పింప్రి, న్యూస్‌లైన్: పుణే వాసులకు నీటి గండం రాబోతుంది. నగర పరిధిలోని జలాశయాలు అడుగంటుతుండడంతో రాబోయే రోజుల్లో నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని ఆయా ప్రాంతవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పుణే విభాగంలో 57 తాలూకాలలో 27 తాలూకాల భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. రాబోయే రోజుల్లో ఈ తాలూకాలలో తాగునీటి కష్టాలు ఎదురవనున్నాయి. భూ జలాల పరిశోధన, అభివృద్ధి విభాగం జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.
‘పుణే, సతారా, సాంగ్లీ, షోలాపూర్, కొల్హాపూర్ ప్రాంతాల్లోని 57 తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. పుణే జిల్లాలో 192 బావుల నీటి మట్టం పరిశీలించాం. అందులో 100 బావులలో భూగర్భ జలాలు అడుగంటాయి. జిల్లాలోని 13 తాలూకాలలోని దౌండ్, పురంధర్, ఇందాపూర్, బారామతి తాలూకాలలో నీటి సమస్య తీవ్రంగా ఉంది. సతారా జిల్లాలో 106 బావులలో భూగర్భ జలాలను పరిశీలిస్తే 45 బావులలో జలాలు అడుగంటాయి. 11 తాలూకాలలో సతారా, కోరేగావ్, మహాబలేశ్వర్, పాటణ్, తాలూకాలలో భూగర్భ జలాలు అడుగంటాయి.
సాంగ్లీ జిల్లాలో 86 బావులలోని నీటి మట్టాలు పరిశీలించాం. 41 బావుల నీటి మట్టాలు అడుగంటిపోయాయి. పలుస్, కడేగావ్, ఖనాపూర్, శిరాళా, తాలూకాలలో తాగునీటి సమస్య అధికంగా ఉంది. షోలాపూర్ జిల్లాలో 166 బావుల నీటి మట్టాలను పరీక్షించాం. 68 బావుల జలాలు అడుగంటాయని తేలింద’ని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర సోలాపూర్, కరమాళా తాలూకాలలో తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. కొల్హాపూర్ జిల్లాలో 58 బావులలో నీటి జలాలు అడుగంటాయి. జిల్లాలోని పన్హాళా, రాధనగరి, గడహింగ్లాజ్, కాగల్, ఆజరా, చంద్గడ్, హతకణంగలే తాలూకాలలో నీటి సమస్య అధికంగా ఉందని, వర్షాలు ఎంత తొందరగా కురిస్తే సమస్య తీరే అవకాశం ఉందని సంబంధిత అధికారి తెలిపారు.
పుణేకు జల గండం!
Published Tue, May 6 2014 10:32 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్
కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ
ఒక్క ఓటుతో ఏముందిలే అనుకుంటున్నారా..?
వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!
Lok Sabha Polls: మూడో విడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement