పిడుగును ఫోన్‌లో బంధించబోయి.. | Man Killed After Trying Take Photograph Of Lightening | Sakshi
Sakshi News home page

పిడుగును ఫోన్‌లో బంధించబోయి..

Published Thu, Jun 7 2018 3:36 PM | Last Updated on Thu, Jun 7 2018 7:36 PM

Man Killed After Trying Take Photograph Of Lightening - Sakshi

చెన్నై : మొబైల్‌లో పిడుగు ఫొటోను తీసేందుకు ప్రయత్నించిన వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులోని తిరువళ్లూరులో బుధవారం చోటు చేసుకుంది. వర్షం కురుస్తున్న సమయంలో స్నేహితుడి రొయ్యల ఫాంకు వెళ్లిన రమేష్‌(43) పిడుగుపాటును ఫోన్‌లో చిత్రీకరించేందుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, పిడుగు అతనికి మరింత చేరువలో పడటంతో ఆ ధాటికి రమేష్‌ ప్రాణాలు వదిలినట్లు చెప్పారు. ఫాం వద్ద పడివున్న రమేష్‌ను అతని స్నేహితులు ఆస్పత్రిలో చేర్పించారని తెలిపారు. రమేష్‌ ముఖం, ఛాతి భాగాల్లో తీవ్రంగా గాయాలు ఉన్నట్లు వైద్యులు వెల్లడించారని వివరించారు.

కాగా, పిడుగుపాటు సమయంలో ఫోన్‌ కెమెరాలతో ఫొటోలు తీసేందుకు యత్నించొద్దని పోలీసులు ప్రజలను హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement