భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం | Heavy Rains In Tamilnadu | Sakshi
Sakshi News home page

భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం

Aug 18 2019 11:32 AM | Updated on Aug 18 2019 1:27 PM

Heavy Rains In Tamilnadu - Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులోని వేలూరు, తిరువణ్ణామలై, విలుపురం జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వేలూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలు కారణంగా పలు జిల్లాల్లో జన జీవనం స్తంభించింది. విస్తారమైన వర్షాలు కురవడంతో కొన్ని చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. పలు నగరాలు జలమయం కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.కుండపోత గా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు లోతట్టు ప్రాంతాలు జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. పది జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణం శాఖ ప్రకటించింది.

Advertisement
 
Advertisement
Advertisement