
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ హామీలపై బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడటం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లేనిపోని హామీ ఇచ్చింది. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ మాటలు నమ్మి ఆగం కావొద్దని ముందే చెప్పాం. అధికారంలోకి 100 రోజుల్లో ఇచ్చిన హామీల్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వాటి సంగతి ఏమైందని ప్రశ్నించారు. రైతు బంధు లేదు,రైతు భీమా లేదు. కాంగ్రెస్ మోసం చేసిందని భావిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పండి ’ అని పిలుపునిచ్చారు.