
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టిపిసిసి) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘తెలంగాణలోనూ దొంగ ఓట్లున్నాయి.దొంగ ఓట్లతోనే ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదు. బండిసంజయ్ బీసీ కాదు.. దేశ్‌ముఖ్. కులం మతం లేకపోతే బీజేపీ గెలవదు. దేవుడి పేరుతో మేం ఎన్నడూ ఎన్నికలప్పుడే దేవుడే గుర్తుకొస్తాడు. బీఆర్ఎస్ మూడు ముక్కలైంది.నాల్గవ ముక్క కోసం ఇంకొకరు ఎదురుచూస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తప్ప.. వేరే పార్టీకి అవకాశం లేదు’అని వ్యాఖ్యానించారు.