రోడ్డు ప్రమాదం: ఇద‍్దరు చిన్నారుల దుర‍్మరణం
నల్లగొండ జిల్లా భువనగిరి మండలంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది.
భువనగిరి: నల్లగొండ జిల్లా భువనగిరి మండలం రాయగిరి పట‍్టణంలోని ఫ్లైఓవర్‌పై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అక‍్కడికక‍్కడే మృతి చెందారు. మామిళ‍్ల సమ‍్మయ‍్య, మంజుల దంపతులు తమ ముగ్గురు పిల‍్లలతో కలిసి ద్విచక్రవాహనంపై జనగామ నుంచి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొంది.
ఈ సంఘటనలో సాయిగణేష్(10), చరణ్(8) అక‍్కడికక‍్కడే మృతి చెందగా మరో చిన్నారి సహా సమ‍్మయ‍్య, మంజుల తీవ్రంగా గాయపడ్డారు. వారిని భువనగిరి ఏరియా ఆస‍్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు జనగామ జిల్లా పాలకుర్తికి చెందినవారని పోలీసులు గుర్తించారు.