breaking news
	
		
	
  Siddharth Nagar
- 
      
                   
                               
                   
            పూరిపాకలపైకి దూసుకొచ్చిన ట్రేలర్

 ఐదుగురికి గాయాలు: ఇద్దరి పరిస్థితి విషమం
 
 సాక్షి, ముంబై: ప్రమాదాల అడ్డాగా చెప్పుకునే ముంబ్రా బైపాస్ వద్ద గురువారం మరో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పిన ఓ ట్రేలర్ సిద్ధార్థ్‌నగర్ వద్ద రోడ్డుపక్కన ఉన్న నివాసాలపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అదుపుతప్పిన ట్రేలర్ డ్రైవర్‌తోపాటు పూరిపాకల్లో నివసిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఠాణే జిల్లా, కల్వాలోని ఛత్రపతి శివాజీ ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన ట్రేలర్ డ్రైవర్ రామ్ ప్రజాపతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. - 
      
                   
                               
                   
            ఆలస్యంగా వెలుగుచూసిన దారుణం

 సిద్ధార్థనగర్: ఉత్తరప్రదేశ్ కు చెందిన 16 ఏళ్ల బాలికను అపహరించి, సామూహిక అత్యాచారం చేసి... నేపాల్ లో ఆమెను అమ్మేసేందుకు ప్రయత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయపాల్, అతని మేనల్లుడు చింకు.. ఎత్వా ప్రాంతం నుంచి బాలికను అపహరించి నేపాల్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమెపై 20 రోజుల పాటు వారు అత్యాచారానికి పాల్పడ్డారు.
 
 చింకు తండ్రి తకావు, బరాన్సి అనే వ్యక్తితో కలిసి బాలికను మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నించారు. వీరి బారి నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగుచూసింది. విజయపాల్, చింకులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మరో ఇద్దరు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. 


