పోలీస్ స్టేషన్లో గొంతుకోసుకున్నయువకుడు | young man suicide attempt in police station | Sakshi
Sakshi News home page

పోలీస్ స్టేషన్లో గొంతుకోసుకున్నయువకుడు

Sep 28 2016 3:04 PM | Updated on Apr 3 2019 7:53 PM

పోలీస్ స్టేషన్లో గొంతుకోసుకున్నయువకుడు - Sakshi

పోలీస్ స్టేషన్లో గొంతుకోసుకున్నయువకుడు

దొంగతనం కేసులో పోలీసులు విచారణకు పిలవటంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు.

అచ్చంపేట: దొంగతనం కేసులో పోలీసులు విచారణకు పిలవటంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించాడు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. మండలంలోని సింగారం గ్రామం పెద్దతండాకు చెందిన చెందిన కిషన్ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుకుంటున్నాడు. ఓ దొంగతనం కేసులో అనుమానంతో కిషన్ ను పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చారు.
 
అయితే తను ఏ నేరం చేయలేదని కిషన్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే వెంట తెచ్చుకున్న బ్లేడ్‌తో కిషన్ గొంతు కోసుకున్నాడు. తీవ్ర రక్తస్రావం కావటంతో పోలీసులు వెంటనే అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో హైదరాబాద్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement