షావోమి లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌! | Xiaomi's First Mi Home Flagship Retail Store in Hyderabad Opens September 12 | Sakshi
Sakshi News home page

షావోమి లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌!

Sep 9 2017 2:18 PM | Updated on Sep 4 2018 5:29 PM

షావోమి లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌! - Sakshi

షావోమి లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌!

చైనాకు చెందిన మొబైల్‌ దిగ్గజం షావోమీ ఇండియాలో మరింత విస్తరించే దిశగా మొట్టమొదటి ఫ్లాగ్‌షిప్‌ ఎంఐ హోమ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనుంది.

సాక్షి, హైదరాబాద్‌: చైనాకు చెందిన మొబైల్‌ దిగ్గజం షావోమీ  ఇండియాలో మరింత విస్తరించే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో  మొట్టమొదటి  ఫ్లాగ్‌షిప్‌ ఎంఐ హోమ్ స్టోర్‌ను హైదరాబాద్‌లో  ప్రారంభించనుంది. ఇప్ప‌టికే బెంగుళూరు, ఢిల్లీ, చెన్నైల‌లో ఎంఐ హోమ్ స్టోర్‌ల‌ను ప్రారంభించి కార్య‌క‌లాపాల‌ను  నిర్వహిస్తున్న షావోమి  ఇపుడు హైదరాబాద్‌ కస్టమర్లకు మరింత చేరువలోకి వస్తోంది. దీంతో హైదరాబాద్‌ ప్రజలు డైరెక్టుగా రిటైల్ స్టోర్కు వెళ్లి  షావోమి ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చన్నమాట. ఈ విషయాన్ని  ట్విట్టర్‌ ద్వారా సంస్థ   ధృవీకరించింది.

సెప్టెంబర్‌ 12వ తేదీన మాదాపూర్ మెయిన్ రోడ్ లో ఈ స్టోర్‌ను ఓపెన్ చేయ‌నుంది.  తమ ఉత్ప‌త్తుల‌కు లభిస్తున్న విశేష ఆదరణను  దృష్టిలో ఉంచుకుని హైద‌రాబాద్ వాసుల‌కు కూడా మ‌రింత చేరువ‌య్యేందుకు  ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. ఇకపై  తమ  ఉత్పత్తుల‌ను  ఆలస్యం, ఔట్‌ ఆఫ్‌ స్టాక్‌ లాంటి  ఎలాంటి సమస్యలు లేకుండా వినియోగదారులు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌ ను పొందవచ్చనీ,  స్మార్ట్‌ఫోన్లు సహా,  ప‌వ‌ర్ బ్యాంకులు, హెడ్‌ఫోన్స్‌, ఫిట్‌నెస్ బ్యాండ్స్‌, ఎయిర్ ప్యూరిఫైర్స్ త‌దిత‌ర గ్యాడ్జెట్టు ఇక్కడ అందుబాటులో ఉంటాయని చెప్పింది.

కాగా  బెంగుళూరులో 3 స్టోర్స్‌, గురుగ్రామ్‌, చెన్నైల‌లో ఒక్కో స్టోర్ ఉండ‌గా  తాజాగా నగరంలో ప్రారంభించే స్టోర్‌తో కలిపి షావోకి ఇది  6వది.  భారతదేశంలో 11 నగరాల్లో 600 కి పైగా రిటైల్ దుకాణాలు ఉండగా   విజయ్ సేల్స్,  సంగీత, బిగ్ సి, ఇజోన్ , హాట్‌ స్పాట్‌లాంటి  పెద్ద రిటైల్ చైన్స్ తో  భాగస్వామ్యం ఉంది. గత నెలలో కంపెనీ 30 నగరాల్లో 1,500 మేర  రిటైల్ స్టోర్లను పెంచుతామని జైన్ చెప్పారు. రాబోయే రెండు సంవత్సరాల్లో 100 ఎంఐ హోమ్ దుకాణాలు తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్న షావోమి .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement