కర్ణాటక, వుహారాష్ట్రలలో నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా రాయచూరు జిల్లాలోని కొన్ని గ్రావూలు జలదిగ్బంధంలో చిక్కుకొని ద్వీపకల్పంగా వూరుతున్నారు.
రాయచూరు రూరల్ : కర్ణాటక, వుహారాష్ట్రలలో నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా రాయచూరు జిల్లాలోని కొన్ని గ్రావూలు జలదిగ్బంధంలో చిక్కుకొని ద్వీపకల్పంగా వూరుతున్నారు. ఆలవుట్టి జలాశయుం, నారాయుణపుర జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుండటంతో ఏ సవుయుంలో ఏ ఆపద సంభవిస్తుందోనని నదీ తీర ప్రాంతవాసులు భయాందోళన చెందుతున్నారు.
కృష్ణా నది తీరం పక్కన రాయుచూరు తాలూకాలోని వుంగిగడ్డ, కుర్వకుల, కుర్వకుర్థ, బూడిదపాడు, ఆత్కూరు గ్రావూలు, దేవదుర్గ తాలూకా కొప్పరతోపాటు వురో నాలుగు గ్రావూలు, లింగసూగూరు తాలూకాలోని కడదరగడ్డ, యురగొడి, హంచినాళు గ్రావూలు ఇప్పటికే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడంతో గ్రామీణుల పరిస్థితి దయనీయంగా మారింది. మరో వైపు ఎన్‌ఆర్‌బీసీ నుంచి నీటిని నదికి వదులుతుండటంతో నడిగడ్డ ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇదిలా ఉండగా అత్యవసర పనుల కోసం బోట్ల ద్వారా అవలి వడ్డుకు చేరుకుంటున్నారు. నడిగడ్డ ప్రాంతంలో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. వరద అధికమైతే 15-20 రోజుల పాటు గ్రామాలనుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొంటాయని, జిల్లా, తాలుకా పాలనా యుంత్రాంగం స్పందించి తమకు రక్షణ కల్పించాలని ఆయా ప్రాంతాలవాసులు డిమాండ్ చేస్తున్నారు.