నమ్మకాన్ని వమ్ముచేయను | Vammuceyanu trust | Sakshi
Sakshi News home page

నమ్మకాన్ని వమ్ముచేయను

Mar 10 2014 2:50 AM | Updated on Mar 29 2019 9:18 PM

బీజేపీకి కంచుకోటగా నిలిచిన బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానంలో గెలిచి తనపై కాంగ్రెస్ పెద్దలు ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని నందన్‌నిలేకని దీమా వ్యక్తం చేశారు.

బెంగళూరు :  బీజేపీకి కంచుకోటగా నిలిచిన బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానంలో గెలిచి తనపై కాంగ్రెస్ పెద్దలు ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయనని నందన్‌నిలేకని దీమా వ్యక్తం చేశారు. బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానాన్ని నందన్ నిలేకనికి కేటాయిస్తూ కాంగ్రెస్ పార్టీ శనివారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో ఆదివారం ఉదయం బెంగళూరులోని కేపీసీసీ కార్యాలయంలో నందన్ నిలేకని కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని తీసుకున్నారు. కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జి.పరమేశ్వర్ ఆయనకు సభ్యత్వాన్ని అందించడంతో పాటు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిలేకని మీడియాతో మాట్లాడుతూ... తాను చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నానన్నారు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి కేంద్ర మంత్రుల వరకూ తనకు చాలా మందితో పరిచయాలు ఉన్నాయన్నారు.

ఇక ఐటీ రంగానికి చెందిన ఎంతో మంది నన్ను వ చ్చే ఎన్నికల్లో దీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సామర్థ్యాన్ని ఉపయోగించి రాన ున్న ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నిలేకని చెప్పారు. తాను బెంగళూరులోని వాణివిలాస్ ఆస్పత్రిలో జన్మించానని ఇక్కడే చదివి, ఐటీ రంగంలో వేలాది మందికి ఉద్యోగాలు కల్పించానన్నారు. దీంతో తనకు బెంగళూరుతో అవినాభావ సంబంధం ఉందన్నారు.

ఆరు నెలల కిందట తాను రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నానన్నారు. నేటి నుంచి ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజల కష్టసుఖాలను తెలుసుకుంటానని నిలేకని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పరమేశ్వర్ మాట్లాడుతూ... సామాజిక రంగంల్లో ఉన్నవారు, మేధావులు రాజకీయాల్లోకి రావాలనుకోవడం మంచి పరిమాణమన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ కూడా కాంగ్రెస్‌లోకి వచ్చి ఎంతటి ఉన్నత పదవులు పొందారో తెలిసిందేనన్నారు.

కష్టపడి పనిచేసేవారికి పార్టీలో సముచిత స్థానం దక్కుతుందన్నారు. ఇదే సందర్భంలో మాజీ మంత్రి పుష్పవతి కాంగ్రెస్‌లో చేరారు. కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రామలింగారెడ్డి, కేంద్రమంత్రి రహ్మాన్‌ఖాన్ తదితులు పాల్గొన్నారు. కాగా, బెంగళూరు దక్షిణ పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ తరఫున సిట్టింగ్ ఎంపీ అనంతకుమార్ ఎన్నికల బరిలో దిగనున్నారు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement