వీహెచ్పీ కార్యకర్త మృతి | Tipu Sultan jayanti protest: VHP activist died in Karnataka | Sakshi
Sakshi News home page

వీహెచ్పీ కార్యకర్త మృతి

Nov 10 2015 1:25 PM | Updated on Apr 6 2019 9:31 PM

వీహెచ్పీ కార్యకర్త మృతి - Sakshi

వీహెచ్పీ కార్యకర్త మృతి

కర్ణాటకలోని మడికెరిలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలలో మంగళవారం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

బెంగళూరు: కర్ణాటకలోని మడికెరిలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలలో మంగళవారం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఉత్సవాలకు వ్యతిరేకంగా వీహెచ్పీ కార్యక్తలు ఆందోళనకు దిగారు. వీరిని  పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది.

రాళ్ల దాడిలో వీహెచ్పీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. స్థానికంగా ఇరువర్గాల వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మొహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement