
సాక్షి, బెంగళూరు : మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్‌ను గురువారం అధికారులు తీహార్ జైలుకు తరలించారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై గురువారం ఢిల్లీ ప్రత్యేక కోర్టులో ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్, శివకుమార్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఒక గంటా 40 నిమిషాలపాటు వారి వాదోపవాదాలు కొనసాగాయి. అనంతరం జడ్జి విచారణను శనివారానికి వాయిదా వేశారు. శివకుమార్ ఆరోగ్యం కుదుటపడినట్లు వైద్యులు నిర్ధారించడంతో రాం మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం గది పక్కనే ఆయనకు గది కేటాయించారు.