వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌:మూన్‌లైట్‌ సెల్ఫీ కెమెరాతో | Vivo 'Y69' with 16MP selfie camera launched at Rs 14,990 | Sakshi
Sakshi News home page

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌:మూన్‌లైట్‌ సెల్ఫీ కెమెరాతో

Aug 25 2017 7:44 PM | Updated on Sep 17 2017 5:58 PM

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌:మూన్‌లైట్‌ సెల్ఫీ కెమెరాతో

వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌:మూన్‌లైట్‌ సెల్ఫీ కెమెరాతో

ప్రముఖ మొబైల్‌ మేకర్‌ వివో వై సిరీస్‌లో మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

సాక్షి: న్యూఢిల్లీ:  ప్రముఖ మొబైల్‌ మేకర్‌  వివో  వై సిరీస్‌లో మరోకొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. 16 ఎంపీ మూన్‌లైట్‌  సెల్పీ కెమెరాతో ఈ డివైస్‌ను శుక్రవారం మార్కెట్లో విడుదల చేసింది. ‘వై 69’  పేరుతో అందుబాటులోకి తెచ్చిన  ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరను రూ. 14,909 గా కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఇ-కామర్స్ సైట్లు  అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్‌తో  తోపాటు  ఇతర రీటైల్‌ స్టోర్లలో "షాంపైన్ గోల్డ్" మరియు "మ్యాట్‌ బ్లాక్" కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది. గ్రూప్‌ సెల్ఫీ మోడ్‌ దీని ప్రత్యేకత కంపెనీ  చెబుతోంది.

ఎఫర్డబుల్‌ ధర, ప్రీమియర్‌ డిజైన్‌, సుపీరియర్‌ కెమెరాతో లాంచ్‌ చేసిన తన లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్‌ తమ కస్టమర్లకు  మంచి అనుభవాన్నిస్తుందని నమ్ముతున్నామని వివో ఇండియా సీఎంవో కెన్నే జెంగ్‌  ప్రకటించారు.  
 
వివో  ‘వై 69’  ఫీచర్లు
 5.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్‌ డిస్‌ ప్లే
1280 x 720 పిక్సెల్స్ రిజల్యూషన్‌,
3 కార్నింగ్ గొరిల్లా గ్లాస్
1.5 గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్ మీడియా టెక్ MT6750 ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 7.0 ఆపరేటింగ్ సిస్టమ్
3జీబీ ర్యామ్‌
32 జీబీ స్టోరేజ్‌
256 జీబీ వరకు విస్తరించుకనే సదుపాయం
13ఎంపీ రియర్‌  కెమెరా
16ఎంపీ మూన్‌లైట్‌ సెల్పీ కెమెరా విత్‌ f/2.0
3,000ఎంఏహెచ్‌  బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement