breaking news
-
ఎన్ని కుట్రలు సృష్టించినా వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదికపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే అంటూ విమర్శలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయింది. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైపోయింది. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే.నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టింది. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనం.కేసీఆర్ గారికి పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారు.మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎఎస్ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందికనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని…— KTR (@KTRBRS) May 28, 2025పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గం. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్-బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశారు.ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలి. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో.. దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి.ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలి. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు కాంగ్రెస్-బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయం’ అంటూ హెచ్చరించారు. -
కవిత లేఖ టీకప్పులో తుపానేనా?
ప్రతిపక్షంలో ఉండగా రాజకీయ పార్టీలకు సంక్షోభాలు సహజం. తెలంగాణలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లోనూ ప్రస్తుతం ఒక సంక్షోభం నెలకొని ఉంది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత లేఖ రాయడం సహజంగానే కలకలం సృష్టించింది. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో.. ఏడాదిన్నర కాలంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్కు ఇది చికాకు కలిగించేదే. కేడర్‌ను గందరగోళంలో పడేసేదే.కవిత లేఖ ఒక ఎత్తు.. అమెరికా నుంచి తిరిగి వస్తూనే విమానాశ్రయంలోనే చేసిన వ్యాఖ్యలు ఇంకో ఎత్తు. ఒకపక్క కేసీఆర్ దేవుడంటూనే.. ఆయన చుట్టూ కొన్ని దెయ్యాలు ఉన్నాయని చెప్పి కవిత బీఆర్ఎస్ను ఇరుకున పెట్టారు. తన లేఖను బయటపెట్టిన కోవర్టులెవరన్న ప్రశ్న కూడా సంధించి దాంతో తనకు సంబంధం లేదని చెప్పారన్నమాట. పార్టీలో కేసీఆర్ తరువాత అత్యంత ప్రముఖులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌లు మరి కొంతమంది మాత్రమే. కవిత తన లేఖను ఎవరి ద్వారా కేసీఆర్‌కు పంపారో తెలియదు కానీ.. పార్టీ ప్రముఖుల్లోనే ఎవరో ఒకరు దాన్ని బయటపెట్టారన్నది ఆమె భావన కావచ్చు.అయితే, ఈ లేఖ లీక్ కావాలని, ప్రజల్లోకి వెళ్లాలని కవిత కూడా కోరుకున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా నుంచి రాగానే విమానాశ్రయంలోనే లేఖ విషయాలను హడావుడిగా మాట్లాడాల్సిన అవసరం లేదు. తండ్రి, సోదరుడితో సంప్రదింపుల తరువాత కూడా వ్యాఖ్యానించి ఉండవచ్చు. అలా కాకుండా పార్టీకి నష్టం కలుగుతుందని తెలిసినా దేవుడు, దెయ్యం వంటి డైలాగులు వాడారంటే ఆమె ఆంతర్యంపై పలు రకాల విశ్లేషణలు వస్తాయి. ఈ విషయం కవితకూ తెలుసు. పైగా ఆమె మద్దతుదారులు, తెలంగాణ జాగృతి కార్యకర్తలు సీఎం, సీఎం అని నినాదాలు ఇవ్వడం, ప్లకార్డులు, బ్యానర్లలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ల ఫోటోలు లేకపోవడం చూస్తే ప్రణాళిక ప్రకారమే కవిత విమానాశ్రయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతుంది.అసెంబ్లీ ఎన్నికల తరువాత ఇప్పుడిప్పుడే పార్టీ పుంజుకుంటున్న తరుణంలో ఈ దుమారం చెలరేగడం కేసీఆర్ కుటుంబంలో ఏదో జరుగుతోందన్న అనుమానాలు పార్టీ కేడర్‌లో రేకెత్తిస్తాయి. కవిత ఇకపై ఏం చేస్తుందన్న ఆందోళన కూడా ఏర్పడుతుంది. కేసీఆర్ స్పందన కోసం అంతా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతానికైతే కేసీఆర్ స్వయంగా స్పందించకపోగా.. ఇతరులు కూడా రియాక్ట్ కావద్దని సూచించారు. కేటీఆర్ ఆయనను కలిసిన తర్వాత కూడా కొత్త పరిణామాలేవీ లేకపోవడం ద్వారా పార్టీ వేచి ఉండే ధోరణిని పాటిస్తోందని అనుకోవాలి. అదే సమయంలో ఎల్లో మీడియా గతంలో వైఎస్ షర్మిలను రెచ్చగొట్టినట్లు తెలంగాణలో కవితను కూడా రెచ్చగొడుతున్నారన్న అనుమానం ఉంది. దానికి తగినట్లే ఆమె పార్టీ పెడతారని, సోషల్ మీడియాలో ఆమెకు అనుకూలంగా కామెంట్లు వస్తున్నాయని టీడీపీకి మద్దతిచ్చే ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. కవిత కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, ఆ పార్టీనే వెనుకాడుతోందని కూడా ఈ ఎల్లో మీడియా కథనాన్ని ఇచ్చింది. జాగృతి కార్యకర్తలు దీన్ని ఖండించవచ్చు కానీ జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది.షర్మిలను రాజకీయంగా వాడుకుని ఆ తర్వాత ఆమెను విఫల ప్రయోగం అని ఎల్లో మీడియా వారే తేల్చేశారు. కవిత పరిస్థితి కూడా అందుకు భిన్నంగా ఉంటుందా అన్న చర్చ ఉంది. కవిత లేఖ ఆధారంగా కాంగ్రెస్, బీజేపీలు రకరకాల వ్యాఖ్యలు చేసి బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేయడానికి ప్రయత్నించాయి. కుటుంబ పంచాయతీ అని, డ్రామా అని, ఆస్తుల తగాదా అని ఈ పార్టీలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వంటి వారు ఆమె సొంత పార్టీ పెడతారని అనే వరకు వెళ్తున్నారు. అంతదాకా వెళతారా అన్నది అప్పుడే చెప్పలేం కానీ పార్టీలో తన ప్రాముఖ్యత పెంచుకోవడానికి యత్నించవచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ ఇదంతా బీజేపీ-బీఆర్ఎస్ డ్రామా అంటున్నారు. కేంద్ర మంత్రి బీజేపీకి చెందిన బండి సంజయ్ కవితను కాంగ్రెస్ వదలిన బాణంగా విమర్శిస్తున్నారు. ఇంకో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదంతా డాడీ, డాటర్ డ్రామా అని వ్యాఖ్యానించారు.కుమార్తె తన తండ్రికి లేఖ రాస్తే తప్పేమిటని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ ప్రశ్నిస్తున్నా.. లేఖలోని విషయాలు, ఒక రాజకీయ పార్టీ అధినేతకు వేసిన ప్రశ్నలు కచ్చితంగా చర్చనీయాంశాలే. ఫీడ్ బ్యాక్ పేరుతో కవిత పార్టీ రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశం తాలూకూ లోటుపాట్లను ఒక జర్నలిస్టులా, విశ్లేషకురాలిగా తన లేఖలో ఎత్తి చూపింది. ఒక వ్యాసంలా సాగిన ఈ లేఖలో కొన్ని పాజిటివ్ పాయింట్లు ఉన్నా.. నెగిటివ్ పాయింట్లే ఎక్కువ. కేసీఆర్ నాయకత్వ పటిమపై కవితకు సందేహం కలిగినట్టుగా ఈ లేఖలోని వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. అలాగే.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో సోదరుడు కేటీఆర్.. పార్టీని నడుపుతున్న నేపథ్యంలో కవితలో ఏదో అసంతృప్తి కూడా ఏర్పడినట్లు స్పష్టమవుతోంది.వరంగల్ సభలో వేదికపై కేసీఆర్‌తో పాటు కేటీఆర్ ఫోటో మాత్రమే ఉండటం కూడా ఆమె అసంతృప్తికి కారణమై ఉండవచ్చు. ఏప్రిల్ 27న జరిగిన పార్టీ రజతోత్సవ సభ విజయవంతం అయిందని.. కేసీఆర్ ప్రసంగాన్ని శ్రద్దగా విన్నారని, కాంగ్రెస్ ఫెయిల్ అని సభికులతో చెప్పించడం, ముఖ్యమంత్రి రేవంత్ పేరును కేసీఆర్ తీయకపోవడం వంటివి కవితకు నచ్చాయట. అయితే, అదే సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం గురించి మాట్లాడకపోవడాన్ని ఆమె ఆక్షేపించారు. కేసీఆర్ ప్రసంగంలో మరింత పంచ్‌ని ప్రజలు ఆశించారని ఆమె చెబుతున్నారు. అయినా ఈ సభతో కార్యకర్తలు, నాయకులు సంతృప్తిగానే ఉన్నారని అంటున్నారు. వారంతా సంతృప్తిగా ఉంటే పనికట్టుకుని కవిత ఈ లేఖ రాసి నెగిటివ్ పాయింట్లపై ఫోకస్ పెట్టవలసిన అవసరం ఏమిటో తెలియదు.నెగిటివ్ పాయింట్ల గురించి చెబుతూ, ఉర్దూలో మాట్లాడకపోవడం, ఎస్సీ వర్గీకరణ, వక్ఫ్ బిల్లు ప్రస్తావన లేకపోవడం, సభ నిర్వహణ ఎవరో పాత ఇంఛార్జీలకు అప్పగించడం నచ్చలేదని అంటున్నారు. సభలో ఇతర నేతలు మాట్లాడే అవకాశం లేకపోవడాన్ని ఆమె తప్పు పట్టారు. సాధారణంగా ఎక్కువ మంది నేతలు ఇలాంటి సభలలో మాట్లాడుతుండే వారు. కానీ, ఈసారి కేసీఆర్ మాత్రమే మాట్లాడారు. ఇది కొంత ఆశ్చర్యంగానే ఉంది. కార్యకర్తల ధూంధాం విఫలమైందని కవిత అభిప్రాయపడ్డారు. బీజేపీపై రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడతారా అని కేసీఆర్‌ను ఆమె నిలదీశారు. భవిష్యత్తులో పొత్తు ఉంటుందేమోనని ఊహాగానాలకు ఆస్కారం కలిగిందని ఆమె విశ్లేషించారు. బీజేపీతో తాను వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డ విషయాన్ని గుర్తు చేసుకున్నారు.అయితే, ఎన్నికల ముందు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు రావడం వల్ల బీఆర్ఎస్కు కూడా ఇబ్బంది అయిన విషయాన్ని కూడా మర్చిపోరాదు. కాంగ్రెస్ పై క్షేత్ర స్థాయిలో నమ్మకం పోయినా, బీజేపీ ప్రత్యామ్నాయం అవుతుందేమోనన్న ఆలోచన పార్టీ శ్రేణులలో ఉందని కవిత అనడం సంచలనమే. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా, మళ్లీ పార్టీని పట్టాలెక్కించేందుకు తంటాలు పడుతున్న తరుణంలో కవిత ఈ మాటలు అనడం నష్టమే. కేసీఆర్ ప్రత్యేక కార్యాచరణ, దిశానిర్దేశం చేయలేకపోయారని కూడా ఆమె తప్పుపట్టారు. ఒకటి, రెండు రోజులు ప్లీనరీ నిర్వహించి పార్టీ శ్రేణుల అభిప్రాయాలను తీసుకుని ఉండాల్సిందని ఆమె అన్నారు. బహిరంగ సమావేశాలలో అభిప్రాయాలు తీసుకునే పరిస్థితి ఉండదు. కవిత లేఖ సారాంశం.. పార్టీ ఆశించినంత బాగా నడవడం లేదు అన్నది అనిపిస్తుంది. కేటీఆర్‌తో సంబంధాలేమైనా దెబ్బతిన్నాయా అన్న అనుమానం కలుగుతుంది.కొద్ది రోజుల క్రితం హరీశ్‌రావు ఇంటికి వెళ్లి కేటీఆర్ రెండుగంటలు భేటీ అయి.. అంతా బాగుందన్న భావన కలిగించడానికి యత్నిస్తే, సోదరి రూపంలో ఈ కొత్త సమస్య వచ్చింది. అయితే, కవిత మరీ అధికంగా స్పందిస్తే ఆమెకే నష్టం. దేవుడి చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అనడం ద్వారా తండ్రిని ఆమె గౌరవించినట్లా? లేక అవమానించినట్లా అన్న చర్చ జరుగుతోంది. పురాణాలలో దెయ్యాల మధ్యలో దేవుడు ఎక్కడైనా కనిపించారా?. తండ్రికి తన లేఖలో‘సారీ’ చెబుతూ ముగించినా, ఆమె ఎయిర్ పోర్టులో చేసిన ఘాటైన వ్యాఖ్యలతో ఆ ‘సారీ’కి అర్థం లేకుండా పోయింది. ‘అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం.. ఆత్మ తృప్తికై ఆడుకునే వింత నాటకం’ అని ఒక కవి అంటాడు. ఇటువంటి రాజకీయాలు చూస్తే ఆ మాట నిజం అనిపిస్తుంది కదా!. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఎందుకీ సాగదీత?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ అంశం మరోమారు చర్చనీయాంశమవుతోంది. గత నాలుగైదు రోజులుగా ఢిల్లీ వేదికగా రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయం నడుస్తుండడం, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పార్టీ పెద్దలతో చర్చల కోసం వెళ్లడం, నీతి ఆయోగ్ సమావేశం కోసం వెళ్లిన సీఎం రేవంత్ ఆ తర్వాత ఒకరోజంతా అక్కడే వేచి ఉండడం, పీసీసీ అధ్యక్షుడితో సమావేశమైన అధిష్టానం పెద్దలు ఈనెల 30న మరోమారు రావాలంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు సమాచారమిచ్చిన నేపథ్యంలో అసలేం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో గత ఏడాది కాలంగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తున్న కేబినెట్ విస్తరణ కోసం ఆశావహ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తుండగా, అధిష్టానం ఈసారైనా అనుమతిస్తుందా..లేదా? అన్న సంశయం రాష్ట్ర కాంగ్రెస్ నేతలను వెంటాడుతోంది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మంత్రివర్గ విస్తరణ విషయంలో అనేక అంశాలు బేరీజు వేసుకుంటున్న కాంగ్రెస్ అధిష్టానం లేనిపోని తలనొప్పులు ఇప్పుడెందుకనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈ నెల 30 తర్వాత పీసీసీ కార్యవర్గ ప్రకటనతోనే సరిపెడుతుందని, మరికొన్ని రోజుల తర్వాతే కేబినెట్ విస్తరణ ఫైల్‌ను కదిలిస్తుందనే అభిప్రాయం గాం«దీభవన్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.ఈ పీటముడులు వీడవా?రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ విషయంలో పడిన పీటముడులు వీడేవి కావనే అభిప్రాయానికి అధిష్టానం పెద్దలు వచ్చారనే చర్చ గాం«దీభవన్ వర్గాల్లో జరుగుతోంది. జనగణనలో కులగణన చేసి బీసీల లెక్క తేల్చాలని, ఎవరి వాటా ఎంతో తేల్చాలని కోరుతున్న కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు రాష్ట్ర మంత్రివర్గంలో బీసీ నేతలకు ఎన్ని బెర్తులిస్తారన్న దానిపై స్పష్టత లేదు. ఇప్పుడున్న రెండింటికి తోడు మరొకటి వస్తుందని అనుకుంటున్నా.. ఆ తర్వాత ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు.ఇక జిల్లాలు, సామాజిక వర్గాల వారీగా కుదరని పొంతన, టీపీసీసీ కార్యవర్గానికి, కార్పొరేషన్ చైర్మన్ పోస్టులకు, అసెంబ్లీలో ఇచ్చే పదవులకు మంత్రివర్గ విస్తరణతో లింకు పెట్టడం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధిష్టానం పక్షాన ఇచి్చన హామీలను నెరవేర్చడం, సీఎం అభిప్రాయం, ఇతర సీనియర్ల ప్రతిపాదనలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ నివేదికలు... ఇలా కావాల్సినన్ని పీటముడులు ఉన్న ఈ అంశం అసలు పరిష్కారమయ్యే మార్గం కూడా దొరకడం లేదనేది బహిరంగ రహస్యమని అంటున్నారు. మరోవైపు ఇద్దరు, ముగ్గురు మంత్రుల పనితీరు ఆశాజనకంగా లేదన్న రిపోర్టులు కూడా ఈ సాగదీతకు కారణమని తెలుస్తోంది. దీంతో మంత్రివర్గ విస్తరణతో పాటు ప్రక్షాళన కూడా చేయాలనుకుంటే ఇంకో ఆరు నెలల సమయమిచి్చ, పనితీరు సరిగా లేని వారిని కూడా పక్కనపెట్టి, వారి సామాజిక వర్గాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఒకేసారి విస్తరణ పూర్తి చేస్తే బాగుంటుందనే యోచనలో కాంగ్రెస్ పెద్దలున్నట్టు సమాచారం.ఏకాభిప్రాయమెలా సాధ్యం? మంత్రివర్గ విస్తరణ కోసం అటు ఢిల్లీ పెద్దలు, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యులు పలుమార్లు చర్చలు జరిపారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా దీపాదాస్ మున్షీ ఉన్నప్పటి నుంచే ఇటు సీఎం నివాసం, అటు ఏఐసీసీ కార్యాలయం వేదికగా చాలాసార్లు సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, సీనియర్ మంత్రి ఉత్తమ్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌లు భేటీ అయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీతో కూడా చర్చోపచర్చలు జరిపారు.చివరకు మార్చి నెలలో పార్టీ పెద్దలను కలిసిన సందర్భంగా ఇక అన్ని చర్చలు అయిపోయాయని, తమ ప్రతిపాదనలన్నింటినీ అధిష్టానం ముందుంచామని, విస్తరణ బంతి అధిష్టానం కోర్టులో ఉందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం మంత్రివర్గ విస్తరణ అంశం ఫ్రీజ్ అయిందని (స్తంభించిందని), ఈ వ్యవహారాన్ని అధిష్టానమే పరిష్కరిస్తుందని అధికారికంగానే చెప్పారు. అయితే ఇంతా జరిగి, ఇన్ని చెప్పిన తర్వాత మళ్లీ ఢిల్లీ వేదికగా మంత్రివర్గ విస్తరణ చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు దేనికి సంకేతమని పార్టీ నేతలు అంటున్నారు.గతంలో కుదరని ఏకాభిప్రాయం ఇప్పుడెలా సాధ్యమవుతుందని, ఏకాభిప్రాయం పేరుతో ఈ సాగదీత ఎందుకనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పారీ్టలోని ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రివర్గ విస్తరణ జాప్యం అంశంలో అసహనంతో ఉన్నారని, వీలున్నంత త్వరలో తమకు కేబినెట్ హోదా ఇవ్వకుంటే అమీతుమీ తేల్చుకుంటామని, తమ దారి తాము చూసుకునే పని ప్రారంభిస్తామని తమ సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారన్న వార్తలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.అయితే.. అనూహ్యమేప్రస్తుత పరిస్థితుల్లో ఈనెల 30వ తేదీ తర్వాత కూడా పీసీసీ కార్యవర్గ ప్రకటన మాత్రమే ఉంటుందని, మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం మరికొంత సమయం తీసుకుంటుందని తెలుస్తోంది. ఒకవేళ మంత్రివర్గ విస్తరణకు గ్రీన్‌సిగ్నల్ వస్తే అది అనూహ్యమేనని, అలా జరిగినా రెండు లేదా మూడు బెర్తులు మాత్రమే భర్తీ చేస్తారని సమాచారం. మరికొంత సమయం తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన చేస్తామనే సంకేతాలను ఇచ్చి ఈ బెర్తులను భర్తీ చేసే అవకాశముంటుందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు అభిప్రాయపడ్డారు. -
కవిత కొత్త పార్టీ ప్రకటన అప్పుడే.. చేరబోయేది ఎవరంటే
సాక్షి,హైదరాబాద్: ‘మై డియర్ డాడీ అంటూ’ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత .. తండ్రి కేసీఆర్‌కు రాసిన ఆరు పేజీల లేఖ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పుట్టించింది. అయితే, ఆ లేఖ బీఆర్ఎస్తో పాటు, ఆ పార్టీ కీలక నేతల్ని ఇరుకున పెట్టేలా ఉండడంతో నాటి నుంచి ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ కీలక నేతల గురించి, అంతర్గత వ్యవహారాల గురించి ఎక్కడో చోట మాట్లాడుతూనే ఉన్నారు. కవిత బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నారని ఒకరు? కాదు, కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ మరొకరు బహిరంగ ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. తాజాగా, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇదే తరహా సంచలన వ్యాఖ్యలు చేశారు.జూన్ 2న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు కవిత సిద్ధమయ్యారు. కొత్త పార్టీ పెట్టిన తర్వాత కవిత పాదయాత్ర చేయనున్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతున్న తరుణంలో కొత్త పార్టీ పేరుతో కేసీఆర్ కుటుంబం డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందన్నారు. వారి కుటుంబంలో ఎవరికి ఎవరు నచ్చకపోయినా కవిత పార్టీలోకి వెళ్లేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు రఘునందన్ రావు. కేసీఆర్‌కు కవిత లేఖఇటీవల కేసీఆర్‌కు కవిత రాసిన లేఖ వెలుగులోకి వచ్చిన సమయంలో రఘునందన్ రావు కవిత, బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కవిత రాసిన లేఖ రాజకీయ పంచాయతీ నా , ఆస్తుల పంచాయతీ నా? కవిత చెప్పినా చెప్పకున్నా తెలంగాణలో బీజేపీ బలపడుతున్నది. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ప్లీనరీ సందర్భంగా కేసీఆర్ కుటుంబంలో వారసత్వ చిచ్చు వచ్చింది నిజమని తెలుస్తోంది. కవితను బయటకు పంపించడం కోసం బావా, బామ్మర్దులు ఒక్కటి అయ్యారు అనే సంకేతం వారి మీటింగ్ ద్వారా ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త పార్టీ కవిత లేఖ రాసిన రోజే కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రిక, టీవీలలో వార్త ప్రముఖంగా వచ్చింది. కవిత కాంగ్రెస్‌లోకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. సీఎం ఈ డ్రామా వెనకా ఉన్నట్టుగా కనిపిస్తున్నది. లేదా ఇటీవలే బీఆర్ఎస్ సిద్ధాంత కర్త, పునాది అని చెప్పుకునే వ్యక్తి హరీష్‌తో కొత్త పార్టీ పెట్టించాలని అన్నారు. ఇప్పుడు కవితతో పార్టీ పెట్టించి కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నం సాగుతున్నది. ఎవరేం చేసినా వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టడం ఆపడం ఎవరి తరం కాదు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ ఏకంగా కవిత కొత్త పార్టీ పెట్టడమే కాదు, అందులో చేరబోయే నేతల గురించి ప్రస్తావిస్తూ రఘునందన్ రావు వ్యాఖ్యానించడం గమనార్హం. -
‘మీరే చెప్పండి.. ఇది అచ్చేదిన్ కాదా?’
హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేళ్ల పాలనపై ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే విషం చిమ్ముతున్నారరంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ధ్వజమెత్తారు. మోదీ తన పాలనలో చేసిన అభివృద్ధి మీకు కనిపించడం లేదా ఖర్గే జీ.. అంటూ లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈరోజు(మంగళవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి మీడియా సమావేశం నిర్వహించారు లక్ష్మణ్,‘మోదీ పదకొండు ఏళ్ల పాలనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విషం చిమ్ముతున్నారు. ప్రపంచంలో పదవ స్థానంలో ఉన్న భారత్ ను మోదీ నాలుగవ ఆర్థిక శక్తిగా ఎదిగేలా చేశారు. మోదీ విధానాలు, కులం, వస్త్రాలపై రాహుల్ గాంధీ అవహేళన చేశారు. స్టాండప్, స్టార్టప్, మేక్ ఇన్ ఇండియాగా మోదీ తీర్చిదిద్దారు. ఉద్యోగాలు ఇవ్వడమే కాదు.. ఉద్యోగాలు కల్పించే వ్యవస్థలుగా యువతను తీర్చిదిద్దారు. జాతీయ రహదారులు, రైల్వే, వైమానిక రంగాలను అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ పాలన కన్నా వంద రెట్ల అభివృద్ధి మోదీ చేసి చూపించారు. నకిలీ విత్తనాలు అరికట్టి, కనీస మద్దతు ధరలు, సబ్సిడీలు మోదీ ప్రభుత్వం కల్పించింది. ఇది అచ్చేదిన్ కాదా ఖర్గే చెప్పాలి. ఓబీసీలపైన రాహుల్ గాంధీ మొసలి కన్నీరు కారుస్తున్నారు. మోదీ గ్లోబల్ లీడర్ గా ఎదిగారు.. ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో మోదీ తరహాలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పారా?, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ దేశ రక్షణ రంగ ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మల్లిఖార్జున్ ఖర్గే వాస్తవాలు గ్రహించాలి. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయింది. ముఖ్యమంత్రి డిల్లీలో మూడు రోజులు పడిగాపులు కాశారు. రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం రాష్ట్ర ప్రజలను అవమానించడమే. కుటుంబ కలహాలు, ఆస్తుల పంపకాలు, వారసత్వ రాజకీయాల వల్లే బీఆర్ఎస్ లో కొట్లాట. బీజేపీ వెన్నుపోటు రాజకీయాలు చేయదు. ఆయుదాలు చేతిలో పట్టుకొని చర్చలు అంటే ఎట్లా?, ఆపరేషన్ సిందూర్ ను విమర్శిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు’ అని లక్ష్మణ్ స్పష్టం చేశారు. -
లూటీ అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాం
అచ్చంపేట/ఆమనగల్లు: ‘ప్రజాప్రభుత్వంలో సమగ్ర ప్రణాళికతో సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని లూటీ చేసింది. మేము గాడిలోకి తెచ్చి రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం. ప్రపంచం మొత్తం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. మేం తెచ్చిన ప్రతి పథకం దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తోంది.. ఇప్పటికే మీ మోడల్ మాకు చెప్పండంటూ ఇతర రాష్ట్రాలు అడుగుతున్నాయి’అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని గట్టుతుమ్మన్ గ్రామంతోపాటు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో పలు అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. కులగణనతో దేశానికే ఆదర్శంగా నిలిచాం గట్టుతుమ్మన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ కులగణన 50 రోజుల్లో పూర్తి చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని ఆయన కుమార్తె కవిత ఇప్పుడు చెబుతోందని.. కానీ రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లోనే ఈ దెయ్యాలను వదిలించుకొని ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని భట్టి ఎద్దేవా చేశారు. రెండు దశాబ్దాలపాటు రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన ప్రణాళికను తాము తయారు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందని కేసీఆర్ దు్రష్పచారం చేశారు.. ‘మా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వల్ల కేసీఆర్ వద్దకు ఎవరూ రావట్లేదని ఆయన బాధపడుతున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ పోతుందని కేసీఆర్ దు్రష్పచారం చేశారు. అప్పట్లో మేము సవాల్ చేశాం. చెప్పినట్లుగానే డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుదుత్పత్తి చేస్తున్నాం’అని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా మరో 50 ఏళ్ల విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని తమ ప్రభుత్వం ప్రణాళికలను రచిస్తోందని భట్టి చెప్పారు. 2029–30 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో భవిష్యత్ తరాలకు మిగులు విద్యుత్ అందిస్తామని.. ఇతర రాష్ట్రాలకు విద్యుత్‌ను అమ్మే స్థాయికి ఎదుగుతామని పేర్కొన్నారు. సంక్షేమానికి ఏటా రూ.70 వేల కోట్లు రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు ఏటా రూ. 70 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్‌లో రూ. 200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, రూ. 18 కోట్లతో నిర్మించనున్న 8 విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో పాల్గొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని త్వరితగతిన పూర్తిచేసి సాగునీరు అందించడమే ప్రజాప్రభుత్వ ఎజెండా అని తెలిపారు.పెండింగ్‌లో ఉన్న రిజర్వాయర్ల భూసేకరణ నిధులను వెంటనే విడుదల చేస్తామన్నారు. ఆయా కార్యక్రమాల్లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వంశీకృష్ణ, మధుసూదన్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వనితుడు చల్లా వంశీచంద్‌రెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.విద్యుత్ కార్మికులకు రూ.కోటి ప్రమాద బీమాదేశ చరిత్రలోనే ఓ రికార్డు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కసాక్షి, హైదరాబాద్/హన్మకొండ: విద్యుత్ కార్మికులకు కోటి రూపాయలకు పైబడి ప్రమాద బీమా అందించడం దేశ చరిత్రలోనే ఒక రికార్డు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) పరిధిలో విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన జోగు నరేశ్ కుటుంబ సభ్యులకు సోమవారం ప్రజాభవన్‌లో కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కుతో పాటు విద్యుత్ శాఖలో నరేశ్ శ్రీమతికి కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన సందర్భంగా భట్టి మాట్లాడారు.విద్యుత్ కార్మికునికి కోటి రూపాయల ప్రమాద బీమా చెక్కును అందించడం కేవలం సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. గతంలో కార్మికుల కోసం ఏ ప్రభుత్వం ఇంత గొప్పగా ఆలోచన, ప్రయత్నం చేయలేదని చెప్పారు. ప్రమాద బీమా, కారుణ్య నియామక పత్రం అందించడం ప్రభుత్వ ఆలోచనకు, మానవీయ కోణానికి అద్దం పడుతోందని, విద్యుత్ ఉద్యోగులు అంకితభావంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. ప్రభుత్వ ఆలోచనను సమర్థవంతంగా అమలు చేసిన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డిని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి విద్యుత్, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. స్పందించిన కవిత
సాక్షి, హైదరాబాద్: కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటీఆర్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.‘‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. మా పార్టీ నాయకులకు వరుస నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉన్నట్లు తేటతెల్లమైంది’’ అంటూ ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించినా తట్టుకొని నిలబడ్డ చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత అన్నారు.తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం @KTRBRS గారికి నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటిల రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ చేసినట్లు…— Kavitha Kalvakuntla (@RaoKavitha) May 26, 2025 హరీష్‌రావు రియాక్షన్.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులపై మాజీ మంత్రి హరీష్‌రావు స్పందిస్తూ.. ప్రతీకార రాజకీయాలు రేవంత్ రెడ్డి అభద్రతకు స్పష్టమైన సంకేతమన్నారు. ‘‘కల్పిత కేసులు కోర్టులో నిలబడవు. ప్రజల విశ్వాసాన్ని రేవంత్ రెడ్డి గెలుచుకోవు. కేటీఆర్‌కు అండగా నిలబడతాం. కేటీఆర్ ఏసీబీ కేసులో సత్యం గెలుస్తుంది’’ అని హరీష్‌రావు అన్నారు. -
కొత్త పార్టీ ఖాయమా?.. ఎమ్మెల్సీ కవిత కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్సీ కవిత కీలక సమావేశం ఆసక్తిగా మారింది. కవితతో బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు దామోదర్‌రావు భేటీ అయ్యారు. దామోదర్‌రావుతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇంఛార్జ్ గండ్ర మోహన్‌రావు కూడా సమావేశమయ్యారు. మూడు గంటలుపైగా కొనసాగిన ఈ సమావేశానికి.. కవిత కొత్త పార్టీ పెడుతుందన్న ప్రచారంతో ప్రాధాన్యత ఏర్పడింది. ఇటీవల తన తండ్రి కేసీఆర్‌కు లేఖ రాసిన కవిత సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.ఎల్కతుర్తిలో గత నెల 27న జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వచ్చిన స్పందన, తన తండ్రి కేసీఆర్ ప్రసంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసిన లేఖ పార్టీలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. అయితే, కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది.‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు నిన్న(ఆదివారం) ఎర్రవల్లి ఫాంహౌస్‌కు వెళ్లిన కేటీఆర్.. తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కవిత లేఖపై చర్చ జరిగినట్లు సమాచారం. కవిత లేఖ నేపథ్యంలో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరిచి క్యాడర్‌ను గందరగోళానికి గురి చేశారని కేసీఆర్‌కు కేటీఆర్ వివరించినట్టు సమాచారం. -
తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్!
ఢిల్లీ: తెలంగాణలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మంత్రి వర్గం కూర్పుపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కేసీ వేణుగోపాల్‌తో రేవంత్‌రెడ్డి చర్చించారు. కేబినెట్లో ఆరు పదవులు ఖాళీ ఉండగా.. ఐదుగురిని భర్తీ చేస్తారని సమాచారం. రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉండగా.. బీసీ కోటాలో వాకిటి శ్రీహరి, ఎస్సీ కోటాలో వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఎస్టీ కోటాలో రామచంద్రనాయక్, బాలు నాయక్ పేర్లు పరిశీలనలో ఉండగా.. ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు రేసులో ఉన్నారు.త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. ఈ అంశంపై రాహుల్‌తో కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారన్నారు. కేబినెట్ విస్తరణపై మా అభిప్రాయాలు ఇప్పటికే చెప్పాం. రేపో, మాపో టీపీసీసీ కార్యవర్గం ప్రకటన కూడా ఉంటుందని ఆయన తెలిపారు. పీసీసీ కార్యవర్గ ఏర్పాటు, జై భీమ్ జై సంవిధాన తదితర అంశాలపై చర్చించానని మహేష్ గౌడ్ తెలిపారు.ఢిల్లీలో రాహుల్ గాంధీతో కేసీ వేణుగోపాల్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. మర్యాద పూర్వకంగా కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిసానని.. తెలంగాణ రాష్ట్ర అంశాలను రాహుల్ గాంధీకి వివరించానని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. వీలైనంత త్వరగా క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయాలని రాహుల్ గాంధీని కోరా.. త్వరగా చేస్తామని చెప్పారు.ఇవాళ, రేపటిలోగా పీసీసీ కార్యవర్గ ప్రకటన ఉంటుంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఒకటి రెండు, సార్లు మా అభిప్రాయాలను అధిష్టానానికి తెలిపాం. తెలంగాణ క్యాబినెట్లో బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని అధిష్టానాన్ని కోరాం’’ అని మహేష్ గౌడ్ వెల్లడించారు. -
సిరిసిల్లలో హైటెన్షన్.. కేటీఆర్ క్యాంపు కార్యాలయం ముట్టడి
రాజన్న సిరిసిల్ల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రోటోకాల్ పాటించాలంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ నేతలు ముట్టడించారు. ఎమ్మెల్యే కేటీఆర్ కార్యాలయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదంటూ కాంగ్రెస్ నాయకులు నిరసనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణా తల్లి ఫోటోలతో కాంగ్రెస్ నాయకులు రాగా.. పోలీసులు అడ్డుకున్నారు.దీంతో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. తెలంగాణా తల్లి, సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు తీసుకొని క్యాంపు కార్యాలయాన్ని ముట్టడికి కాంగ్రెస్ నాయకులు యత్నించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.లాఠీఛార్జ్‌లో బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. తోపులాటలో టౌన్ సిఐ కృష్ణ వేలికి గాయమైంది. ప్రోటోకాల్ విషయంలో ఇరువర్గాల పరస్పరం వాగ్వాదంతో రచ్చ రచ్చగా మారింది. క్యాంపు కార్యాలయంలో కొత్త సీఎం ఫోటో ఉండాలని.. కానీ పాత సీఎం కేసీఆర్ ఫోటో ఉందని సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఈ విషయంపై వివాదం నెలకొంది. -
బీజేపీ మార్క్ అభివృద్ధి.. వీడియోలతో పరువు తీసిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైరికల్ కామెంట్స్ చేశారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మే నెలలో కురిసిన సాధారణ వర్షపాతం బహిర్గతం చేసిందని ఎద్దేవా చేశారు. భవనం పైకప్పునే సరిగ్గా నిర్మించలేకపోయిన వాళ్లు.. కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారంటూ వీడియోను షేర్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బహిర్గతం చేయడానికి సాధారణ వర్షం చాలు.. హైదరాబాద్‌లో 430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అయినా ఢిల్లీ విమానాశ్రయం పైకప్పులైనా, బీజేపీ మార్క్ ‘అభివృద్ధి’ని చెప్పడానికి సాధారణ వర్షం సరిపోతుంది. బీజేపీ ప్రభుత్వం సరిగ్గా పైకప్పును కూడా నిర్మించలేకపోవడం విచారకరం.. కానీ, బీజేపీ వాళ్లు కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన షేప్ షిఫ్టర్ పైకప్పుల అద్భుతమైన సరికొత్త డిజైన్లను ఏ ఏజెన్సీ పరిశీలిస్తుందో చూడాలి మరి?!’ అంటూ సెటర్లు వేశారు.Be it the 430 crore Cherlapally Railway Station in Hyderabad or the roofs at the Delhi Airport, all it takes is a simple rain to expose the BJP mark ‘development’Isn’t this the same roof that collapsed last year in Delhi? And it took only one shower to bring it all down? It… pic.twitter.com/KWBuNFgYll— KTR (@KTRBRS) May 26, 2025ఇక, ఈ వీడియోలో ఇటీవల బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన ఢిల్లీ విమానాశ్రయం, చర్లపల్లి రైల్వే స్టేషన్ కనిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ వీటిని ఎంతో ఆడంభరంగా ప్రారంభించి.. ప్రచారం చేశారు. ఇవి ప్రారంభమై కొన్ని నెలలే అవుతున్నప్పటికీ చిన్న పాటి వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. New Tourist Place చర్లపల్లి రైల్వేస్టేషన్ వాటర్ ఫాల్స్ 👇 pic.twitter.com/vcT4WupKzy— Tirumanndas Narresh Goud (@GoudNareshBrs) May 22, 2025ఈదురు గాలులకు కూలుతున్న చర్లపల్లి రైల్వే స్టేషన్.ప్రధాన మంత్రి ఇటీవలే ప్రారంభించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ చిన్న పాటి గాలులకు ఊడి పడడం చూసి విస్తుపోతున ప్రజలు. pic.twitter.com/nkxf3m7Sws— Telangana365 (@Telangana365) May 3, 2025Vikas overflows in Delhi Airport after a drizzle. pic.twitter.com/BP7bA5QaGV— Congress Kerala (@INCKerala) May 25, 2025 -
బనకచర్లతో తెలంగాణకు భారీ నష్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు నీటి ప్రయోజనాలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుంటే అడ్డుకోవలసిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఆ పార్టీ ఎంపీలు.. తమకేమీ పట్టనట్లుగా ఉన్నారని ధ్వజమెత్తారు. గోదావరి–బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జల దోపిడీ మళ్లీ షురూ ఉమ్మడి పాలనలో సాగిన జల దోపిడీ, నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని, ఎప్పటిలాగే పదవుల కోసం పెదవులు మూసుకుంటున్నారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రయోజనాలకు నీళ్లొదిలి సీఎం రేవంత్‌రెడ్డి గురు దక్షిణ చెల్లించుకుంటూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని దుయ్యబట్టారు. బనకచర్ల ద్వారా 200 టీఎంసీల గోదావరి జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్ర చేస్తోందన్నారు.ఇందుకు సహకరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని విమర్శించారు. నాడు తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని లేఖలు రాసిన చంద్రబాబు నేడు మిగులు జలాలను తీసుకుంటున్నట్లు చెప్పడం శోచనీయమన్నారు. ఏ ఒక్క అనుమతి లేకుండా, నిబంధనలు బుల్డోజ్ చేస్తూ, కేంద్రం జుట్టు తమ చేతిలో ఉందని ఏపీలో రాత్రికి రాత్రి పనులు చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనుమతుల్లేని ప్రాజెక్టుకు నిధులెలా ఇస్తారు? గత అసెంబ్లీలో నీతి అయోగ్ బహిష్కరిస్తాం అని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందరి కంటే ముందే నీతి అయోగ్ మీటింగ్‌కు వెళ్లారని, బనకచర్లను అడ్డుకుంటారని భావిస్తే ఏమీ మాట్లాడకుండా వచ్చారని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు 50 శాతం కేంద్రం గ్రాంటు ఇవ్వడంతో పాటు, మరో 50 శాతం ఎఫ్ఆర్బీఎంను మించి రుణం తీసుకునే వెసులుబాటు కల్పిస్తారని చెపుతున్నారని.. నిబంధనలు ఉల్లంఘించి నిర్మించే ప్రాజెక్టుకు ఇలా నిధులు, అనుమతులు, రుణాలు ఎలా ఇస్తారని నిలదీశారు. కిషన్‌రెడ్డి చొరవ చూపి ఈ ప్రాజెక్టును ఆపాలన్నారు. లేదంటే ఢిల్లీ సీడబ్ల్యూసీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తెలంగాణపై ఎందుకింత కక్ష? పోలవరానికి జాతీయ హోదా ఇచి్చ..కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు ఎందుకు జాతీయ హోదా ఇవ్వరని హరీశ్‌రావు ప్రశ్నించారు. పోలవరానికి రూ.80 వేల కోట్లు, బనకచర్లకు రూ.80 వేల కోట్లు కలిపి రూ.1.6 లక్షల కోట్లు ఏపీకి ఇస్తున్నప్పుడు, తెలంగాణ ప్రాజెక్టులకు అందులో ఒక్క శాతం అయినా ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెలంగాణపై బీజేపీకి ఎందుకింత కక్ష, సవతి తల్లి ప్రేమో అర్థం కావడం లేదన్నారు.కృష్ణాలో వాటా కోసం కేసీఆర్ పోరాటం చేసి సెక్షన్ 3ని సాధించారని,. కొత్త ట్రిబ్యునల్ సాధించారని చెప్పారు. గోదావరి మీద కూడా భవిష్యత్తులో కొత్త ట్రిబ్యునల్ వస్తుందని భావించి ప్రాణహితకు 160 టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే, కాళేశ్వరానికి 240 టీఎంసీల నీటి కేటాయింపులు చేసినట్లు తెలిపారు. ఈ విధంగా పలు ప్రాజెక్టులు చేపట్టి కొన్నింటిని పూర్తి చేశామని వివరించారు. కాంగ్రెస్ వాళ్లు ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ఉండబట్టే నీళ్లు కిందకు వెళుతున్నాయని అన్నారు. -
ఆ విమర్శలపై స్పందించొద్దు
సాక్షి, హైదరాబాద్ : పార్టీలో అంతర్గత విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారం..విమర్శలకు పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదని, పార్టీలో వ్యక్తమయ్యే భిన్నాభిప్రాయాలపై తొందరపడి స్పందించొద్దని మాజీ సీఎం కేసీఆర్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సూచించారు. జూన్ 1న అమెరికాలోని డల్లాస్‌లో జరిగే పార్టీ రజతోత్సవ సభకు హాజరయ్యేందుకు కేటీఆర్ ఈనెల 28న హైదరాబాద్ నుంచి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఎర్రవల్లిలోని నివాసంలో కేసీఆర్‌తో కేటీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు.ఈ సందర్భంగా గత నెల 27న ఎల్కతుర్తిలో జరిగిన పార్టీ రజతోత్సవ సభ, అనంతరం జాతీయంగా, రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, వాటిపై బీఆర్ఎస్ స్పందిస్తున్న తీరుపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పార్టీలో అంతర్గత విభేదాలు అంటూ జరుగుతున్న ప్రచారం, విమర్శలపై కేసీఆర్‌తో చర్చించారు. ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ, అమెరికా పర్యటన నుంచి వచి్చన తర్వాత కవిత చేసిన వ్యాఖ్యలు తదితర అంశాలు ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేసేందుకు ఫోకస్ పెట్టాలని, అందుకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కేసీఆర్ ఆదేశించారు. త్వరలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి సభ్యత్వ నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలు ఇవ్వాలని కేటీఆర్‌ను ఆదేశించారు.డిజిటల్ సభ్యత్వ నమోదుకు సాంకేతికంగా జరుగుతున్న ఏర్పాట్లు, రూపొందిస్తున్న యాప్‌నకు సంబంధించిన వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు డల్లాస్ సభలో ప్రసంగిచాల్సిన అంశాలపై ఇద్దరి మధ్య చర్చ సాగింది. తెలంగాణవాసులతో సభ అనంతరం జరపాల్సిన భేటీలపై ఈ సందర్భంగా కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసే బాధ్యతను మండలిలో ప్రతిపక్ష నేత, పార్టీ సీనియర్ నేత మధుసూదనాచారికి అప్పగించాలని నిర్ణయించారు. -
బీసీల సాధికారతపై నేడు కాంగ్రెస్ సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: బీసీల సాధికారతపై కాంగ్రెస్ పార్టీ సోమవారం కీలక సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో కాంగ్రెస్ అగ్రనేత, రాహుల్‌గాం«దీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేల నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న తాజా, మాజీ పీసీసీ అధ్యక్షులు, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకావాలని ఇప్పటికే అధిష్టానం ఆదేశించింది. టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ రెండురోజుల క్రితమే కులగణనపై కాంగ్రెస్ అధిష్టానానికి ఇందిరాగాంధీ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం తెలిసిందే.అప్పటి నుంచి ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. సోమవారం జరిగే సమావేశంపై కాంగ్రెస్ పెద్దలతో కలిసి చర్చల్లో పాల్గొంటారు. తెలంగాణలోని బీసీ మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఈ భేటీకి హాజరవుతారు. ఆదివారం మాణిక్యం ఠాగూర్, మహేశ్‌గౌడ్ సహా పలువురు నేతలు కులగణనకు సంబంధించి సమావేశ నిర్వహణపై చర్చించారు. కులగణనపై దేశవ్యాప్తంగా వర్క్‌షాపులు నిర్వహించాలని అధిష్టానం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది.రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఇచి్చన హామీ మేరకే తెలంగాణలో కులగణన సర్వే జరిగిందని, కాంగ్రెస్ ఒత్తిడి వల్లే కేంద్రం కులగణన ప్రకటన చేసిందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లేదా బిహార్‌లో కులగణన ప్రకటనలో కీలకపాత్ర పోషించిన రాహుల్‌కు ధన్యవాద సభ, భారీ ర్యాలీ నిర్వహించాలని యోచిస్తోంది. -
కేబినెట్లో బీసీలే అత్యధికంగా ఉండాలి
సాక్షి, న్యూఢిల్లీ: త్వరలో జరగబోయే రాష్ట్ర మంత్రివర్గ విస్తర ణలో అత్యధిక శాతం బీసీలు ఉండాలని అధిష్టానాన్ని కోరుతున్నట్టు టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. టీపీసీసీ కార్యవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీ, మైనారిటీలకు 70% వరకు అవకాశం ఇవ్వబోతున్నామని స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ కోరుకున్న విధంగా అందరికీ సమాన భాగస్వామ్యం ఉంటుందన్నారు.ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా బీసీ నినాదం అనేది దేశవ్యాప్తంగా అంటుకుందని చెప్పారు. రా హుల్ జాతీయస్థాయిలో ఓబీసీల విషయంలో గొంతెత్తడంతో కొంత చలనం వచ్చిందని.. దానికి తెలంగాణ దిక్సూచి గా మారిందన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మహేశ్‌గౌడ్ రాష్ట్ర తాజా రాజకీయాలు, ఇతర అంశాలపై ఆదివారం ‘సాక్షి’తో ముచ్చటించారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... మా అభిప్రాయాలను అధిష్టానానికి చెప్పాం ‘మంత్రివర్గ కూర్పు విషయంలో ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, నేను, సీనియర్ నాయకులమంతా మా అభిప్రాయాలను ఏ ఐసీసీకి చెప్పాం. జూన్‌లో అధిస్టానం తుది నిర్ణయం ప్రకటిస్తుందని అనుకుంటున్నాం. వీలైనంత త్వరగా కేబినెట్, టీపీసీసీ కార్యవర్గ విస్తరణ జరగాలని కోరుకుంటున్న వారిలో నేను మొదటి వ్యక్తిని. ప్రభుత్వ, పార్టీపరమైన పదవుల్లో మహిళలకు ప్రాధాన్యం ఉంటుంది. నేను, రేవంత్ జోడెడ్లలా పనిచేస్తున్నాం నాకు..రేవంత్‌రెడ్డి మధ్య సఖ్యత ఉంది. ముఖ్యమంత్రిగా ఆయన, టీపీసీసీ అధ్యక్షుడుగా నేను జోడెడ్లలాగా పనిచేస్తున్నాం. అలా చేస్తేనే పార్టీకి నష్టం జరగకుండా ముందుకు పోతుంది. అంతా ఐక్యంగా ఉన్నారనే విశ్వాసంతోనే ప్రజలు మాకు అధికారం కట్టబెట్టారు. వారి ఆకాంక్షలు, ఆశయాల మేరకు మేము పనిచేయాల్సిందే. ఒత్తిళ్తు, విభేదాలున్నా, వాటిని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా ముందుకు పోతున్నాం. ఆ పార్టీ వ్యవహారాన్ని రాజకీయంగా మలచుకోం కవిత ఎపిసోడ్‌తో రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు ఎలాంటి సంబంధం లేదు. అందులో తలదూర్చాల్సిన అవసరమూ లేదు. ఆ తతంగాన్ని రాజకీయంగా మలచుకోవాలనే దురుద్దేశం మాకు లేదు. వాళ్ల ఆస్తుల పంపకాలకుగానీ, పదవుల పంపకాలకు గానీ మమ్మల్ని వారు పిలవలేదు. ఆమె లేఖ రాసేవరకు అందరూ ప్రేమగానే ఉంటున్నారని అనుకున్నాం. ఇప్పు డు లుకలుకలు బయటపడ్డాయి. కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి ఏం వెలగబెట్టారు? తెలంగాణ పట్ల మోదీ ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపిస్తోంది. రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్రమంత్రులు ఉన్నారు. రాష్ట్రం కోసం వీరు వెలగబెట్టిందేమిటి? ఏపీకి ఇచ్చినంత బడ్జెట్ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల కేంద్రం, రాష్ట్రం మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా పోయాయి. నష్టం జరిగింది. విభజన హామీలు, కేంద్రం నుంచి రావాల్సిన రూ.వేల కోట్ల బకాయిల గురించి బీజేపీ నేతలు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల మేరకే పోలవరం ప్రాజెక్టుకు సహకారం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే తెలంగాణ నీటివాటా విషయం, రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలగకుండా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకుంటామంటే అందుకు సహకరిస్తాం. అందులో తప్పేముంది? రాష్ట్రమే మాకు ముందు ప్రాముఖ్యం’అని మహేశ్‌గౌడ్ చెప్పారు. -
కేసీఆర్ అవినీతిని ఈటల బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని ఈ సందర్భంగా కమిషన్ ముందు బయట పెట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాంగ్రెస్ పాలనలో అదే పరిస్థితి పునరావృతం అవుతోందని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ చేతగానితనాన్ని బీజేపీపై రుద్దుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు కవిత లేఖ రాయడంపై మాట్లాడుతూ దోచుకున్న డబ్బు పంచుకోవడం కోసం లేఖలు రాసుకున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు. -
ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్.. కవిత లేఖ నేపథ్యంలో కేసీఆర్‌తో భేటీపై ఆసక్తి
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవల్లి ఫాంహౌస్‌కు కేటీఆర్ వెళ్లారు. తన తండ్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. కవిత లేఖపై చర్చ జరిగినట్లు సమాచారం. కవిత లేఖ నేపథ్యంలో ఇద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. సుమారు గంటన్నర సాగిన ఈ సమావేశంలో కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరిగినట్లు తెలిసింది. పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన అంశాలను బహిరంగపరిచి క్యాడర్‌ను గందరగోళానికి గురి చేశారని కేసీఆర్‌కు కేటీఆర్ వివరించినట్టు సమాచారం.కాగా, కవిత లేఖ బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపుతోంది. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుందంటూ నిన్న(శనివారం) జరిగిన సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యానించారు.‘‘ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్లో అధ్యక్షుడు కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. -
కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, కవిత.. జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖపై కాంగ్రెస్ నాయకులు జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లేఖ తో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు అని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం. కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టు ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో ఏదో జరిగిపోతుందనే చర్చ జోరుగా సాగుతుంది. కొత్త పార్టీ అనే చర్చ అన్ని రాజకీయ పక్షాల్లో నడుస్తుంది. కవిత లేఖతో కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదు. కాంగ్రెస్ ఆనాటి నుండి ఈనాటి వరకు బలంగా ఉంది.. భవిష్యత్‌లోనూ బలంగానే ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో బలహీన పార్టీ బీజేపీ. బీఆర్ఎస్ ఉధ్యమం పేరుతో బలమైన పార్టీగా అవతరించింది. రాష్ట్ర విభజన కోణంలోనే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పరిపాలన దక్షతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.. వస్తుంది. మతం, హిందుత్వ పేరుతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. బలమైన పార్టీలుగా మొదటి స్థానంలో కాంగ్రెస్, రెండో స్థానంలో బీఆర్ఎస్, మూడో స్థానంలో బీజేపీ ఉంది. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నప్పటికీ అధికారంలోకి వచ్చే పరిస్థితిలో లేవు.కేసీఆర్‌తోనే ఉనికి..కవిత లేఖతో నష్టం జరుగుతుంది అనేది వారి కుటుంబ వ్యక్తిగత అంశం. కవిత లేఖతో కేసీఆర్ కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించే అవకాశం ఉంది. కవిత లేఖ వల్ల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో బలమైన క్యాడర్ ఉండడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ కంటే బీజేపీ వైపు చూసే అవకాశం ఉంది. కేసీఆర్ కుటుంబంలో ఉన్న వారు తామే గొప్ప అనే భావన మంచిది కాదు. కేసీఆర్‌తోనే బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది. కేసీఆర్ ఉంటేనే కేటీఆర్, హరీష్ రావు, కవిత లీడర్లు.బీజేపీకి ప్లస్ అవుతోంది..తండ్రి కూతురుగా కవిత లీడర్‌గా ఎదిగారు. కేసీఆర్‌ను దేవుడు అంటూనే దెయ్యాలు అని సంబోధించడం దేనికి సంకేతం?. కేసీఆర్ దేవుడు అంటూనే కేసీఆర్‌ను రాజకీయ సమాధి చేసేలా కవిత వ్యవహారం ఉంది.కవిత వ్యవహారం చూస్తే తన కొమ్మను తాను నరుకున్నట్టుగా ఉంది. కవిత లీకుల వ్యవహారం బీజేపీని బలపర్చేలా ఉంది. కవిత డిప్రెషన్లో ఉండి లేఖ విడుదల చేసినట్లుగా ఉంది. బీఆర్ఎస్ ఉనికిని దెబ్బతీస్తూ బీజేపీని పెంచి పోషించేలా బీఆర్ఎస్ వ్యవహారం ఉంది. లేఖలు, లీకులు మీడియాలో వార్తలకు పనిచేస్తాయి కానీ.. మీ మనుగడ దెబ్బతీస్తుందనే విషయం మర్చిపోతే ఎలా?. బీజేపీకి లేని బలాన్ని బీఆర్ఎస్ ఇస్తుంది. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అలర్ట్ కావాలి అని హెచ్చరించారు. కవితకు అవగాహన లేదు..బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ వైపు తిప్పుకునే వ్యూహం మేము అమలు చేయాలి. దీనిపై పీసీసీ, సీఎంతో మాట్లాడుతాను. నాయకత్వం లేని బీజేపీకి బీఆర్ఎస్ ఎందుకు అవకాశం ఇస్తుందో అర్దం కావడం లేదు. కేసీఆర్ లోతైన ఆలోచన చేస్తాడు. పిల్లలు దారి తప్పారని కేసీఆర్ భావిస్తున్నట్లు ఉంది. తండ్రి గురించి కవితకు పూర్తి అవగాహన లేకపోవడం దురదృష్టకరం. కుటుంబానికి వారసుడు కొడుకే అవుతాడు. కొడుకు లేని పక్షంలో కూతురు వారసురాలు అవుతుంది. కవిత ఏదో రాష్ట్ర రాజకీయాలను తిప్పేస్తుందని కాదు.. కానీ చర్చల వల్ల నష్టం జరుగుతుంది. కేసీఆర్ కూతురు కాబట్టే మీడియాలో కవితకు ప్రాధాన్యత. కవిత లేఖలు.. మా శత్రువు బీజేపీకి ఉపయోగపడుతాయనే మా బాధ’ అంటూ కామెంట్స్ చేశారు. -
పదేళ్లు రాష్ట్రాన్ని లూటీ చేశారు: భట్టి విక్రమార్క
వైరా: గత పదేళ్లు అధికారంలో ఉన్నవారు రాష్ట్రాన్ని లూటీ చేశారని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వాళ్లే ఇప్పుడు ఫామ్‌హౌస్‌లో నిద్రపోతూ అన్యాయం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా వైరాలో శనివారం ఏర్పాటుచేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పదేళ్లలో గ్రూప్–1 పోస్టులు భర్తీచేయకపోవటంతో నిరుద్యోగ యువత వారి తల్లిదండ్రులకు భారంగా మిగిలారని, మరికొందరు ఆవేదనతో రోడ్లపై తిరిగారని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి 56 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాని యువతకు స్వయం ఉపాధి కోసం రూ.9 వేల కోట్లతో రాజీవ్ యువ వికాసం ద్వారా తోడ్పాటు ఇవ్వనున్నామని వెల్లడించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ద్వారా గిరిజనులకు పంపిణీ చేసిన 6.70 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకొచ్చేలా రూ.12,600 కోట్లతో ఇందిరా సౌరగిరి జల వికాసం పథకాన్ని ప్రారంభించినట్లు వివరించారు. బీఆర్ఎస్ పాలనలో గిరిజనులు అటవీ భూముల్లో పంటలు సాగుచేయకుండా ఇబ్బంది పెట్టారని, మహిళలను కూడా చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనలు ఉన్నాయని విమర్శించారు. కాగా, జాబ్‌మేళాలో 92 కంపెనీలు పాల్గొనగా, సుమారు 8 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ఇందులో 4,448 మందికి వివిధ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్, సింగరేణి సీఎండీ బలరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్... శని కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్‌రెడ్డి అని, రాష్ట్రానికి పట్టిన శని కాంగ్రెస్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ దెయ్యాన్ని, శనిని వదిలించాలన్నదే తమ ప్రయత్నమని పేర్కొన్నారు. ‘కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు’ఉన్నాయంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో కేటీఆర్ ఈమేరకు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుంది. ఈ సూత్రం వాళ్లకు వీళ్లకు కాదు.. పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ వర్తిస్తుంది. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన బీఆర్ఎస్లో అధ్యక్షుడు కేసీఆర్‌కు లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా సూచనలిస్తూ ఎవరైనా లేఖలు రాయొచ్చు. అయితే పార్టీలో ఏ హోదాలో ఉన్న వారైనా కొన్ని అంతర్గత విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుంటుంది’అని కేటీఆర్ అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు మేము పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్ష పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో ఎలా ముందుకు పోవాలని వేల మంది కార్యకర్తలతో గంటలకొద్దీ చర్చించాం. ఆ క్రమంలో చాలామంది నేరుగా మైక్‌లో మాట్లాడారు. మరికొందరు కేసీఆర్‌కు ఇవ్వమంటూ లేఖలు ఇచ్చారు. మా పార్టీలో బహిరంగ చర్చను ప్రోత్సహిస్తాం. ప్రజాస్వామిక స్ఫూర్తి కలిగిన మా పార్టీ అధ్యక్షుడికి ఎవరైనా సూచనలు చేయొచ్చు, ఉత్తరాలు రాయొచ్చు’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అన్ని పార్టీల్లో ఉన్నట్లు బీఆర్ఎస్లోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చని, సరైన సమయంలో వారంతటే వారు బయటపడతారన్నారు. ఓటుకు నోటు కేసులో ‘బ్యాగ్‌మ్యాన్’ ‘యంగ్ ఇండియా నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చార్జిషీట్లో చేర్చడం రాష్ట్రానికి అవమానకరం. ఈ కేసులో రేవంత్ పేరు వచ్చిందన్న వార్తను కొన్ని పత్రికలు అసలు రాయనే లేదు. మీడియా ఎంత తాపత్రయపడ్డా.. ఎన్ని ప్రకటనలు తీసుకున్నా రేవంత్ ఒక లొట్ట పీసు ముఖ్యమంత్రి అని ప్రజలకు అర్థమైపోయింది. మీడియా ఎన్ని దాచినా సోషల్ మీడియాతో ప్రజలకు వాస్తవాలు తెలుస్తూనే ఉంటాయి. ఓటుకు నోటు కేసులో బ్యాగ్‌మ్యాన్ అని పేరు తెచ్చుకున్న రేవంత్ వైఖరి మారలేదని ఈడీ చార్జిïÙట్లో బయటపడింది. కాంగ్రెస్‌కు తెలంగాణ ఏటీఎంగా మారగా, ఢిల్లీ కాంగ్రెస్‌కు అవసరమైనప్పుడల్లా భారీ మొత్తంలో ఇస్తూ రేవంత్ తన పదవి కాపాడుకుంటున్నాడు. నైతికత ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకోవాలి లేదా కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆయనను పదవి నుంచి తప్పించాలి. ప్రధాని మోదీ, అమిత్ షాతో ఒప్పందం కుదుర్చుకునేందుకే రేవంత్ ఢిల్లీ వెళ్లారు. 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ కేసుల నుంచి తప్పించాలని చీకట్లో అమిత్ షా కాళ్లు పట్టుకుంటున్నాడు. రేవంత్‌కు రాహుల్ గాంధీ అధికారిక బాస్ కాగా, మోదీ, అమిత్ షా అనధికార బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిన్నరగా బీఆర్ఎస్పై నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, ఢిల్లీ బాస్‌లకు రూ.వేలకోట్ల చందాలు అనే రీతిలో రేవంత్ పాలన సాగుతోంది. రేవంత్ అవినీతిపై రాహుల్ మాట్లాడాలి. ఈడీ చార్జిïÙట్లో సోనియా, రాహుల్ పేర్లు ఉన్నా జపాన్ టూర్ పేరిట రేవంత్ స్పందించకుండా తప్పుకున్నాడు’అని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నడుమ అపురూప బంధం ‘నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు మౌన మునుల్లా మారిపోయారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు చేస్తున్న భూదందా అక్రమాలకు రేవంత్ వత్తాసు పలుకుతున్నందుకే మౌనమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.187 కోట్ల వాల్మీకి స్కామ్, ట్రిపుల్ ఆర్ టాక్స్, హెచ్‌సీయూ భూముల్లో అక్రమాలు, పౌర సరఫరాల కుంభకోణం జరుగుతున్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు స్పందించడం లేదు. రేవంత్‌కు రక్షణ కవచంలా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం స్పందించకుంటే నెల రోజుల తర్వాత మా కార్యాచరణ ప్రకటిస్తాం. ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్‌ను కోరతాం’అని చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ రవీందర్రావు, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, రాజయ్య పాల్గొన్నారు. -
‘బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది’
