బీజేపీ మార్క్‌ అభివృద్ధి.. వీడియోలతో పరువు తీసిన కేటీఆర్‌ | BRS KTR Satirical Comments On BJP Govt | Sakshi
Sakshi News home page

బీజేపీ మార్క్‌ అభివృద్ధి.. వీడియోలతో పరువు తీసిన కేటీఆర్‌

May 26 2025 11:58 AM | Updated on May 26 2025 4:30 PM

BRS KTR Satirical Comments On BJP Govt

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మే నెలలో కురిసిన సాధారణ వర్షపాతం బహిర్గతం చేసిందని ఎద్దేవా చేశారు. భవనం పైకప్పునే సరిగ్గా నిర్మించలేకపోయిన వాళ్లు.. కాళేశ్వరం గురించి మాట్లాడుతున్నారంటూ వీడియోను షేర్‌ చేశారు.

మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని బహిర్గతం చేయడానికి సాధారణ వర్షం చాలు.. హైదరాబాద్‌లో 430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అయినా  ఢిల్లీ విమానాశ్రయం పైకప్పులైనా, బీజేపీ మార్క్ ‘అభివృద్ధి’ని చెప్పడానికి సాధారణ వర్షం సరిపోతుంది. బీజేపీ ప్రభుత్వం సరిగ్గా పైకప్పును కూడా నిర్మించలేకపోవడం విచారకరం..  కానీ, బీజేపీ వాళ్లు కాళేశ్వరం  గురించి  మాట్లాడుతున్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన షేప్‌ షిఫ్టర్ పైకప్పుల అద్భుతమైన సరికొత్త డిజైన్లను ఏ ఏజెన్సీ పరిశీలిస్తుందో చూడాలి మరి?!’ అంటూ సెటర్లు వేశారు.

ఇక, ఈ వీడియోలో ఇటీవల బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన ఢిల్లీ విమానాశ్రయం, చర్లపల్లి రైల్వే స్టేషన్‌ కనిపిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోదీ వీటిని ఎంతో ఆడంభరంగా ప్రారంభించి.. ప్రచారం చేశారు. ఇవి ప్రారంభమై కొన్ని నెలలే అవుతున్నప్పటికీ చిన్న పాటి వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో, పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

KTR: బీజేపీ అభివృద్ధిని బహిర్గతం చేయడానికి సాధారణ వర్షం చాలుway-station-2460489

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement