పరువు నష్టం కేసు: రాహుల్‌ గాంధీకి బెయిల్‌ | Defamation Case: Rahul Gandhi granted bail by Bengaluru court | Sakshi
Sakshi News home page

పరువు నష్టం కేసు: రాహుల్‌ గాంధీకి బెయిల్‌

Jun 7 2024 3:10 PM | Updated on Jun 7 2024 3:30 PM

Defamation Case: Rahul Gandhi granted bail by Bengaluru court

బెంగళూరు:  పరువునష్టం కేసులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహల్‌ గాంధీకి బెంగళూరు లోకల్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. శుక్రవారం స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ కేఎన్‌ శివకుమార్‌ రాహుల్‌ గాంధీకి బెయిల్‌ మంజూరు చేశారు. 

గతేడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీపై రాహుల్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. 2019-2023 పాలనలో రాష్ట్రంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని రాహుల్‌ విమర్శలు గుప్పించారు. ప్రతీ పనిలోనూ 40 శాతం కమీషన్ తీసుకుంటోందని ఆరోపణలు చేశారు. 

డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య, రాహుల్‌ గాంధీ సహా కాంగ్రెస్‌ నేతలు అప్పటి ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సహా తమ పార్టీ నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కేశవ్‌ ప్రసాద్‌.. రాహుల్‌ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. 

ఈ నేపథ్యంలోనే శుక్రవారం న్యాయమూర్తి ఎదుట రాహుల్‌గాంధీ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా బెంగళూరు ప్రత్యేక కోర్టు రాహుల్‌ గాంధీకి బెయిల్‌ మంజూరు చేసింది. తర్వాత ఈ కేసు విచారణను జులై 30వ తేధీకి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement