ముగ్గురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీజాపురజిల్లా డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రిత్విక్ రంజనమ్ పాండేను...
సాక్షి, బెంగళూరు : ముగ్గురు ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీజాపురజిల్లా డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రిత్విక్ రంజనమ్ పాండేను సర్వే సెటిల్‌మెంట్ అండ్ లాండ్ రికార్డ్స్ కమిషనర్‌గా, రాష్ట్ర ఆర్థికశాఖలో డిప్యూటీ సెక్రటరీగా ఉన్న డి.రణదీప్‌ను బీజాపుర జిల్లా డిప్యూటీ కమిషనర్‌గా బదిలీ చేసింది.
రాష్ట్ర ఆర్థిక శాఖలోనే డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న దీప్తి ఆదిత్య కనాడేని ఆర్థిక శాఖలోని (బి అండ్ ఆర్) విభాగానికి డిప్యూటీ కమిషనర్‌గా నియమించింది. బెంగళూరులోని అటల్ జనస్నేహి కేంద్ర డెరైక్టర్‌గా రిత్విక్‌కు అదనపు బాధ్యతలను అప్పగించింది.
బెంగళూరు సిటీ సౌత్ డివిజన్ విభాగానికి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వర్తిస్తున్న హెచ్.ఎస్.రేవణ్ణను కర్ణాటక లోకాయుక్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ విభాగానికి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.