
రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఫెయిల్
దోచుకున్న డబ్బు పంపిణీకే లేఖలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యే బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు రాష్ట్ర పార్టీ తరఫున పూర్తిస్థాయి మద్దతు ఉంటుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ చేసిన అవినీతిని ఈ సందర్భంగా కమిషన్ ముందు బయట పెట్టాలని ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర అభివృద్ధిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఫెయిల్ అయ్యాయని కిషన్‌రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, కాంగ్రెస్ పాలనలో అదే పరిస్థితి పునరావృతం అవుతోందని చెప్పారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చేతగానితనాన్ని బీజేపీపై రుద్దుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు కవిత లేఖ రాయడంపై మాట్లాడుతూ దోచుకున్న డబ్బు పంచుకోవడం కోసం లేఖలు రాసుకున్నారని కిషన్‌రెడ్డి ఆరోపించారు.