాలో ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు ఘోర పరాజయం పాలైన విషయం విదితమే. ఒకరిద్దరు మినహా మిగిలిన అందరికి కనీసం డిపాజిట్లు రాకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజల్లో కనీసం పట్టులేని అభ్యర్థులను బరిలోకి దించడంతో కనీసం వార్డు కౌన్సిలర్‌కు వచ్చే ఓట్లన్ని కూడా ఆయా నియోజకవర్గాల్లో సాధించలేకపోయింది. కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తిదాడి! రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం.. అక్టోబర్ 30న మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న అప్పటి మెదక్ ఎంపీ, ప్రస్తుత దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డిపై దుండగుడు కత్తితో దాడి చేయడంతో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థిగా నియోజకవర్గంలోని సూరంపల్లిలో ఎన్నికల ప్రచారం చేస్తున్న కొత్త ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి నమస్తే సార్ అంటు మిరుదొడ్డి మండలం చేప్యాలకు చెందిన గటాని రాజు వచ్చి ఒక్కసారిగా కత్తితో పొడిచాడు. వెంటనే అక్కడున్న పోలీసులు, ప్రజలు రాజును పట్టుకొని దేహశుద్ధి చేశారు. కత్తి దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో సంచలనంగా మారింది. కత్తి దాడిలో గాయపడ్డ ప్రభాకర్‌రెడ్డి ప్రత్యేక అంబులెన్స్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో దుబ్బాకకు వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా 53 వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇవి చదవండి: వైద్యుడి నుంచి.. శాసన సభ్యుడి వరకు.. -
ప్రజాపాలన దరఖాస్తు.. ఏర్పాట్లపై రాజాసింగ్ సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజాపాలన పేరుతో ఆరుగ్యారంటీలకు దరఖాస్తులను నేటి నుంచి ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల కోసం ప్రజలు కొన్ని చోట్ల బారులు తీరుతున్నారు. మరికొన్ని చోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా గోషామహల్, మంగళ్‌హాట్ నియోజకవర్గంలో అభయ హస్తం ప్రజాపాలన కార్యక్రమాన్ని రాజాసింగ్ పరిశీలించారు. ఈ క్రమంలో ప్రజాపాలన ఏర్పాట్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డు కార్యాలయాల్లో ప్రజలకు దరఖాస్తు ఫామ్స్ ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు దరఖాస్తులు ఇవ్వకుండా బయట జిరాక్స్ షాప్‌లో తెచ్చుకోవాలని, ఒక్కో దరఖాస్తుకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. దరఖాస్తు దాఖలు కోసం మరికొన్ని రోజులు గడువు ఇవ్వాలని కోరారు. ఇది కూడా చదవండి: పార్టీతో సంబంధం లేకుండా సంక్షేమ పథకాలు: భట్టి -
Telangana: భాగ్య లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా
Amit Shah Tour At Hyderabad LIVE Updates ► కొంగరకలాన్ బయలుదేన కేంద్ర మంత్రి అమిత్ షా ► చార్మినార్ భాగ్య లక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అమిత్ షా ► అమిత్ షాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు ► భాగ్య లక్ష్మీ అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు ► శంషాబాద్ నోవొటెల్ నుంచి ఛార్మినార్ బయల్దేరిన అమిత్ షా ► బీజేపీ ముఖ్య నేతలతో ముగిసిన అమిత్ షా సమావేశం ► బీజేపీ ముఖ్యనేతలకు అమిత్ షా క్లాస్ ► ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ పార్టీకి నష్టం చేయకండి ► పార్లమెంట్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలి ► నేతల మధ్య గ్యాప్ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతీసింది. ఇది రిపీట్ అవ్వొద్దు ► తెలంగాణలో లోక్ సభ సిట్టింగ్ ఎంపీలు అదే స్ధానంలో పోటీ చేసేందుకు అమిత్ షా గ్రీన్ సిగ్నల్. ► నాలుగు ఎంపీ స్థానాలు మినహా మిగిలిన స్థానాల్లో పార్టీ పరిస్థితిపై అమిత్ షా ఆరా ► కాసేపట్లో చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెళ్లనున్నారు. ►శంషాబాద్ నోవాటెల్ హోటల్ నుంచి మరికాసేపట్లో కేంద్ర హోం మంత్రి బయలుదేరనున్నారు. ►అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్న అమిత్ షా. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు. ►భాగ్యలక్ష్మి టెంపుల్ నుంచి నేరుగా కొంగరకలాన్‌లోని శ్లోక ఫంక్షన్ హాల్‌కు అమిత్ షా వెళ్లనున్నారు. ► శంషాబాద్ నోవోటెల్లో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమావేశం అయ్యారు. ► సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్, బండి సంజయ్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, రాష్ట్ర ఇంచార్జ్ అరవింద్ మీనన్, గరికపాటి మోహన్ రావు, చాడా సురేష్ రెడ్డి,పొంగులేటి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు. ► కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ నుంచి ఆయన నోవాటెల్ హోటల్‌కు వెళ్లనున్నారు. అదే విధంగా చార్మినార్ భాగ్య లక్ష్మీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. కొంగరకలాన్‌లో బీజేపీ నిర్వహిస్తున్న విస్తృత స్థాయి సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. సమావేశ అనంతరం ఆయన కొత్తగా గెలిచిన ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. -
చేవెళ్ల బీజేపీ అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి..?
సాక్షి, రంగారెడ్డిజిల్లా: పార్లమెంట్ ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ.. చేవెళ్ల పార్లమెంట్ నియోజ కవర్గంలో మాత్రం ఎన్నికల వేడి రాజుకుంది. సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇస్తూ బీఆర్ఎస్ అధిష్టానం ఊహాగానాలకు చెక్‌పెట్టగా, ఎలాగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఆశావహులు పోటీపడుతున్నారు. చేవెళ్ల కేంద్రంగా రాజకీయ వ్యూహాలు రచిస్తున్నా యి. ఇటీవల మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి సహా ఈ అసెంబ్లీ టికెట్ ఆశించి, చివరి నిమిషంలో భంగపడిన పారిజాత నర్సింహారెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డికి అతి సన్నిహితుడైన ఎలుగింటి మధుసూదన్‌రెడ్డి సహా మరికొంత మంది నేతలు పోటీ పడుతున్నారు. బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పోటీకి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ఆయన ఆ పార్లమెంట్ స్థానం పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ పట్టు సాధించేందుకు యతి్నస్తున్నారు. తనకంటూ ఓ ప్రత్యేక కేడర్‌ను తయారు చేసుకుని ముందుకెళ్తున్నారు. ఆ ఆంతర్యం ఏమిటో? నియోజకవర్గాల పునరి్వభజనలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం 2009లో ఏర్పడింది. ఈ పార్లమెంట్ పరిధిలో తాండూరు, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. తొలి ఎన్నికల్లో దివంగత సూదిని జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి విజయం సాధించారు. రెండోసారి పోటీకి ఆ యన ఆసక్తి చూపలేదు. 2014లో ఎన్నికల్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇక్కడి నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి కారుగుర్తుపై పోటీ చేసిన రంజిత్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడి నుంచి ఒకసారి విజయం సాధించిన వారు.. రెండోసారి పోటీకి పెద్దగా ఆసక్తి చూపిన దాఖలాలు లేవు. పోటీ చేసిన వారు ఓటమి పాలయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్‌సభా స్థానాలుండగా, ఆ పార్టీ అధిష్టానం కేవలం చేవెళ్ల లోక్‌సభ స్థానానికే అ భ్యరి్థని ప్రకటించడం వెనుక ఉన్న ఆంత ర్యం ఏమిటనేది అంతు చిక్కడం లేదు. అనేక సవాళ్లు అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీ రంజిత్‌రెడ్డి వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్చార్జిగా వ్యవహరించారు. అక్కడ బీఆర్ఎస్ ఓటమి పాలైంది. చేవెళ్ల అభ్యరి్థకి అండదండగా నిలిచినప్పటికీ.. కేవలం 268 ఓట్లతోనే బీఆర్ఎస్ గట్టెక్కింది. రాజేంద్రనగర్ నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించినట్లు అప్పట్లోనే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ను పక్కన పెట్టి.. ఆయన సొంతంగా పలు కార్యక్రమాలు చేశారు. మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి తన తనయుడికి చేవెళ్ల నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారిద్దరూ ఆయన గెలుపునకు కృషి చేస్తారా? అంటే అనుమానమే. దీనికి తోడు శేరిలింగంపల్లి, మహేశ్వరం, రాజేంద్రనగర్‌లో బీజేపీ బలంగా ఉంది. వికారాబాద్, పరిగి, తాండూరులో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఇచి్చన హామీ మేరకు బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీ పూర్తికాలేదు. గత ప్రభుత్వం జీఓ నంబర్ 111 ఎత్తి వేసినట్లు చెపుతున్నా.. సాంకేతికంగా ఇప్పటికీ జీఓ అమల్లోనే ఉంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయన మళ్లీ నెగ్గుకొస్తారా? అంటే వేచి చూడాల్సిందే. -
శ్వేత-స్వేద పత్రాలు కాదు కావాల్సింది! మరి..
తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ల మధ్య పత్రాల యుద్దం మరీ రక్తి కట్టించినట్లు అనిపించదు. ప్రభుత్వం బీఆర్ఎస్ పై ఏవో కొన్ని ఆరోపణలు చేయడానికే శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు కనిపిస్తుంది. దానికి సమాధానంగా బీఆర్ఎస్ విడుదల చేసిన స్వేదపత్రం తమ ప్రభుత్వంపై వచ్చిన విమర్శలకు సమాధానం కన్నా,సెంటిమెంట్ ప్రయోగానికే ప్రాధాన్యత ఇచ్చినట్లుగా ఉంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్దిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన ఆర్దిక, విద్యుత్ శాఖల శ్వేతపత్రాలలో గత ప్రభుత్వం చేసిన తప్పులను ఎండగట్టే యత్నం చేశారు. విద్యుత్ ఆర్ధిక రంగంలో వివిధ శాఖల ద్వారా ,కార్పొరేషన్ ల ద్వారా చేసిన అప్పులను ఆయన వివరించారు. మొత్తం మీద 6.71 లక్షల కోట్ల అప్పులు గత ప్రబుత్వం చేసిందని లెక్కగట్టారు. ✍️కాని ఆ అప్పులు వినియోగించిన తీరు, దాని వల్ల మంచి జరిగిందా?లేదా? ఎక్కడ లోపం జరిగింది?దానివల్ల తెలంగాణకు ఏ రకంగా నష్టం వాటిల్లింది అనేదానిపై స్పష్టంగా మాట్లాడినట్లు కనబడదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రస్తుతం అప్పులు చేయక తప్పని స్థితి. ఆ అప్పులు ఏ రకంగా తెచ్చారు? వాటికి ఎంత వడ్డీ చెల్లించాలి?కరోనా వంటి క్లిష్ట పరిస్థితి ఏర్పడినప్పుడు అప్పులు లేకుండా ప్రభుత్వం ఎలా నడవాలి అన్న ప్రశ్నలకు సమాదానం లేదు. పోనీ తాము అప్పులు తేబోమని కాని, అప్పులు తెచ్చినా ఫలానా అందుకే వినియోగిస్తామని కాని భట్టి విక్రమార్క చెప్పలేకపోయారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు చూస్తే కొన్ని కొంత అభ్యంతరకరంగానే కనిపిస్తాయి. నీళ్లు అమ్మి అప్పులు కడతామని వేల కోట్ల అప్పు తేవడం ఆశ్చర్యంగానే ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో మంచినీటిని రెండువేల లీటర్ల వరకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. దీనితో వాటర్ వర్క్స్ సంస్థ ఆర్దిక పరిస్థితి కుదేలు అయ్యే ప్రమాదం ఏర్పడింది. ✍️ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం దానిని మార్చగలుగుతుందా?అన్నది అనుమానమే. ప్రైవేటు సంస్థలు అప్పులు తెచ్చేటప్పుడు ఏదో రకంగా బ్యాంకర్లను ఒప్పించేందుకు రకరకాల అబద్దాలు చెబుతుంటాయి.అంకెలను పెంచి ప్రాజెక్లు రిపోర్లులు ఇస్తుంటాయి. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చేసిందన్న భావన కలుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు లక్ష కోట్ల అప్పు తేవడం విశేషం. అది ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటే దానికి అంత అప్పు అయినా ఫర్వాలేదు. ఆ అప్పు పూర్తిగా సద్వినియోగం అయి ఉంటే మంచిదే. కాని అక్కడే పలు సందేహాలను ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. దీనికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక బారేజీ కుంగడం బీఆర్ఎస్ కు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. విద్యుత్ రంగానికి సంబందించిన శ్వేతపత్రంలో కూడా ఆయా బకాయిల గురించి భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో ప్రభుత్వ సంస్థల బకాయిలే ముప్పైవేల కోట్ల వరకు ఉన్నాయి. ✍️ప్రభుత్వమే అతిపెద్ద బాకీదారుగా ఉంటే ప్రజలు మాత్రం విద్యుత్ బిల్లులు సకాలంలో ఎందుకు చెల్లిస్తారు?దీనిపై ప్రభుత్వ వివరణ ఇచ్చి ఉండాల్సింది. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ మెంట్ ఆఫీస్ లకు సంబంధించి బకాయిలను ఎప్పటికప్పుడు తీర్చివేస్తామని ఎందుకు చెప్పలేకపోయిందన్నది ప్రశ్న. లిఫ్ట్ ఇరిగేష్ స్కీములకు సంబంధించి పెద్ద ఎత్తున సుమారు 15 వేల కోట్ల వరకు పెండింగులో ఉండడం ఊహించిందే.కాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం అవి బయటపడకుండా కప్పిపుచ్చింది.డిస్కంలకు సంబంధించి ఎనభైఒక్కవేల కోట్ల మేర అప్పులు,నష్టాలు చూస్తే ఆ వ్యవస్థ కోలుకోవడం ఎలా అన్న ప్రశ్న వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు మాత్రం విద్యుత్ సరఫరాలో దాదాపు కోత లేకుండానే అందించింది. విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయని గతంలో కాంగ్రెస్ ఆరోపించేది. కాని శ్వేతపత్రంలో దానికి ఆధారాలు చూపించలేదు. ✍️గత ప్రభుత్వం చత్తీస్ గడ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినప్పుడు అక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. అయినా అక్రమాలు జరిగాయని భట్టి విక్రమార్క చెబుతారా! కొత్త విద్యుత్ ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని విక్రమార్క చేసిన ఆరపణలపై మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి సవాల్ చేయడం, దానిపై న్యాయ విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. అందులో ఏమి బయటపడుతుందన్నది ఇప్పుడే చెప్పలేం.ఈ శ్వేతపత్రాలు ఇవ్వడంలో తప్పు లేదు.కాని గత ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలను కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉన్న రోజులోల చేసినవే.రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలిసినా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల పేరుతో అలవిగాని హామీలను ఎలా ఇచ్చిందన్నదానికి జవాబు దొరకదు. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయల సాయం,200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ,గ్యాస్ బండ ఐదువందల రూపాయలకే ఇవ్వవలసి ఉంది.రైతు భరోసా గా తక్షణం ఎకరాకుపదిహేనువేల రూపాయల చొప్పు ఆర్ధిక సాయం అందించవలసి ఉంది. ✍️దళిత బంధు వంటి భారీ స్కీములు ఉండనే ఉన్నాయి. అన్ని స్కీములకు కలిపి అయ్యే వ్యయం నమూడు లక్షల కోట్లపైనే ఉంటుందన్నది ఒక అంచనా . ప్రభుత్వం వీటికి ఎంత వ్యయం అవుతుది అన్నదాని గురించి కూడా ఏమైనా పత్రాలు విడుదల చేస్తుందా అన్నది డౌటే. ఈ స్కీముల అమలులో ఎలాంటి కోత పెడతారో చూడాలి.ప్రజాపాలన పేరుతో ఈ స్కీములు కావాల్సిన వారు నమోదు చేసుకోవాలని అనడమే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. ఎన్నికల మానిఫెస్టోలో అలా చెప్పారా అన్నది ప్రశ్న.ఏపీలో వలంటీర్ల వ్యవస్థ ద్వారా అర్హులందరికి స్కీములు అమలు చేస్తున్నారు. ఇక్కడ కూడా వలంటీర్ల వ్యవస్థను పెడతామని గతంలో ఒక సందర్భంలో రేవంత్ అన్నారు. బస్‌లలో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ నిలబెట్టుకున్నప్పటికీ, దాని వల్ల ఆర్టిసికి ఎంత నష్టం వాటిల్లిందన్నది చెప్పాలి. ✍️దానిని ఎలా భర్తీ చేస్తారు? ఈ స్కీము వల్ల ఆటోలు,క్యాబ్ ల వారికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం ప్రత్యామ్నాయం ఏమి చూపుతుంది?ఇలాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి.గత ప్రభుత్వం ఆర్దిక నిర్వహణ సరిగా లేదు కనుక తాము స్కీములు అమలు చేయలేకపోతున్నామంటే ప్రజలు అంగీకరించకపోవచ్చు. వందరోజుల తర్వాత కాంగ్రెస్ జవాబు ఇవ్వక తప్పనిస్థితి ఏర్పడుతుంది. ఇక కేటీఆర్ స్వేదపత్రం పేరుతో ప్రభుత్వానికి జవాబు ఇచ్చినప్పటికీ, అందులో అతిశయోక్తులు కూడా బాగానే ఉన్నట్లు అనిపిస్తుంది. ఆరులక్షల కోట్లలో ప్రభుత్వ అప్పు మూడున్నరలక్షల కోట్లేనని, మిగిలినవి గ్యారంటీల కింద తెచ్చిన అప్పులని అన్నారు. ఏ అప్పు అయినా ఒకటే అని అనుకుంటారు. పదమూడు లక్షల కోట్లు వ్యయం చేస్తే ఏభై లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ చెబుతున్నారు. ✍️ఆ సంపద నిజంగానే ప్రజలకు ఉపయోగపడితే సంతోషమే. ఆ సంపద ద్వారా ఆదాయం వస్తున్నట్లయితే ఇన్ని వేల కోట్ల బకాయిలు ఎందుకు పెండింగులో ఉన్నది వివరించాలి. ప్రభుత్వం శ్వేతపత్రంలో వెల్లడించిన వాటికి సమాధానం లేనప్పుడు కేటీఆర్ సెంటిమెంట్ ప్రయోగించారు. రాష్ట్రం అప్పుల పాలైందని పదే,పదే ప్రభుత్వం చెబితే తెలంగాణ పరపతి దెబ్బతింటుందని, తెలంగాణ అస్తిత్వం నిలబడిందంటే దానికి కేసీఆర్ కారణమని కేటీఆర్ అంటున్నారు. ప్రభుత్వపరంగా చూస్తే కేసీఆర్ పాలన మరీ అద్వాన్నం అని అనలేకపోయినప్పటికీ, కొన్ని విషయాలలో మితిమీరి వ్యవహరించడం వల్ల నష్టపోయారన్నది వాస్తవం. నిజానికి వారు చెబుతున్నదాని ప్రకారం అంత స్వేదం చేసి సంపాదించి ఉంటే ప్రజలు ఎందుకు అర్ధం చేసుకోలేకపోయారు?వారిని ఎందుకు ఓడించారు?కేవలం రాజకీయ కారణాలతోనే ఓటమిపాలయ్యారా?లేక ప్రభుత్వంలో జరిగిన తప్పుల వల్ల కూడానా అన్నది వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ✍️అప్పుడు కేసీఆర్ మరీ అతిగా వెళ్లకుండా ఉంటే ఇప్పుడు ఈ ఓటమి ఎదురయ్యేది కాదు. అలాగే కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంపై అన్నిటిని నెట్టేసి కాలం గడుపుదామన్నా కుదరదు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు ఎప్పటికప్పుడు పెంచుతున్నది రాజకీయ పార్టీలే. వాటిని నెరవేర్చకపోతే ప్రజలు వెంటనే స్పందించే అవకాశం కూడా ఉంటుంది. వారికి కావల్సింది శ్వేతపత్రాలు,స్వేదపత్రాలు కాదు. రాజకీయ పార్టీలు తాము విడుదల చేసిన ఎన్నికల పత్రాలలోని వాగ్దానాలను నెరవేర్చడం. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
నేడు పార్టీ నేతలతో అమిత్‌షా కీలక చర్చలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఫలితాలపై సమీక్ష, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట అంశాలపైనా ఆయన రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 12.05కి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు, అక్కడి నుంచి 12.20కి సమీపంలోని నోవాటెల్ హోటల్‌కు వస్తారు. 1.45 వరకు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతారు. భోజనానంతరం మధ్యాహ్నం 2 గంటలకు నగర శివార్లలోని కొంగర కలాన్ శ్లోక కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. 2.10 నుంచి 3.00 గంటల వరకు బీజేపీ నేతలతో జరిగే తొలి విడత భేటీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తారు. పోటీ చేసిన పార్టీ అభ్యర్థులు, ఎన్నికైన 8 మంది ఎమ్మె ల్యేలతో గెలుపోటములను ప్రభావితం చేసిన అంశాలపై షా చర్చిస్తారు. 3 నుంచి 4.30 గంటల వరకు రెండో విడత భేటీలో లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్ర పార్టీ సన్నద్ధతపై చర్చించి దిశానిర్దేశం చేయనున్నారు. ఈ భేటీలో పార్టీ మండల/డివిజన్ అధ్యక్షులు మొదలుకుని జాతీయ స్థాయి నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నట్టు సమాచారం. అమిత్ షా సాయంత్రం 5కి తిరిగి హో టల్‌కు చేరుకుని 5.30 వరకు పార్టీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అనంతరం ఆయన చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. -
తెలంగాణ కొత్త పీసీసీపై కాంగ్రెస్ ఫోకస్.. భట్టికా.. బీసీకా?
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ)కి కొత్త అధ్యక్షుడి ఎంపికపై దృష్టి సారించిన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కొత్త ఏడాది తొలినాళ్లలో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది. మరో మూడు నెలల్లో జరుగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పది, పదిహేను రోజుల్లోనే కొత్త అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది. దీనికై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు, రాష్ట్ర ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణచేసిన హైకమాండ్ పెద్దలు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఒక పేరును, బీసీ సామాజిక వర్గం నుంచి నలుగురి పేర్లను పరిశీలిస్తోంది. కష్టకాలంలో నిలబడిన తనను గుర్తించాలంటున్న భట్టి ఏఐసీసీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు పరిశీలనలో ఉందని తెలుస్తోంది. కర్ణాటకలో డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం పదవితో పాటే పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిన మాదిరే తనకు కూడా ఆ పదవి ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత సోనియాగాంధీని కలిసిన సమయంలో ఇదే విషయాన్ని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. పీసీ సీ అధ్యక్షుడిగా మల్లు అనంతరాములు చేసిన సేవలతో పాటు సీఎల్పీ నేతగా తా ను కష్టకాలంలో నిలబడిన తీరును పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లుగా సమాచారం. బీసీ వర్గానికే ఎక్కువ చాన్స్... ప్రస్తుతం ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గం, ఉప ముఖ్యమంత్రి ఎస్సీ సామాజిక వర్గం అయినందున పీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు బీసీ సామాజిక వర్గానికి కట్టబెట్టాలనే డిమాండ్ సైతం బలంగా ఉంది. దీనిని పరిగణనలోకి తీసుకుంటున్న హైకమాండ్ బీసీ వర్గానికి చెందిన మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్,మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతరావు పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పొన్నం ఇప్పటికే మంత్రిగా కొనసాగుతుండటం, మధుయాష్కీ ఇటీవలే ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన దృష్ట్యా, మహేశ్ గౌడ్, వీహెచ్‌ల పేర్లపై చర్చ జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఆ ఇద్దరిలో ఒకరికి రేవంత్ మద్దతు? ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం మహేశ్ గౌడ్, వీహెచ్లలో ఒకరికి మద్దతుగా నిలుస్తున్నారని సమాచారం. మొత్తంగా ‘జనవరి రెండో వారానికల్లా తెలంగాణకు కొత్త అధ్యక్షుడు రావొచ్చు. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ పరిశీలన చేస్తోంది. బీసీ సామాజిక వర్గ నేతను ఎంపిక చేసేందుకు ఎక్కువ అవకాశాలున్నాయి’అని ఏఐసీసీలోని కీలక నేత ఒకరు వెల్లడించారు. -
‘ఇండియా కూటమి’తో దేశ సమగ్రతకు ముప్పు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, ఆ పార్టీ నేతృత్వంలోని కూటమితో దేశ సమగ్రతకు ముప్పువాటిల్లుతోందనీ దేశ ప్రజ లు ఈ విషయంపై ఆలోచించాలని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ‘ఇండియా కూటమి’అహంకారాన్ని ఆదిలో నే అడ్డుకుని సరైన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరుతూ బుధవారం ఆయన బహిరంగ ప్రకటన చేశారు. సనాతన ధర్మానికి, హిందుత్వానికి, హిందీ మాట్లాడే ప్రజలకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ పనికిరాని కూటమి రోజురోజుకూ ప్రమాదంగా మారుతోందని ధ్వజమెత్తారు. మెజారిటీ ప్రజల విశ్వాసాన్ని, అస్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహ రి స్తోందని నిందించారు. ఇటీవలే కాంగ్రెస్ కూటమిలోని డీఎంకే నాయకుడు.. యూపీ, బిహార్ నుంచి వచ్చే హిందీ మాట్లాడే వాళ్లు, తమిళనాడుకు టాయిలెట్లు కడిగేందుకు వస్తారని చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపా యని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాలకు చెందిన కార్మికులు.. శ్రమనే నమ్ముకుని జీవనోపాధి కోసం దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారిని ఇంత నీచంగా అవమానించాల్సిన అవసరం ఉందా? అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. శ్రమజీవులను అవమానించడం, కష్టపడి పనిచేసేవారిని అవహేళన చేయడం కాంగ్రె స్కు, వారితో అంటకాగుతున్న వారికి మొదట్నుంచీ అలవాటేనని ఆరోపించారు. అధికారంలోకి వస్తే హిందువులను నిర్మూలించాలనే వారి ఆలోచన ఇటీవలే పార్లమెంటులో చర్చ సందర్భంగా.. రాజకీయ స్వార్థంతో కడుపునిండా ద్వేషాన్ని నింపుకుని ఓ ఎంపీ మాట్లాడారని కిషన్‌రెడ్డి నిందించారు. గోమూత్రాన్ని తాగే రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందన్న ఆ ఎంపీ అహంకార పూరితమైన మాటలను యావత్ సమాజం తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. డీఎంకే పార్టీ సనాతన ధర్మాన్ని కేన్సర్, డెంగ్యూ, మలేరియాతో పోల్చడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. కొంతమంది కుహనా లౌకికవాదులు అహంకారపూరితంగా నోటికొచ్చినట్లు మాట్లాడటమే మేధావితనమని, గొప్పతనమని అనుకుంటున్నారని విమ ర్శించారు. ప్రతిసారీ హిందుత్వం, పేద ప్రజలపై తమ అక్కసును వెళ్లగక్కడం ద్వారా.. 2024 ఎన్నికలకు తమ ఎజెండాను ఈ కూటమి స్పష్టం చేసిందని తెలిపారు. అధి కారంలోకి వస్తే హిందుత్వాన్ని, హిందువులను నిర్మూలించడమే ఆ కూటమి ఆలోచన అని అర్ధమవుతోందని కిషన్‌రెడ్డి ఆరోపించారు. -
ఓడిన అభ్యర్థులే ఇన్చార్జులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) క్షేత్ర స్థాయిలో పార్టీ బాధ్యతల అప్పగింతపై దృష్టి సారించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది గెలుపొందగా, 80 చోట్ల పార్టీ ఓటమి పాలైన విషయం తెలిసిందే. కాగా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల వారికే బాధ్యతలు అప్పగించింది. అలాగే పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాల్లో లోక్‌సభ ఎన్ని కల దిశగా పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేసే బాధ్యతను ఓడిన అభ్యర్థులకే అప్పగించింది. ఓటమి పాలైన నేతల్లో ఎక్కువమంది మాజీ శాసనసభ్యులే ఉండటంతో వీరినే నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిలుగా ప్రకటించారు. నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్సీలు, ఇతర కీలక నేతలు, కేడర్‌ను సమన్వయం చేసే బాధ్యతను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఏ లోక్‌సభ నియోజకవర్గానికి ఎవరు అభ్యర్థి అనే అంశంతో సంబంధం లేకుండా నియోజకవర్గాల వారీగా ముఖ్య నేతలు, కేడర్‌తో సమావేశాలు ఏర్పాటు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు నియోజకవర్గ ఇన్చార్జిలను ఆదేశించారు. లోక్‌సభ సెగ్మెంట్ల వారీగా సమీక్ష రాష్ట్రం నుంచి 17 మంది ఎంపీలు లోక్‌సభలో ప్రాతినిథ్యం వహిస్తుండగా ఇందులో బీఆర్ఎస్కు చెందిన వారు 9 మంది ఉన్న విషయం తెలిసిందే. వీరంతా సమావేశాలకు అందుబాటులో ఉండాల ని తుంటి ఎముకకు శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సుమారు వారం రోజుల క్రితం ఆదేశించారు. అయితే వైద్యుల సూచన నేపథ్యంలో ఈ భేటీలు వాయిదా పడినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ పార్టీ యంత్రాంగాన్ని లోక్‌సభ ఎన్నికల దిశగా సన్నద్ధం చేయడంపై కసరత్తు కొనసాస్తున్నారు. చేవెళ్ల, కరీంనగర్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ నియోకవర్గాల నుంచి పోటీ చేసే అభ్యర్థులపై పార్టీ అధినేత స్పష్టత ఇవ్వడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కార్యాచరణపై దృష్టి కేంద్రీకరించారు. చేవెళ్ల లోక్‌సభ సెగ్మెంట్ (సిట్టింగ్ ఎంపీ రంజిత్‌రెడ్డి) పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలతో రెండురోజుల క్రితమే సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రాతినిథ్యంలేని నియోజకవర్గాలపై నజర్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఒక్క సెగ్మెంట్లోనూ గెలవని లోక్‌సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. హైదరాబాద్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్కు ప్రాతినిథ్యం లేకుండా పోయింది. భువనగిరి, వరంగల్, మహబూబాబాద్ సెగ్మెంట్ల పరిధిలో పార్టీకి కేవలం ఒక్కో ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు. ఆదిలాబాద్, జహీరాబాద్, నాగర్‌కర్నూల్ పరిధిలో ఇద్దరు, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలో ముగ్గురేసి చొప్పున బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయా లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్ఎస్ తరఫున గెలిచిన, ఓటమి పాలైన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, సాధించిన లేదా కోల్పోయిన మెజారిటీ, ప్రభావం చూపిన అంశాలు, పార్టీ యంత్రాంగం పరిస్థితిపై ఇప్పటికే పోస్ట్‌మార్టం జరిగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా ఈ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలో పార్టీ యంత్రాంగాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు అవసరమైన కార్యాచరణపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన నియోజకవర్గాల్లో కేటీఆర్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ పైనా కసరత్తు జరుగుతోంది. -
మిగిలిన రూ.99,999 కోట్లూ పంచాల్సిందే... : సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘ప్రజావాణికి వచ్చిన ఓ మహిళ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదని, నేను రూ.లక్ష ఇచ్చి పరిష్కరిస్తున్నా అని కేటీఆర్ అన్నట్టు పత్రికల్లో వచ్చింది. నీ రూ.లక్ష కోట్లలో రూ.లక్షను మెడలు వంచి పేదలకు ఇప్పించామంటే ప్రజావాణి విజయవంతమైనట్టే కదా. అక్రమంగా సంపాదించిన రూ.లక్ష కోట్ల నుంచి రూ.లక్షను ఒక మహిళకు ఇవ్వగలిగాం. ఇంకా రూ.99,999 కోట్లు కేటీఆర్ వద్ద ఉన్నాయి. వాటినీ పంచాల్సిన పరిస్థితిని కల్పిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు, ఛత్తీస్‌గఢ్ విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణంపై న్యాయ విచారణకు ఆదేశిస్తూ ఇప్పటికే ఉత్తర్వులిచ్చాం. ఈ విచారణలో తేలే అంశాల ఆధారంగా రెవెన్యూ రికవరీ చట్టం కింద తిరిగి వసూలు చేస్తాం..’.’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. చార్లెస్ శోభరాజ్‌ను అడిగినా తాను ఏ తప్పు చేయలేదని అంటాడని, కాళేశ్వరం ప్రాజెక్టు కుంగడంలో ఎల్అండ్టీ, హరీశ్‌రావు, కేటీఆర్, ఇతర అధికారుల పాత్ర విచారణలో తేలుతుందని చెప్పారు. ‘వాళ్ల దగ్గర ఉన్న ఆస్తి ప్రజల రక్తమాంసాలను పీల్చి పిప్పి చేసి సంపాదించుకున్నది. ఈరోజు వాళ్లు తినేది ప్రజల రక్తపు కూడు..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాపాలనపై బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బావాబామ్మర్దుల తాపత్రయమే.. ‘శాసనసభలో బావాబామ్మర్దుల (కేటీఆర్, హరీశ్) తాపత్రయం తప్ప ఒక్క సభ్యుడైనా వీరికి మద్దతుగా లేచి మాట్లాడాడా? వాళ్లిద్దరే ఆరాటపడుతున్నారు. రోళ్లకల్లి నిప్పులు చిమ్మేలా వెనకటికి ఇద్దరు దంచుతున్నారట. ఆ దంచడం చూసి అందరూ అ బ్బా..ఏం దంచుతున్నారు అ ని చప్పట్లు కొట్టుతున్నారట. ఓ అరగంట తర్వాత ఓ ము సలావిడ అక్కడినుంచి పో తూ ఆ రోళ్లో జొన్నలు, సజ్జలు లేవు. ఎంత దంచ్చి నా అలసిపోవడం తప్ప వచ్చేది ఏం లేదని చెప్పిందట. అసెంబ్లీలో కూడా హరీశ్, కేటీఆర్ దంచుడు అలానే ఉంది..’అంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. భవనాలను కూల్చడం ఆస్తుల సృష్టి కాదు ‘ఉపయోగపడేవాటన్నింటినీ కూల్చి మళ్లీ కట్టారని శ్వేతపత్రంలో చెప్పాం. సచివాలయం భవనాలను కూల్చకుండా కిరాయి భవనాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్పత్రులను తరలించడానికి అవకాశం ఉంది. ఒకవేళ అచ్చిరాలేదంటే ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చి కొత్తగా ఖాళీ జాగాలో సచివాలయం కడితే ఉపయోగపడేది. అన్ని రకాల వసతులతో ఉన్న భవనాలను కూలగొట్టి కొత్తవి కట్టి ఆస్తి సృష్టించినం అంటున్నారు. 22 ల్యాండ్ క్రూజర్లను కొని దాచిపెట్టారు నేను కొత్త వాహనాలను కొనొద్దు అని అధికారులకు చెప్పా. పాతబళ్లకు మరమ్మతులు చేయాలని నేను అంటుంటే..22 ల్యాండ్ క్రూజర్లను కొని విజయవాడలో దాచిపెట్టామని ఓ అధికారి చెప్పాడు. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే తెద్దాం అనుకున్నాం కానీ ఆయన నెత్తిమీద దర్రిదం ఉండి ఇంటికి పోయిండు అని అన్నాడు. మూడోసారి కూడా వస్తాననుకుని కేసీఆర్ తనతో పాటు తన మందిమాగధుల కోసం ఒక్కో బండికి రూ.3 కోట్లు పెట్టి కొన్నారు. ఆయన సృష్టించిన సంపద అలాంటిది. ఆ వాహనాలు ప్రభుత్వ ఆస్తి. తీసుకోకుంటే ఎక్కడికిపోతాయి? కావాలంటే మీకు (జర్నలిస్టులకు) ఇస్తాం. అలా రౌండ్ కొట్టి రండి..’అంటే సీఎం ఛలోక్తి విసిరారు. ఆ అధికారుల సమాచారం మా వద్ద ఉంది ‘వరంగల్‌లో సైనిక్ స్కూల్ అర్ధాంతరంగా ఎందుకు ఆగిపోయింది? ఐటీఐఆర్ కోసం అడగలేని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ బుల్లెట్ ట్రైన్ కోసం మేము ప్రధానిని అడగలేదని సుద్దులు చెప్తున్నాడు. గత ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం ఇస్తున్న అధికారుల సమాచారం మా వద్ద ఉంది. నిన్నటి వరకు మీరే మంత్రులు కదా. షాడో టీమ్స్ ఎందుకు? (కొత్త ప్రభుత్వ పనితీరును గమనించేందుకు షాడో టీమ్స్ ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చేసిన ప్రకటనను విలేకరులు గుర్తు చేయగా రేవంత్ ఇలా స్పందించారు) మా కొడంగల్, ఇతర ప్రాంతాల్లో కల్తీ కల్లు దొరకనప్పుడు బాధితులు పిచ్చిపిచ్చి చేష్టలు చేస్తే కుటుంబ సభ్యులే మంచానికి తాళ్లతో కట్టేస్తారు. అధికారం పోయిన కేటీఆర్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌తో అలా మాట్లాడుతున్నాడు. కొంత కాలం అతన్నీ తాళ్లతో మంచానికి కట్టాల్సిన పరిస్థితి ఉంటది. అప్పుడే అది ఇవ్వలేదని, ఇది ఇవ్వలేదని బావాబామ్మర్దులు తోక తెగిన బల్లిలా దుంకుతున్నారు. గత రెండేళ్లుగా డిసెంబర్ 22 నుంచి మార్చి 31 మధ్యనే రైతుబంధు వేశారు. మేం ఈసారి డిసెంబర్ 9నే ప్రారంభించాం..’అని రేవంత్ చెప్పారు. త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు ప్రస్తుత చైర్మన్, సభ్యుల రాజీనామాలను నాలుగైదు రోజుల్లో గవర్నర్ ఆమోదిస్తారు: సీఎం రేవంత్ వెల్లడి త్వరలోనే టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు రానుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 6, 7 తేదీల్లో గ్రూప్– 2 పరీక్షలు నిర్వహిస్తామని గతంలో టీఎస్పీఎస్సీ ప్రకటించిన నేపథ్యంలో ఈ పరీక్షల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని బుధవారం సచివాలయంలో మీడియా ప్రశ్నించగా, సీఎం ఈ విధంగా స్పందించారు. ‘టీఎస్పీఎస్సీ ద్వారా పోటీ పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటన, ఉద్యోగ నియామక పత్రాల జారీకి చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ జరగదు. న్యాయపరంగా, చట్టరీత్యా చెల్లుబాటు కాదు. చైర్మన్, సభ్యుల రాజీనామాపై గవర్నర్ నాలుగు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు. గతంలో ఇదే సంస్థపై వచ్చిన ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునేందుకు ఆమె రాష్ట్రపతి అనుమతి కోరారు. న్యాయనిపు ణుల సలహాలు తీసుకుని రాజీనామాలను నాలుగైదు రోజుల్లో ఆమోదిస్తారు. ఆ వెంటనే కొత్త బోర్డు నియామకాలు చేపడతాం’’అని సీఎం స్పష్టం చేశారు. ‘మేనిఫెస్టోలో ప్రకటించిన క్యాలండర్ ప్రకారం సంవత్సరం తిరిగే లోపు డిసెంబర్ 9, 2024 నాటికి 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ఇక ఇప్పుడు అభ్యర్థులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు’అని సీఎం వ్యాఖ్యానించారు.