breaking news
-
ఇది కదా అసలు నిజం.. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చాక ఆర్థిక పరిస్థితిపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ రేవంత్ ప్రభుత్వంపై మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని కేటీఆర్ ట్వీట్ చేశారు.అయితే, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) నివేదిక ఈ వాదన తప్పని తేల్చిందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారానికి పాల్పడుతుందంటూ కేటీఆర్ మండిపడ్డారు. వాస్తవానికి, గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమేనని (4 నెలల్లో రూ.9,355 కోట్లు) పేర్కొన్నారుకాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర రుణ భారాన్ని ఎక్కువ చేసి చూపిస్తుందంటూ కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఈ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపాలని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజల జీవనం స్తంభించిపోయిందని కేటీఆర్ అన్నారు. ఈ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగిందని, ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకోకుండా, విలాసవంతమైన, లాభదాయకమైన ప్రాజెక్టులపై సమీక్షలు నిర్వహిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.ప్రతి నెలా రూ. 7,000 కోట్ల రుణ వడ్డీ చెల్లిస్తోందని పూర్తిగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు...గత నాలుగు నెలల్లో సగటు నెలవారీ వడ్డీ చెల్లింపు కేవలం రూ. 2,300 కోట్లు మాత్రమే - కేటీఆర్ కేసీఆర్ ప్రభుత్వం మీద కాంగ్రెస్ అబద్ధాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ 👇… pic.twitter.com/6vKlTipJbF— KTR News (@KTR_News) August 29, 2025రూ.3,50,000 కోట్ల 2036 ఒలింపిక్స్ నిర్వహణ, రూ.1,50,000 కోట్ల మూసీ సుందరీకరణ, రూ.225 కోట్ల హైదరాబాద్ బీచ్ ప్రాజెక్టుల గురించి చర్చలు జరుపుతున్నారని పేర్కొన్నారు. ప్రజల గోడును గాలికొదిలేసి, డబ్బు సంపాదించే పనులపైనే రేవంత్ అండ్ కో దృష్టి పెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. -
ఎట్ల చేద్దాం? అటు ఎర్రవల్లి ఫాంహౌస్‌కి బీఆర్ఎస్ లీడర్లు.. ఇటు బీజేఎల్పీ కీలక భేటీ
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంతో ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీలు కీలక సమావేశం నిర్వహిస్తున్నాయి. కాళేశ్వరం నివేదికపై అసెంబ్లీలో చర్చించడమే ప్రధాన ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సెషన్‌ను నిర్వహిస్తోందన్న సంగతి తెలిసిందే. అయితే కాళేశ్వరం అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ ఈ చర్చకు దూరంగా ఉంటారనే సంకేతాలు అందుతున్నాయి. ఈ తరుణంలోనే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఆయన కీలక నేతలతో భేటీ కాబోతున్నారు. అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ నేపథ్యంలో.. అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన దిశానిర్దేశం చేయబోతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు సహా బీఆర్ఎస్ సీనియర్ నేతలు పాల్గొనబోతున్నారు. నివేదికపై చర్చించేందుకు తమకు తగినంత సమయం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఇప్పటికే బీఆర్ఎస్ భావిస్తోంది.ఇక.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేఎల్పీ సమావేశం నడుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై చర్చిస్తున్నారు. అయితే మీటింగ్ మధ్యలో ఎమ్మెల్యేల ప్రయారిటీ అంశాన్ని కొందరు చర్చకు తెచ్చినట్లు తెలుస్తోంది. కేడర్ తీవ్ర అసంతృప్తిలో ఉందని.. రాష్ట్ర కమిటీలో తాము ఇచ్చిన పేర్లను పరిశీలించాలని ఎమ్మెల్యేలు రాంచందర్ రావు దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.కాళేశ్వరం కమిటీ నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు తెలంగాణ అసెంబ్లీ రేపటి నుంచి ప్రత్యేకంగా భేటీ కానుంది. శనివారం ఉదయం 10.30గం.లకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు నివాళులర్పించిన అనంతరం సభ వాయిదా పడే అవకాశం ఉంది. ఆపై బీఏసీ మీటింగ్ జరగనుంది. మధ్యాహ్నా సమయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. వీలును బట్టి.. నాలుగు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. -
కేటీఆర్, బండి సంజయ్ ఆప్యాయ పలకరింపు
సాక్షి,సిరిసిల్ల: తెలంగాణ రాజకీయాల్లో నేతల మధ్య మాటల తూటాలు పేలడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం అనునిత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించడం, రాజకీయ వేదికలపై ఘాటు విమర్శలు చేసుకోవడం సర్వ సాధారణం. అలా పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే ఈ రాజకీయ ప్రత్యర్థులు.. ఎదురుపడితే ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠకు తెరపడింది.గురువారం, తెలంగాణలోని సిరిసిల్ల జిల్లాలో వరద బీభత్సం నేపథ్యంలో కేటీఆర్ వరద బాధితులను పరామర్శించి తిరుగు ప్రయాణమయ్యారు. ఇదే సమయంలో, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా వరద ప్రాంతాలను సందర్శించేందుకు అక్కడికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో కేటీఆర్‌కు బండి సంజయ్ ఎదురుపడ్డారు. వీరిద్దరూ రాజకీయ విభేదాలను పక్కనపెట్టి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ హఠాత్ పరిణామం అక్కడ ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు రాజకీయాలకు అతీతంగా వెల్లివిరిసిన మానవత్వం అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు. విపత్తు సమయంలో నాయకుల మధ్య ఏర్పడిన ఈ సానుకూల పరిణామం, ప్రజల్లో మంచి సందేశాన్ని పంపించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.అంతకుముందు కేటీఆర్ మల్లారెడ్డిపేటలో వరద ప్రవాహాన్ని పరిశీలించి, సహాయక చర్యల్లో పార్టీ నేతలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. పంట నష్టానికి ఎకరానికి రూ.25,000, వరదల్లో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. FLOOD POLITICS - BJP STYLE Interesting how MoS Home Bandi Sanjay rushed to Sircilla constituency and not to Medak and Kamareddy which are very severely affected! Before even Bandi Sanjay reached Sircilla, BRS working president and Sircilla MLA KTR was already touring his… pic.twitter.com/FyxYJBzYQ2— Revathi (@revathitweets) August 28, 2025 -
తెలంగాణలో వర్ష బీభత్సం.. బీహార్ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్
సాక్షి,తెలంగాణ: ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షం హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో బీభత్స సృష్టిస్తోంది. వర్షం కారణంగా వాగులు,వంకలు,లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ ఎత్తున ఆస్తినష్టం సంభవించింది. వరద ధాటికి వరదనీరు పొంగిపొర్లుతుంది. వరద ప్రవాహాతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలు బిక్కుబిక్కుమంటూ ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకుని గడుపతున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలో వర్ష బీభత్సంపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారు. సీఎం మాత్రం తీరిగ్గా బీహార్‌లో ఎన్నికల యాత్ర చేస్తున్నారు. ఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసం..తెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం కాంగ్రెస్ అధిష్ఠానం ముందు మోకరిల్లిందిఅధిష్ఠానం ఆశీస్సులతో.. పదవులు కాపాడుకుని ఖజానా కొల్లగొట్టే ధ్యాస తప్పితే ఆరు గ్యారంటీలు..420 హామీల అమలు గురించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి సోయి లేదు. వరదలతో ప్రజలు..యూరియా దొరక్క రైతులు.. ఉద్యోగ నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారుచాలా చోట్ల వరదనీటిలో మునిగి ప్రజలు హెలికాప్టర్ సాయం కోసం ఎదురుచూస్తున్నారు.తెలంగాణ ప్రజల సొమ్ముతో ప్రైవేట్ జెట్లలో ఊరేగుతున్న కాంగ్రెస్ సీఎం, మంత్రులకు ఓలా, ఊబర్, ర్యాపిడో క్యాబ్‌ల కన్నా అధ్వాన్నంగా 100 కిలోమీటర్ల లోపు ప్రభుత్వ కార్యక్రమాలకు హెలికాప్టర్‌ను వినియోగిస్తున్న ఈ నేతలకు ఇప్పుడైనా హెలికాప్టర్ పంపి ప్రజల ప్రాణాలు రక్షించే తీరిక ఉందో,లేదో ?కాంగ్రెస్ నేతలారా.ఓట్లు కాదు..ప్రజల పాట్లు చూడండి..ఎన్నికలు కాదు..ఎరువుల కోసం రైతుల వెతలు చూడండి. వరదల్లో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది’అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారీ వర్షాలతో తెలంగాణ నీట మునుగుతున్నదిప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రజలు సాయం కోసం అర్థిస్తున్నారుసీఎం మాత్రం తీరిగ్గా బీహార్ లో ఎన్నికల యాత్ర చేస్తున్నాడుఎప్పుడొస్తాయో తెలియని బీహార్ ఎన్నికల కోసంతెలంగాణకు సంబంధమే లేని బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ సీఎం, మంత్రివర్గం… pic.twitter.com/AuZrpbwjN7— KTR (@KTRBRS) August 27, 2025 -
అందుకే ఫుట్‌బాల్ తీసుకొచ్చా: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ బీజేపీ ఫుట్ బాల్ పాలిటిక్స్‌లో ట్విస్ట్ చోటు చేసుకుంది. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి యూటర్న్ తీసుకున్నారు. ఆయన వ్యాఖ్యల ఆధారంగా ప్రచురితమవుతున్న అసంతృప్తి కథనాలను తోసిపుచ్చుతూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ బీజేపీ వ్యవహారంపై అసంతృప్తితోనే తాను ఫుట్‌బాల్ గిఫ్ట్ ఇచ్చినట్లు వస్తున్న కథనాలను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఖండించారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్ ఆడాలనే తీసుకొచ్చానంటూ ప్రకటించారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయింది. కాంగ్రెస్‌తోనే బీజేపీకి పోటీ. రేవంత్ మంచి ఫుట్‌బాల్ ప్లేయర్. అందుకే ఎలా ఆడుకోవాలో తెలియజేయడానికే ఫుట్‌బాల్ తీసుకొచ్చా. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్ ఆడుతాం అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీకి కానుకగా ఫుట్‌బాల్ ఇవ్వడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహారంపై విశ్వేశ్వర్‌రెడ్డి గుర్రుగా ఉన్నారని.. అధిష్టానం పెద్దలు ఒకరి దగ్గరకు వెళ్తే.. మరొకరి దగ్గరికి వెళ్లమంటూ ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారని.. ఈ నేపథ్యంలోనే ఇలా ఫుట్‌బాల్ ఇచ్చి నిరసన తెలిపారనే చర్చ నడిచింది.ఈ పరిణామంపై మాజీ బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సైతం స్పందిస్తూ.. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి మద్దతు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఫుట్‌బాల్స్ బయటకు వస్తాయంటూ తెలంగాణ బీజేపీ నేతలను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈలోపే కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఖండనకు దిగడం గమనార్హం.‘ఏదైనా విషయంపై మిమ్మల్ని కలిస్తే పార్టీ అధ్యక్షుడు రామచందర్రావును కలవమని, ఆయన్ను కలిస్తే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి అభయ్‌పాటిల్‌ను కలవమని చెబుతూ నన్ను ఫుట్‌బాల్ ఆడుకుంటున్నారు. అందుకే మీకు అదే బహుమానంగా ఇస్తున్నాను.. మంగళవారం కొండా చేసిన వ్యాఖ్యలు..ఇదీ చదవండి: ఎంత బాధ ఉంటే ఆయన అలా చేస్తారు? -
కిషన్‌రెడ్డికి ఆ అవసరమేంటి?.. రాజాసింగ్ హాట్ కామెంట్స్
తెలంగాణ బీజేపీ నేతలపై గోషామహల్(హైదరాబాద్) ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్లు చేశారు. తెలంగాణలో బీజేపీకి బీఆర్ఎస్, కాంగ్రెస్‌తో పోటీ లేదని.. బీజేపీలో బీజేపీ నేతలతోనే పోటీ నడుస్తోందని, అలాంటి పార్టీని ఇక్కడి నేతలే నట్టేట ముంచుతున్నారని వ్యాఖ్యానించారాయన. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడంపై స్పందిస్తూ రాజాసింగ్ ఓ వీడియో వీడియో విడుదల చేశారు. ఎంత బాధలో ఉంటే కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకులకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇస్తారు?. ఆయనతోనే కాదు.. గత 11 ఏళ్లుగా నాతో కూడా బీజేపీ నేతలు ఫుట్ బాల్ ఆడుకున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది ఎంపీ ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నాయకులు ఇదే మాదిరిగా పార్టీ నేతలకు ఫుట్ బాల్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం. కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంచి నాయకుడు. భారీ మెజార్టీతో గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్లమెంట్లో మీ వ్యక్తులను పెట్టి ఆయన్ని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు?. నా అసెంబ్లీ పరిధిలో కూడా కిషన్ రెడ్డి మనుషులను పెట్టీ నన్ను ఇబ్బంది పెట్టారు. వారికి నా ఏరియాలో పెట్టాల్సినటువంటి అవసరం కిషన్ రెడ్డికి ఏముంది?. తెలంగాణలో ఇక్కడున్న నేతలే బీజేపీని ముంచుతున్నారు. దీనిపై బిజెపి జాతీయ నాయకత్వం ఒక్కసారి రివ్యూ చేయాలి. మాకు బిఆర్ఎస్, కాంగ్రెస్ తో పోటీ కాదు. మా నాయకులతో మేమే కొట్లాడాల్సిన పరిస్థితి తెలంగాణ బీజేపీలో ఉంది. .. ఇతర పార్టీల మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు బీజేపీలో చేరతారని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అంటున్నారు. ఇది మంచి విషయమే అయినప్పటికీ మరి బీజేపీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి?. ఇతర పార్టీల నుంచి నాయకులను చేర్చుకోవాల్సిన అవసరం బిజెపికి లేదు. బిజెపిలో ఉన్న కార్యకర్తలకు ఫండ్ ఇచ్చి లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకుని మంచి నాయకులను తయారు చేస్తే సరిపోతుంది కదా!. బిజెపి కార్యకర్తలు నిరంతరం పార్టీ కోసం కష్టపడి లేబర్ గానే బతకాలా? అని రాజాసింగ్ ఆ వీడియోలో చెప్పారు.చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వినూత్న రీతిలో మంగళవారం నిరసనకు దిగారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు, ఆయా జిల్లాల్లోని పార్టీ వ్యవహారాలను పట్టించుకోవడం లేదని కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ విషయమై చర్చించేందుకు స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావును కలిశారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలవమని కొండాకు రాంచందర్ రావు సూచించారు. ఆయన్ను కలిస్తే రాష్ట్ర ఇన్ చార్జ్ అభయ్ పటేల్‌ను కలవాలని సూచించినట్టు తెలిసింది. అభయ్పటేల్ను కలిస్తే ఆయన మళ్లీ రాంచందర్ రావు, తివారిని కలవాలని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసుకు వచ్చి తివారికి ఫుట్ బాల్ ఇచ్చి నిరసన తెలిపారని చర్చ నడిచింది. -
ఒక్క తెలంగాణలోనే ఎస్ఐఆర్ ఎందుకు?
బీహార్‌లో మాదిరిగా తెలంగాణలోనూ ఓటరు జాబితాపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) జరుగుతుందన్న కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత జి.కిషన్ రెడ్డి ప్రకటన కీలకమైందే. రాజధాని హైదరాబాద్‌లోనే మూడు నుంచి నాలుగు లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని, సవరించేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోందని ఆయన తెలిపారు. తద్వారా ఎన్నికల వ్యవస్థలో ఉన్న అవ్యవస్థను ఆయన అంగీకరించినట్లయింది. బీహారులో ఎస్.ఐ.ఆర్ పేరుతో సుమారు 65 లక్షల ఓట్లు తొలగించడం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోకుండా ఓట్లను మాయం చేశారన్నది విపక్షం ఆరోపణ. తమకు అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించారని ఆర్జేడీ, కాంగ్రెస్‌లు ఆరోపిస్తూంటే... ఇతరదేశాల వారు అక్రమంగా ఓటర్ల జాబితాలోకి చేరి ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ, మిత్రపక్షాలు అంటున్నాయి. నిజానికి ఈ రెండింటిలో ఏది జరిగినా అది ప్రజాస్వామ్య బలహీనతలకు ఉదాహరణలవుతాయి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓట్చోరీపై మీడియా సమావేశంలో వెల్లడించింది మొదలు దేశంలో రాజకీయంగా వేడి పుంజుకుంది. ఓటర్ల జాబితాలోని లోపాలను ప్రజలకు ఎత్తి చూపే లక్ష్యంతో రాహుల్ బీహార్‌లో ఓట్ అధికార్ యాత్ర కూడా చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఓట్ల నమోదులో జరిగిన పలు అక్రమాలను వెలుగులోకి తీసుకు వచ్చారు. మహారాష్ట్రలో ఎన్నికలకు ముందు దాదాపు కోటి ఓట్లు అదనంగా చేర్చారని, అవన్ని బోగస్ ఓట్లని ఆయన ఆరోపించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులోఇన మహదేవపుర అసెంబ్లీ నియోజజకవర్గాన్ని నమూనాగా తీసుకుని ఆయన అక్కడ ఏ రకంగా లక్షకుపైగా ఓట్లను చేర్చింది సోదాహరణంగా వివరించారు. ఈ బోగస్ ఓట్లతోనే బీజేపీ, మహారాష్ట్ర అసెంబ్లీ, కర్ణాటక లోక్‌సభ ఎన్నికల్లో అధిక సీట్లు సాధించగలిగిందని రాహుల్ ఆరోపించారు. రాహుల్ విమర్శలకు ఎన్నికల సంఘం నేరుగా జవాబు ఇవ్వలేకపోయిందనే చెప్పాలి. అదే టైమ్‌లో బీహారులో తొలగించిన ఓట్లపై సుప్రీంకోర్టులో కూడా విచారణ జరిగింది. ప్రత్యేక విస్తృత ఓట్ల రివిజన్‌ను ఆమోదిస్తూనే సుప్రీంకోర్టు ఆధార్ కార్డును కూడా ఓటు నమోదుకు పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆయా రాజకీయ పక్షాల వారు ఎవరైతే ఓటు హక్కు కోల్పోయారని చెబుతున్నారో వారితో మళ్లీ దరఖాస్తు చేయించుకోవాలని సలహ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ఓట్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇది రాజకీయ వివాదం అయ్యే అవకాశం ఉంది. ప్రత్యేకించి కాంగ్రెస్, ఎంఐఎంలు దీనిని వ్యతిరేకించవచ్చు. అయితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఈ రివిజన్ జరుగుతున్న సమయంలో అప్రమత్తంగా ఉండే అవకాశం కూడా లేకపోలేదు. బీజేపీ సహజంగా ఎంఐఎం ఓట్లపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. పాతబస్తీలో పలు చోట్ల డబుల్ ఓట్లు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తుంటుంది. అందులో కొంత నిజం ఉండవచ్చు కూడా. పాతబస్తీలో అధికారులు ఏ మార్పు తీసుకు వచ్చినా చాలా ఇబ్బంది పడుతుంటారు. ఉదాహరణకు గతంలో అక్కడ విద్యుత్ బిల్లులు చెల్లించని వారి ఇళ్ల విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని ప్రయత్నిస్తే పెద్ద ఆందోళన వచ్చింది. స్థానికులు కొందరు అధికారులపై తిరగబడ్డారు. ఓట్ల విషయానికి వస్తే బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా స్థిరపడ్డ రోహింగ్యాల వంటివారు, పాకిస్తాన్ చెందినవారు కూడా పాతబస్తీలో అధికంగా ఉన్నారని, వారికి కూడా ఓట్లు ఉన్నాయని,వాటిని తొలగించాలని బీజేపీ చెబుతుంటుంది. నిజంగానే ఇతర దేశాలకు చెందినవారు కాని, అనర్హులైనవారు కాని ఓటర్ల జాబితాలో ఉంటే ఆ పేర్లను తొలగించడం తప్పు కాదు. కానీ ఆ ముసుగులో బీజేపీకి ఓటు వేయరన్న అనుమానం ఉన్న అర్హులైన ఓటర్లను కూడా తొలగిస్తే తప్పు అవుతుంది. తెలంగాణలో శాసనసభ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల గడువు ఉంది. ఇప్పుడు ఓట్ల రివిజన్ జరిగినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే రాజకీయ పార్టీలు దీనిపై దృష్టి పెట్టి అర్హులైన వారు ఎవరైనా ఓటు కోల్పోతే మళ్లీ చేర్చవచ్చు. బీజేపీ మతపరమైన విమర్శలను చేస్తుంటుంది. ఆ ప్రాతిపదికన ఓట్లు తొలగిస్తుందేమో అన్న భయం ఇతర పార్టీలకు ఉంది. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది కనుక, కింది స్థాయి అధికారులు వారి అదీనంలో ఉంటారు కనుక అలా ఇష్టం వచ్చినట్లు ఓట్లు తీసివేయడమో, చేర్చడమో జరుగుతుంటే పట్టుకోవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఓట్ల జాబితాను తమకు అనకూలంగా ఉండే విధంగా మార్చే ప్రయత్నిస్తే అది మరో వివాదం అవుతుంది. ఎన్నికల సంఘం నిజంగా ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయదలిస్తే ముందుగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ప్రజలలో, ప్రతిపక్ష పార్టీలలో ఉన్న అనుమానాలు తీర్చాలి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్‌లో గత శాసనసభ ఎన్నికలలో పోలింగ్ నాటికన్నా కౌంటింగ్ నాడు సుమారు 49 లక్షల ఓట్లు అధికంగా లెక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈవీఎంలపై అనుమానాలు చెలరేగాయి. కొందరు హైకోర్టుకు వెళ్లినా తేలలేదు. రాజకీయంగా కూడా ఫిర్యాదు చేసిన ఒక మాజీమంత్రిని దానిపై మరింత గొడవ చేయకుండా మేనేజ్ చేశారన్న అభియోగమూ లేకపోలేదు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో ఒక బృందం ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా వినతిపత్రం సమర్పించింది. కౌంటింగ్ నాడు అసంబధ్దంగా పెరిగిన 12.5 శాతం ఓట్ల ప్రభావం 88 నియోజకవర్గాలపై ఉందని వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, కేంద్ర ప్రభుత్వానికి కాని ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్నా, ఆయా రాష్ట్రాలలో ఇలాంటి ఆరోపణలపై స్పందించాలి. అందులో నిజం లేదని బహిరంగంగా రుజువు చేయాలి. ఈవీఎంలపై నిర్దిష్ట అనుమానాలు వచ్చాయి. ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులను పోల్చి లెక్కించడం, బ్యాటరీ ఛార్జ్‌లో అనుమానాలు రావడం, సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అధిక పోలింగ్ జరిగిందన్నట్లుగా లెక్కలు రావడం, దానికి సంబంధించిన సీసీ ఫుటేజీ ఇవ్వడానికి నిరాకరించడం, వీవీప్యాట్ స్లిప్పులను పది రోజుల్లోనే దగ్దం చేయడం వంటివి ఎన్నికల కమిషన్ నిజాయితీని శంకించేవిగా ఉన్నాయి. ఏపీ, తెలంగాణల్లో దొంగ ఓట్లు చేర్చడం అన్నది కొత్త కాదు. లక్షల మంది హైదరాబాద్‌లో నివసిస్తూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉంటున్నారు. వారికి తెలంగాణలో కూడా ఓట్లు ఉంటున్నాయి. ఎన్నికల రోజున వందల బస్సుల్లో, వేల కార్లలో హైదరాబాద్ నుంచి ఏపీకి బయల్దేరి వెళ్లడం ఇందుకు నిదర్శనం. అనేక జిల్లాలు, రాష్ట్రాలలో డబుల్ ఓట్ల సమస్య ఉంది. దీనికి శాశ్వత పరిష్కారం వెతక్కుండా ఎన్నికల కమిషన్ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు అనుగుణంగా వ్యవహరించడం పెద్ద సమస్యగా ఉంది. వారు కోరిన విధంగా ఎన్నికల సమయాల్లో పోలీసు అధికారులను బదిలీ చేయడం, కావల్సిన వారిని నియమించుకోవడం వంటివి కూడా జరిగాయి. ఇలాంటివాటి వల్ల ఎన్నికల కమిషన్ విశ్వసనీయత దెబ్బతింటోంది. ఒక్క తెలంగాణలో మాత్రమే స్పెషల్ రివిజన్ ఎందుకు చేయాలని తలపెట్టారో కిషన్ రెడ్డి చెప్పాలి. ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా వంటి రాష్ట్రాలలో కూడా చేస్తారా? అదనంగా చేరాయన్న దొంగ ఓట్లను తొలగిస్తారా? లేదా? లేక తమకు అనుకూలంగా లేని ఓటర్లను జాబితా నుంచి తొలగించడానికి ఈ రివిజన్‌ను వాడుతారా? ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఈ ఓటర్ల జాబితాలను తమకు అనుకూలంగా మలచుకోవడంలో చాలా అనుభవం ఉందని ప్రత్యర్ధి రాజకీయ పార్టీలు చెబుతుంటాయి. పశ్చిమ బెంగాల్లో బంగ్లా దేశీయులు అనేక మంది ఓటర్ల జాబితాలో చేరారని ఆ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఆరోపిస్తుంటుంది. ఏ రాజకీయ పార్టీ ఎలాంటి అక్రమాలకు పాల్పడకుండా, దొంగ ఓట్లను చేర్చకుండా, లేదా అసలైన ఓటర్లను తొలగించకుండా ఏమి చేయాలన్న దానిపై ఎన్నికల సంఘం నిర్దిష్ట ప్రతిపాదనలు చేయాలి. ఆధార్ కార్డును విదేశీయులకు జారీ చేశారన్న ఆరోపణలను ఎన్నికల సంఘం చేస్తోంది. అంటే మన దేశంలో ఒక వ్యవస్థకు, మరో వ్యవస్థకు సమన్వయం కొరవడుతోందన్నమాట. అమెరికా వంటి దేశాలలో కాన్పు జరిగి పుట్టిన రోజునే గుర్తింపు కార్డు ఇచ్చే సిస్టమ్ ఉంటుంది. మన దేశంలో కూడా అలాంటి పద్దతి వస్తే మంచిది. పుట్టిన రోజు సర్టిఫికెట్ ఆధారంగా వారికి నిర్ణీత ఏజ్ వచ్చాక ఆటోమాటిక్‌గా ఓటింగ్ హక్కు ఇచ్చే విధంగా సాఫ్ట్వేర్ సిద్ధం చేసుకోవడం వంటివి చేయవచ్చేమో పరిశీలించాలి. ఓటర్ల జాబితాలలో అక్రమాలు నిజంగా ఎక్కడ జరిగినా తప్పే.వీటన్నిటిని అరికట్టడానికి ఒక స్పష్టమైన విదానాన్ని రూపొందించనంత కాలం ఓటర్ల జాబితాపై ఆరోపణలు వస్తూనే ఉంటాయి. మరి దీనికి పరిష్కారం ఎప్పటికి వస్తుందో!::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్థానిక ఎన్నికలపై డైలమా!
సాక్షి, హైదరాబాద్/ న్యూఢిల్లీ: రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికల విషయంలో డైలమా ఏర్పడింది. వాయిదా వేద్దామా? ప్రభుత్వ పరంగా బీసీలకు 42% కోటాపై జీవో ఇచ్చి ముందుకు వెళదామా అన్న దానిపై అధికార కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై జాతీయ స్థాయి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్‌తో కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చర్చలు జరిపినప్పటికీ ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పీసీసీ నియమించిన మంత్రుల బృందం ఇచ్చే నివేదిక కీలకం కానుంది. మంత్రుల బృందం చేసే సిఫారసును ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మరోసారి కూలంకషంగా చర్చించిన తర్వాతే దీనిపై ఓ స్పష్టత వస్తుందని ప్రభుత్వ, కాంగ్రెస్ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఎటూతేల్చుకోలేక..!: పంచాయతీ ఎన్నికలను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశం ఎంతకీ తేలకపోవడం ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి సమస్యగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మెజారిటీ మంత్రులు ఎన్నికలకు వెళ్దాం అనే ఆలోచనలో ఉన్నారు. కానీ పార్టీలోని బీసీ నాయకత్వం రిజర్వేషన్ల కల్పనపై మాట నిలబెట్టుకుని ఎన్నికలకు వెళ్తే బాగుంటుందని సూచిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ మొదటి నుంచి 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే ఎన్నికలనే ఆలోచనతో ఉన్నారు. ఈ తర్జనభర్జనల నేపథ్యంలోనే న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగానే రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు పీసీసీ నియమించిన ఐదుగురు మంత్రుల బృందం ఢిల్లీలో పర్యటించి న్యాయ నిపుణులతో పాటు పార్టీ హైకమాండ్‌తో కూడా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. పార్టీ పరంగా ఇస్తే బూమరాంగ్ ఖాయం విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం..కులగణన చేస్తామని, ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రజలకు వాగ్దానం చేసి, ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని చెబితే బూమరాంగ్ కావడం ఖాయమని కాంగ్రెస్ హైకమాండ్ తేల్చిచెప్పింది. అవసరమైతే ఎన్నికల నిర్వహణకు కోర్టును మరింత సమయం కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి పంపిన రెండు బిల్లులతో పాటు, 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడాన్ని తప్పుపడుతూ.. క్షేత్రస్థాయిలో బీజేపీని ఎండగట్టే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పినట్లు తెలిసింది. సోమవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీలతో చర్చలు జరిపిన సీఎం, మంత్రుల బృందం.. మంగళవారం బిహార్‌లో ఓటర్ అధికార యాత్ర నిర్వహిస్తున్న రాహుల్గాందీతోనూ సమాలోచనలు జరిపినట్లు తెలిసింది. బీజేపీని ఎండగట్టాల్సిందే.. ‘పార్గీ పరంగా సాధ్యం కాదు. ఒకవేళ ఇచ్చినా మళ్లీ గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితే రావొచ్చు. ఓడిపోయే సీట్లను బీసీలకు కేటాయించొచ్చు. ఇది బీసీలను మోసం చేయడమే..’ అని కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. ‘బీసీలకు రిజర్వేషన్ల అమలు ఇప్పుడు ఒక్క తెలంగాణ అంశమే కాదు.. యావత్ దేశానిది. రిజర్వేషన్లు అమలు చేయకుండా ఒకట్రెండు ధర్నాలు చేసి చేతులు ముడుచుకుంటే మొదటికే మోసం వస్తుంది. కాబట్టి బీజేపీని మరింతగా ఎండగట్టాలి. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలి..’ అని హైకమాండ్ పెద్దలు గట్టిగా చెప్పినట్లు తెలిసింది.ఈ పరిస్థితుల్లోనే ప్రభుత్వ పరంగా బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అంశం తెరపైకి వచ్చింది. అయితే ఇది కోర్టులో నిలబడుతుందా లేదా? అనే సందేహం కూడా కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. కోర్టును గడువు అడగండి..మళ్లీ ఆర్డినెన్స్ పంపండి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయ కోవిదుల అభిప్రాయాలను తీసుకుని నివేదిక సమర్పించేందుకు గాను టీపీసీసీ నియమించిన మంత్రుల బృందం ఆదివారం ప్రజాభవన్‌లో రాష్ట్ర అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డితో సమావేశమై ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, న్యాయపరంగా ఉన్న ఇబ్బందులపై చర్చించింది. తాజాగా సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమావేశమైంది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆలోచనలను కూడా వివరించింది. ఈ నేపథ్యంలో 42 శాతం రిజర్వేషన్లను అధికారికంగా అమలు చేయాలనే కోణంలోనే ముందుకు వెళ్లాలనుకుంటే ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని సూచించినట్టు తెలిసింది. అదే విధంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ కాలపరిమితి 3 నెలలు ముగిసిన తర్వాత మళ్లీ ఆర్డినెన్స్ చేసి, మరోమారు ఆమోదం కోసం గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపాలని చెప్పినట్లు సమాచారం. ఈలోపు హైకోర్టులో ఉన్న కేసులో ఆరు వారాల గడువు కోరుతూ కౌంటర్ దాఖలు చేయాలని, తద్వారా సుప్రీంకోర్టులో ఉన్న కేసుకు బలం చేకూరుతుందని, రెండోసారి మంత్రివర్గం పంపిన ఆర్డినెన్స్‌ను రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారు ఆమోదించాల్సి ఉంటుందని ఆయన వివరించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ సమావేశాల నిర్ణయంపై చర్చ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలను ఈ నెల 30వ తేదీ నుంచి నిర్వహించాలన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీ నిర్వహణకు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేనప్పటికీ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం సాధ్యం కాదనే కోణంలోనే వీలున్నంత త్వరగా అసెంబ్లీ సమావేశాలను పూర్తి చేయాలన్న యోచనతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. ఇదే నిజమైతే 30వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచుతూ జీవో విడుదల చేయాలని మంత్రివర్గం నిర్ణయిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ ఎన్నికల వాయిదాకు కనుక మొగ్గు చూపితే హైకోర్టును గడువు అడిగే విధంగా కేబినెట్ నిర్ణయం ఉంటుందని సమాచారం ఏది ఏమైనా ఈ నెల 30వ తేదీన జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో..అన్ని అంశాలను క్రోడీకరించి మంత్రుల బృందం ఇచ్చే సిఫారసుపై చర్చించిన అనంతరమే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయా? వాయిదా పడతాయా? అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. రాహుల్ యాత్రలో సీఎం, రాష్ట్ర నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ బిహార్‌లో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్‌తో కలిసి రేవంత్‌రెడ్డి రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్‌షోకు హాజరైన పార్టీ నేత ప్రియాంకగాం«దీని కూడా రాష్ట్ర నేతలు కలిశారు. -
కడియం శ్రీహరిపై మరోసారి తాటికొండ రాజయ్య వివాదస్పద వ్యాఖ్యలు
సాక్షి, జనగామ జిల్లా: స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నకిలీ ఎన్కౌంటర్లకు స్పెషలిస్ట్ కడియం శ్రీహరి అంటూ వ్యాఖ్యానించారు. నియోజకవర్గంలో ఏఒక్కటి తన మార్క్ అని చెప్పడానికి లేని టాల్మాన్ అంటూ విమర్శలు గుప్పించారు. ఓర్వలేని తనంతో లెక్కచేయనితనంతో ఫ్రస్టేషన్‌కు లోనై ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో ఉన్నాడని ఎద్దేవా చేశారు.బీజేపీలోకి రమ్మని పిలిచిన వెళ్లే జంపు జలానీలు తండ్రీ కూతుర్లని మండిపడ్డారు. అభివృద్ధి నినాదం అయితే ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 1560 కోట్లు, హనుమకొండ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి 6000 కోట్లు తీసుకొస్తే, అభివృద్ధి కోసం పార్టీ మారినని చెప్పుకుంటున్న కడియం శ్రీహరి 800 కోట్లు తెచ్చానని చెప్పుకోవడం కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందన్నారు.ఓడిపోతాడనే భయంతో తక్కువ మెజారిటీతో మూడుసార్లు ఎమ్మెల్యే గెలవడం ప్రజా నాయకుడు అనిపించుకోడన్నారు. నియోజకవర్గంలో ఇక నుండి కడియం శ్రీహరి ఎత్తులు జిత్తులు, కుళ్ళు కుతంత్రాలు సాగవన్నారు. ఉప ఎన్నికలు వస్తాయని నేను అనుకోవడం లేదని, నువ్వే అనుకుని ఆగమాగం అవుతూ.. ఈరోజు లింగాల ఘన్‌పూర్‌లో మా పార్టీ కార్యక్రమాలను పోలీసుల ద్వారా రద్దు చేయించడం కడియం శ్రీహరి దుర్బుద్ధికి నిదర్శనం అంటూ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. -
తెలంగాణ అసెంబ్లీ స్పెషల్ సెషన్‌కు ముహూర్తం ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ హీటెక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కాళేశ్వరం నివేదిక సహా ఇతర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీ ప్రత్యేకంగా సమాచారం కానుంది. ఈ నెల 30 నుంచి ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 29న తెలంగాణ కేబినెట్ భేటీలో స్పెషల్ సెషన్‌కు సంబంధించిన ఎజెండా ఖరారు కానుంది. మూడు లేదంటే ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కాళేశ్వరం కమిటీ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికతో పాటు బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించే యోచనలో ప్రభుత్వం ఉంది.ఇదిలా ఉంటే.. కాళేశ్వరం అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ రూపొందించిన నివేదికను అసెంబ్లీలో చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నివేదికపై చర్చ నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. -
‘ప్రభుత్వం రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు పోయే సత్తా మీకుందా?’
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో సైతం ఓట్ల చోరీ జరిగిందన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా దొంగ ఓట్లతోనే బండి సంజయ్ గెలిచారన్న పీసీసీ చీఫ్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. కరీంనగర్ ఓటర్లను మహేష్ గౌడ్ అవమానించారన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 26వ తేదీ) కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. వార్డు మెంబర్‌గా కూడా మహేష్ గౌడ్ గెలవలేరని చురకలంటిచారు. అసలు మహేష్ గౌడ్‌ను కరీంనగర్ ప్రజలు గుర్తుపట్టరని, అటువంటి వ్యక్తి బీజేపీ ఓట్ల చోరీ చేసిందా? అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని, ఒకవేళఆ పార్టీ మరొకసారి అధికారంలోకి వస్తే రాజకీయ సన్యాసం చేస్తానంటూ సవాల్ చేశారు. కరీంనగర్లో ఒక్కో మైనార్టీ ఇంట్లో 200 ఓట్లు ఉన్నాయంటూ బండి సంజయ్ ఆరోపించారు.‘పీసీసీ అధ్యక్షుడు ఓట్ల గురించి కాదు సీట్ల చోరి గురించి సమాధానం చెప్పాలి. ఒక్కసారి వార్టు మెంబర్ కూడ గెలవని వారి మాటలకి నేను స్పందించను. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలి. ప్రభుత్వం రద్దు చేసి ఓట్లని సరిచేసి మళ్ళీ ఎలక్షన్ పోయే సత్తా ఉందా.?, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు రాళ్ళతో కొట్టే స్థితి కి దిగజారారు. ప్రజలని కలవకుండా రాత్రి పూట పాదయాత్ర చేయడం ఏంటో?, కరీంనగర్ ప్రజలు పిసిసి అధ్యక్షుడుని గుర్తు పడతారా?, కరీంనగర్ లొని మైనారిటి దొంగ ఓట్లు ఉన్నాయని మేము ఫిర్యాదు చేసాం.. అయినా కూడ కరీంనగర్లో కాంగ్రెస్ లో గెలవలేదు. బిసి రిజర్వేషన్ల ఇయ్యమని అడిగితే ముస్లీం రిజర్వేషన్లు ఇస్తున్నారు. ఓట్ల చోరి జరిగి ఉంటే మిగితా ఎనిమిది సీట్లు మేమే గెలచేవారం. బండిసంజయ్ని తిడితే పెద్ద నాయకుడు అవుతాడని అనుకుంటున్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా బిజేపి దేశం కొసం, ధర్మం కొసం కొట్లాడుతుంది’ అని స్సష్టం చేశారు. -
అదే కోటా... అదే తీర్మానం?
సాక్షి, హైదరాబాద్: ‘మరో 15 రోజుల్లో కోదండరాంను ఎమ్మెల్సీని చేస్తా. ఎవరు ఆపుతారో చూస్తా’అంటూ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నాయి. కోదండరాంతోపాటు కాంగ్రెస్ నేత ఆమేర్ అలీఖాన్‌ల శాసనమండలి సభ్యత్వాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో సీఎం చెప్పినట్లు మళ్లీ కోదండరాంను ఎలా ఎమ్మెల్సీ చేస్తారనే ప్రశ్న తలెత్తుతోంది. అయితే మళ్లీ గవర్నర్ కోటాలో, రాష్ట్ర మంత్రివర్గ తీర్మానంతోనే ఆయన్ను మరోసారి ఎమ్మెల్సీ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని.. అందుకే ఆయనకు పదవిపై ఘంటాపథంగా మాట్లాడారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. సుప్రీం ఏమంటుందో? గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమితులైన ప్రొఫెసర్ కోదండరాం, ఆమేర్ అలీఖాన్‌లను అనర్హులుగా ప్రకటిస్తూ ఈ నెల 13న సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో వారు పదవులను కోల్పోవాల్సి వచ్చింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ సోమవారం ఓయూలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుడికి తాము పదవి ఇస్తే పెద్దపెద్ద లాయర్లను పెట్టి కుట్రలు చేసి దింపేయాలని ప్రయత్నాలు చేశారని చెప్పారు. మళ్లీ ఆయన్ను ఎమ్మెల్సీని చేస్తానని ప్రకటించారు. దీనివెనుక గట్టి నిర్ణయమే ఉందని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీగా పంపేందుకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్‌సిగ్నల్ ఇచి్చందని, గవర్నర్ కోటాలో మళ్లీ కేబినెట్ ఆయన పేరును సిఫారసు చేస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే సుప్రీంకోర్టు వచ్చే నెల 17న ఈ కేసుపై తదుపరి విచారణ చేపట్టనున్న నేపథ్యంలో ఈ నెల 29న జరిగే కేబినెట్లో తీర్మానం చేస్తారా లేక సెపె్టంబర్ 17న సుప్రీం ఏం చెబుతుందో పరిశీలించి ఆ తర్వాత జరిగే కేబినెట్లో ఆమోదిస్తారా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందంటున్నాయి. గవర్నర్ కోటాలో మళ్లీ నామినేట్ చేసేందుకు ఆ ఇద్దరూ ప్రాతినిధ్యం వహించిన స్థానాలను మండలి వర్గాలు ఖాళీగా చూపిన తర్వాత ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుందని.. నోటిఫికేషన్ వచ్చాకే కేబినెట్ తీర్మానం చేస్తుందని.. అప్పటికి కేసు పెండింగ్‌లో ఉన్నా కోదండరాం పేరును మళ్లీ సిఫార్సు చేసేందుకు సుప్రీంకోర్టే వెసులుబాటు ఇచ్చినందుకు ఇబ్బందులేవీ ఉండవని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. అయితే కోదండరాంను ఒక్కరినే మళ్లీ గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తారా లేక ఆమేర్అలీఖాన్ పేరునూ జతచేస్తారా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
‘కోటా’ చిక్కుముడి విప్పేదెలా?
సాక్షి, న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై చట్టపరంగా ఎదురయ్యే చిక్కుముళ్లను విప్పేందుకు మంత్రుల బృందం పార్టీ పెద్దలు, న్యాయ నిపుణులతో భేటీ అయింది. రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లోనే ఉన్నందున దీనిని చట్టపరిధిలో పరిష్కరించే మార్గాలపై సమాలోచనలు చేసింది. ఒకవేళ జీవోలు ఇస్తే ఎదురయ్యే సవాళ్లు, దీనిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన కార్యాచరణ, కులగణన ద్వారా వచ్చిన ఎంపిరికల్ డేటాను న్యాయవ్యవస్థల ముందుంచే అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలవుతున్న రాష్ట్రాలు, వాటిపై గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు, రాజ్యాంగ నిబంధనలన్నింటిపైనా చర్చలు జరిపింది. రిజర్వేషన్లపై మార్గాన్వేషణ: 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సభ్యులు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ సోమవారం ఢిల్లీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మనుసింఘ్వీ, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో గంటపాటు భేటీ అయ్యారు. ఇప్పటికే విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీ ఆమోదించిన రెండు బిల్లులు రాష్ట్రపతి కోసం వేచి చూస్తున్న విషయాలతోపాటు, 2018లో చంద్రశేఖర్ రావు రిజర్వేషన్లను 50శాతానికి పరిమితి చేస్తూ చేసిన చట్టాన్ని తొలగించాలన్న ఆర్డినెన్స్‌పైనా చర్చించారు. ఈ బిల్లుల ఆధారంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 263 ప్రకారం బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతూ జీవో ఇవ్వడమా?, ఇస్తే ఈ ఉత్తర్వుల అమలును ఇతరులెవరూ కోర్టుకు వెళ్లి అడ్డుకోకుండా ముందుగానే కేవియట్ దాఖలు చేయడమా? అన్న అంశాలపై మంత్రులు సమాచాలోచనలు చేశారు. ఒకవేళ కోర్టులు అభ్యంతరం చెబితే కులగణన సర్వే ద్వారా సేకరించిన డేటాతో బీసీల జనాభా, వెనకబాటుతనాన్ని నిరూపించే అవకాశాలపైనా చర్చించారు. ఇప్పటికే 10శాతం ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ల కోసం చేసిన 103వ రాజ్యాంగ సవరణతో విద్య, ఉద్యోగాల్లో మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటడాన్ని సుప్రీంకోర్టు సమర్ధించిన దృష్ట్యా, సర్వే డేటాలోని అంశాలు తమకు కలిసి వస్తాయనే అభిప్రాయం వ్యక్తమైంది. 50 శాతం రిజర్వేషన్లు దాటితే సమానత్వపు హక్కు ఉల్లంఘన జరిగినట్లేనని, అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే 50శాతం పరిమితిని దాటవచ్చని సుప్రీంకోర్టు.. గతంలో మరాఠాల రిజర్వేషన్లపై తీర్పుఇచ్చిన నేపథ్యంలో ఎంపిరికల్ డేటాను ఎంతవరకు ప్రామాణికంగా చూపవచ్చనే అంశంపైనా చర్చించారు. హైకోర్టు విధించిన గడువు సెపె్టంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితుల్లో అదనపు గడువు కోరే అవకాశాలపైనా చర్చలు జరిగాయి. అయితే ఈ నెల 29న జరిగే కేబినెట్ భేటీలో చర్చించి తుది నిర్ణయం చేయనున్నారు. నేడు బిహార్‌కు సీఎం, మంత్రులు రానున్న బిహార్ ఎన్నికలకు ముందు జాతీయ ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందంటూ ఏఐసీసీ అగ్రనేత తలపెట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’లో మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు పాల్గొననున్నారు. ఓట్ల చోరీపై రాహుల్ చేస్తున్న పోరాటానికి రాష్ట్ర నేతలు సంఘీభావం తెలపనున్నారు. రోడ్‌షోలో ఏఐసీసీ అగ్రనేత ప్రియాంకగాంధీ సైతం పాల్గొనే అవకాశాలున్నాయి. -
సార్.. మమ్ముల్ని ఉపయోగించుకోండి.. మీ వెనకాలే ఉంటాం: ఎంపీ అరవింద్
నిజామాబాద్: బీజేపీలో కొత్త వారిని చేర్చుకోవాల్సిన అవశ్యకత ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజామాబాద్ అంటేనే బీజేపీ బలంగా ఉన్న పార్లమెంట్.. రామ్ చందర్ రావు విద్యావేత్త కాబట్టి ఆయనకు అభద్రతా భావం ఉండదన్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25) నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. ‘ పార్టీలో కొత్త వారిని చేర్చుకోండి. సార్.. మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. మేము మీ వెనకాలే ఉంటాం. నిజామాబాద్ అంటేనే బీజేపీ బలంగా ఉన్న పార్లమెంట్. రాష్ట్ర పార్టీలో జాయినింగ్ పెంచి పార్టీనీ బలోపేతం చేసే బాధ్యత రామచంద్ర రావుపై ఉంది. రాకేష్ రెడ్డి గెలిచే వ్యక్తి అని ఆనాడే పార్టీ పెద్దలకు నేను చెప్పి కాషాయ పార్టీలో జాయిన్ అవ్వాలని ఇన్వైట్ చేశా. పార్టీలో చేరాలని రాకేష్ రెడ్డి కుటుంబంతో సహా ఢిల్లీ వచ్చారు. ఆయన మర్డర్ చేశాడని ఎవరో అప్పటి జనరల్ సెక్రటరీకి కంప్లైంట్ చేశారంట. దీంతో ఆయన చేరిక ఆ రోజు ఆగింది. మళ్లీ వారు ఎంక్వైరీ చేస్తే రాకేష్ రెడ్డిపై ఎటువంటి మర్డర్ కేసు లేదని తేలింది. ఆనాడు MLA రాకేష్ రెడ్డి జాయినింగ్ ను కొంత మంది అడ్డుకునే కుట్ర చేశారు. పార్టీని ఎవడి అయ్యా కోసం కాదు.. కార్యకర్తల కొరకు అధికారంలోకి తేవాలి. పార్టీని ఎదగకుండా ఆపే వాడు అంటే నాకు పడదు’ అని పేర్కొన్నారు.ఇదీ చదవండి:మరి మీ ఎంపీలు కూడా ఓట్ చోరీతోనే గెలిచారా?: బీజేపీ -
‘మోసం చేసిందనిపిస్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి’
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీ ఇచ్చింది. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దని ముందే చెప్పాం. అధికారంలోకి 100 రోజుల్లో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారు. రైతు బంధు లేదు,రైతు భీమా లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పండి ’ అని పిలుపునిచ్చారు. -
మరి మీ ఎంపీలు కూడా ఓట్ చోరీతోనే గెలిచారా?: బీజేపీ
నిజామాబాద్: తెలంగాణలో సైతం ఓట్ చోరీ జరిగిందంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ చందర్ రావు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. మహేష్ కుమార్ ఓట్ చోరీ అంటున్నారు కదా.. ఇది ఓట్ చోరీ కాదు.. రాహుల్ గాంధీ బ్రెయిన్ చోరీ అంటూ మండిపడ్డారు. ఏ ఓటర్ లిస్టుతో కాంగ్రెస్ అధికారం చేపట్టిందో అదే ఓటర్ లిస్ట్‌తోనే బీజేపీ కూడా గెలిచిందన్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25) నిజామాబాద్ బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రామ్ చందర్రావు.. కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. ప్రధానంగా లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందనే అంశాన్ని ఇక్కడ రామ్ చందర్రావు ప్రస్తావించారు. మరి కాంగ్రెస్ ఎంపీలు సైతం దొంగ ఓట్లతో గెలిచారా? అంటూ ప్రశ్నించారు. ‘ ముస్లింలకు రిజర్వేషన్లు పెంచి బీసీల రిజర్వేషన్లు తగ్గించే కుట్ర కాంగ్రెస్ చేస్తోంది. రాష్ట్రంలో కృత్రిమ యూరియా కొరతకు కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది. దీనిపై మంత్రులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు, సృష్టిస్తున్న కృత్తిమ కొరత. రాష్ట్రం లో కాంగ్రెస్ నేతలు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. యూరియా సమస్య పై కాంగ్రెస్ పార్టీ రైతులను రెచ్చ కొడుతుంది. ఓటమి భయం తో.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం భయ పడుతుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడు దొంగలు..ఈ రెండు పార్టీలకు రైతుల గురించి మాట్లాడే అర్హత లేదు. పసుపు బోర్డు నిజామాబాద్ లో ఏర్పాటు చేయటం మామూలు విషయం కాదు’ అని రామ్ చందర్ రావు స్పష్టం చేశారు.కాగా, నిన్న(ఆదివారం, ఆగస్టు 24) టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదు. బండిసంజయ్ బీసీ కాదు.. దేశ్‌ముఖ్. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు. -
‘బండి సంజయ్ సహా బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు’
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారని సంచలన ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో బీజేపీ ఎంపీల గెలుపుపై తమకు అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే, బీహార్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది అంటూ జోస్యం చెప్పారు.టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సాక్షి టీవీతో మాట్లాడుతూ.. తెలంగాణలో బండి సంజయ్ సహా, బీజేపీ ఎంపీలు దొంగ ఓట్లతో గెలిచారు. ఆ మాటకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నారు. మాకు తెలంగాణ బీజేపీ ఎంపీల గెలుపుపై అనుమానాలున్నాయి. ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాస్తాం. మా నిజామాబాద్ జిల్లాలోనూ దొంగ ఓట్లున్నాయి. అది నేను నిరూపిస్తాను. మహారాష్ట్రలో కోటి దొంగ ఓట్లు నమోదు చేశారు.నిజామాబాద్‌లోనూ మహారాష్ట్ర ప్రజలకు ఓట్లు ఉన్నాయి. కరీంనగర్లోనూ ఓ డబల్ బెడ్ రూమ్ ఇంట్లో 69 ఓట్లు ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది. ఓట్లు చోరీ చేసే అవసరం కేవలం బీజేపీకే ఉంది. బీహార్ ఎన్నికల్లోనూ అవకతవకలకు ఆస్కారం లేకుండా ప్రజల్ని చైతన్యపర్చేందుకే రాహూల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోంది. బీహార్‌లో కాంగ్రెస్ ప్రభంజనం రాబోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
బై ఎలక్షన్లతో కాంగ్రెస్‌కు బైబై
మియాపూర్: రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఉప ఎన్నికలు రానున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వానికి అవే బైబై ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే తమ పదవులకు రాజీనామా చేసి ఉపఎన్నికల్లో పోటీచేసి గెలవాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ముందా? అని సవాల్ విసిరారు. మియాపూర్ నరేన్ గార్డెన్లో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శంభీపురం రాజు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.2.80 లక్షల కోట్ల అప్పుచేసి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను చేపడితే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడవకముందే రూ.2.20 లక్షల కోట్ల అప్పుచేసి ఒక్క మంచిపని కూడా చేయలేదని విమర్శించారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌ను మహా నగరంగా తీర్చిదిద్దామని చెప్పారు. కరోనా సమయంలో ఏడాదిపాటు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఆదాయం రాకపోయినా అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగించామని తెలిపారు. ఇప్పుడు 20 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుతో 42 ప్లైఓవర్లు, నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు, 36 మురుగునీటి శుద్ధి కేంద్రాలు నిర్మించిందని వెల్లడించారు. రేవంత్ ప్రభుత్వం ఒక్క కొత్త వంతెన గానీ మోరీని గానీ నిర్మించిందా? అని ప్రశ్నించారు. హైడ్రా అరాచకంతో హైదరాబాద్ అతలాకుతలం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రావల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుప్పకూలిందని కేటీఆర్ విమర్శించారు. హైడ్రా అరాచకాలతో నగరమంతా అతలాకుతలమైందని ఆరోపించారు. దుర్గంచెరువులో కాంగ్రెస్ హయాంలో సీఎం రేవంత్‌రెడ్డి అన్న తిరుపతిరెడ్డి అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా? అని సవాల్ చేశారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా.. పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. 20 నెలల్లో హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీలో ఉన్నామో కూడా చెప్పుకోలేకపోతున్నారని, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఈ కార్యక్రమానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రోజాదేవి రంగారావు, సిం«ధూ ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బండి సంజయ్‌పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదు. బండిసంజయ్ బీసీ కాదు.. దేశ్‌ముఖ్. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు. -
‘నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం’
హన్మకొండ జిల్లా: ఎవరు కుళ్లుకున్నా తన పని తాను చేసుకుపోవడమే తనకు తెలుసని ఎమ్మెల్యే కడియం శ్రీహారి స్పష్టం చేశారు. పని చేయని వారు దొంగలాగ పారిపోతారని, తాను పని చేశాను కాబట్టే ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానన్నారు. అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ప్రజలకు సూచించారు.ఈరోజు(ఆదివారం, ఆగస్టు 24వ తేదీ) జిల్లాలోని ధర్మసాగర్ మండలం పెద్దపెండ్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కడియం శ్రీహరి మాట్లాడుతూ.. ‘ నాలాగ పనిచేసే ఎమ్మెల్యే దొరకడం కష్టం. నేను ఒక్క రూపాయి లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. అవినీతికి కాకుండా అభివృద్ధికి సహకరించండి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ చేశారు. తన పాలనను రెఫరెండంగా ఉపఎన్నికలకు వెళ్లేదమ్ము రేవంత్‌కు ఉందా? అని ప్రశ్నించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి’అని డిమాండ్ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ‘బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్‌లో నాయకులు వేలు పెట్టలేదు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రెండు లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని, కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టారు. కేసీఆర్ 70 లక్షల మంది రైతు ఖాతాల్లో 70 వేల కోట్లు వేస్తే, రెండు లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు. 200 ఉన్న పెన్షన్‌ను కేసీఆర్ ప్రభుత్వం 2000 చేస్తే, రేవంత్ ఏం చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని కేటీఆర్ ప్రశంసించారు. -
యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్లు డ్రామాలు: సీఎం రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యూరియా కొరతపై బీజేపీ, బీఆర్ఎస్లు కలిసి డ్రామాలాడుతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇచ్చే పార్టీకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని కేటీఆర్ అనడంలోనే వాళ్ల తీరు అర్థమవుతోందని విమర్శించారు. యూరియా కోసం నాలుగుసార్లు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అనుప్రియా పటేల్‌ను కలిశానని సీఎం రేవంత్ తెలిపారు. యూరియా పంపిణీ అంశానికి సంబంధించి క్షేత్రస్థాయిలో మానిటరింగ్‌ను పెంచాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఈరోజు(శనివారం, ఆగస్టు 23 వ తేదీ) గాంధీ భవన్లో మూడు గంటల పాటు జరిగిన పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. ‘ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ప్రకటించినందుకు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యాంగ పరిరక్షణ కోసం, పౌర హక్కులను కాపాడటం కోసం పని చేశారు. రాహుల్ గాంధీ, పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రంలో కులగణన చేపట్టాo. బీసీలకు విద్యా, ఉద్యోగాలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు మంత్రి వర్గంలో ఆమోదించి అసెంబ్లీలో బిల్ పాస్ చేసుకున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తు విడిగా మరో బిల్ తీసుకొచ్చాం.. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకుండా కేసీఆర్ చట్టం తెచ్చారు. ఈ అడ్డంకిని తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చాం. కేసీఆర్ తెచ్చిన చట్టాన్ని సవరించడానికి ఆర్డినెన్సు తెచ్చాం.. దాన్ని గవర్నర్ కేంద్రానికి పంపారు. బీసీ లకు మేలు జరగాల్సిందే. రాహుల్ గాంధీ మాట నిలబడాలి. 90 రోజులలో రాష్ట్రపతి బిల్లులను ఆమోదించాలన్న అంశం పైన సుప్రీంకోర్టు లో మన రాష్ట్ర వాదనలు వినిపించడం కోసం ఇద్దరు న్యాయవాదులను నియమించాం. బీహార్ లో రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ఓట్ చోరీ పాదయాత్రకు ఈ నెల 26వ తేదీన హాజరవుతా’ అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు.. బీఆర్ఎస్కు ప్లస్?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా నోటీసులు ఇచ్చారు. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలలో నిన్న ఐదుగురికి నోటీసులు పంపించారు. నేడు మరో ఐదుగురికి నోటీసులు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. కాగా, న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం చేస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. దీంతో, తెలంగాణ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అయితే, స్పీకర్ నోటీసులతో ఫిరాయింపు నేతలు తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుతారా? లేక రాజీనామా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.ఇక, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదులపై వెంటనే వివరణ ఇవ్వాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. అదేవిధంగా మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా స్పీకర్ నుంచి నోటీసులు అందినట్లుగా సమాచారం. అయితే, స్పీకర్ ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తనకు వచ్చిన నోటీసులకు త్వరలోనే సమాధానమిస్తానని అన్నారు. తాను అసలు పార్టీ మారలేదని.. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. గద్వాల నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు.మరోవైపు.. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌కు ఇంకా స్పీకర్ నోటీసులు అందలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగి జగిత్యాల ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజయ్. ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అయితే, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకోకపోవడంతో ఎమ్మెల్యేకి నోటీసులపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకూ బీఆర్ఎస్కు రాజీనామా చేయని సంజయ్. దీంతో, సంజయ్‌కు నోటీసులు ఇస్తారా? లేదా? అని స్థానికంగా చర్చ నడుస్తోంది. -
సచివాలయం వద్ద ఉద్రికత్త.. బీజేపీ నేతలు అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం మరోసారి హీటెక్కింది. తెలంగాణ సచివాలయం ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. సేవ్ హైదరాబాద్ పేరుతో బీజేపీ నేతలు నిరసనలకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో సచివాలయం వద్దకు బీజేపీ నేతలు రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జిల్లా బీజేపీ నేతలు నిరసనల్లో పాల్గొన్నారు. బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలోనే సచివాలయం వద్దకు చేరుకున్నారు. అయితే, బీజేపీ నేతల నిరసనల నేపథ్యలంలో సచివాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిరసనలకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాల్లో వారిని అక్కడి నుంచి తరలించారు.ఇక, హైదరాబాద్‌లో కరెంట్ తీగలు తగిలి ఇటీవల మరణాలు, డ్రైనేజీ సమస్యలు, గుంతల రోడ్ల అంశాలపై బీజేపీ నిరసనకు దిగింది. జీహెచ్ఎంసీ, హైడ్రా, జలమండలి విభాగాల మధ్య కో-ఆర్డినేషన్ లేక ఎక్కడి సమస్యలు అక్కడే అంటూ బీజేపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నిరసనల నేపథ్యంలో ఇప్పటికే గ్రేటర్ పరిధిలో పలువురు బీజేపీ కార్పొరేటర్లు, నేతలను పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. -
రెండు నగరాల జంట కథ.. ముఖ్యమంత్రుల వింత వ్యథ!
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆశలన్నీ ఇప్పుడు రెండు నగరాలపైనే ఉన్నాయి. ఫ్యూచర్ సిటీపై రేవంత్, అమరావతిపై ఏపీ సీఎం చంద్రబాబు గంపెడు ఆశలతో ఉన్నారు. అయితే, ఈ రెండు కొత్త నగరాల ప్రతిపాదనలను పరిశీలిస్తే రేవంత్ రెడ్డి పరిస్థితే కొంత మేలు అనిపిస్తుంది.ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారులతో జరిగిన ఒక సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘కొంతమంది ఫ్యూచర్ సిటీని ఫోర్ బ్రదర్స్ సిటీ అని అంటున్నారు.. మీరంతా నాకు సోదరులే. మీ అందరి ప్రయోజనం కోసమే దాన్ని డిజైన్ చేస్తున్నాను. ఇతరుల వ్యాఖ్యలు పట్టించుకోను’ అని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు పుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పడుతోందో అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసమే ఫ్యూచర్‌సిటీ అని రేవంత్ ధైర్యంగా చెప్పగలిగారు కానీ.. చంద్రబాబు మాత్రం ఇప్పటికీ రైతు ప్రయోజనాల కోసమే అమరావతి అన్న బిల్డప్‌ను కొనసాగిస్తున్నారు. కానీ అందరూ దాన్ని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుగానే పరిగణిస్తున్నారు.వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి భూముల అమ్మకం ద్వారా ఆ రుణాలు తీరుస్తామన్న ప్రభుత్వం వ్యాఖ్యలు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అచ్చంగా సరిపోతుంది కూడా. అయితే చిన్న చినుకుకే చిత్తడై పోతూ.. చెరువులను తలపిస్తున్న అమరావతి ప్రాంతం సహజంగానే పలు రకాల సందేహాలకు తావిస్తుంది. ఈ విషయాలపై మాట్లాడిన వారిపై కేసులు పెట్టి అణగదొక్కేందుకు చేస్తున్న ప్రయత్నాలనూ అందరూ గమనిస్తూనే ఉన్నారు. ఒక పక్క వరద లేదని ప్రభుత్వం చెబుతుంటే.. మరోపక్క మంత్రి నారాయణ వరద ఏ రకంగా ఉందో చెప్పకనే చెప్పారు.అమరావతి నగరం ఎప్పటికి పూర్తి అవుతుంది? అందుకోసం ఎన్ని లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది? రాష్ట్ర ప్రజలందరిపై పడే అప్పుల భారం ఎంత? అన్న చింత ఏపీలోని ఆలోచనాపరుల్లో కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి ఊహా చిత్రాలు అంటూ గ్రాఫిక్స్ ప్రదర్శించి ప్రజలను తన అనుకూల మీడియా ద్వారా టీడీపీ మభ్యపెట్టాలని యత్నిస్తే, ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఊహా చిత్రాలను ప్రచారంలోకి తేవడం విశేషం. ఫ్యూచర్ సిటీ నిర్మాణం కూడా అంత తేలిక కాకపోవచ్చు. ఎంత ఖర్చు అవుతుందన్న అంచనాలు తెలియాల్సి ఉంది. అయినా ఇక్కడి భూ స్వభావం, వరదల వంటి సమస్యలు లేకపోవడం, ఇప్పటికే అభివృద్ది చెందిన హైదరాబాద్ చెంతనే ఉండడం కలిసి రావచ్చు. దానికి తోడు ఫార్మా సిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం సమీకరించిన 14 వేల ఎకరాల భూమి అదనపు అడ్వాంటేజ్ కావచ్చు.నిజానికి ఏ ప్రభుత్వం కూడా కొత్త నగరాలను నిర్మించదు. ప్రజలకు అవసరమైన సదుపాయాలను కల్పించి నగరాభివృద్దికి దోహదపడతాయి. ఈ క్రమంలో నగరాభివృద్ది సంస్థలు ఆయా చోట్ల భూములు సేకరించి, కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను తయారు చేస్తుంటాయి. ఉదాహరణకు హైదరాబాద్‌లో హెచ్ఎండీఏ ప్రభుత్వ భూములను కొన్నిటిని తీసుకుని, లేదా ప్రైవేటు భూములను సమీకరించి ప్లాట్లు వేసి వేలం నిర్వహిస్తుంటుంది. ఇది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న అనుభవమే. గత టర్మ్‌లో ఏపీలో అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా ఆయా పట్టణాలు, నగరాలలో ప్రభుత్వపరంగా ఇలాంటి వెంచర్లు వేసి మధ్య తరగతి ప్రజలకు అందుబాటు ధరలలో స్థలాలను సమకూర్చాలని ప్లాన్ చేసింది. అందుకోసం భూములు కూడా తీసుకున్నారు. ఇది ఒక క్రమ పద్దతిలో జరిగితే స్కీములు సక్సెస్ అవుతాయి. లేదంటే విఫలమవుతాయి. పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా వసతుల కల్పన సంస్థలు ఉన్నాయి.అవి ఆయా చోట్ల, అంతగా పంటలు పండని భూములను సేకరించి రోడ్లు, విద్యుత్, నీరు తదితర వసతులు కల్పించి పరిశ్రమలకు అనువైన రీతిలో తయారు చేసి విక్రయిస్తుంటాయి. తెలంగాణ, ఏపీలలో పలుచోట్ల ఇండస్ట్రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. కొన్ని ఇతర చోట్ల కూడా పరిశ్రమలు భూములు కొనుగోలు చేసుకుని యూనిట్లను పెట్టుకుంటాయి. ఇదంతా నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. అయితే ఏపీ విభజన తర్వాత చంద్రబాబు తానే కొత్త రాజధాని నగరం నిర్మిస్తానంటూ 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిలో తమకు అవసరమైన కార్యాలయాల భవనాలు నిర్మించడం కాకుండా, ఆయన వేల ఎకరాలను రైతుల నుంచి సమీకరించి వారికి అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రతిపాదించారు. ప్రభుత్వం అన్ని సదుపాయాలతో ప్లాట్లు ఇస్తే బాగా రేట్లు వస్తాయని ఆశపడ్డ రైతులు తమ భూములను పూలింగ్ కింద ఇచ్చారు.కానీ, ఇప్పటికీ పదేళ్లు అయినా వారికి ప్లాట్లు దక్కలేదు. వసతుల కల్పన జరగలేదు. పైగా మరో 44 వేల ఎకరాల భూమిని అదనంగా సమీకరిస్తామని ప్రభుత్వం చెప్పడంపై రైతులలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ లక్ష ఎకరాల భూమి ఎప్పటికి అభివృద్ది కావాలి? అక్కడకు ఏ తరహా పరిశ్రమలు ఎప్పటికి వస్తాయి? నవ నగరాల పేరుతో గతంలో చేసిన హడావుడి ఇప్పుడు కూడా చేస్తారా?. అమరావతిలో భూములు కొంటే కోట్ల రూపాయల లాభం వస్తుందని భావించి అనేకమంది పెట్టుబడి పెడితే రేట్లు పడిపోయి వారంతా అయోమయంలో చిక్కుకున్నారు. రైతులకు తమ ప్లాట్లు వస్తే అమ్ముకోవచ్చని అనుకుంటే దానికి పలు షరతులను అధికారులు పెడుతున్నారు. వెయ్యి గజాలు, రెండువేల గజాల ప్లాట్లు వచ్చిన రైతులు అవి కాగితం మీదే ఉన్నా, వాటిని విభజించుకోవడానికి లేదన్న కండిషన్ వారిని ఆందోళనకు గురి చేస్తోంది. పలువురు రైతులు తమకు ఈ కాగితాల ఆధారంగా అప్పులు పుట్టడం లేదని, భూములు అమ్ముదామన్నా అవి ఎక్కడ ఉన్నాయో చూపలేక పోతున్నామని వాపోతున్నారు.ఇన్ని సమస్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు ఓ మోస్తరు వర్షం కురిసినా ఆ ప్రాంతం అంతా నీటిమయం అవుతోంది. భూమి చిత్తడిగా మారుతోంది. ఈ భూమి భారీ నిర్మాణాలకు అనువు కాదని శివరామకృష్ణ కమిటీ, ప్రపంచ బ్యాంక్‌లు కూడా చెప్పినా చంద్రబాబు ప్రభుత్వం మొండిగా ముందుకు వెళుతోంది. ఈ సమస్యలన్నీ సర్దుకుని నిర్మాణాలు సాగితే ఫర్వాలేదు కాని, లేకుంటే ప్రభుత్వం రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి రావచ్చు. ఈ నేపథ్యంలో అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకోవడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడకు పలు సంస్థలు వచ్చేస్తున్నట్లు, ఏఐ వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, స్పోర్ట్స్ సిటీ, కొత్త విమానాశ్రయం ఏర్పాటు, వంటివి జరగబోతున్నట్లు హడావుడి చేస్తున్నారు. అయినా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కొనుగోలుదార్లు.. అవన్నీ అయినప్పుడు చూద్దాంలే అన్నట్టు వేచి చూసే ధోరణిలోనే ఉంటున్నారు.ఇక, ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే ఇక్కడ కూడా భూ సేకరణపై కొంత నిరసన వ్యక్తమవుతోంది. అధిక వాటా, అనాసక్తి వంటి కారణాలతో రైతులు కొంతమంది ప్రభుత్వానికి సహకరించడం లేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల తరువాత హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం బాగా మందగించింది. ఇప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఫ్యూచర్ సిటీ ప్రతిపాదన వల్ల ఆ ప్రాంతంలో భూముల రేట్లు కొంత పెరిగిన మాట నిజమే కాని, రకరకాల సందేహాల వల్ల ఇప్పుడు అంత ఊపు లేదు అంటున్నారు. దానిని పారదోలడానికి రేవంత్ సర్కార్ కష్టపడుతోంది. వదంతులు నమ్మవద్దని, ఫ్యూచర్ సిటీకిగాని, హైదరాబాద్‌కు కాని రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రభుత్వం అంటోంది. ఇప్పటికే స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేసింది. ప్లాన్డ్గా అభివృద్ది ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు.అయితే ఆయా గ్రామాల మధ్య శ్రీశైలం రోడ్డు, సాగర్ రోడ్డుల మధ్య ఈ సిటీ అభివృద్దికి ఎన్నో ఆటంకాలు కూడా రావచ్చన్న అనుమానం ఉంది. హైడ్రాను స్థాపించడం వల్ల రేవంత్ సర్కార్‌కు కొంత కీర్తి, మరికొంత అపకీర్తి వచ్చింది. చెరువుల శిఖం భూములనో, మరొకటనో, కొత్తగా నిర్మిస్తున్న పలు భవనాలు, అపార్టెమెంట్లు కూల్చడం వల్ల మధ్య తరగతి ప్రజలు కొంత నష్టపోయారు. వారు ఇప్పుడు కొత్తగా కొనుగోలు చేయడానికి సందేహిస్తున్నారు. అయితే చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణల తొలగింపు వంటి వాటి వల్ల కొంత పేరు కూడా వచ్చింది. ఇందులో కూడా పక్షపాతంగా కొన్ని జరిగాయన్న విమర్శలూ ఉన్నాయి. ఇక ఓవరాల్ ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిని ఉండడం, ఐటీ రంగంలో అనిశ్చిత పరిస్థితులు ఏర్పడడం, ఉద్యోగుల లేఆఫ్‌ల ప్రభావం హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌పై కూడా ఉందని అంటున్నారు.హైదరాబాద్‌లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఏ అభివృద్ది లేని అమరావతిలో రియల్ ఎస్టేట్ పుంజుకోవడం అంత తేలిక కాదని అంచనా. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో ఏడు ఎకరాల ప్లాటును గోద్రోజ్ కంపెనీ 547 కోట్లకు కొనుగోలు చేయడం రేవంత్ ప్రభుత్వానికి ఒక సానుకూల అంశం. చంద్రబాబు, రేవంత్‌లు అలవికాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక సతమతమవుతున్నారు. ఏపీ సర్కార్ రికార్డు స్థాయిలో అప్పులు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం కూడా అప్పుల ఊబిలో దిగుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ స్థితిలో రెండు కొత్త నగరాల నిర్మాణం వీరికి అవసరమా?. ఇతర ప్రజా సమస్యలను పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ కోసం ఇంత రిస్క్ అవసరమా? అని ఎవరైనా అడిగితే ఎవరి వ్యూహం వారిది అని తప్ప ఇంకేమీ చెప్పగలం.!-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.