పూరిపాకలపైకి దూసుకొచ్చిన ట్రేలర్ | trailer came on puri pakalu | Sakshi
Sakshi News home page

పూరిపాకలపైకి దూసుకొచ్చిన ట్రేలర్

Oct 16 2014 10:46 PM | Updated on Sep 2 2017 2:57 PM

పూరిపాకలపైకి దూసుకొచ్చిన ట్రేలర్

పూరిపాకలపైకి దూసుకొచ్చిన ట్రేలర్

ప్రమాదాల అడ్డాగా చెప్పుకునే ముంబ్రా బైపాస్ వద్ద గురువారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పిన ఓ ట్రేలర్ సిద్ధార్థ్‌నగర్ వద్ద రోడ్డుపక్కన ఉన్న నివాసాలపైకి దూసుకొచ్చింది.

ఐదుగురికి గాయాలు: ఇద్దరి పరిస్థితి విషమం
 
సాక్షి, ముంబై: ప్రమాదాల అడ్డాగా చెప్పుకునే ముంబ్రా బైపాస్ వద్ద గురువారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పిన ఓ ట్రేలర్ సిద్ధార్థ్‌నగర్ వద్ద రోడ్డుపక్కన ఉన్న నివాసాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదుపుతప్పిన ట్రేలర్ డ్రైవర్‌తోపాటు పూరిపాకల్లో నివసిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఠాణే జిల్లా, కల్వాలోని ఛత్రపతి శివాజీ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రేలర్ డ్రైవర్ రామ్ ప్రజాపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement