కారులో ఆరు దేశాలు చుట్టొస్తా! | Travel by car in Six Countries | Sakshi
Sakshi News home page

కారులో ఆరు దేశాలు చుట్టొస్తా!

Jan 8 2016 2:31 AM | Updated on Nov 6 2018 4:37 PM

కారులో ఆరు దేశాలు చుట్టొస్తా! - Sakshi

కారులో ఆరు దేశాలు చుట్టొస్తా!

కారులో ఆరు దేశాలు చుట్టొస్తానంటున్నారు యువ సంగీత దర్శకుడు జిబ్రాన్. వాగై చూడవా, కుట్టిపులి చిత్రాలకు సంగీతం అందించినా, విశ్వనటుడు

కారులో ఆరు దేశాలు చుట్టొస్తానంటున్నారు యువ సంగీత దర్శకుడు జిబ్రాన్. వాగై చూడవా, కుట్టిపులి చిత్రాలకు సంగీతం అందించినా, విశ్వనటుడు కమలహాసన్ చిత్రాలు ఉత్తమవిలన్,పాపనాశం, తూంగావనం చిత్రాలతో ప్రాచుర్యం పొందిన సంగీతదర్శకుడు జిబ్రాన్ అన్న విషయం తెలిసిందే. ఈయన ఇప్పుడు చెన్నై నుంచి సింగపూర్ వరకూ కారులో ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే జిబ్రాన్ తాజాగా చెన్నై టూ సింగపూర్ అనే చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
 
 ఆరు పాటలు చోటు చేసుకున్న ఈ చిత్ర ఆడియోను ఆరు దేశాల్లో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. దీని గురించి జిబ్రాన్ తెలుపుతూ అబ్బాస్ అగ్భర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం చెన్నై టూ సింగపూర్ అని తెలిపారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని వినూత్నంగా చేయాలని భావించామన్నారు. అలా వచ్చిన ఆలోచనే చెన్నై నుంచి సింగపూర్ వరకూ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నదని చెప్పా రు.
 
 చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయని, చెన్నై నుంచి సింగపూర్ వరకు కారులో ప్రయాణం చేస్తూ ఒక్కో దేశంలో ఒక్క పాటను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. చెన్నై టూ సింగపూర్ రోడ్డు ప్రయాణ రూటును నటుడు అజిత్ ను అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి బంగ్లాదేశ్, అక్కడ నుంచి మియాన్మర్, థాయిల్యాండ్ వె ళ్లి అక్కడ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. మొదట ఒక పాటను చెన్నైలో ఆవిష్కరించి ఆ త రువాత మిగిలిన ఐదు దేశాల్లో ఒక్కో పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement