లారీని ఢీకొన్న కారు: ఇద్దరి మృతి | two people died in road accidents | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొన్న కారు: ఇద్దరి మృతి

Dec 28 2013 3:33 AM | Updated on Aug 30 2018 3:56 PM

తిరుత్తణిలో ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

 తిరుత్తణి, న్యూస్‌లైన్:తిరుత్తణిలో ఆగివున్న లారీని వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు చెన్నైలోని కీళకట్టలై, అరుల్‌మురుగన్ నగర్, తిరుప్పరం కుండ్రం వీధికి చెందిన రామస్వామి (70), భార్య మనోరంజితం (60), కొడుకు బాలాజి (41), కోడలు నాగమణి (34), మనువళ్లు విఘ్నేష్ (16), నందకుమార్ (1)  గురువారం ఉదయం చెన్నై నుంచి తిరుమలకు దర్శనార్థం కారులో వెళ్లారు. తిరుమలలో స్వామివారిని దర్శించుకుని గురువారం రాత్రి తిరుత్తణి మీదుగా చెన్నైకి కారులో వెళుతుండగా తిరుత్తణి వద్ద రెండవ చెన్నై బైపాస్ రోడ్డు వద్ద అక్కడ నెల్లూరు నుంచి పాండిచ్చేరికి పామాయిల్ తీసుకెళుతూ ఆగివున్న ట్యాంకర్ లారీని వెనుక  నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో  కారులో ఉన్న విఘ్నేష్ (16) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన  ఐదుగురిని పోలీసులు తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నందకుమార్(1) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం రామస్వామి, రంజితం, బాలాజీ, నాగమణిని పోరూరు రామచంద్ర ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీని స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ ధర్మపురి జిల్లాకు చెందిన కుమార్ (30)ని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement