సాంబారు బాగాలేదనందుకు ఆత్మహత్య.. | women committed to suicide in karnataka | Sakshi
Sakshi News home page

సాంబారు బాగాలేదనందుకు ఆత్మహత్య..

Sep 17 2017 8:40 AM | Updated on Sep 19 2017 4:41 PM

సాంబారు బాగాలేదనందుకు ఆత్మహత్య..

సాంబారు బాగాలేదనందుకు ఆత్మహత్య..

సాంబారు బాగా లేదని భర్త నిందించడంతో భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సాక్షి, బనశంకరి:  సాంబారు బాగా లేదని భర్త నిందించడంతో భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈఘటన కేపీ.అగ్రహార పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళ్తే చోళూరుపాళ్యలో శ్రీనివాస్‌–నాగరత్నమ్మ(45) దంపతులు నివాసముంటున్నారు. కుటుంబ విషయంలో అప్పుడప్పుడు భర్త శ్రీనివాస్‌ భార్యతో గొడవపడేవాడు. శుక్రవారం రాత్రి భోజనం చేయడానికి కూర్చున్న శ్రీనివాస్‌ సాంబారు బాగా వండలేదంటూ భార్యను నిందించాడు.

దీంతో తీవ్రమనస్ధాపం చెందిన  నాగరత్నమ్మ అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌ కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఉదయం శ్రీనివాస్‌ నిద్రలేచి గమనించగా భార్య ప్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతున్న దృశ్యం కనిపించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్ధలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహానికి శవపరీక్షల నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement