
నిజామాబాద్: బీజేపీలో కొత్త వారిని చేర్చుకోవాల్సిన అవశ్యకత ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నిజామాబాద్ అంటేనే బీజేపీ బలంగా ఉన్న పార్లమెంట్.. రామ్ చందర్ రావు విద్యావేత్త కాబట్టి ఆయనకు అభద్రతా భావం ఉండదన్నారు. ఈరోజు(సోమవారం, ఆగస్టు 25) నిజామాబాద్‌లో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చందర్‌రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ.. ‘ పార్టీలో కొత్త వారిని చేర్చుకోండి. సార్.. మీరు మమ్మల్ని ఉపయోగించుకోండి. మేము మీ వెనకాలే ఉంటాం. నిజామాబాద్ అంటేనే బీజేపీ బలంగా ఉన్న పార్లమెంట్. రాష్ట్ర పార్టీలో జాయినింగ్ పెంచి పార్టీనీ బలోపేతం చేసే బాధ్యత రామచంద్ర రావుపై ఉంది. రాకేష్ రెడ్డి గెలిచే వ్యక్తి అని ఆనాడే పార్టీ పెద్దలకు నేను చెప్పి కాషాయ పార్టీలో జాయిన్ అవ్వాలని ఇన్వైట్ చేశా.
పార్టీలో చేరాలని రాకేష్ రెడ్డి కుటుంబంతో సహా ఢిల్లీ వచ్చారు. ఆయన మర్డర్ చేశాడని ఎవరో అప్పటి జనరల్ సెక్రటరీకి కంప్లైంట్ చేశారంట. దీంతో ఆయన చేరిక ఆ రోజు ఆగింది. మళ్లీ వారు ఎంక్వైరీ చేస్తే రాకేష్ రెడ్డిపై ఎటువంటి మర్డర్ కేసు లేదని తేలింది. ఆనాడు MLA రాకేష్ రెడ్డి జాయినింగ్ ను కొంత మంది అడ్డుకునే కుట్ర చేశారు. పార్టీని ఎవడి అయ్యా కోసం కాదు.. కార్యకర్తల కొరకు అధికారంలోకి తేవాలి. పార్టీని ఎదగకుండా ఆపే వాడు అంటే నాకు పడదు’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:
మరి మీ ఎంపీలు కూడా ఓట్ చోరీతోనే గెలిచారా?: బీజేపీ