జేఎల్‌ఎన్ స్టేడియం వద్ద నేడు ట్రాఫిక్ ఆంక్షలు | Traffic restrictions today at the stadium jeelen | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఎన్ స్టేడియం వద్ద నేడు ట్రాఫిక్ ఆంక్షలు

Apr 12 2014 1:29 AM | Updated on Sep 2 2017 5:54 AM

జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నం దున నగరవాసులు దక్షిణ ఢిల్లీలోని లోధీరోడ్, బీషమ్ పితామహ మార్గ్, లాలా లజ్‌పత్ రాయ్ మార్గ్‌లకు దూరంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు శుక్రవారం సూచించారు.

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నం దున నగరవాసులు దక్షిణ ఢిల్లీలోని లోధీరోడ్, బీషమ్ పితామహ మార్గ్, లాలా లజ్‌పత్ రాయ్ మార్గ్‌లకు దూరంగా ఉండాలని ఢిల్లీ పోలీ సులు శుక్రవారం సూచించారు. జేఎల్‌ఎన్ స్టేడియంలో శనివారం డేరా సచ్చా సౌదా అనే సంస్థ ఉద యం 7.30 గంటల నుంచి సాయంత్రం 7.00 గంటల వరకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించనుంది.
 
 సుమారు 20 వేల మంది వాలంటీర్లు రక్తదానం చేసేం దుకు ఇక్కడకు వస్తారని భావిస్తున్నారు. వీరంతా ప్రైవేటు బస్సులు, కార్లు, మెట్రో రైళ్లు, ఇతర షటిల్ సర్వీసులలో ప్రగతి మైదాన్ నుంచి లోధీరోడ్డుకు చేరుకుంటారని ట్రాఫిక్ పోలీసు విభాగం తెలిపింది. విధానపరంగా లోధీరోడ్డు, భీషమ్‌పితామహ మార్గ్‌పై పార్కింగ్‌ను అనుమతించరు.

ఇక ఆదివారం నాడు అదే సంస్థ సాయంత్రం 4.00 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ‘మాస్ట్రో మస్త్ రుహానీ నైట్’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి 30వేల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.
 
 ప్రైవేటు బస్సులు, కార్లను సునేరీ పుల్లా, బారాపుల్లా క్లస్టర్ బస్ డిపోల్లో పార్కింగ్ చేయాలి. ప్రత్యేక స్టిక్కర్లు అతికించిన కార్లను జేఎల్‌ఎన్ స్టేడియంలోని రెండో నెంబర్ పార్కింగ్ లాట్‌లో నిలపాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇతర ప్రయాణికులు ఈ రెండు రోజులు లోధీరోడ్డు, భీషమ్‌పితామహ మార్గ్, లాలా లజ్‌పత్‌రాయ్ మార్గ్‌లలో కాకుండా ఇతర మార్గాలలో ప్రయాణించేందుకు ప్రయత్నించాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement