జన చైతన్య యాత్రకు వస్తే ఖబడ్డార్... | tunduru mega aqua food park vllagers warning to mla over jana chaitnya yatra | Sakshi
Sakshi News home page

జన చైతన్య యాత్రకు వస్తే ఖబడ్డార్...

Published Thu, Nov 24 2016 6:02 PM | Last Updated on Sat, Aug 11 2018 3:38 PM

టీడీపీ జనచైతన్య యాత్రను అడ్డుకుంటామని తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు హెచ్చరించారు.

పశ్చిమగోదావరి : టీడీపీ జనచైతన్య యాత్రను అడ్డుకుంటామని తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులు హెచ్చరించారు. శుక్రవారం గ్రామంలో జన చైతన్య యాత్రను నిర్వహించేందుకు అధికార పార్టీ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ క్రమంలో తమ గ్రామానికి ఎమ్మెల్యే, టీడీపీ నేతలు రావొద్దని గ్రామ పెద్దలు తేల్చిచెప్పారు. తమ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ గ్రామంలోకి వస్తే అడ్డుకుంటామన్నారు. దీంతో తుందుర్రులో భారీగా పోలీసులు మోహరించారు. జన చైతన్య యాత్రను అడ్డుకుంటే పోలీసులు కేసులు పెడతామని బెదిరింపులకు పాల్పడుతున్నారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement