పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది.
పోలవరం ప్యాకేజీ డబ్బుల కోసం..
May 11 2017 2:18 PM | Updated on Sep 5 2017 10:56 AM
కుక్కునూరు: పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం వెలుగుచూసింది. పోలవరం ప్యాకేజీ డబ్బుల కోసం కన్న తల్లిని కడతేర్చాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన జిల్లాలోని కుక్కునూరు మండలం కమ్మరిగూడెంలో గురువారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన శ్రీను డబ్బుల కోసం కన్నతల్లిని కిరాతకంగా హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. నిందితుడు గతంలో డబ్బుల కోసం తండ్రిని చంపి జైలు శిక్ష అనుభవించి వచ్చాడు.
Advertisement
Advertisement