హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ ధరపై భారీ తగ్గింపు
													 
										
					
					
					
																							
											
						 ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్‌టీసీ  తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది.
						 
										
					
					
																
	ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్‌టీసీ  తన ఫ్లాగ్ షిప్  స్మార్ట్  ఫోన్ ధరను భారీగా  తగ్గించింది.  'హెచ్‌టీసీ యూ ప్లే' స్మార్ట్‌ఫోన్  ధరపై  భారత్ లో రూ. 10వేల తగ్గింపును ఆఫర్ చేస్తోంది.   ఈ తగ్గింపు తర్వాత హెచ్‌టీసీ యూ ప్లే ఇప్పుడు రూ.29,990 ధరకే యూజర్లకు లభించనుంది.    వైట్, ఇండిగో బ్లూ, బ్లాక్ ఆయిల్ ,  కాస్మిక్ పింక్ గోల్డ్ రంగులలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ను  ప్రత్యేకంగా  అమెజాన్‌లో అందుబాటులో   ఉంచింది.  కాగా   ఫిబ్రవరి లాంచ్ చేసిన ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.39,990లు.
	 
	హెచ్‌టీసీ యూ ప్లే ఫీచర్లు
	5.2 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే
	గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్
	1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
	ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్
	32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
	256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
	డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో
	16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
	16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
	4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్
	యూఎస్‌బీ టైప్ సి, ఎన్‌ఎఫ్‌సీ
	2500 ఎంఏహెచ్ బ్యాటరీ