సాక్షి, ఢిల్లీ: బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కవిత ఇచ్చిన ఝలక్‌తో కేటీఆర్‌కు మతి భ్రమించిందన్నారు. ఇంట్లో కంపటి తట్టుకోలేక కేటీఆర్ సతమతమవుతున్నారంటూ చెప్పుకొచ్చారు. కవిత ఎపిసోడ్ డైవర్ట్ చేసేందుకే తమపై ఆరోపణలు చేశారన్న మహేష్ గౌడ్.. పది సంవత్సరాల బీఆర్ఎస్ తప్పిదాలను కవిత ఎత్తి చూపిందన్నారు.బీఆర్ఎస్ తప్పిదాలన్ని ప్రజలకు అర్థమవుతున్నాయి. కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్‌కు నోటీసులతో.. కేటీఆర్ భయపడుతున్నాడు. బీఆర్ఎస్కు, బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉన్నట్లు కవిత వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ మూడు ముక్కలు కాబోతుంది కవిత, కేటీఆర్ మధ్య పోటీ తీవ్రం కావడంతో అదను కోసం హరీష్ రావు ఎదురుచూస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో కేసీఆర్ ఫామ్ హౌస్‌కి పరిమితమయ్యారు’’ అంటూ మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు.‘‘కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరో ప్రజలకు తెలియాలి. పదేళ్ల అవినీతిలో పంపకాల్లో వచ్చిన తేడాతోనే.. కవిత జెండా ఎగరవేసినట్లు అర్థమవుతుంది. భవిష్యత్తు తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో బీఆర్ఎస్ ఉండదు’’ అంటూ మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
సిస్టర్ స్ట్రోక్‌తోనే కేటీఆర్ అలా మాట్లాడారు: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు తాజాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్(KTR)ను మించిన వారే లేరని కౌంటర్ ఇచ్చారామె.శనివారం మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కవిత చెప్పిన దెయ్యం కేటీఆరే. సిస్టర్ స్ట్రోక్(Sister Stroke)తో కేటీఆర్ చిన్న మెదడు చిట్లింది. కాళేశ్వరంలో కమీషన్లు తిన్నప్పుడు లేని భయం.. కమిషన్ ముందు హాజరయ్యేటప్పుడు ఎందుకు?. అబద్ధాల పునాదులపై బీఆర్ఎస్ నడుస్తోంది. రాహుల్ గాంధీ(Rahul Gandhi) గురించి మాట్లాడే స్థాయి కేటీఆర్‌కు లేదు’’ అని అన్నారామె. అటవీ అధికారులు ప్రజలకు సహకరించాలిఅటవీ శాఖ కఠిన నిబంధనల వల్ల ఉమ్మడి అదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు. ‘‘ప్రజల తరఫున వారి సమస్యలను ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తున్నారు. అందుకే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాలు చూపించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ, రోడ్లు భవనాల శాఖ, ఐటీడీఏ శాఖలతో ఈరోజు సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ భేటీలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను విస్తృతంగా చర్చించి ఓ మార్గం చూపిస్తాం. అటవీ ప్రాంతాల్లోనీ ప్రజల అభివృద్ధికి అటవీశాఖ అధికారులు మానవీయ కోణంలో సహకరించాలి. కనీస సౌకర్యాలు కల్పించాలి’’ అని అన్నారామె.ఇదీ చదవండి: కవితకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చిన కేటీఆర్! -
కవితకు కేటీఆర్ స్వీట్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది అంటూ కవితకు కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కవిత లేఖపై స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్.. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయవచ్చు. పార్టీలో అంతర్గతంగా మాట్లాడితేనే మంచిది. మా పార్టీలో ప్రజాస్వామిక స్పూర్తి ఉంది. పార్టీలో ఎవరైనా సూచనలు చేయవచ్చు.. ఎవరైనా లేఖలు రాయవచ్చు. అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారు. పార్టీలో అందరం కార్యకర్తలమే.. అందరూ సమానమే. ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుతుంటే దేవుడు, దెయ్యం ఎందుకు? అని ప్రశ్నించారు. -
రేవంత్ రాజీనామా చేయాల్సిందే.. బీజేపీ నేతలెందుకు స్పందించరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోందని సంచలన ఆరోపణలు చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..‘ఓటుకు నోటు కుంభకోణం ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ఏటీఎంలా మారిపోయింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు పంపిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. పీసీసీ పదవి కోసం రేవంత్ రూ.50 లక్షలు ఇచ్చారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేశారు. ఇప్పుడు సీటుకు రూట్ కుంభకోణం బయటపడింది. రేవంత్ రెడ్డి వైఖరితో దేశవ్యాప్తంగా తెలంగాణ పరువు పోయింది.నేషనల్ హెరాల్డ్ కేసులో రేవంత్ రెడ్డి పేరు బట్టబయలైంది. రేవంత్ రెడ్డితో రాజీనామా చేయించి నిష్ఫక్షపాతంగా విచారణ చేయించాలి. రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో అర్థమవుతోంది. హస్తిన పెద్దల కాళ్లు పట్టుకోవడానికే రేవంత్ ఢిల్లీకి వెళ్తున్నారు. ఢిల్లీ బాసులకు రేవంత్ రెడ్డి వేల కోట్లు చందాలు ఇస్తున్నారు. లీడర్లు, కాంట్రాక్టర్లతో రేవంత్ దందాలు చేశారు. రేవంత్ జపాన్ పర్యటనపై మాకు అప్పుడే సందేహాలు వచ్చాయి. యంగ్ ఇండియా పేరుతో దందా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో భారీ వసూళ్లను పాల్పడ్డారు. రేవంత్ రెడ్డి వ్యవహారంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు. నీతి, నిజాయితీ ఉంటే రేవంత్ సీఎం పదవి నుంచి తప్పుకోవాలి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కుర్చీ నుంచి రేవంత్‌ను తప్పించాలి.మంత్రి పొంగులేటిపై ఈడీ దాడులు చేస్తే ఇప్పటి వరకూ బీజేపీ నేతలు స్పందించలేదు. వాల్మీకి స్కాంపై నోరు మెదపరు. సివిల్ సప్లయ్ స్కాంపై ఎలాంటి చర్యలు లేవు. బీజేపీకి నిజాయితీ ఉంటే ఈ స్కాంలపై స్పందించాలి. తెలంగాణలో ఎవరు ఎవరితో కుమ్మక్కు అవుతున్నారో ప్రజలు అర్థం చేసుకోవాలి. గవర్నర్‌ని కలిసి సీఎం అవినీతిపై చర్యలకు డిమాండ్ చేస్తాం. నెల రోజుల్లో చర్యలు తీసుకోకుంటే మా పార్టీ కార్యచరణ తీసుకుంటాం అని హెచ్చరించారు. యడ్యూరప్పపై విమర్శలు వస్తే రిజైన్ చేయాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయలేదా?. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ అని అందరికీ తెలుసు. డీకే శివకుమార్‌ను తొలగించాలని కర్ణాటకలో బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కానీ, తెలంగాణలో మాత్రం బీజేపీ నేతలకు ఏమైంది?. హెరాల్డ్ కేసుపై రేవంత్ ఎందుకు స్పందించలేదు?. బీజేపీ నాయకత్వం కాంగ్రెస్ నేతలను కాపాడుతోంది. బీజేపీ నేతలకు దమ్ముంటే రేవంత్ వ్యవహారంపై వెంటనే స్పందించాలి’ అని డిమాండ్ చేశారు. -
కవిత లేఖ కలకలం.. కేటీఆర్ కీలక ప్రెస్‌మీట్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ కవిత లేఖ, ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కవిత వ్యాఖ్యలపై పార్టీ అధినేత కేసీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కవిత లేఖ, కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించనున్నారు. తెలంగాణభవన్‌లో ఈరోజు ఉదయం 11 గంటలకు కేటీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది.ఇక, అంతకుముందు కేసీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్పై కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. అమెరికా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కవిత శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయం వెలుపల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కవిత..‘నా కుమారుడి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి వెళ్లిన తర్వాత లేఖ లీక్ అయి హంగామా జరిగినట్లు తెలిసింది. రెండు వారాల క్రితం నేను కేసీఆర్‌కు లేఖ రాశా. గతంలో కూడా లేఖల ద్వారా కేసీఆర్‌కు అనేకసార్లు అభిప్రాయాలు చెప్పా. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే.. దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుమార్తెనైన నేను రాసిన లేఖే బయటికి వచ్చిందంటే.. పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏమిటి? దీనిపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది.నాపై కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని ఇటీవలే చెప్పా. ఇప్పుడు లేఖ బహిర్గతం అవ్వడంతో.. ఏం జరుగుతున్నదోనని పార్టీలో ఉన్న అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్న వారు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు అనుకుంటున్న విషయాలే నేను లేఖలో చెప్పా. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపైనా ద్వేషం లేదు. మా నాయకుడు కేసీఆరే. ఆయన నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. పార్టీ కూడా ముందుకెళ్తుంది అని అన్నారు. మరోవైపు.. కవిత అభిమానులు.. ఆమెను సీఎం.. సీఎం.. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు.