వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు.
శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Jan 3 2017 10:47 AM | Updated on Sep 5 2017 12:19 AM
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారాల్లో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం సంప్రదాయం. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం నిలిపివేశారు.
ఆలయ మహద్వారం నుంచి గర్భాలయం వరకు వైదికంగా భక్తిశ్రద్దలతో శుద్ధి కార్యక్రమం నిర‍్వహించారు. 11 గంటల అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఇందులో భాగంగా ఉదయం నిర్వహించాల్సిన అష్టదళ పాద పద్మారాధన సేవ రద్దు చేశారు. ఇక మంగళవారం వీఐపీ దర్శనం కూడా రద్దు చేశారు.
Advertisement
Advertisement