నెల్లూరు జిల్లా వింజమూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు.
నెల్లూరు జిల్లా వింజమూరు ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు హఠాన్మరణం చెందాడు. శనివారం ఉదయం బస్టాండ్‌లో ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోగా, స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కాగా, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. మృతుడు చెన్నైకి చెందిన చిన్న నాగేశ్వరరావు (38)గా పోలీసులు గుర్తించారు. గీతల చొక్కా, నల్లరంగు ప్యాంట్ ధరించి ఉన్న అతడి వద్ద ఒక బ్యాగ్ ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.